16-01-2023, 07:29 AM
- నిద్ర: నిద్రలేమి అనేక వ్యాధులకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. మంచి నిద్ర మీ రోజును మరింత మెరుగుపరుస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల అలసట వస్తుంది. అటువంటి పరిస్థితిలో రోజు చివరిలో శరీరంలో తగినంత శక్తి ఉండదు. దీనివల్ల లైంగిక శక్తి తగ్గడంతోపాటు పలు సమస్యలు కూడా వస్తాయి. దీనిని నివారించడానికి మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి. సమయానికి నిద్రపోవడంతోపాటు.. మెరుగైన ఆహారం తీసుకోవాలి.
- హార్మోన్లలో సమతుల్యత లోపించడం: సరైన ఆహారం, జీవనశైలి కారణంగా శరీరంలో చాలా సార్లు హార్మోన్లు అసమతుల్యత చెందుతాయి. అసమతుల్య హార్మోన్ల కారణంగా, శారీరక సంబంధం పెట్టుకోవాలన్న కోరిక కలగదు. దీంతో టెస్టోస్టెరాన్ వారి శరీరంలో తక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయబడటం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో డాక్టర్ సలహా తీసుకోండి.
- దంపతుల మధ్య గొడవ: భార్యాభర్తల మధ్య రోజుకో గొడవ వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే గొడవలు మానుకుని ఒకరినొకరు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. కలహాలు తరచూ వస్తే భాగస్వామి గురించి చెడుగా భావిస్తారు. దీన్ని నివారించడానికి రెండింటినీ సమన్వయం చేసుకోవాలి.
- శ్రద్ధ వహించండి: ప్రజలు తమ భాగస్వామిని సంతృప్తి పరచలేనప్పుడు చాలా సార్లు ఇది జరుగుతుంది. సాధారణంగా ఇది పురుషులతో జరుగుతుంది. ఇదే జరిగితే, ఇద్దరూ మాట్లాడుకోవాలి.. ఇష్టపడటం లేదా ఇష్టపడకపోవడం గురించి ఇద్దరి భావాలను ఒకరినొకరు పంచుకుని దీనికి పుల్‌స్టాప్ పెట్టాలి.