06-01-2023, 06:29 PM
(06-01-2023, 05:59 PM)Takulsajal Wrote: కనిక : శీను...
శీను ముందుకు నడిచి వెళ్లి పక్కనే ఉన్న బెంచి మీద కూర్చున్నాడు, కనిక వెళ్లి తన పక్కనే కూర్చుంది ఏమైనా మాట్లాడతాడేమో అని
శీను : నీకు మ్యాచ్ అయిన గుండె దొరికిందని తీసుకొద్దామని వెళ్లాను.. దొరికింది కూడా.. అదిగో అక్కడ వీల్ చైర్లో కూర్చుని ఉంది, పేరు వింధ్య నా చెల్లెలు.. అని ఇన్ని రోజులు జరిగింది మొత్తం చెప్పాడు.
శీను కనిక అటు వెళ్ళగానే జగ్గు వింధ్య దెగ్గరికి వెళ్ళాడు.. పాపని ఎత్తుకుని దీపాలికి ఇచ్చి ఏమైనా కొనివ్వమని పంపి దీపాలిని చూసాడు..
వింధ్య : చిన్నన్నయ్యా.. మిమ్మల్ని కలుసుకుంటానని అస్సలు అనుకోలేదు
జగ్గు : నేనూ అనుకోలేదు..
వింధ్య : అన్నయ్యా
జగ్గు : శీను వచ్చింది నిన్ను చంపెయ్యడానికి.. అది నీకు తెలుసా
వింధ్య : ఏంటి అన్నయ్య నన్ను చంపడమా.. అని భయపడుతూ ముందు పాప కోసం వల్లి వల్లి అని పిలిచింది
జగ్గు : అదిగో అక్కడ అన్నయ్య పక్కన కూర్చుందే తనే మన వదిన.. పేరు కనిక.. ఇంకొన్ని రోజుల్లో చనిపోతుంది.. హార్ట్ ప్రాబ్లెమ్.. తనకి మ్యాచ్ అయ్యే గుండె నీ దెగ్గర ఉంది తనని బతికించుకోవడానికే నీ దెగ్గరికి వచ్చాడు కానీ నువ్వు చెల్లెలివని తెలిసి అందులోనూ అమ్మ పోలికతో ఉన్న నిన్ను చంపుకోలేక అటు ప్రేమించినదాన్ని ఎలా బతికించుకోవాలో తెలీక ఏడుస్తున్నాడు.
వింధ్య కళ్ళలో నుంచి కన్నీరు కారడం చూసి వెంటనే మళ్ళి మాట్లాడాడు
జగ్గు : వింధ్యా.. నీకు కాళ్ళు పని చెయ్యవు చేతులు పని చెయ్యవు.. బతికున్నన్ని రోజులు ఇలా ఎవరో ఒకరి సాయంతో బతకాల్సిందే ఒక్క అడుగు కూడా అటు ఇటు వెయ్యలేవు.. అదే నీ గుండె తనకి ఇచ్చావనుకో వదిన బతుకుతుంది నీ కూతురుని తన కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది.. నేను నీకు మాటిస్తున్నాను ఒక్కసారి ఆలోచించు.. అని పక్కకి వెళ్ళిపోయాడు. వింధ్య మాత్రం తన అన్నయ్యని కనికని చూస్తూ ఉంది, తన కంట్లో నుంచి కన్నీరు కారుతూనే ఉంది.
కనిక : మరేం పరవాలేదు శీను... జగ్గు మాటలు విని కొంచెం హోప్ పెట్టుకున్నాను అంతే అని నవ్వింది.. ఇంకేం మాట్లాడాలో అర్ధంకాక.. ఎదవలేక..
శీను : సారీ..
కనిక : మరి నీ చెల్లెలి కోరికలు తీర్చావా
శీను : ఈ వారం రోజుల్లో తాను చూడాలనుకున్నవి మొత్తం చూపించాను, అందరం ఒక ఇంట్లో కలిసుందాం అని కోరింది.. ఆటే తీసుకెళుతున్నాను.
కనిక : నేనూ నీతోనే వస్తాను అని శీను భుజం మీద వాలింది
శీను లేచి : వద్దు కనిక, ఇంతకముందు అమ్మ విషయంలో చాలా బాధ పడ్డాను మళ్ళి అంటే నా వల్ల కాదు.. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను.. అని కళ్ళు తుడుచుకున్నాడు
కనిక లేచి ఇంకేం మాట్లాడకుండా బైటికి వెళ్ళిపోయింది.. శీను తిరిగొచ్చేసరికి జగ్గు వింధ్యతో మాటాడుతుంటే వెళ్ళాడు.. వింధ్య కంట్లో నీరు చూసి జగ్గుని కోపంగా చూస్తూ తన కళ్ళు తుడిచాడు.
దీపాలి : అక్క ఎక్కడా కనిపించలేదు
శీను : వెళ్ళిపోయింది.. బైట కారు దెగ్గర ఉందేమో వెళ్లి చూడు
దీపాలి : మరి పదండి వెళదాం.. ఇంకా ఎందుకు ఇక్కడా
శీను తన చెల్లిని తీసుకుని వెళ్లిపోతుంటే జగ్గు రెండు నిమిషాలు దీపాలితో మాట్లాడి తన దెగ్గర నుంచి పాపని తీసుకున్నాడు.. దీపాలికి ఎం చెయ్యాలో అర్ధం కాక కోపంలో జగ్గుని కొట్టేసింది.. జగ్గు ఎం మాట్లాడకుండా వెనక్కి తిరిగాడు.. దీపాలి తన అక్కకోసం బైటికి వెళ్లగా కనిక కళ్ళు తిరిగి కిందపడిపోయింది.. పక్కన ఉన్న వారి సాయంతో ఏడ్చుకుంటూనే తనని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళిపోయింది.
శీను ముందు అక్కడ నుంచి బైటికి వచ్చేసి హోటల్ కి వెళ్లి రెండు రూమ్స్ బుక్ చేసి జగ్గుని చూసుకొమ్మని చెప్పి వెళ్లి కళ్ళు మూసుకుని పడుకున్నాడు. జగ్గు వింధ్యని వల్లిని తీసుకుని ఇంకో రూంలోకి వెళ్లి కూర్చున్నారు.
వింధ్య : అన్నయ్యా.. నాకు ఓకే
జగ్గు : ఏంటి...?
వింధ్య : అదే నా గుండెని ఇస్తాను.. నేను కోరుకున్నవన్నీ వారం రోజుల్లోనే నా అన్న మొత్తం తీర్చేశాడు.. మనసులో అంత బాధ పడుతున్నా నన్ను నా బిడ్డని నవ్విస్తూ మమ్మల్ని సంతోషంగా చూసుకున్నాడు.. ఇక నా బిడ్డని బాగా చూసుకోడా..
జగ్గు : నిజంగానా అని లేచి నిలబడ్డాడు ఆశ్చర్యంగా
వింధ్య : నిజమే..
జగ్గు వెంటనే అన్న రూంకి పరిగెత్తి లేపాడు..
వింధ్య : వల్లి.. నన్ను పక్క రూంకి తీసుకెళ్ళు.. వాళ్ళకి కనిపించకుండా నిలుచుందాం..
వల్లి : అలాగే..
జగ్గు వెళ్లి శీనుని లేపాడు.
శీను : ఏంట్రా
జగ్గు : వింధ్య ఒప్పుకుంది
శీను : ఏంటి
జగ్గు : తన గుండెని వదినకి ఇవ్వడానికి వింధ్య ఒప్పుకుంది
శీను : పిచ్చెమైనా పట్టిందా.. అయినా నాకు ఇలా కావాల్సిందేలే.. నేను చేసిన పాపాలే నాకు తగులుతున్నాయి.. కర్మ అనేది ఎక్కడికి పోదు.. ఈ చేతులతో ఎంతో మంది ఉసురు పోసుకున్నాను, అంతకంతా నరకం అనుభవిస్తున్నాను అని తల కొట్టుకున్నాడు.
జగ్గు ఏడవటం తప్ప ఇంకేం చెయ్యలేకపోయాడు..
వింధ్య : వల్లి వెళ్ళిపోదాం పదా అనేసరికి వల్లి తన తల్లిని వెనక్కి తీసుకొచ్చేసింది..
సాయంత్రం వరకు అటు కనిక, దీపాలి, జగ్గు, శీను, వింధ్య అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు..రాత్రికి అందరూ మౌనంగా భోజనం చేశారు, వింధ్యని వల్లిని తమ రూంలో విడిచిపెట్టి.. ఏ భయాలు పెట్టుకోవద్దని.. ఏమి ఆలోచించకుండా పడుకొమ్మని.. పొద్దున్నే వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడ నుంచి బైటికి వెళ్ళిపోయాడు.. జగ్గు మాత్రం రూంలో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు.
వింధ్య : వల్లి ఆ డోర్ పెట్టేసేయి.. ఇలా రా నీతో మాట్లాడాలి..
వల్లి : ఏంటి మమ్మీ..
వింధ్య : ఈ బాడీని మార్చేద్దామా
వల్లి : అంటే
వింధ్య : మళ్ళీ నాకు కాళ్లు చేతులు అన్ని వచ్చేస్తాయి.. నిన్ను ఎత్తుకుని తిప్పొచ్చు.. నీతో ఆడుకోవచ్చు.. నీకు అన్నం తినిపించొచ్చు.. స్నానం చెపిన్చొచ్చు మళ్ళీ మాములుగా అయిపోతాను
వల్లి : నిజంగానా
వింధ్య : అవును మావయ్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తాడట, చేయించుకోనా
వల్లి : చేపించుకో మమ్మీ
వింధ్య : మరి ఈ మొహం కూడా ఉండదు.. కొత్తగా వస్తాను ఓకేనా
వల్లి : అవునా.. ఏం కాదులే మమ్మీ.. నువ్వు లేచి తిరుగుతే అదే చాలు.. నీతో చాలా ఆడుకోవాలి.. చాలా లిస్ట్ ఉంది నీతో పనులు చేపించుకోవడానికి.. ఉండు అప్పటి వరకు వీలైనన్ని ఫోటోలు తీసుకుందాం అని లేచి ఫోన్ తెచ్చి ఫోటోలు తీసుకుంటుంటే వింధ్య నవ్వుతూ చూస్తుంది..
శీను బైటికి వెళ్లి నేరుగా హాస్పిటల్ కి వెళ్ళాడు.. కనిక రూం కనుక్కుని వెళుతుంటే దీపాలి ఎదురు వచ్చింది..
దీపాలి : మళ్ళీ ఎందుకు వచ్చావ్
శీను పట్టించుకోకుండా లోపలికి వెళ్లేసరికి కుటుంబ సభ్యులు అంతా కనిక చుట్టు కూర్చుని ఉన్నారు.. శీను ఏడ్చుకుంటూ వెళ్లి కనిక ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ తన ఒళ్ళో మొహం పెట్టుకుని ఏడుస్తుంటే.. కనిక శీను తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతుంటే
శీను : నాకు ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు.. నిన్ను బతికించుకోలేకపోతున్నాను.. నాకు చంపడం మాత్రమే తెలుసు బతికించేది రాదు.. అంటుంటే
దీపాలి నాన్న : తప్పు మాది కూడా ఉందయ్యా.. స్వార్ధంతో కనికకి మ్యాచ్ అయ్యే గుండె దొరికినా అప్పుడు దొరకలేదని అబద్ధం చెప్పాము.. ఇప్పుడు ఎవడి కాళ్లు పట్టుకున్నా దొరకట్లేదు అని ఏడ్చేసాడు..
కనిక : శీను.. శీను.. ఇలా చూడు.. అని లేపి తన పక్కన కూర్చోపెట్టుకుంది.. అందరూ బైటికి వెళ్ళిపోగా కనిక శీను గుండె మీద తల పెట్టుకుని పడుకుని.. అవన్నీ ఏమొద్దు కానీ.. ఇలా నేను పోయేంతవరకు నాకు మాటలు చెపుతూ ఉండు.. ఇదే నా చివరి కోరిక నీ ఒళ్ళో చనిపోవాలని ఉంది శీను.. ప్లీజ్..
శీను : అలాగే.. అని ముద్దు పెట్టుకున్నాడు.
లొకేషన్ ముంబై : : బేస్ లొకేషన్
చీఫ్ : ఛ ఉన్న ఒక్క అవకాశం కూడా చెజారిపోయింది..
సర్పాల్ సింగ్ : ఏమైనా దొరికాయా
చీఫ్ : దొరికాయి ఐదు బుల్లెట్లు.. ఇంతకీ ఎవడో స్పెషల్ ఆఫీసర్ వస్తాడన్నారు ఏడి.. ఎవడు వాడు
సర్పాల్ సింగ్ : పేరు చిరంజీవి అని మాత్రమే తెలుసు.. ఏ డిపార్ట్మెంటో.. ఏ స్టేటో.. వాడి గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు
చీఫ్ : ఇక్కడ మనమే ఏమి పీకలేక పోయాం వాడొచ్చి ఏం పీకుతాడట
సర్పాల్ సింగ్ : రానీ.. చూద్దాం..
ఇంతలో ఎవడో ఫోన్లో మాట్లాడుతూ ఒకడు వస్తుంటే సెక్యూరిటీ ఆపారు.. చీఫ్ మరియు సర్పాల్ సింగ్ ఆ హీరో కట్ అవుట్ వంక చూసారు.. ఆ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూనే జేబులోనుంచి ఐడి కార్డు తీసి చూపించగా లోపలికి దారి వదిలారు. ఐడి పర్సులో పెడుతుంటే పర్సు జారీ పడింది.. అందులో ఉన్న కానీస్తేబుల్, SI, DSP, DGP, కలెక్టర్, బాడీగార్డ్.. ఇంకొన్ని పవర్ ఫుల్ ఐడిలు కిందపడేసరికి అవి చూసిన సెక్యూరిటీ ఆశ్చర్యంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఆపబోతే చీఫ్ ఆపొద్దని సైగ చేసాడు.
చిరంజీవి : బంగారం నా మాట వినవే.. నేనెక్కడికి పోతానే ఆఫ్ట్రాల్ వెయిటర్ గాడిని.. బార్లోనే ఉన్నాను..
అవతల నుంచి నేను కూడా బార్లోనే ఉన్నాను అన్న అమ్మాయి గొంతు కోపంగా వినిపించింది
చిరంజీవి : నేనిప్పుడే సరుకు కొనడానికి బైటికి వచ్చానే
దొంగ నాటకాలు ఆడకు నువ్వు
చిరంజీవి : అక్కి.. అక్కు.. నమ్మవే బాబు.. మా వదిన ఏదో చెప్పిందని.. అలా అనుమానపడకే.. నేను మళ్ళీ చేస్తాగా.. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో.. అస్సలే కసక్కులా ఉంటావు.. ఎవడో ఒకడు గోకుతాడు మళ్ళీ.. నేను నీకోసం ఏడవాలి.. ఇదిగో సుబ్బు గాడు ఫోన్ చేస్తున్నాడు మళ్ళీ చేస్తా.. బై అని ఫోన్ పెట్టేసి.. ఎక్కడున్నాడో చూసుకుని.. సర్ సారీ సర్.. అని సెల్యూట్ చేసాడు.
చీఫ్ : ఎవరో సుబ్బు కాల్ చేస్తున్నాడన్నావ్
చిరంజీవి : పెళ్ళాం నుంచి తప్పించుకోవాలంటే అబద్ధాలు చెప్పాలి సర్
చీఫ్ : అక్కడ కేసు డీటెయిల్స్ ఉన్నాయి.. ఏదో పీకుతావని పిలిపించారుగా నిన్ను.. పో.. పొయ్యి అక్కడ పీకుపో.. అని నవ్వాడు.
చిరంజీవి చీఫ్ ని చూస్తూ, చెయ్యి పట్టమని సైగ చేసాడు.. పర్లేదు పట్టండి సార్ అని చీఫ్ చెయ్యి చాపగానే ఆయన చేతిలో ఇంకో బుల్లెట్ చేతిలో పెట్టాడు.
చీఫ్ : ఏంటిది
చిరంజీవి : ఆ.. మీరు పూర్తిగా పీకనిది.. నేను పీక్కోచ్చాను.. అంటూ ఒళ్ళు విరుస్తూ చుట్టు చూసి.. ఇప్పుడెళ్లి పీకొచ్చా.. అదే మీరు పీకలేనిదీ.. అని ఫైల్ వైపు నడుచుకుంటూ వెళ్లి దాన్ని చూడకుండా పక్కనే ఉన్న కాఫీ మెషిన్ నుంచి కాఫి పట్టుకుని తాగుతుంటే చీఫ్ ఆశ్చర్యంగా లేచి నిలబడ్డాడు.
చిరంజీవి : బాబు.. ఆ ఫాక్స్ నాదేనమ్మా.. నా జాయినింగ్.. పోయి మీ చీఫ్ కి సబ్మిట్ చెయ్యిపో.. అనగానే అక్కడే ఉన్న సోల్జర్ గన్ వీపుకి వేసుకుని ఆ పేపర్ తీసుకుని చీఫ్ కి ఇచ్చాడు.
ఆ పేపర్ చూసిన చీఫ్ కి చెమటలు పట్టాయి.. చిరంజీవి వంక ఆశ్చర్యంగా చూస్తూ సైన్ చేసి స్టాంప్ వేసాడు.
చీఫ్ : ఇక నుంచి అందరూ.. సర్ నే ఫాలో అవ్వండి.. సారీ సర్.. అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
చిరంజీవి : నా వయసుకి మీ వయసుకి ఈ ఫార్మాలిటీస్ కుదరవు లెండి.. మీరు అబ్బాయి అని పిలవండి నేను బాబాయి అని పిలుస్తాను, ఇంకా కన్వినియింట్ గా కావాలంటే చిన్నా అని పిలవండి.. అని కాఫీ కప్ పక్కన పెడుతూ పరిచయాలు అయిపోయాయిగా ఇక పని మొదలు పెడదామా..
అందరూ : ఎస్ సర్
హలో takulsajal గారు మి థింకింగ్ కి మీ రైటింగ్ స్కిల్స్ కి నమస్కారం
తమిళ్ వాళ్లకి lokiverse vuntey
తెలుగు సినిమా వాళ్లకి hitverse vntey
Ma xossipy వాళ్లకి takulverse vundi
త్రివిక్రమ్ మాటలో చెప్పాలంటే : మీరు xossipy కి రైటర్ అవడం మాకు అదృష్టం
మీ దూరదృష్టం
Sex stories ki కూడా నోబెల్ ప్రైజ్ తీసునే అరహతా ఉన్నావాడు takul sajal మీరు మన మధ్య అమాయకగా వుండు