27-12-2022, 05:56 PM
(This post was last modified: 27-12-2022, 05:57 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(27-12-2022, 05:22 PM)Lonely warrior Wrote: నాకు నచ్చిన రచయిత ఎవరు అని చెప్పను కాని ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ thread లోనే చెప్పాలి ఎందుకంటే నేను login అవ్వకముండు 2020 నుండి ఈ సైట్ నీ follow అవుతున్న దాని తర్వాత నేను కామన్ గా ఒక పాయింట్ నోట్ చేశాను . అది ఏమిటి అంటే ప్రతి స్టోరీ లో update to update minimum 3 days నుంచి one month వరకు కూడా గాప్ ఉంటుంది. కానీ ఇండెక్స్ లో ఏ పేజీ లో ఏ update ఉంటుందో ముందే చెప్తారు.అది ఎలా పోని కథ మొత్తం ముందే రాస్తే అప్డేట్స్ రెగ్యులర్ గా ఇవ్వొచు కదా . కొంత మంది ఉన్నారు అందులో నేను కూడా ఒకడిని update ఇచ్చి దాని తర్వాత నెక్స్ట్ update రాస్తారు.అలాంటి వాళ్లకు టైం పట్టడం సాధారణం ఏదైనా పని ఉండి కూడా వాళ్ళకి update ఆగుతుంది. మరి ముందే కథ రాసి పెట్టుకున్నా వాళ్ళు అప్డేట్స్ ఎందుకు ఇవ్వరు.
హా మీరు అనుకోవచ్చు అరేయ్ వెర్రిపుకా నీకు ఏమి తెలుసు అని అడుగుతున్నావు అని. మీ అంత కాకపోయినా కొద్దిగా తెలుసు
ఒక రోజు లో ఒక రైటర్ అవరేజ్ గా 4 నుండి 5 గంటలు మాత్రమే కథ మీద దృష్టి పెట్టగలరు అది కూడా వాళ్ళ ప్రొఫెషన్ writing అయితే ఇది జరుగుతుంది. మిగిలిన వాళ్ళు free times or weekend లో స్టోరీ రాయాలి. అలాంటి వాళ్లకు week మొత్తం మీద దొరికే టైం 15 to 20 hours అది కూడా free గా ఉండేది ఎటువంటి ప్రోగ్రాం లేకపోతే కానీ ఇక్కడ జోక్ ఎంటి అంటే కొంత మంది ఈ సైట్ లో రైటర్స్ కథలను ఎక్కడి నుండో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి కొద్దిగా మారుస్తున్నారు , వాళ్ళకి అబ్బో విపరీతంగా following..
చిన్న లాజిక్ ఆలోచించండి, లేదా మీరే ఒక సారి ట్రై చేయండి ఈరోజు కథ మొదలు పెడితే గట్టిగా ఒక కథ పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని..
షార్ట్ టైం లో అన్ని కథలూ ఎలా రాస్తున్నారు అని ఆలోచించండి.
కాపీ అండ్ పేస్ట్ కి ఇక్కడ విలువ ఎక్కువ...
Finally Naa best writer ఎవరు అంటే.. అతనికే P M చేశాను.
మిత్రమా lonely writer నువ్వు చెప్పిన దానితో అంగీకరిస్తాను. నాకు కూడా తెలుసు ఒక update రాయడానికి ఎంత సమయం పడుతుందో. నేను కూడా ఒక update ఇచ్చాకే ఇంకోటి రాస్తాను. అది కూడా ఆ వారంలో ఎంతవరకు వీళైతే అంత. Readers ఇది కాస్త గమనించాలి. కొందరు కథ ఎలా అనిపించింది అని చెప్పరు కాని update చదివిన వెంటనే మళ్ళీ update అంటారు. ఇంకా కొందరు రచయిత flow అర్దం చేసుకుని సహకరిస్తారు, అలా నాకు, ఇతరులకి కూడా సహకరించే వాళ్ళకు ముందుగా నా thanks.
ఇక copy and paste కి ఎక్కువ విలువ అంటావా, తేనె తీగకి పువ్వులు కావాలి కోతికి కొబ్బరి కావాలి. ఎవరికి ఎటువంటి కథలు ఇష్టమో అది వారికే తెలుస్తుంది. Aleady రాసుకున్న కథలు, modify చేసి రాస్తే readers fast updates కి attraction అంతె. వాళ్ళ తీరు అది.
నేను కూడా ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు.