25-12-2022, 05:31 PM
శీను : నాకు గుర్తున్నంత వరకు అది మార్కెట్ లాంటి ఏరియా ఎవ్వరిని ఎవ్వరు పట్టించుకోని జీవితాలు, అందులో ఒక చిన్న పూరి గుడిసె మాది అమ్మా నేను నా తమ్ముడు అంతే. నాకు ఆరేళ్లు ఉంటాయేమో రెండేళ్ల నా తమ్ముడిని నాకు అప్పజెప్పి అమ్మ పనికి వెళ్ళేది. అమ్మ వచ్చే వరకు వాడు ఏడవకుండా చూసుకోవడమే నా పని. అమ్మ వచ్చే వరకు వాడిని ఆడిస్తే అమ్మ వచ్చాక మా ఇద్దరికీ అన్నం వండి తినిపెడితే తినేసి అమ్మ చెప్పే కధలు వింటూ పడుకునే వాళ్ళం.
ఒకరోజు అమ్మ ఇంటికి రాలేదు, వర్షం పడుతుంది కదా వస్తుందిలే ఆనుకుని తమ్ముణ్ణి నిద్రబుచ్చి నేనూ పడుకున్నాను. తెల్లారే మెలుకువ వచ్చింది చూస్తే అమ్మ రాలేదు. సొరుగులో చిల్లర ఉంటే పాలు కొనుక్కోచ్చి కాచి వాడికి తాపాను. రెండు రోజులు గాడిచాయి అమ్మ రాలేదు తమ్ముడు తిండికి ఏడుస్తుంటే ఏం చెయ్యాలో తెలీక వాడిని అలా చూడలేక మొదటి సారి ధైర్యం చేసాను. తమ్ముణ్ణి ఉయ్యాల కోసం కట్టిన అమ్మ చీర చించి వాడిని నా వీపుకి కట్టుకుని ఇంట్లో నుంచి అడుగు బైటికి పెట్టాను.
ఆ రోజు చెయ్యి చాచి ఎంతమంది కాళ్లు పట్టుకుని అడుక్కున్నానో లెక్కలేదు, వాడికి నీళ్లు కూడా తాపలేక వాడి ఆకలి చూడలేక కాలవలో మురికి నీళ్లు నా చేత్తో వడకట్టి తాపించాను. తమ్ముణ్ణి వీపుకి కట్టుకునే షు పాలిష్ చేసే వాడిని. పొద్దున నుంచి సాయంత్రం వరకు కష్ట పడితే వాడికి పాలు ఇంట్లోకి ఒక బిందెడు నీళ్లు ఇచ్చేవారు. పన్నెండు రోజులు వాటితోనే సర్దుకున్నాను.
ఒకరోజు ఎవడో వచ్చి నా జుట్టు పట్టుకుని మా గుడిసె నుంచి బైటికి తోసి ఉన్న సామాన్లు బైటికి విసిరేసి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్లాలో తెలీలేదు, రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే ఇటికల బట్టి ఒకటి కనిపించింది పని అడిగితే నన్ను నా తమ్ముణ్ణి చూసి పనిలో పెట్టుకున్నారు. తిండి పెట్టేవారు కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు కారు. రెండు నెలలు ఒకటే చొక్కా నిక్కరుతో ఉన్నాను.