27-12-2022, 09:11 PM
(This post was last modified: 27-12-2022, 09:32 PM by matured man. Edited 2 times in total. Edited 2 times in total.)
27 Dec 2022 :: Update 2
సారిక నుండి కంపనీ ఎలా టేక్ ఓవర్ చెయ్యాలో ప్లాన్ నా మనసులో రెడీ అయ్యింది.. సారిక మీద ఎందుకు రివెంజ్ తీర్చుకోవాలని నా మనసు అనుకుంటుందో నాకు తెలియదు.. ఆమె నాకు ఎప్పుడూ శతృవు కాదు.. నాతో ఒక బిజినెస్ ఉమన్ గానే ప్రవర్తించింది.. తన కంపెనీ షేర్లు ఇంకొకరు తను అమ్మకుండా కొనేస్తే ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తారు.. ఆడవాళ్లు కరుకుగా ఉన్నారంటే బలమైన కారణం ఉంటుంది.. కానీ వాళ్ల మనసులు ఎప్పుడూ వెన్నలాగే ఉంటాయి.. ఆ వెన్న అందరి వేడికీ కరగదు.. ఇతరులు చెప్పింది విని కక్ష పెంచుకోకూడదు.. ఎలాగైనా ఆమె కంపెనీ మేజర్ షేర్ హోల్డర్ ని నేను.. ఎప్పుడైనా ఆమెని నేను కలవ వచ్చు.. నేను ఆమె మీద దురభిప్రాయాన్ని దూరం చేసాను.. నేను ఇప్పుడు సాధారణ మైన పొజిషన్ లో కూడా లేను.. నా ఒక నిర్ణయం తో అనేక జీవితాలు తారు మారు అవుతాయి.. రాజు ఎప్పుడూ ప్రజల కోసం ఆలోచించి, తర్వాత తన కోసం ఆలోచించాలి.. ఈ జీవితం వద్దు అనుకునే నేను కలెక్టర్ పోస్ట్ తీసుకోలేదు.. కానీ దేవుడు తను అనుకున్నది అలాగే జరిపిస్తాడు.. కలెక్టర్ అయితే ఒక జిల్లా ప్రజలు.. పొజిషన్ లో పైకి వెళ్తున్న కొద్దీ ఒక రాష్ట్ర ప్రజలు.. ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ ఒక దేశ ప్రజలు.. అందరికీ తెలిసినా జీర్ణం చేసుకోలేని విషయం ఏంటంటే టాటా గారు, అంబాని, అదాని, నారాయణ మూర్తి, టి.వి.ఎస్. గ్రూప్ వేణు శ్రీనివాసన్, మొదలైన వాళ్లందరూ ఒక డెసిషన్ తీసుకుంటే కొన్ని కోట్ల కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేస్తాయి.. లేదా వాళ్ల కంపనీల్లో పని చేసే కోట్లమంది జీవితాల్లో అశేషమైన వెలుగులు నింపేస్తాయి... ఇప్పుడు నా దగ్గర కూడా ఇన్ని కంపెనీలు.. ఉద్యోగుల కుటుంబాలు.. కొత్త కంపెనీలు కలిపి దాదాపు 100,000 కుటుంబాలు అంటే 500,000 పొట్టలు.. తల విదిల్చా.. నాన్న గారి దగ్గరికి వెళ్లాలి.. కాసేపు ఆయనతో మాట్లాడాలి.. ఆయన స్నేహితులతో మాట్లాడాలి.. అనుకుంటూ సారిక మీద సదభిప్రాయం తో కారులో కూర్చున్నా.. కార్ కంపనీ కి చేరగానే, నా రూం కి వెళ్లా.. ఫస్ట్ ఇంటికి ఫోన్ చేసి, సౌభాగ్య లక్ష్మి తో మాట్లాడా.. బుడ్డోడిని వీడియో కాల్ లో చూసా.. తర్వాత, ఐశ్వర్య తో మాట్లాడా.. మనసు ప్రశాంతం అయిపోయింది.. శరీరానికి మనసుకి పూర్తి శక్తి వచ్చింది.. జయశ్రీని పిలిచి, సారికతో అప్పాయింట్మెంట్ తీసుకో అని చెప్పాను.. జయశ్రీ విస్మయం గా చూసింది.. అడిగి చూడు.. అన్నాను.. తల ఊపి బయటకి వెళ్లింది.. శివనాండి కి ఫోన్ చేసి, సారిక గురించి పో - లీ - స్ రికార్డ్ ఉంటే ఇవ్వమన్నాను.. నా ఆఫీస్ లో ఉన్న ప్రైవేట్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ని పిలిచి సారిక పూర్తి రికార్డ్ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకూ రెడీ చేసి ఇవ్వమని చెప్పాను.. అలాగే శ్రీధరన్, పల్లవి లని పిలిచి, మనం కొన్న కంపనీల్లో ఎవరైనా అప్పోజ్ చేసారా? అని అడిగాను.. ఎవరూ చెయ్యలేదు.. అందరూ రాజీనామా పంపారు అని చెప్పారు.. ఓకే, టేక్ ఓవర్ ప్రాసెస్ కంప్లీట్ చెయ్యండి.. అని చెప్పి వాళ్లని పంపేసాను..