(23-12-2022, 08:17 PM)Jani fucker Wrote: ఎన్నో సమస్యలు, ఆపదలు వాటి అన్నింటి తర్వాత విశ్వాస్ ఇంకా భాను హిమాలయ పర్వత యాత్ర కి బయలు దేరారు.. అయితే అసలు సవాళ్లు ఇప్పుడే మొదలు ... దైవ కార్యం మీద బయలుదేరిన వీళ్ళను మొదటి నుండి ఆ విలువైన వస్తువులు కోసం కాచుకొని ఉన్న నంబియార్ కి మధ్య పోరు.. ఇప్పుడు మరి నంబియార్ లేడు అతని వంశం నుండి ఎవరు ఉన్నారు అంటే...
........................ ***** .......................
మరొక్క విషయం కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవి..
1... ఇది పూర్తిగా కల్పితం ఇందులో ఎటువంటి దేవతలను అలాగే దేవుళ్లను తక్కువ చేసి చూపించడం లేదు.. కేవలం దైవ సంపద కోసం వృథా ప్రయత్నాలు చేస్తూ సాటి మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని వాళ్ళ గురించి మాత్రమే...
2...పాత్రలు , సన్నివేశాలు ,ప్రదేశాలు నా స్వతహాగా రాయబడినవి.. ఎటువంటి సినిమా కానీ సీరియల్ కానీ అందులో సన్నివేశాలు కానీ ఇందులో జోడించడం లేదు...
3...నిధి రహస్యం లోని ఏ పాత్ర కూడా ఇందులో ఉండదు ( ఇచ్చా రూప ధారి లో) తరువాతి అధ్యాయం లో ఉండే అవకాశం ఉంది..
4...అలాగే నంబియార్ వంశం అంటే ఇప్పటి నాయర్ కులం కేరళ లోకి వస్తుంది.. కాబట్టి ఇందులో నాయర్ కులం వాళ్ళని చెడు గా చూపించాను అని తప్పుగా అనుకోకండి..
చివరిది కానీ ముఖ్యమైనది...
దయచేసి ఏ కథను అయిన దేనికోసం రాస్తున్నారు అనేది పూర్తిగా చదివి ఆదరణ చూపించండి...
....... ఇచ్చారూపధారి... మొదటి భాగం ......
..................... కథ లోకి వెళ్ళే ముందు నంబియార్ పరిపాలన ఎలా మొదలు అయింది అని తెలుసుకుందాము.
.... శాసనం ఇంకా పతనం....
చాలా ఏళ్ళ క్రితం నాటి మాట ఇప్పటి కేరళ రాష్ట్రం లోని అలువ లో ఒక చిన్న కుటుంబం లో పుట్టాడు..నంబియార్ అతని అసలు పేరు అరిముల్యక మురుగన్ నంబినాయర్ .. నంబియార్ తండ్రి , అతని పేరు ఆర్యవీర్ మురగన్ నంబినాయార్.
నంబియార్ తండ్రి కులవృత్తి రీత్యా ఒక కమ్మరి. అతను
రాజ సైనికులకు ఆయుధాలు తయారు చేసేవాడు.అలాగే ఆర్యావీర్ స్వయంగా ఒక సైనికుడు కూడా ..నంబియార్ అతని తండ్రి కి 4 వ సంతానం .తల్లి ముక్తిక నాయర్. నంబియార్ తన తల్లి కొంగు చాటు బిడ్డ లాగా ఉండేవాడు.దాంతో అతనికి తల్లి తో పాటు రోజు గుడికి వెళ్ళడం అలవాటు అయింది.
ముక్తిక కు ఒక ప్రాణాంతక వ్యాధి సోకింది.
నంబియార్ 15 వ ఏట తన తల్లి ముక్తీక చనిపోయింది
. నంబియార్ అతని తల్లి చనిపోయిన ఏడే సైన్యం లో చేరాడు..
తర్వాత తన శక్తి సామర్థ్యాలు తో ఒక దళం కి సైనికాధికారి అయ్యాడు.. రాజ్య కాంక్ష మొదటి నుండి ఉన్న నంబియార్ చుట్టుపక్కల చిన్న చిన్న ప్రాంతాలను ఆక్రమిస్తు తన బలం పెంచుకోవడం మొదలు పెట్టాడు..ఈ విషయం అప్పటి మహా రాజు సెల్వాఘవన్ కి తెలిసి నంబియార్ ఆక్రమించిన ప్రాంతాలను స్వాధీనం చేసుకుని అతని రాజ్యం నుండి బహిష్కరించారు.. నంబియార్ తన ప్రాణ స్నేహితుడు అయిన హంశనందుడి తండ్రి దగ్గరకు వెళ్ళి శరణు కోరాడు..
హంశనందుడి తండ్రి అయిన ప్రచాలనందుడు నంబియార్ కి సహాయం చేసాడు..కేరళ రాజ్యం మీద యుద్ధం ప్రకటించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.. ప్రచాల తను గెలిచిన కేరళ రాజ్యాన్ని నంబియార్ కి అప్పగించి రాజు గా నంబియార్ కి పట్టాభిషేకం చేశారు.
సామంత రాజు గా నంబియార్ పరిపాలన ప్రచాలనందుడి కను సైగల్లో ఉండేది. ప్రచాలనందుడు మరణం తర్వాత హంశనండుడు రాజు అవ్వడం తో. హంసనందుడు అతని స్నేహతుడైన నంబియార్ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యం గా ప్రకటించాడు.. అప్పటి నుండి నంబియార్ మళ్ళీ తన రాజ్య కాంక్ష తో చిన్న చిన్న రాజ్యాల మీద యుద్ధాలు ప్రకటిస్తూ తన సైనిక దళాలు , ఖజానా విపరీతంగా పెంచుకుంటూ వచ్చాడు .
నంబియార్ కేరళ రాజ్యాన్ని ఒంటి చేత్తో పాలిస్తూ ఎన్నో రాజ్యాలను ఆక్రమించి ఒక నియంత లాగా ఎదిగాడు.తను ఏదైనా రాజ్యం మీదకు యుద్దానికి వెళ్తుంటే ఆయ రాజ్యానికి చెందిన రాజులు ముందుగా తనకు భయపడి అతని కాళ్ళ దగ్గరకు చేరేవాల్లు..లేదా కాటికి చేరేవాళ్ళు ...
నంబియార్ తన సంపద మొత్తం నేల మాలికలు రూపం లో ఎక్కడికి అక్కడ భద్రపరిచేవాడు..కానీ అతనికి ఎప్పుడు వాటి మీద ఆశ లేదు తనకు అతని మిత్రుడు అయినా హంశనందుడు వద్ద గల విలువైన వస్తువులు.. అలాగే తన తర్వాత ఈ సువిశాల సామ్రాజ్యాన్ని పరిపాలించడం కోసం ఒక వారసుడు...
మొదటి నుండి కూడా దైవభక్తి ఉన్న నంబియార్ అతని భార్య తో కలిసి ఎన్నో దాన ధర్మాలు చేశాడు. తీర్ధయాత్రలు చేశాడు.. తనకు సంతానం కోసం తీర్థయాత్రలు చేస్తూ ఉన్న నంబియార్ కి ఒక సన్యాసి ఎదురయ్యే నంబియార్ పరిపాలన లోనే ఉన్న ఒక చిన్న గ్రామం గురించి అక్కడి విశిష్టత గురించి చెప్పాడు.. దాంతో నంబియార్ తన భార్య తో
ఇక్కడికి ( త్రిస్సుర్ )వచ్చాడు. ఇక్కడి మూలవిరాట్ పరమశివుడు. ఇక్కడి శివుని విగ్రహాన్ని నాగేంద్రుడు స్వయంగా ప్రతిష్టించారు అని.అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసం మొదటి సోమవారం ఆ నాగేంద్ర స్వామి వచ్చి దర్శనమ్ ఇచ్చేవాడు అని అంటారు.అలాగే ఇదే గుడి లో ఉన్న బావి ద్వారా శివుని క్షేత్రాలకు సొరంగ మార్గాలు ఉన్నాయి అని అలాగే ఇక్కడి అడవి లో ఒక గుహ లో పెద్ద వల్మికం ( పుట్ట) ఉందని దాని ద్వారా నాగలోకం లోకి దారి ఉందని నమ్మకం.
నంబియార్ ఇక్కడి వచ్చిన తర్వాత కొన్ని నెలల్లో అతని భార్య అయిన వెలమాంబా గర్భం దాల్చడం జరిగింది. అప్పటి నుండి నంబియార్ ఈ ఊరినే తన సొంత రాజధాని గా మార్చుకొని ఇక్కడి నుండే యావత్తు భారతదేశాన్ని పాలించేవాడు...
...పతనం...
అయితే ఒక సారి తన ప్రాణ స్నేహితుడు హంశనందుడి తో జరిగిన యుద్ధం లో గెలిచి అంబి రాజ్యం మొత్తాన్ని నంబియార్ నాశనం చేశాడు. దాని తర్వాత నంబియార్ వంశం కూడా పతనానికి గురి అయ్యింది. ఎన్ని శతాబ్దాలు గడిచినా కూడా అతని వంశం లో ఆడ సంతానం కలగడం లేదు. అలాగే నంబియార్ చేసిన కొన్ని అకృత్యాలు వారి కుటుంబాన్ని వెంటాడుతున్నయి ..
రాజుల పాలన ముగిసింది..నంబియార్ వంశం లోని అతని వారసులు జమీందారులు గా చెలామణి అవుతూ ఉన్నారు.. వారు కూడా నంబియార్ అడుగు జాడల్లో నడవాలని త్రిస్సుర్ చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమీస్తు చివరికి ఊరి మధ్య లో ఉన్న గుడి నీ కూడా వదలలేదు. మూలవిరాట్ ను స్తాన భ్రంశం చేసి ఆ విగ్రహాన్ని అడవి లో ఒక గుహ లో పెట్టీ వచ్చారు..అది మొదలు ఎటు చూసినా వీరికి ప్రతి విషయం అనుకులించడం లేదు. కాలం మారుతోంది . ఒకప్పుడు దాదాపు పదివేల గడప తో లక్ష మందికి పైగా ఉన్న త్రిస్సుర్ ఇప్పుడు కేవలం ఐదు వేల మంది తో ఉంది..అయితే ఈ నంబియార్ వంశం లో గంజాయి వనం లో తులసి మొక్క లాగా పుట్టినవాడు"" దద్వార్ నాయర్"".. అతను పేరుకి తగ్గట్టే ధర్మరాజు.తన ఇంటి ముందు కు వచ్చి దేహి అని అడిగిన ఎవరికి ఖాళీ చేతులతో వెనక్కి తిరిగి పంపించేవారు కాదు.అతని భార్య ""అచల నాయర్"" నిజంగా దయగల తల్లి ఒక పేద ఇంటి నుండి ఈ ఇంటి కి కోడలు గా వచ్చింది. ఈవిడ శివ భక్తురాలు ఊర్లో మళ్లీ గుడి కట్టించి నిత్యం అందులో పూజలు చేయించేది.. కానీ చెప్తారు కదా నువ్వు ఎన్ని చేసిన కర్మ ఫలం అనుభవించక తప్పదు అని.అలాగే దద్వార్ ఇంకా అచల ఒక సారి వాళ్ల హవేలీ ( జమిందారు బంగ్లా) లో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది .దాంతో భార్య భర్తలు ఇద్దరు సజీవ దహనం అయిపోయారు..
దద్వార్ ఇంకా అచల ఉన్నప్పుడు రాజ భవనం లా కాంతులతో వెలిగిపోతున్న హవేలీ ఇప్పుడు ప్రేత కళతో చూడటానికే భయంకరం గా మారింది..ఊర్లో జనాలు కూడా అక్కడ వుండలేక మెల్లిగా వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు ఊరి మొత్తం మీద వెయ్యి మంది కూడా లేరు.. దద్వార్ ఇంకా అచల కు ఐదుగురు కొడుకులు.వారి పేర్లు గజేంద్ర నాయర్, దేవరాజ్ నాయర్, హేమరాజ్ నాయర్, మహేంద్ర నాయర్, అభిర్ నాయర్ .. దద్వార్ ఇంకా అచల వీరిని పంచ పాండవులు అని ముద్దుగా పిలుచుకునే వారు.. తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు గజేంద్ర వయస్సు 13 యేళ్లు అలాగే అభీర్ వయస్సు 5 .. వీరి చదువులు ఇంకా మంచి చెడూ దద్వార్ తమ్ముడు ఆర్య నాయర్ చూసుకునేవాడు..
దద్వార్ చనిపోయిన తర్వాత ఎవరు త్రిస్సుర్ వచ్చింది లేదు..అచల కట్టించిన గుడి లో అలాగే అడవి లో ఉన్న మూలవిరాట్ కు గురువాయూర్ నంబుతురి అనే ఒక వృద్ధ పూజారి నిత్యం పూజలు చేస్తూ ఉండేవాడు. అతను జ్యోతిష్యం అలాగే దివ్య దృష్టి విద్యల్లో నిష్ణాతుడు... దద్వార్ ఇంకా అచల చనిపోయిన తర్వాత ఎప్పుడు కూడా వారి కుటుంబం వాళ్ళు ఈ గుడిని దర్శించుకోడానికి రాలేదు..ఆర్య మాత్రం ఆలయ ధర్మకర్త గా గుడి కి కావలసిన అవసరాల కోసం ప్రతి సంవత్సరం 20 లక్షలు పంపించేవాడు..
దద్వార్ ఇంకా అచల చనిపోయి ఇప్పటికీ దాదాపు 35 సం"లు గడిచాయి... వాళ్ళ పిల్లలు ముగ్గురు విదేశాలలో మంచి వ్యాపారవేత్తలు గా ఎదిగారు.ఇద్దరు ఇండియా లోనే ఉంటున్నారు.. అయితే అన్నదమ్ములు ఐదుగురు ఒక రోజు మాట్లాడుకొని వాళ్ళ అమ్మ నాన్న ల పెళ్లి రోజు వస్తుంది . అందుకు పిల్లల కానుక గా ఆ హవేలీ బాగు చేయించి చుట్టుపక్కల ఊర్లలో అందరికీ అన్నదానం చేయాలి అని అనుకున్నారు . దానికోసం ముందుగా పెద్దవాడు గజేంద్ర త్రిస్సుర్ వచ్చాడు. తన కుటుంబం తో సహా అక్కడే ఉంటూ హవేలీ మరమ్మత్తులు చేయిస్తున్నాడు.. పని మొత్తం పూర్తి అవ్వడానికి దాదాపు 6 నెలలు పట్టింది. కార్తీకమాసం మొదలు అయ్యింది.. ఊర్లో అచల కట్టించిన గుడి లో కార్తిక మాస పుజలు మొదలు అయ్యాయి.. గజేంద్ర భార్య మీనా తన అత్తగారు లాగే గుడి లో పూజలు చేయిస్తుంది...
దేవరాజ్ తను కొచ్చి airport లో ఉన్నాను అని గజేంద్ర కి ఫోన్ చేసాడు... గజేంద్ర తన తమ్ముళ్ళ రాక గురించి భార్య తో చెప్పి
వాళ్ళని తీసుకొని రావడానికి బయలుదేరాడు. తను ఉంటున్న ఊరు నుండి airport కీ 3 గంటలు ప్రయాణం . మధ్యలో చిన్న అడవి మార్గం ఆ దారి చూడటానికి చాలా బాగుంటుంది..
గజేంద్ర కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు.. టైం రాత్రి 10:30 అవుతుంది.. అయితే ఆ అడవి మార్గం లో కార్ లైట్ వెలుతురు లో గజేంద్ర కి ఒక యువతి ఒంటరిగా నడుచుకుంటూ రావడం కనిపించింది..
గజేంద్ర ఆ యువతి నీ చూసి కార్ స్లో చేశాడు.. కార్ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఆగింది.. గజేంద్ర కార్ డోర్ తీసి బయటకు వచ్చాడు .ఆ యువతి అందం గజేంద్ర నీ కట్టి పడేసింది.
గజేంద్ర ఎవరు మీరు ఇంత రాత్రి వేళ ఈ అడవి లో ఒంటరిగా ఏమి ఇలా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు...
దానికి ఆ యువతి నా పేరు మృదుల, నా కార్ పాడైంది . దగ్గరలో ఎవరైన మెకానిక్ ఉన్నాడు ఎమో అని నడుచుకుంటూ వస్తున్న అని చెప్పింది..
గజేంద్ర...మృదుల అందం కి ముగ్ధుడైపోయాడు..ఓహ్ అవునా ఇప్పుడు ఇక్కడ మెకానిక్ ఎవరు ఉండరు.ఇది పల్లెటూరు కదా అని అన్నాడు..
మృదుల...ఓహ్ నేను 10 కిలోమటర్ల నుండి నడుచుకుంటూ వచ్చాను.మళ్లీ వెనక్కి వెళ్ళడం నా వల్ల కాదు అని గజేంద్ర నీ చూసింది..
మృదుల చెప్పిన దానికి గజేంద్ర వెంటనే, మీకు ఇబ్బంది లేకపోతే నేను మీకు తోడుగా వస్తాను.నాకు కార్ రిపేర్ కాస్త తెలుసు అని అన్నాడు.. మృదుల చిన్నగా నవ్వుతూ సరే అయితే అంటూ కార్ డోర్ ఓపెన్ చేసుకొని లోపల కూర్చుంటూ హ్మ్మ్ రండి వచ్చి కార్ స్టార్ట్ చేయండి అని చెప్పింది..గజేంద్ర తనకు పట్టిన అదృష్టాన్ని నమ్మలేకపోతు వచ్చి కార్ లో కూర్చొని కార్ స్టార్ట్ చేసాడు...
గజేంద్ర చూపు అంతా మృదుల మీదే ఉంది...
మృదుల తన కురులు సరి చేసుకుంటూ హేయ్ ఎంటి అల చూస్తున్నారు.. కాస్త రోడ్ వైపు కూడా చూసి డ్రైవ్ చేయండి . లేకపోతే దేనికి అయిన గుద్దేస్తారు అని అంది..
గజేంద్ర ...ఈ టైం లో నాకు తెలిసి మనం ఇద్దరం తప్ప మూడవ వ్యక్తి ఈ రోడ్ మీదకు రాడు.. అయిన మీరు ఎప్పుడో నన్ను మీ అందం తో గుద్దేసారు అని అన్నాడు..
గజేంద్ర మాటలకు మృదుల నవ్వుతూ అబ్బో మంచి మాటకారి మీరు అని అంది..గజేంద్ర కార్ స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ మృదుల వైపే తన దృష్టి పెట్టి మాటకారి మాత్రమే కాదు. చేతకారి నీ కూడా అని అన్నాడు..
మృదుల కిల కిల మని నవ్వుతూ అహ అవునా అంతా గొప్ప చేతకారి నా మీరు ఏమి చేస్తారు ఎంటి అని అడిగింది..గజేంద్ర కాస్త దైర్యం తెచ్చుకొని మీరు ఒప్పుకుంటే అంటూ మృదుల కాలి మీద తన చెయ్యి వేసాడు..మృదుల తన కాలి మీద ఉన్న గజేంద్ర చేతిని చూస్తూ కార్ డోర్ అద్దం మెల్లిగా కిందకు దించి కార్ లోకి వస్తున్న చల్లని గాలికి ఎగురుతున్న తన ముంగురులు చేతితో సవరించుకుంటూ హా ఒప్పుకుంటే తర్వాత ఎంటి అని అడిగింది..
గజేంద్ర తన చేతి పట్టు కొద్దిగా బిగించి ఈ రాత్రికి మీకు ఒక మరిచి పోలేని అనుభూతులు ఇస్తాను అని అన్నాడు.. మృదుల తన కళ్ళను గుండ్రంగా తిప్పుతూ అబ్బో దొరగారి కి చాలా కోరికలు ఉన్నాయి. అంతగా నాలో ఏమి నచ్చింది తెలుసుకోవచ్చ నేను, అంటూ తన మోచేతిని కార్ విండో మీద పెట్టి కాస్త గజేంద్ర వైపు తిరిగింది.. క్షణం పాటు తిరిగిన ఎక్కడ చెదిరిపోతాయో ఈ జ్నాపకాలు అన్నట్టు గజేంద్ర అలాగే చూస్తున్నాడు..
మృదుల...ఎంటి మరి అల చూస్తున్నారు.అంటు గాలికి ఎగురుతున్న తన చీర ను నడుము దగ్గర డొపుకుంటు గజేంద్ర ని చూస్తుంది..
గజేంద్ర...మిమ్మల్ని చూస్తుంటె ఆ బ్రహ్మ బదులు మన్మధుడు చేసినట్టు ఉన్నాడు.తన కొసం సృష్టించిన మిమ్మల్ని ఆ రతి దేవుడు పొరపాటుగా భూమి మీదకు పంపించాడు అనుకుంటా..ఒక్కో శరీర భాగం దేనికి అదే సాటి బహుశ ఈ భూమి మీద ఉన్న కవులు కుడా మీ అందాన్ని వర్ణించ లేక జుట్టు పిక్కుంటారు ఎమో అంటు మీ పాదం ముట్టుకున్న జన్మ ధన్యం అని అన్నాడు..
మృదుల పూర్తిగా గజేంద్ర వైపు కి తిరిగి తన కుడి కాలిని పైకి లేపి గజేంద్ర మొఖం దగ్గరకు తెచ్చి హ్మ్మ్ ముట్టుకొంది అని నవ్వుతుంది..గజేంద్ర కార్ డ్రైవ్ చేస్తూ ఒక చేత్తో మృదుల పాదం పట్టుకొని తనని చూస్తూ పాదాలకు ముద్దు పెట్టుకుంటున్నాడు.
గజేంద్ర కాలిని వదిలి మృదుల ని తన వద్దకు రమ్మని చెప్పాడు .మృదుల సీట్ లో నుండి లేచి గజేంద్ర దగ్గరకు వచ్చి తన ఒడిలో అటు ఇటు కాలు వేసి కూర్చుంది..గజేంద్ర ఒక చేత్తో మృదుల నడుము చుట్టేసి తన మీదకు లాక్కుంటూ మృదుల మెడ వంపుల్లో ముద్దులు పెడుతూ తన వొంటి నుండి వస్తున్న వాసన నీ పీలుస్తూ పిచ్చెక్కిపోతున్నాడు..మృదుల కూడా గజేంద్ర ను హత్తుకొని రెండు చేతులు అతని చుట్టూ వేసింది ..
గజేంద్ర...మృదుల నడుము మీద ఉన్న మడతలను సవరదీస్తూ నడుము భాగాన్ని మర్ధన చేస్తూ హా ఈరోజు రాత్రి నా జీవితం లో మర్చిపోలేని రాత్రి అది కేవలం మీ వల్ల అంటూ మృదుల వొంటి సువాసన పిలుస్తున్నాడు.
మృదుల...ఈ రోజు మీకు ఆఖరి రాత్రి అందుకే నేను వచ్చాను .అంటూ కార్ లో నుండి బయటకు చూస్తూ గజేంద్ర మొఖాన్ని తన ఎద అందాలు మీద దాచిపెడుతు మృదుల తన నోటి నుండి నాలుక బయట పెట్టి హిస్.హిస్.హిస్. అంటూ శబ్దం చేస్తుంది...మృదుల నాలుక పాము నాలుక లాగా రెండుగా చీలి ఉంది.మొఖం మీద కూడా పాము వొంటి మీద ఉన్న పోలుసు లాగా ఉంది..
......ఊర్లో.....
హవేలీ కి దేవరాజ్ ఇంకా హెమరాజ్ ఇద్దరు తమ తమ కుటుంబాలతో వచ్చారు...
అక్కడ పని చేసే వాళ్ళు బ్యాగ్ లు కార్ లో నుండి దింపి తీసుకొని వెళ్ళి లోపల పెట్టారు..
గజేంద్ర భార్య మీనా తన మరుదులు ఇద్దరినీ చూస్తూ నవ్వుతూ పలకరించింది..అలాగే తన చెల్లెళ్ళు ( ఇద్దరి భార్యలు) సంయుక్త,నిత్య లను కౌగలించుకొని అందరినీ లోపలికి పిలిచింది.
మీనా..ప్రయాణం ఎలా జరిగింది..అని లోపలికి వెళ్తూ అడిగింది.
దేవరాజ్... హా బాగానే జరిగింది వదిన అంటూ పనోల్లతో హేయ్ సామాన్లు జాగ్రతగా పెట్టండి గదుల్లో అని అన్నాడు.
అందరూ హాల్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
నిత్య( హేమరాజ్ భార్య)...అక్క ఆరోగ్యం ఎలా ఉంది.నికు వొంట్లో అసలు బాగాలేదు అని బావగారు ఈయనతో ఫోన్ లో చెప్పారు అంట అని అడిగింది..
.....గజేంద్ర తన కార్ లో ఆ అడవి లో వెళ్తున్నాడు....
అయితే గజేంద్ర దృష్టి మొత్తం మృదుల మీద ఉండటం తో కార్ వెళ్ళి ఒక చెట్టు కు గుద్దుకుంది.
గజేంద్ర ఏమైంది అని చూస్తూ ఎదురుగా కార్ చెట్టుకు గుద్దుకుని ఉండటం తో తన రెండు చేతులతో మృదుల నీ పక్క సీట్ లోకి కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను అని కింద కు దిగాడు..
గజేంద్ర కార్ వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.కానీ కార్ అంగుళం కూడా కదలడం లేదు..అరేయ్ ఏంటిది అస్సలు కదలడం లేదు అని అనుకుంటూ కార్ లో కూర్చొని ఉన్న మృదుల నీ చూస్తూ చిన్నగా నవ్వి మళ్ళీ ప్రయత్నం చేశాడు.అయినా కూడా కదలడం లేదు..గజేంద్ర కి ఏమి అర్ధం కాలేదు.మృదుల కార్ లో నుండి కిందకు దిగి గజేంద్ర దగ్గరకు వచ్చి ఏంటండీ మీ వల్ల అవ్వడం లేదా ఎవరైనా సహాయం కావాలా అని చులకన గా నవ్వింది.
గజేంద్ర కి అల తక్కువ చేసి మాట్లాడినందుకు మృదుల మీద కోపం వచ్చింది..
గజేంద్ర... ఎవరి సహాయం అవసరం లేదు నా గురించి నికు తెలీదు అంటూ బలం అంత ఉపయోగించి కార్ నీ తోసాడు .కానీ ఏమీ లాభం లేదు.. ఛా ఏంటిది అని గజేంద్ర మృదుల నీ చూసాడు.. మృదుల నవ్వుతూ నాతో పాటు రా అని చేతి వేళ్ళ తో చెప్తూ అడవి లోకి వెళ్తుంది . గజేంద్ర వెనకే వెళ్తూ హేయ్ ఎక్కడికి అని అన్నాడు.. మృదుల రా నాతో పాటు చెయ్యి చూపిస్తూ తన చీర కొంగు జార విడిచి మెల్లిగా విప్పుతూ ఇంకా లోపలికి వెళ్తుంది.గజేంద్ర మొఖం లో ఏదో సాధించా అనే ఆనందం అతను అలాగే వెళ్తూ మృదుల విప్పి పడేసిన చీర తీసుకొని తన మెడ లో నుండి వేసుకొని ముందుకు కదిలాడు .. అల ముందుకు వెళ్తున్న గజేంద్ర కి మృదుల కనిపించలేదు..
అరేయ్ ఎటు వెళ్ళిపోయింది తను అని చుట్టూ చూస్తూ ముందుకు కదిలాడు.గజేంద్ర కాలికి ఏదో తగిలి కింద పడ్డాడు.కింద మొత్తం బురదగా ఉండటం తో తన బట్టలు అన్నీ మురికి అయ్యాయి. గజేంద్ర పైకి లేచి ఛా అనుకుంటూ తన అవతారం చూసుకుంటూ ఇది ఎటు వెళ్ళిపోయింది అని అనుకుంటున్నాడు. అప్పుడే మృదుల చాలా కొద్దిగా దూరం లో నిలబడి తన రవిక తీసి గజేంద్ర వైపు విసిరింది.గజేంద్ర అది చూసి నవ్వుకుంటూ మృదుల వైపు పరిగెత్తాడు.జాకెట్ తొక్కుకుంటూ....
....హవేలీ....
మీనా అలాగే మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ కూర్చున్నారు మాట్లాడుకుంటూ..
దేవరాజ్..హా అవును వదిన ఎలా ఉంది నీకు ఏమైంది.అన్నయ్య కంగారు పడుతూ ఫోన్ చేసాడు అందుకే మేము వచ్చాము .సరే అన్నయ్య ఎక్కడ వచ్చి 10 నిమిషాలు అయిన కనిపించలేదు అని అన్నాడు..
మీనా...అదేంటి దేవ మీరు ఫోన్ చేశారు అని airport కి వచ్చారు కదా మీ కోసం అని అడిగింది..
హేమరాజ్...మా కోసం వచ్చాడా .అయిన మేము ఎప్పుడు ఫోన్ చేశాం వదిన నిన్న ఉదయం అన్నయ్య మాకు ఫోన్ చేయడమే మేము అయితే చేయలేదు అని అన్నాడు..
మీనా...మరి నాతో మీరు ఫోన్ చేశారు అని చెప్పి వెళ్లారు.వెళ్ళి కూడా 3 గంటలు అయింది అని కంగారు పడుతుంది .
మీనా అల కంగారు పడటం చూసి సంయుక్త , నిత్య ఇద్దరు వచ్చి తన పక్కన కూర్చున్నారు .
సంయుక్త...అక్క ఎందుకు అల కంగారు పడుతున్నావు . మా వారు ఫోన్ చేయకపోతే ఎంటి మహేంద్ర లేదా అభిర్ వీళ్లలో ఎవరైనా చేసి ఉండొచ్చు కదా అని చెప్పి సరే మనందరికీ భోజనాలు ఏర్పాట్లు చేస్తాను .ఇక్కడ వంట గది ఎక్కడ అని అడిగింది..
సంయుక్త మాటలకు ఒక్క మీనా మాత్రమే కాదు, నిత్య, హేమరాజ్ అలాగే దేవారాజ్ కూడా ఇలా కూడా జరిగే అవకాశం ఉంది కదా అని అనుకొని కాస్త కుదుటపడ్డారు .. ఇంకా అందరూ భోజనానికి లేచారు...
..అడవి లో మృదుల నీ వెంబడిస్తూ వెళ్తున్న గజేంద్ర కొంత దూరం వెళ్ళిన తర్వాత భయం తో అరుస్తూ దేన్నో చూస్తూ వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు.
కంగారు లో గజేంద్ర కి ఎటు వెళ్తున్నాడు అనేది అర్థం కావడం లేదు అంత చీకటి .... గజేంద్ర గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది.
వెనక్కి చూస్తూ పరిగెడుతున్న గజేంద్ర కి ఏదో తనని తరుముతున్న భావన అలాగే ఉంది.అల పరిగెడుతూ ఉన్న గజేంద్ర కాలిని ఎవరో పట్టుకోని లాగారు . దాంతో గజేంద్ర కింద పడ్డాడు . ఏదో భారీ ఆకారం పొదల్లో కదులుతూ గజేంద్ర నీ ఇడ్చుకుంటు తీసుకొని వెళ్తుంది. [/url][url=https://imgbb.com/]
గజేంద్ర కాపాడమని అరుస్తున్నాడు. కానీ ఇంత రాత్రి వేళ ఈ అడవి లో ఎవరు ఉంటారు..చెట్లకు ఉన్న ముళ్ళు గజేంద్ర వొంటిని చిరెస్తున్నాయి..తన వొంటికి అయిన గాయాల నుండి రక్తం కారుతోంది.అయిన కూడా ఎవరో గజేంద్ర నీ ఇద్చుకుంటు తీసుకొని వెళ్తున్నారు..ఉన్నట్టుండి గజేంద్ర నీ గాలి లోకి ఎత్తి ఒక చెట్టు కాండనికి వేసి కొట్టారు .దాంతో గజేంద్ర గట్టిగా అరుస్తూ స్పృహ కోల్పోయాడు .
గజేంద్ర స్పృహ లోకి వచ్చి చూస్తే నేల తన తల పైనా కనిపిస్తుంది.ఎంటి ఇది అన్నట్టు గజేంద్ర చుట్టూ చూస్తే ఒక పెద్ద మర్రిచెట్టు కి తలకిందులుగా వేలాడుతున్నాడు. హేయ్ ఎక్కడ దాక్కున్నావ్ నా ముందుకు రా నీ అంతు చూస్తా అని అరుస్తున్నాడు.. ఇందాక చెట్టు కు వేసి కొట్టడం తో గజేంద్ర వొంట్లో ఎముకలు కొన్ని విరిగాయి..ఆ నొప్పి కి ఇప్పుడు ఈ నొప్పి కీ తట్టుకోలేక గజేంద్ర అరుస్తునే ఉన్నాడు.. ఏ చీర అయితే తను మెడ్ లో వేసుకొని మృదుల వెనుక వెళ్ళాడో.ఇప్పుడు అదే చీర తో గజేంద్ర నీ చెట్టు కు వేలాడాదిశారు... గజేంద్ర అరస్తునే ఉన్నాడు..
ఇంతలో పొదల్లో నుండి హిస్.. హిస్స్ అని శబ్దం చేస్తూ గజేంద్ర వైపు కి ఏదో వస్తుంది.దాన్ని చూస్తూనే గజేంద్ర భయం తో ఇంకా గట్టిగా అరుస్తున్నాడు .
ఆ పొదల్లో నుండి దాదాపు 60 అడుగుల ఒక నాగం( పాము) అక్కడికి వచ్చింది.అది గజేంద్ర నీ చూస్తూ అతని కింద తల చుట్టూ తిరుగుతూ బుసలు కొడుతోంది...
గజేంద్ర ఆ పాము నీ చూస్తూ తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాడు.కానీ తన తరం కావడం లేదు . వొంట్లో ఎముకలు విరిగి రక్త స్రావం అవుతుంది . పాము గజేంద్ర చుట్టూ తిరుగుతూ ఒక చోట ఆగి మనిషి లాగా మారింది.. గజేంద్ర ఆ మనీషి నీ చూస్తూ కోపం తో నువ్వా అసలు ఎవరు నువ్వు వంచకి అని అరుస్తున్నాడు.
ఆ మనీషి ( మృదుల ) గజేంద్ర నీ చూసి నవ్వుతూ నీ పాలిట మృత్యువు నీ అంటూ తన నోరు తెరచి గజేంద్ర మీదకు విషం చిమ్ముతుంది. ఆ విషం గజేంద్ర వొంటి మీద పడి అతని దేహం లోకి ప్రవేశించింది..
మృదుల నవ్వుతూ త్వరలో నీ మిగిలిన నలుగురు తమ్ముళ్లను కూడా నీ దగ్గరకి పంపిస్తాను అని చెప్తూ పాము లాగ మారి వెళ్ళిపోయింది.
గజేంద్ర మీద విషం చాలా వేగంగా ప్రభవం చూపించింది .అతని నీ తలక్రిందులుగా కట్టేసి ఉంచడం తో మెదడు కి రక్త ప్రసరణ వేగంగా జరిగి కళ్ళ లో నుండి చెవుల్లో నుండి అలాగే ముక్కు ఇంకా నోటి నుండి రక్తం కారుతోంది..గుండె వేగం ఒక్క సారి గా పెరిగి కొట్టుకోవడం ఆగిపోయింది.గజేంద్ర శరీరం నల్లగా మారిపోయింది....
హవేలీ లో అందరూ గజేంద్ర కోసం చూసి బాగా ఆలస్యం అయ్యేలా ఉంది . ఉదయాన్నే మాట్లాడుకోవచ్చు అనుకుంటూ దేవరాజ్, హేమరాజ్ లు తమ భార్యలతో వాళ్లకు ఇచ్చిన గదుల్లోకి వెళ్ళిపోయారు. మీనా మాత్రం గజేంద్ర కోసం ఎదురు చూస్తుంది....
మృదుల తన నాగిని రూపం నుండి ఒక పక్షి లాగా మారి హవేలీ దగ్గరకు ఎగురుకుంటూ వచ్చి ఒక చెట్టు మీద కూర్చుంది. తనకు ఎదురుగా హవేలీ లోని ఒక కిటికీ లో నుండి హేమరాజ్ కనిపిస్తున్నాడు...
పక్షి రూపం లో ఉన్న మృదుల హేమరాజ్ నీ చంపాలి అని వేగంగా ఎగురుతూ కిటికీ దగ్గరకు వచ్చి వాలింది.మృదుల తన రెక్కలను ఆడిస్తూ కాలి పంజాల తో కిటికీ అద్దం మీద కొడుతోంది.
కిటికీ దగ్గర పక్షి నీ చూసినా హేమరాజ్ దానిని తోలదానికి కిటికీ తలుపు తెరిచి ప్రయత్నం చేస్తున్నాడు . కానీ బయట నుంచి ఆ పక్షి కీ... కీ... కీ... అని అరుస్తూ గాలి లో గుండ్రంగా తిరుగుతూ మళ్ళీ వచ్చి కిటికీ దగ్గర వాలుతుంది . అది చూసి విసిగిపోయిన హేమరాజ్ మంచం పక్కన ఉన్న పళ్ళు కోసే కత్తి నీ ఆ పక్షి మీదకు విసిరాడు.. ఆ కత్తి నేరుగా వచ్చి పక్షి రెక్క కు తగిలింది.. దాంతో ఆ పక్షి ( మృదుల ) కింద పడిపోయింది..
హేమరాజ్ నవ్వుతూ కిటికీ మూసేసి మంచం మీద నడుము వాల్చి తన భార్య కోసం ఎదురు చూస్తున్నాడు . కింద పడిన మృదుల ఒక కోతి లాగా మారి చెట్టు ఎక్కి అక్కడ నుండి వెళ్ళిపోయింది...
మృదుల అక్కడి నుండి అడవి లోకి వెళ్ళిపోయి గుహ లో ఉన్న శివుని విగ్రహం దగ్గర కు వెళ్లి మానవ రూపం దాల్చి శివునికి నమస్కరిస్తూ వేడుకుంది..
మృదుల .. ఓహ్ లోకేశ్వర తమ సొంత లాభం కోసం నా వంశం మొత్తాన్ని నాశనం చేసిన వారిలో ఇద్దరినీ హతమార్చాను . మిగిలిన ముగ్గురిని కూడా శిక్షించే శక్తి నాకు ప్రసాదించు తండ్రి అని వేడుకుంటుంది...
మృదుల శివునికి ప్రార్థించి తన చేతికి అయిన గాయానికి కట్టు కుంటుంది.ఆ సమయం లో అక్కడికి ఒక పాము వచ్చింది . మృదుల దానిని చూస్తూ ఓహ్ నువ్వా ఈ సమయం లో ఇక్కడ రావడానికి కారణం ఏమిటి అని అడిగింది..
ఆ పాము ఒక మగ మనీషి లాగా మారి మృదుల పక్కకి వచ్చి కూర్చొని నా రాకుమారి ఎలా ఉంది అని చూడటానికి వచ్చాను అంటూ మృదుల చేతికి కట్టు కట్టడం లో సహాయం చేస్తున్నాడు.. అతను మృదుల ను చూస్తూ దేవయాని ( మృదుల) ఇక నువ్వు మన లోకానికి వచ్చే సమయం ఆసన్నం అయ్యింది, నీ చేతి గాయం చూడు చాలా లోతుగా తగిలింది అని అన్నాడు..
మృదుల అక్కడి నుండి లేచి ఇది కేవలం చిన్న గాయం మాత్రమే వాయున, ఇది కొన్ని రోజులకు మానిపోతుంది.. కానీ ఆ రాక్షసులు మనకు చేసినదానికి నా గుండెల్లో అయిన గాయం ఎప్పటికీ మానదు నేను మిగిలిన ఆ నలుగురు మీద కూడా ప్రతీకారం తీర్చుకునే వరకు ఈ లోకాన్ని వదిలి రాను ఇది ఆ శివుని మీద ఆన అని అంది ..
వాయున పైకి లేచి మృదుల దగ్గరకి వచ్చి నీ గురించి నాకు తెలుసు అందుకే నువ్వు నీ కర్తవ్యం పూర్తి చేసేవరకు నీకు అలాగే మన ప్రేమ కి తోడుగా నేను కూడా ఈ లోకం లో ఉంటాను , నీతో పాటు అని మృదుల ను ఆలింగనం చేసుకున్నాడు.. మృదుల కూడా తన ప్రేమికుడిని హత్తుకుంది...
వాయునా తన చెలి పరిమళాన్ని ఆస్వాదిస్తూ మృదుల ను కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు..
మృదుల...ఎంటి వాయునా అల చూస్తున్నావు . ఈరోజు వింతగా ఏమైనా కనిపిస్తున్నానా అని అడిగింది..
వాయునా...అదేమీ లేదు కానీ నాకు ఇప్పటికీ ఆశ్చర్యం గా ఉంది. ఈ చేప కళ్ళ అమాయకపు చిలిపి సుందరి ఇద్దరినీ చంపింది అంటే నమ్మలేకపోతున్న అంటూ మృదుల ను చూస్తున్నాడు..
మృదుల నవ్వుతూ ఇప్పుడు నువ్వు కూడా ఆ కుటుంబం తో కలిసి వారిలో ఒకడి లా ఇక్కడే ఉంటావు కదా అప్పుడు చూడు.. ప్రస్తుతానికి మనం ఇద్దరం వెళ్లాల్సిన సమయం ఆసన్నం అయ్యింది.. హవేలీ లో కలుసుకుందాం అంటూ వాయునా కి వీడ్కోలు చెప్పి చిలుక లాగా మారి అక్కడ నుండి ఎగిరి వెళ్ళిపోయింది..
వాయునా కూడా పావురం లాగా మారి వెళ్లిపోయాడు...
పాఠకుల కు ఒక ప్రశ్న ఇందులో మీరు గమించిన అంశాలు కమెనట్స్ లో తెలుపండి ..
పేర్లు చాలా కొత్తగా ఉన్నాయి . దాద్వార్, అభీర్,అచల,గురువాయూర్, వాయునా అలాగే నంబియార్ పేరు సూపర్...

గజేంద్ర కంటే ముందు ఎవరు చనిపోయారు. హేమరాజ్ అయితే మృదుల మీద కత్తి విసిరాడు. మరి దేవేంద్ర,మహేంద్ర, అభీర్ వీళ్లలో ఒకడు చనిపోయాడు అవునా. నెక్స్ట్ అప్డేట్ తొందరగా ఇవ్వు ...


అలాగే అందరూ
కాలనీలో టీచరమ్మ చదవండి...