Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు నచ్చిన రచయిత - కారణాలు
#40
(27-12-2022, 05:22 PM)Lonely warrior Wrote: నాకు నచ్చిన రచయిత ఎవరు అని చెప్పను కాని ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ thread లోనే చెప్పాలి ఎందుకంటే నేను login అవ్వకముండు 2020 నుండి ఈ సైట్ నీ follow అవుతున్న దాని తర్వాత నేను కామన్ గా ఒక పాయింట్ నోట్ చేశాను . అది ఏమిటి అంటే ప్రతి స్టోరీ లో update to update minimum 3 days నుంచి one month వరకు కూడా గాప్ ఉంటుంది. కానీ ఇండెక్స్ లో ఏ పేజీ లో ఏ update ఉంటుందో ముందే చెప్తారు.(index లో ఏ పేజీలో ఏ update ఉందొ ముందు ఎవ్వరు చెప్పలేరు ఎపిసోడ్ రాసినప్పుడల్లా edit చేస్తూ వస్తారు నేను అదే చేస్తాను)

అది ఎలా పోని కథ మొత్తం ముందే రాస్తే అప్డేట్స్ రెగ్యులర్ గా ఇవ్వొచు కదా . కొంత మంది ఉన్నారు అందులో నేను కూడా ఒకడిని update ఇచ్చి దాని తర్వాత నెక్స్ట్ update రాస్తారు.అలాంటి వాళ్లకు టైం పట్టడం సాధారణం ఏదైనా పని ఉండి కూడా వాళ్ళకి update ఆగుతుంది. మరి ముందే కథ రాసి పెట్టుకున్నా వాళ్ళు అప్డేట్స్ ఎందుకు ఇవ్వరు. దీనికి సమాధానం ఎవరిష్టం వాళ్ళది మిత్రమా కొంత మందికి వాళ్ల కథల కోసం పాఠకులు ఎదురు చూస్తున్నారంటే అది కిక్ ఇస్తుంది, లేదా ఇంకే కారణం అయినా అయ్యుండొచ్చు.. నేను shemale అని ఒక కధ రాసాను, విక్రమాదిత్య కధ కోసం రాస్తూ మధ్యలో చాలా కధలు రాసి వాటిని పనికి రాని కధలుగా పక్కన పడేసాను.. ఇప్పుడు ఆ కధని పూర్తిగా మార్చి రాస్తున్నాను అంటే మళ్ళీ మొదటి నుంచి రాసినట్టే ఇది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు.. ఏమైనా కావచ్చు 

హా మీరు అనుకోవచ్చు అరేయ్ వెర్రిపుకా నీకు ఏమి తెలుసు అని అడుగుతున్నావు అని. మీ అంత కాకపోయినా కొద్దిగా తెలుసు 

ఒక రోజు లో ఒక రైటర్ అవరేజ్ గా 4 నుండి 5 గంటలు మాత్రమే కథ మీద దృష్టి పెట్టగలరు అది కూడా వాళ్ళ ప్రొఫెషన్ writing అయితే ఇది జరుగుతుంది. మిగిలిన వాళ్ళు free times or weekend లో స్టోరీ రాయాలి. అలాంటి వాళ్లకు week మొత్తం మీద దొరికే టైం 15 to 20 hours అది కూడా free గా ఉండేది ఎటువంటి ప్రోగ్రాం లేకపోతే కానీ ఇక్కడ జోక్ ఎంటి అంటే కొంత మంది ఈ సైట్ లో రైటర్స్ కథలను ఎక్కడి నుండో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి కొద్దిగా మారుస్తున్నారు , వాళ్ళకి అబ్బో విపరీతంగా following..

చిన్న లాజిక్ ఆలోచించండి, లేదా మీరే ఒక సారి ట్రై చేయండి ఈరోజు కథ మొదలు పెడితే గట్టిగా ఒక కథ పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని.. 

షార్ట్ టైం లో అన్ని కథలూ ఎలా రాస్తున్నారు అని ఆలోచించండి.  వేరే వాళ్ళ విషయం నాకు తెలియదు కానీ నా విషయానికి వస్తే మాత్రం నేను కధని చాలా ఫాస్టుగా రాస్తాను, కొత్తలో అయితే పోస్ట్ చేసేప్పుడు ఏం రాసానో కూడా చదివేవాడిని కాదు కానీ ఇప్పుడు రాసాక ఒక సారి చదివి తప్పులు ఉంటే సరిదిద్దుతున్నాను. నేను అతి తక్కువ టైంలో రాసిన కధ అరణ్య.. ప్రతీ episode పది నిమిషాలకి మించి రాయలేదు.. ఆఖరి ఏడు ఎనిమిది updates తప్ప. నేను రాస్తున్న donseenu అనే కధ ఒక పాట నుంచి పుట్టింది అది కూడా 45 ని లేదా గంట అంతకు మించి పట్టలేదు. అదే నా మైనస్ కూడా అందుకే నా కధల్లో stability ఉండదు.. ఎక్కడో మొదలయ్యి ఇంకెక్కడో ముగుస్తాయి.. ఇక్కడ అవసరం లేకపోయినా చెపుతున్నాను నేను రాసిన ఏ update పోస్ట్ చెయ్యక్కుండా ఉండను. నా కధ ఒకటి ఆగింది అంటే అది రాయలేక లేదా రాయలేదని అర్ధం (ఇది నా అప్డేట్స్ కోసం ఎదురు చూసే పాఠకులకి చెపుతున్నాను)



కాపీ అండ్ పేస్ట్ కి ఇక్కడ విలువ ఎక్కువ... ఒప్పుకుంటాను కానీ అది పాఠకులకి తెలియనంత వరకే, మన పాఠకులు ముదుర్లు చెప్పాలంటే జాదుగాళ్ళు, మనం రాసేది కొన్ని కధలే కానీ వాళ్ళు చదివేది వందల కధలు అది మరిచిపోకండి 




Finally Naa best writer ఎవరు అంటే.. అతనికే P M చేశాను. చాలా మంచి పని చేశారు

ఇక గుర్తింపు విషయానికి వస్తే
Thokkutha అనే పాఠకుడు చెప్పినట్టు
ఒకరి గుర్తింపుని ఎవ్వరు ఆపలేరు
మీరు పెట్టే ఆ కష్టాన్ని ఇంకొకరు దోచుకోలేరు ఈ విషయం మనుసులో పెట్టుకోండి, నేను మిమ్మల్ని అర్ధం చేసుకున్నాను 

ఇక గుర్తింపు విషయానికి వస్తే ఇక్కడ నేనొక విషయం విన్నవించాలనుకుంటున్నాను
రచయితలకి ప్రముఖ్యత లేదు అని నేను చాలా గట్టిగా చెప్పగలను
ఎవరో ఒకరు ఇద్దరు వెలుతురు లోకి వస్తున్నారేమో కానీ
వాళ్లకి ఇవ్వాల్సిన కనీస గౌరవం ఎవ్వరు ఇవ్వరు
నేను ఈ site గురించి చెప్పడం లేదు
మామూలుగా బైట సంగతి చెపుతున్నాను
ఎంతో మంది కవులు, భాషా కవులు 
ఎంతో మంది రచయితా రచయిత్రిలు ఉన్నారు
కనీసం వాళ్ళని గుర్తు చేసుకోవడం దేవుడెరుగు
వాళ్ల పేర్లు కూడా తెలియదు చాలా మందికి

మాటల మంత్రికుడు త్రివిక్రమ్ గారు చెప్పినట్టు
వాళ్ళు మన మధ్యన పుట్టడం ఎంత అదృష్టమో అంతే దురదృష్టం కూడా

ఎవ్వరు hurt అవ్వకండి
నేనేం తప్పుగా మాట్లాడలేదు 

[+] 3 users Like Pallaki's post
Like Reply


Messages In This Thread
RE: మీకు నచ్చిన రచయిత - కారణాలు - by Pallaki - 28-12-2022, 07:33 PM



Users browsing this thread: 3 Guest(s)