20-01-2023, 12:58 PM
హాయ్ అందరు బాగున్నారా .
ఈరోజు 2వ గంట కొడదాం..
..................( కావ్య c/o కరోనా కష్టాలు )..............
అక్కర్లేదు! కష్టపడకు! నాకు తెలుసు అని చెప్పిన నందా వంక కళ్ళార్పకుండా చూస్తూ ఎలా తెలుసు రా అని ఆశ్చర్యం తో అడిగాడు విక్కి..??
.....@ నందా బుల్లి విశ్లేషణ..
నా గోల్డెన్ ఫిష్ మెడ లో ఐడీ కార్డు వేసుకొని ఉంది రా ..! నా అందాల బొమ్మ మరో బుజ్జి బొమ్మ ( ఐడీ కార్డు ఫోటో) రూపం లో నాకు దర్సనం ఇచ్చింది గా. అంతే కాదు తన నడుము పట్టుకున్నప్పుడు తన పేరు,వయసు,పని చేసే కంపెనీ పేరు చివరికి బ్లడ్ గ్రూప్ తో సహా అన్ని స్కాన్ చేశాను...!!! ఇక కథ ఎలా నదిపిస్తానో చూడు అంటూ గాల్లో ఎగిరి భూమి నీ తాకి .. లవ్ గేమ్ స్టార్ట్స్ నౌ అంటూ దొర ఇంగిలి పీసు లో సెలవిచ్చారు...!!
అరేయ్ నువ్వు ఇస్తున్న బిల్డప్ మామూలుగా లేదు గా..! వదినమ్మ కిక్ నీకు బాగా ఎక్కేసింది.. జాగ్రత్తరోయ్ అదసలే కంచు..! అని అంటూ ఛా అది అని అనేసా అని నోరు కరుచుకున్నాడు విక్కి...!!!
వీళ్లిద్దరూ ఇంటికి చేరుకున్నారు...టిఫిన్ చేస్తున్నారు.. చేస్తున్నంత సేపు కావ్య ఊహలు , ఉసులు నందా కలలో ఇలలో మెదులుతున్నాయి..
అయ్యగారు..!! అంటూ షాక్ లో కదలకుండా నిలబడి పోయింది రమణమ్మ..!!!
ఏమైంది..?? అంటూ ఊహ లోకం నుండి ఎక్సీట్ అయ్యి ఇలా లోకం లోకి ఎంట్రీ ఇచ్చాడు నందు..
మీరు...మీరేనా...
ఏంటి రమణమ్మ అన్నా ...నందుని చూసి..!!!
ఇడ్లీ లో సాంబార్ వేసుకొని తింటారు.. లేదా సాంబార్ లో ఇడ్లీ నంచుకొని తింటారు ...!! కానీ మిరెంటి ఇడ్లికి లాల( నీళ్ళు) పోసి సాసు లో పూర్తిగా నానబెట్టి తింటున్నారు అని అడిగింది అవక్కై రమణమ్మ...!!!!!!!
అమ్మ నీ ఇప్పుడు దీనికి ఇలా దొరికేసా ఎంటి ...?? అసలే దీని నోట్లో , పొట్టలో ఏమి దాగదు.. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి..అంటూ హాల్ లో ఉన్న టీవీ వైపు చూసి హా రమణమ్మ ఇది కరోనా నుండి తప్పించుోవడానికి కొత్త ప్రయత్నం , టీవీ లో చూపించారు లే..!!! హమ్మయ్య కవర్ చేశాను అని తెగ ఫీలయ్యాడు నందా..
రమణమ్మ...అలాంటిది ఏది నేను టీవీ లో చూడలేదే అని తన మెమొరి నీ స్కాన్ చేస్తూ అడిగింది...నందా నీ అనుమానం గా చూస్తూ...
అమ్మ...! బాబోయ్ ...పట్టేసింది.! కనిపెట్టేసింది ..హా ఇది చైనీస్ చానెల్ లో చూపించారు లే .." యస్.. దొరకలేదోచ్"" అంటూ నందు తెగ సంబరపడి పోతున్నాడు..
ఆహా .!! అంటూ తెలిసి కూడా ఏమి తెలియనట్లు వెళ్ళిపోయింది రమణమ్మ..
నువ్వు చెప్పిన పని చేశారా అంటూ విక్కి వచ్చి తన బ్రో భుజం తట్టాడు...
నందా థాంక్స్ చెప్తూనే తన కలల కావ్య ఏమి చేస్తుందో అని ఆలోచనలో పడ్డాడు..
....###.... కావ్య రూం రాత్రి టైం...నాకు సరిగ్గా గుర్తు లేదు.. """అయిన మనకి ఇప్పుడు టైం తో ఏమి పని ..?ఇక్కడ అయితే నా టైం బ్యాడ్ గా నడుస్తుంది"""
'' దొంగ సచ్చినోడ, బట్టతలోడా ..! నాకింత అన్యాయం చేస్తావ్ అనుకోలేదు..!!
నీకు కరోనా వచిపోను..నీ ఆవిడ నీకు తిండి పెట్టకుండా పస్తులు ఉంచను., నీ కుక్కకి పిచ్చి ఎక్కి నిన్నే కరవ అంటూ తన బ్యాగ్ బెడ్ మీద పడేసి శాపనార్థాలు పెడుతుంది.. కావ్యా.!!!
ఏమైందీ...!! ఎందుకే ఇప్పుడు తిట్ల వర్షం కురిపిస్తున్నావ్. ఎవడు నీ నోట్లో పడి నీ అక్కస్సు కి బలి అవుతున్నది అని ఉండబట్టలేక అడిగింది . వరూధిని...
"" వరం..! ఆ బొంత కాకి గాడు నన్ను ఉద్యోగం నుండి పికేసాడే ..!
హేయ్ పాండురంగ... ఇప్పుడు నా గతి ఎంటి..?? ఓ బాబా ... ఉద్యోగం లేకపోతే నా సాపాటు..!! ఎంటి నాకు ఈ గ్రహపాటు..??
పొద్దునే లేచి ఎవరి మొఖం చూసానో.. శివయ్య....!!! హా గుర్తుకు వచ్చింది .. ఇంటి కంచెలు దాటి రోడ్ల మీద పడి అమాయకమైన నా లాంటి ఆడపిల్లలను ఎదిపించి అందులో నవ్వు వెతుకునే రెండు కంచర గాడిదలు జంటగా కనిపించాయి .. కాదు.హతవిధీ...!! అంటూ తల కి చెయ్యి అడ్డం పెట్టుకొని మాయాబజార్ లో సావిత్రి రేంజ్ లో స్టిల్ ఇచ్చింది మన కావ్య పాప..
హ్మ్మ్..!! అంత మంది దేవుళ్ళని పిలిచేయకే ఆయన వస్తారు లే అని వేరే వాళ్ళు రెస్ట్ తీసుకుంటే ఇంకా నీ బతుకు ఫుల్ రెస్తే .. అయిన వాళ్ళని అంటున్నావ్ పాపం వాళ్ళు ఏమీ చేశారే అని అడిగిన వరుధిని కి చిన్న రీల్ వేసి చూపించింది...
ఇట్స్ ఓకే లే వే .. అని మాట పూర్తి చేసెలోపు .. !! నేనున్నానని .. నికెంకాదని అంటూ వరుధిని ఫోన్ హామీ ఇచ్చింది...
వరూధిని ఫోన్ లిఫ్ట్ చేసి... యస్ సార్...వాట్..బట్ వై...? హౌ..?. వెన్ ..? అంటూ ఫ్రీజర్ లో వేసిన ఐస్ గడ్డ లాగా నిలుచుంది పోయింది..
కావ్య వరుధిని నీ చూసి...
దీనికి ఏమైంది అబ్బా ..?? అనుకుంటూ .. వరు.. వరు కుట్టి..నా బుజ్జి ఏమైంది అంటూ గారంగా అడిగింది..
వరు తల తిప్పి బుసలు కొడుతు కావ్య వీపు విమానం మోత మోగించింది...
అబ్బా ..!! అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు..వాడెవడో నీకు ఫోన్ లో ఆర్ధింగ్ ఇస్తే .. నన్ను వేసుకుంటవ్ ఎంటే బేవార్సి..?? పైగా ఫోన్ లో సినిమా లో లాగా ఎందుకు ..ఏమిటి..ఎలా అని అన్నావు గా..!! వివరం తెలిసింది గా ...పైగా వీపు విశాలంగా ఉంది అని కొట్టి పాడ దొబ్బుతావా అంటూ సర్రుమంటున్న వీపు నీ అందుకో దానికి కుస్తీ పడుతుంది.కావ్య..
ఒసేయ్ ఆంబోతు ..!! ఎక్కడ పంది లా దొర్లి దరిద్రపు దేవతను నెత్తి నా పెట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చావే..?? దెబ్బకి నా ఉద్యోగం కూడా ఆమ్ ఫట్ అనిపించావ్ అంటూ ఎగిరెగిరి పడింది. వరుధిని...
కావ్య...నేను చెబితే నమ్మావా..!! ఆ జంట రాక్షసులే దీనికి కారణం..! హాయిగా ..సాఫీగా సాగుతున్న మన లైఫ్ లోకి మారిచి,సుబహు లాగా లెగ్ ఎంట్రీ ఇచ్చారు..మనల్ని మిక్సీ లో వేసిన జ్యూస్ లాగా చేస్తారు ఏమో అని భయం గా ఉందే అని బిక్కమొహం పెట్టింది..
"" అసలు వాళ్ళతో పెట్టుకోవడం అవసరమా..?? దారినా పోయే పేడ ను టెస్ట్ చేసి ముక్కు కి తగిలించుకోవడం అవసరమా అంటూ స్మెల్లింగ్ కామెంటరీ ఇచ్చింది వరు..""
ఇప్పుడేంటి దారి...?? "" కుక్క తోక.... గోదారేనా "" అంటూ వాపోయింది కావ్య...
రేపటి నుంచి మన విందు... గోవిందు...!! అంటూ రెండు చేతులు ఎత్తి గోడకు తగిలించి ఉన్న లార్డ్ వెంకటేశ్వర కి దండం పెట్టింది వరు...
సరెలేవే . ఇవ్వలైనా డిన్నర్ సూపర్ గా వండుకొని కుమ్మెద్దాం అంటూ పళ్ళు ఇకిలించింది కావ్య..
అబ్బా..!! ఆ కోల్గట్ యాడ్ స్మైల్ ఆపవే తల్లి చూడలేక చస్తున్నా అంటూ కిచెన్ లోకి దూరింది వరు..
ఐ వన్న ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు అంటూ .. మన NTR గారు కూడా భయపడే రేంజ్లో పాట పాడుకుంటూ కాలు కాలిన పిల్లి లా వరుధిని వెనకాలే వెళ్లింది కావ్య..
ఒసేయ్ ఆ ఉల్లిపాయలు సన్నగా తరిగి..అలాగే ఫ్రిడ్జ్ లో ఉన్న పలావు కూరగాయలు కూడా కట్ చేసి పెట్టు అంటు వరు ఆర్డర్ వేసింది...
యస్ బాస్ ..అమ్మ చీ ఛీ... ఆ బట్టతల మొఖం వాడిని తలుచుకున్న ఎంటి అంటూ.
అమ్మ నా డియర్ వరు ...ఇదిగో ఖండ ఖండలుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అంటూ కళ్ళు నుండి కారుతున్న జలపాతాలను తుడుచుకుంటూ ప్లేట్ అక్కడ పేట్టి అలగే వరు అడిగిన కూరగాయలు కూడా ఫ్రిడ్జ్ నుండి తీసి ఇచ్చింది కావ్య..
ఎలాగో ఉల్లిపాయలు తరిగావు గా, ఇవి కూడా కోసి అందులో వెయ్యి ఈలోపు నేను బియ్యం కడిగి పెడతాను అంటూ నీళ్ల కుళాయి తిప్పింది వరు...
కూరగాయలు...కూరగాయలు....!!!
అంటూ చెవి కోసిన మేక లా శ్రీ చైతన్య వాళ్ళ రైము నీ ఖూనీ చేసింది కావ్య...
దాంతో స్టమక్ అప్సెట్ అయ్యి విరోచనాలు వచ్చిన దానిలా లుక్ ఇచ్చింది వరు...
ఏమే ఏమైందీ...అడ్డమైన గడ్డి తినొద్దు అంటే వినవు..నోరు నీ మిల్లు ఆడించినట్టు ఏదో ఒకటి వేసి నమలందే నీకు తనివి తీరదు...ఇప్పుడు చూడు ఫేస్ ఎలా పెట్టావో...!! వెళ్ళు మొక్కని పాతిన దానిని ఆ మాత్రం క్వార్టర్ వాటర్ పోయాలేన అని కావ్య చెప్పిన దానికి అర్ధం కానట్టు మొఖం పెట్టి వరు చూస్తే..
అదేనే కూరలు తరిగిన దానిని ఇంకా పలావు చేయలేనా అంటూ స్టైల్ గా వరు భుజం మీద చెయ్యి వేసి హ్మ్మ్ మై హు నా అంటూ చెప్పింది కావ్య..
""" ఒసేయ్ వంకర్లు తిరిగిన బుద్దిదానా.."" నీ పాట విని నా ఫేస్ లో వచ్చిన రియాక్షనే అది..నేను బాగానే ఉన్నానే గ్రైండర్ ..అయిన ఈ కొత్త పాట ఎక్కడిది.. ఉన్న వాటికి సమాధి కట్టావు గా ...!! మరి ఈ కొత్త పాట కి దినం ఇప్పుడు పెట్టావ్ గా..?? అంటూ కొరకొర చూసింది వరు..
ఓహ్ అదా ...!! నిన్న పక్కింటి చింటు బేబీ బాయ్ అదే ఆ బాబు గాడు శ్రీ చైతన్య వాళ్ళ రైమ్ పాటలు పాడుతుంటే నా బుర్ర లోకి అప్లోడ్ చేసి ఇప్పుడే నా వాయిస్ లో పాడాను... హౌ ఈజ్ ఇట్టు అంటూ కూరగాయల ముక్కలు కావ్య వేయగా..వరు కడిగిన బియ్యం వేసింది...
కుట్టి..!! అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసావా .!? పలావ్ మసాలాలు వేశావా అంటూ హెడ్ షఫ్ లా ఆర్డర్ వేసింది కావ్య..
అబ్బా...!!! వేసానే అంటూ ఇద్దరు ఎలుక కోసం చూస్తున్నా పిల్లుల చైర్ తెచ్చుకొని అక్కడే కూర్చొని కుక్కర్ వంక చూస్తూ..త్వరగా కూయవే అసలే కడుపులో ఎలుకలు డిస్కో డాన్స్ చేస్తున్నాయి..రేపటి నుంచి ఎలాగో వాటితోనే కాపురం చేయాలి..ఈరోజు అయిన వాటిని త్వరగా శాంత పరచాలి అంటూ పొట్ట రుద్దుకుంటూ ఇద్దరు కుక్కర్ కేసి జాలిగా చూస్తున్నారు..
వాళ్ళ మొర ఆలకించి కుక్కర్ సీటి కొట్టి .. నేను రెఢీ అంటూ కొత్త పెళ్లి కూతురు లా సిగ్గుపడింది...
తర్వాత ఇద్దరు అదే చిన్న సైజ్ పార్టీ లా పీకల దాకా మెక్కి అది అరిగేదాకా గిన్నెలు తోమి పడుకోవడానికి రూం లోకి దూరారు..
...గుర్...గుర్...గుర్... బాబోయ్ ఇది మళ్ళీ మొదలు పెట్టింది అంటూ వరు దిండు తీసుకొని హాల్ లోకి పరిగెత్తింది...
మన కావ్య పాప గురక కి పక్కన వాళ్ళు హరి అనడం ఖాయం..ఎందుకంటే పాటే కర్ణ కఠోరంగా ఉంటే.ఇంకా గురక ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి...హా..హా..హా..హా. అంతకు మించి.
పొద్దునే సూర్యుడు కిటికీ లో నుండి హాయ్ చెప్పి మన కావ్య పాప నీ నిద్ర లేపాడు...
Lockdown అని కాదు కానీ...ఇప్పుడు నో పని..! నో మనీ.పోని ఆ కాంతమ్మ లాగా నాలుగు ఇళ్లలో పాచి పని చేసుకొని బ్రతుకుడామా అంటే కరోనా దెబ్బ కి అందరూ మా ఇంటికి వద్దు అంటే రావొద్దు అంటూ తమ ఇంట్లో వాళ్ళతోనే జన్మ భూమి కార్యక్రమం పెట్టించి ఎవరి పని వాళ్లే చేసుకుంటున్నారు..ఇంకా నేను ఏమి వెలగబెడతా ...
హ్మ్మ్ ...ఇక ఏదోకటి చేసి నా మన్స్టర్కి , నోకరికి జాబ్ అప్లికేషన్ పెట్టాలి..అని అనుకుంటూ హాల్ లోకి వచ్చింది కావ్య..
సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ అంటూ కాళ్ళు చేతులు సాగదీస్తూ పాట పాడుకుంటూ వచ్చిన కావ్య గొంతు విని ఉలిక్కి పడి లేచి కూర్చుంది వరు...
ఒసేయ్..!! దొంగ మొఖమా .. రాత్రుళ్ళు గురక.. పగలు ఏమో నీ పాట బరక .. ఎంటే నాకు ఈ టార్చర్ అంటూ తల పట్టుకోని లేచి నిలబడింది వరుధిని...
సారీ.. మళ్ళీ గురక పెట్టానా అంటూ సిగ్గు పడింది కావ్య...
నీ సిగ్గు సిమడ .. పో వెళ్ళి టిఫిన్ రెడీ చేయి నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ ఆర్డర్ వేసింది వరు..
నేనున్నానని...నీకేం కాదని అంటూ వరు ఫోన్ కూత పెట్టింది..
యస్ హూ ఈజ్ థిస్ అంటూ సిరాగ్గా అడిగింది సిటీ దొరసాని...
యస్ సార్... యస్ సార్ ... అంటూ ఫోన్ లో చెప్పేవాటికి గంగిరెద్దు లా తలాడించింది... కాసేపటికి ఫోన్ పీక నొక్కేసాకా..
యాహూ మనకి జాబ్ వచ్చిందే అంటూ పాచి మొఖం తో కావ్య పాప కు ముద్దు గిఫ్ట్ గా ఇచ్చింది వరు...
అది కావ్య విని ఆనందిస్తున్నా .. ఉన్నట్టుండి బ్యార్ మని గొంతు ఎత్తింది...
అయ్యో ఏమైంది కావ్య కి మీకు ఏమైనా తెలుసా తెలిస్తే చెప్పండి.. అంత వరకు..
అందరికీ టాటా, బిర్లా...

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...