25-12-2022, 11:35 AM
(This post was last modified: 25-12-2022, 11:36 AM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
పొద్దున్నే కనిక లేచి రాత్రి జరిగింది తలుచుకుని సిగ్గు పడి, పిచ్చ సంతోషంగా దొల్లుతూ శీనుని తలుచుకుని మళ్ళీ మంచం మీద పడిపోయి బెడ్ షీట్ మీద ఉన్న డిజైన్ కి అనుగుణంగా వేలుతో రాస్తూ శీను గురించి ఆలోచిస్తూ తెగ సంబరపడుతుంది. ఇదంతా గమనిస్తున్న దీపాలి కనిక దెగ్గరికి వెళ్లి తన పక్కనే బోళ్ళా పడుకుని ఏంటక్కా బాధ పడతావని అనుకుంటుంటే చాలా సంతోషంగా ఉన్నావు. ఆ జగదీష్ వెళ్లిపోయాడని నాకే చాలా బాధేసింది అలాంటిది నీ మెడలో తాళి కట్టినవాడు వెళ్ళిపోతే నువ్వేమో ఇలా ఆనంద పడుతున్నావ్
కనిక : ఏంటి.. జగదీష్ వెళ్ళిపోతే బాధ పడ్డావా
దీపాలి : అదీ..
కనిక : ఎప్పుడు జరిగింది ఇది నాకు తెలీకుండా.. ఆ..
దీపాలి : అంటే అదీ.. నేను తనకి ఇంగ్లీష్ నేర్పించాను.. తను నాకు ఫైటింగ్ నేర్పించాడు.. ఆ టచింగ్స్ లో కొంచెం.. పైగా స్మార్ట్ గా ఉన్నాడు.. అలా జరిగిపోయింది.. కానీ ఆ సచ్చినోడికి అన్న తప్ప వేరే ధ్యాస లేదు.. ఎంతసేపు.. అన్నా.. అన్నా.. అన్నయ్య.. ఈ ఒక్క ముక్క తప్పితే నోటి నుంచి ఇంకో మాట రాదు.
కనిక : హహహ్.. వాళ్ళు వెళ్ళిపోలేదు.. బాధ పడకు
దీపాలి : వెళ్లలేదా అని లేచి నిలబడింది.. తన కళ్ళలో మెరుపు కనిక గమనించి నవ్వుకుంది.
కనిక : వెళ్ళలేదు.. తన రూంలోనే ఉండుంటాడు వెళ్లి చూడుపో
జగ్గు : ఇక్కడే ఉన్నాను అని బైట నుంచి చెయ్యి ఊపాడు నవ్వుతూ..
కనిక జగ్గుని చూసి భయపడిపోయి వెంటనే తల దించుకుంది.. జగ్గు అది గమనించి లోపలికి వచ్చాడు. కనిక దెగ్గరికి వెళ్లి దీపాలి చెయ్యి పట్టుకుని పక్కకి జరిపి వెళ్లి కనిక పక్కన కూర్చున్నాడు.
జగ్గు : వదినా
జగ్గు వదినా అని పిలవగానే ఆశ్చర్యంగా తల ఎత్తింది. జగ్గు కనిక చెయ్యి పట్టుకున్నాడు.
జగ్గు : నీతో అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు.. ఎప్పుడు అన్నయ్య ఒక అమ్మాయిని చూడటం గాని మాట్లాడటం గాని నేను చూడలేదు.. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాడి మీద కాలు వేసి పడుకుంటాను (కనిక, దీపాలి నవ్వుకున్నారు ) కలలో కూడా వాడు ఒక అమ్మాయిని తలుచుకోవడం నేను చూడలేదు కానీ నిన్ను చూడగానే అన్నయ్య మారిపోవడం గమనించాను, అదే నాకు భయమేసింది.. అన్నయ్య మా గురించి నీకు చెప్పాడని నాకు తెలుసు మేము క్రిమినల్స్ మి.. మళ్ళీ లేని పోనీ సమస్యలు వస్తాయని అనుకున్నాను దాని కంటే పెద్ద కారణం ఇంకోటి ఉంది.. నన్ను నా అన్నని నువ్వు విడతీస్తావేమో అన్న భయం.. అందుకే నీతో అలా ప్రవర్తించాను.
కనిక జగ్గు చేతి మీద తన చెయ్యి వేసింది
కనిక : లేదు జగదీష్.. మీ అన్నయ్యకి నువ్వంటే ఎంత ఇష్టమో తన కళ్ళలో నేను చూసాను.. ఎవ్వరితో పంచుకొని తన బాధలు నాతో పంచుకున్నప్పుడే నాకు అర్ధమయ్యింది.. శీను నన్ను ప్రేమిస్తున్నాడని.. ఇక మీ ఇద్దరి మధ్యలో నేను దూరతానని భయపడుతున్నావా.. హహ.. మర్చిపోయావా నేను ఇంకొన్ని రోజుల్లో చచ్చిపోతాను..
జగ్గు : లేదు నీకేం కాదు
కనిక : జగదీష్
జగ్గు : జగ్గు అని పిలువు వదినా.. ఇక చెప్పాను కదా నీకేం కాదని.. అన్నయ్య నీకు చెప్పలేదు కదా.. అన్నయ్య వెళ్ళింది నీ పని మీదే.. నీకు గుండెని తీసుకురావడానికి వెళ్ళాడు.. ఎలా ఏంటి అని అడక్కు.. నేను చెపుతున్నాను కదా వాడు ఒక్కసారి ఏదైనా పనిలోకి దిగాడంటే అనుకున్న టైంలో పూర్తిగా చేసి తీరతాడు.. నువ్వేం భయపడకు.. అన్నయ్యతో నీకు నచ్చినన్ని రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావు నాది గారంటీ.. కావాలంటే బెట్ వేసుకుందాం ఏమంటావ్
దీపాలి : ఏంటి బెట్
జగ్గు : ఆ.. నేను ఓడిపోను కానీ.. నాలుగు రోజుల్లో అన్నయ్య రాకపోతే నేను జీవితాంతం వదిన ఏదీ చెపితే అది చేస్తాను.. వదిన శివగామి అయితే నేను కట్టప్ప లాగ..
దీపాలి : మరి నాలుగు రోజుల్లో వస్తే
జగ్గు : వస్తే.. వస్తే..
కనిక నవ్వుతూ వస్తే అంది.. జగ్గు వెంటనే దీపాలి పక్కన నిలుచొని భుజం మీద చెయ్యి వేసి దెగ్గరికి లాక్కుని.. వదినా నువ్వు ఓడిపోతే నాకు దీన్నిచ్చి పెళ్లి చెయ్యాలి.. ఏమంటావ్
దీపాలి : పోరా నేను చేసుకోను.. అనగానే జగ్గు నీరసపడిపోయాడు.. కనిక నవ్వుకుంది.. అది చూసి దీపాలి కూడా గట్టిగా నవ్వి.. సరే పో.. పండగ చేస్కో అంది.. జగ్గు సంతోషంతో యే యే.. అని ఎగిరి దీపాలిని ఎత్తుకుని గిరగిరా తిప్పి మంచం మీద విసిరేసాడు.. దీపాలి అమ్మా.. అనగా కనిక అది చూసి గట్టిగా నవ్వింది..
దీపాలి : మోరటోడా
జగ్గు : సరే రెడీ అవ్వండి.. అలా బైటికి వెళదాం
కనిక : ఎక్కడికి జగ్గు
జగ్గు : ఇంట్లో ఏం చేస్తాం వదినా.. అలా బైటికి వెళదాం.. పేరుకే పెళ్లి అయ్యింది కానీ.. మీ అస్సలు పెళ్లి నిన్న రాత్రి జరిగింది.. పార్టీ ఇవ్వాలి కదా వదినా.. నాకు ఈ ఊరు చూపించండి
దీపాలి : పదక్కా వెళదాం.. ఇంట్లో ఆ సోంబేరి మొహాలని ఎంతసేపు చూస్తాం
కనిక నవ్వుతూ సరే అని లేచింది. ముగ్గురు రెడీ అయ్యి బైటికోచ్చి కారు తీస్తుంటే కనిక కుటుంబంలోని మావయ్య బాబాయిలు చూస్తూ ఉన్నారు.
వీళ్లింకా పోలేదా..
ఉండనీ.. మన ప్లాన్ ప్రకారం.. మన ఇంటి గుట్టు బైటికి రాకూడదంటే వీళ్ళు బైటికి వెళ్లకపోవడమే మంచిది, అనయ్యతో మాట్లాడాను ప్లాన్ చేస్తా అన్నాడు.
శీను ముంబై చేరడానికే ఒక రోజు సమయం గడిచిపోయింది, ఆరోజంతా రెస్ట్ తీసుకుని తెల్లారి రెడీ అయ్యి కొత్త సిం కొత్త ఫోన్ ఒకటి తీసుకుని సికిందర్ కి ఫోన్ కలిపాడు.
సికిందర్ : హలో
శీను : సికిందర్ భాయ్
సికిందర్ : హా.. బోలో
శీను : భాయ్.. డాన్ శీను మనిషిని
సికిందర్ : ఎక్కడున్నావ్
శీను : ఇప్పుడే ముంబైలో అడుగు పెట్టాను
సికిందర్ : నా మనుషులు వస్తారు.. నిన్ను పికప్ చేసుకుంటారు
శీను : లేదు భాయ్.. డాన్ శీను ఎవ్వరిని కలవద్దని చెప్పారు.. నేను వెళ్లేముందు మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను మీకోసం డాన్ గిఫ్ట్ పంపించాడు అది ఇచ్చే వెళతాను
సికిందర్ : డాన్ శీను గారు నాకు గిఫ్ట్ పంపించారా.. నిజమా
శీను : నిజమే భాయ్.. మీరు ఊహించనిది.. ఇవ్వాల్టి నుంచి మూడు రోజుల్లో మిమల్ని కలుస్తాను.. మీ మనుషులని ఇద్దరిని పంపించండి నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి టైం చాలా తక్కువగా ఉంది.
సికిందర్ : వస్తున్నారు
శీను : థాంక్స్ భాయ్..
సికిందర్ : నై నై.. సబ్ కుచ్ డాన్ కేలియే.. ఖుదా హఫీజ్ అని పెట్టేసి ఆలోచించడం మొదలుపెట్టాడు డాన్ తనకోసం ఏం పంపించి ఉంటాడా అని..
శీను బంద్రా వచ్చి హోటల్లో భోజనం చేసిన ఐదు నిమిషాల్లో ఇద్దరు వచ్చి శీనుకి ఫోన్ చేశారు.. వాళ్ళని కలుసుకుని కారులో వెళుతునే కావాల్సిన వివరాలు కనుక్కున్నాడు.
తన పేరు వింధ్య
వయసు 28
ఆరేళ్ల కూతురు, పేరు వల్లి
దారిలో వెళుతూనే తను రాసుకున్న డైరీ చదివాడు
భర్త సురేష్, డబ్బంటే పిచ్చి.. అమ్మా నాన్న లేని వింధ్యని తన ఆస్తి కోసం ప్రేమించి లేపుకేళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఏడాదికి కూతురు పుట్టింది కానీ వింధ్యకి మాత్రం కాళ్లు చేతులు శరీరం అన్ని చచ్చు పడిపోయాయి. కేవలం మాట్లాడడం తప్ప ఇంకేమి చెయ్యలేదు.. ప్రతీ నెలా హాస్పిటల్ కి తీసుకెళ్ళాల్సిందే.. ప్రతీ వారం డాక్టర్ చెకప్ ఇంట్లో జరగాల్సిందే.. ఆస్తి వచ్చిన కొత్తల్లో కొన్ని రోజులు బాగానే ఉండేవాడు కానీ రాను రాను తన అసలు బైట పడటం వింధ్య గమనించింది.. తన ముందే రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఆ తరవాత మొదటి భార్య హాస్పిటల్ అదనపు ఖర్చులు పెట్టడం ఇష్టం లేక ఇప్పటికి రెండు సార్లు హత్యా ప్రయత్నం చేసాడు. ఒకసారి విధి కాపాడితే రెండో సారి కూతురు కాపాడుకుంది.. అప్పటి నుంచి కూతురు వల్లి చదువు మానేసింది తన గురించి ఆలోచించడం మానేసి అమ్మ బాగోగులు చూసుకుంటూ ప్రతీ క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది. ఇప్పుడు తనని ఒప్పించి గుండె తీసుకోవాలో లేదా ఏం ఆలోచించకుండా చంపేసి తీసుకోవాలో అర్ధం కాలేదు.
ఇంతక ముందు శీను అయితే ఈ పాటికి ఒక్క ఫోన్ కాల్ తో వింధ్యని లేపేసి తనకి కావాల్సింది తాను తీసుకునేవాడు కానీ ఏ క్షణాన కనికని కలిసాడో డాన్ శీను అప్పుడే చచ్చిపోయాడు. ఈ విషయం శీనుకి ఇప్పుడు కాదు కనికని చూసిన మొదటి క్షణంలోనే తెలిసిపోయింది తన నడక తన చూపులు తన మాటలు ప్రతీ ఒక్కటి తన అమ్మని గుర్తు చేసాయి అందుకే డాన్ శీను మళ్ళీ ఉత్త శీను అయిపోయాడు.
ఇప్పుడు శీను ఆ ఇంటికి ఎందుకు వెళుతున్నాడో కూడా తనకి తెలీదు.. సురేష్ తన కూతురు వల్లిని తట్టుకోలేక వింధ్యకి ఒక కేర్ టేకర్ కోసం చూస్తున్నాడు.. ఇప్పుడు శీను కేర్ టేకర్ గానే ఆ ఇంటికి వెళుతున్నాడు. ఆలోచిస్తుండగానే కారు వింధ్య ఇంటి ముందు ఆగింది. కారు దిగి వాళ్ళని వెళ్లిపొమ్మని ఆ పెద్ద ఇంటిని చూస్తూ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు.
సెక్యూరిటీ ఆపగానే ఇన్విటేషన్ చూపించి సెక్యూరిటీని దాటుకుని వెళుతు గార్డెన్ లో వీల్ చైర్లో అటు వైపు తిరిగి ఉన్న వింధ్యని తన ఎదురుగా టేబుల్ మీద టేప్ రికార్డర్ పెట్టి డాన్స్ వేస్తున్న చిన్న పాపని చూస్తూ ఉండగా ఒకతను వచ్చి ఎవరు కావాలి అని అడగ్గా తను వచ్చిన విషయం చెప్పాడు. ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్లి మళ్ళీ బైటికొచ్చి ఆఫీస్ రూంలో కూర్చోండి సార్ వస్తున్నారు అని మళ్ళీ మొక్కలకి నీళ్లు పట్టే పనిలో పడిపోయాడు.
శీను డోర్ తీసుకుని ఆఫీస్ రూంలో కూచున్నాడు కానీ మనసంతా వింధ్య మీదె ఉంది అదే ఆలోచిస్తుండగా సురేష్ లోపలికి వచ్చి కూర్చున్నాడు.
సురేష్ : జాబ్ గురించి తెలిసే ఉంటుందనుకుంటున్నాను, ఎప్పుడు తన పక్కనే ఉండాలి తన అన్ని బాగోగులు చూసుకోవాలి ఏ అవసరం వచ్చినా చూడాలి ముందుగా అమ్మాయినే పెట్టాలని అనుకున్నాను కానీ తనని అప్పుడప్పుడు బైటికి తీసుకెళ్లాలి హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అందుకే నువ్వు.. ఓకే నా అన్ని పనులు చెయ్యాల్సి వస్తుంది.. అప్పుడప్పుడు బాత్రూంకి కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది మరి..
శీను : అన్ని తెలుసండి ఇంతక ముందు ఒక ముసలావిడకి కేర్ టేకర్ గా పని చేసాను
సురేష్ : ఓకే అయితే.. ఇవ్వాళే జాయిన్ అవ్వు నచ్చితే పనిలో పెట్టుకుంటాను.. రాము.. రాము.. పెద్దమ్మ గారిని చూసుకోవడానికి మనిషిని పెట్టాను తనే ఇక నుంచి యాదమ్మని చిన్నమ్మ గారికి సాయంగా ఉండమని చెప్పు
రాము : అలాగే సర్.. అన్నా రండి మేడం గారి రూం చూపిస్తాను అని బైటికి నడిచాడు. నీ పేరెంటన్నా
సీను : వెంకట్
రాము : ఎక్కడ నుంచి వచ్చారు
శీను : హైదరాబాద్.. పని కోసం ఇక్కడికి వచ్చాను
రాము : పని కోసం అక్కడ నుంచి ఇక్కడి దాకా వచ్చావా
శీను : ఇక్కడ డబ్బులు ఎక్కువిస్తారు కదా
రాము : అవునులే..
శీను రాము వెనకాలే వెళుతు ఇంటిని గమనించాడు, చాలా పెద్ద ఇల్లు సురేష్ చిన్న భార్య కనిపించింది.. ఒంటి నిండా నగలతో మేకప్ తో వింధ్య ఆస్తి మొత్తం తనదే అన్నట్టు అనుభవిస్తుందని అర్ధమయ్యింది.. అక్కడా అదే ఇక్కడా అదే.. అంతా ఆస్తి కోసమే.. పక్కనోడి సొమ్ము కొట్టేయ్యడమంటే ఎంత సరదానో జనాలకి దాని కోసం ఏమైనా చేస్తారు ఎంతకైనా తెగిస్తారు.. అయినా ఇన్ని రోజులు నేను చేసింది అదే కదా.. డబ్బు కోసం మనుషులని చంపేవాడిని.. ఆలోచిస్తూనే రాము వెళ్లిన రూం దెగ్గర ఆగిపోయాడు.
రాము వల్లిని చూస్తూ : అమ్మాయి గారు అమ్మ గారిని చూసుకోవడానికి మనిషి వచ్చాడు బైటే ఉన్నాడు
వింధ్య : లోపలికి రమ్మను
రాము బైటికి వచ్చి శీనుని లోపలికి వెళ్ళమన్నాడు.. శీను లోపలికి వెళుతునే రూం అంతా గమనించి చూసాడు.. పాప తన అమ్మతో మాట్లాడుతూ వాళ్ళ అమ్మ తల దువ్వుతుంది.. ముందుకు నడుస్తూ ఉంటే పాప తల తిప్పి చూసింది.. చిన్నగా నవ్వాడు.. వెనకున్న వింధ్య మొహం ఇంకా కానరాలేదు.
వల్లి : నువ్వేనా
శీను : నవ్వుతూ నేనే అన్నాడు
వెనకాల ఉన్న వింధ్య నన్ను చుడనివ్వు అనగానే పాప అడ్డం జరిగింది, వింధ్య మొహం చూసిన శీనుకి ఒక్క క్షణం కళ్ళు తిరిగినట్టు అయ్యింది.. అచ్చు తన తల్లి పోలికలతో ఉన్న వింధ్యని చూడగానే వేగంగా వెళ్లి తన వీల్ చైర్ ముందు మోకాళ్ళ మీద కుప్ప కూలిపోయాడు.
వల్లి భయపడింది.. వింధ్య కొంత కంగారు పడినా ఏమైంది అని అడిగింది అమాయకంగా..
శీను ఏడుస్తూనే : ఎవరు నువ్వు అన్నాడు ప్రేమగా తన చెంప పట్టుకుని...

~{ (<•>) }~