30-12-2022, 01:07 PM
(This post was last modified: 30-12-2022, 02:42 PM by matured man. Edited 1 time in total. Edited 1 time in total.)
30 Dec 2022 Update 1
ధరణీ! నీ పరిచయం నాకు మంచి నేస్తం మాత్రమే కాదు మరువలేని బంధం కూడా.
ప్రకృతిని ప్రేమించడం నిజమైన మతం.
సాటివారిని ఆదరించడం నిజమైన ధర్మం.
ఈ ఉషోదయం తొలి కిరణాల వలె
నీ చిరునవ్వుల దరహాస వెలుగులలో
అపుడే విచ్చిన పూల సుగంధాలతో
రంగు రంగు పక్షుల కిలకిల రావాలతో
పచ్చని ప్రకృతినే పమిటగా చుట్టి
రవి కిరణపు రంగుల రవికను కట్టి
తొలి కిరణం తాకిన చిగురుటాకు
సిగ్గులతో కోకిలమ్మ కొలువై
ప్రకృతి నెలవై కొమ్మ కొమ్మను కదిలించి
సంగీతం సెలయేరులు తాకగా
తుమ్మెద నాదంతో
జుమ్మని జతకట్టి
ఇంత సుందరమైన నిన్ను సృజించి అక్కకి స్నేహితురాలిగా నా హితురాలిగా ఇచ్చిన ఆ పరమాత్మునకి నమస్సుమాంజలి.
ధరణీ! ప్రయాణం అంటే కొత్త ప్రపంచాన్ని చూడడం మాత్రమే కాదు మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడం కూడా..
Thank you Dharani...Thank you.. for bringing me here today...