23-12-2022, 12:21 AM
గంటన్నర ప్రయాణం తరవాత ఏలూరులో ఆగింది బండి, పెద్దగా ఏం మాట్లాడుకోలేదు.. ఇద్దరు టిఫిన్ చేసాక శీను ఒక దమ్ము లాగి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టారు. మూడు వందల యాభై కిలోమీటర్ల మౌన ప్రయాణం తరవాత ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఇద్దరు నిలుచున్నారు. అనుకున్నదానికంటే ముందే రావడం వల్ల ఒక గంట వెయిట్ చెయ్యాల్సి వచ్చింది.
శీను : నీ చెల్లెలి పేరేంటి
కనిక : దీపాలి
శీను : అదేంటి పండగ పేరు పెట్టారు
కనిక : (నవ్వుకుని పైకి మాత్రం కోపంగా చూసి) అది దీపావళి.. అంది
శీను : ఇంకా ఎంతసేపు, అందరూ వస్తున్నారు నీ చెల్లెలు తప్ప
కనిక : ఫ్లైట్ ల్యాండ్ అయ్యిందని అనౌన్స్ మెంట్ అయ్యింది, వచ్చేస్తుంది.
ఇంతలో వెనక నుంచి కనిక రెండు కళ్ళు ముయగానే కనిక నవ్వుతూ దీపాలి అని నవ్వి తన చేతులు పట్టుకుని తీసి తన వైపు తిరిగి గట్టిగా కౌగిలించుకుంది.
కనిక : థాంక్స్ రా
దీపాలి : అక్కా..
కనిక : పదా ముందు రూం తీసుకుని ఫ్రెష్ అవుదాం
దీపాలి : లేదు ఐయామ్ ఓకే.. చూడు షార్ట్ వేసుకుని వచ్చేసాను, డైరెక్ట్ గా ఇంటికే వెళదాం.. డ్రైవర్ లగ్గేజ్ తెచ్చేయి అని ముందుకు నడిచింది.
కనిక సారీ.. నేను తెస్తాను పదండి అని శీనుని చూసింది.. శీను పట్టించుకోకుండా ముందుకు వెళ్లి దీపాలిని దాటుకుంటూ వెళ్ళిపోయాడు.. అది చూసిన దీపాలి వెనక్కి తిరిగి చూసేసరికి కనిక లగ్గేజ్ పట్టుకురావడం చూసి పరిగెత్తి లగ్గేజ్ అందుకుంది.
దీపాలి : వాడికి ఎంత పొగరు
కనిక : నా పెళ్లి తనతోనే జరుగుతుంది
దీపాలి : అయితే డబ్బులు తీసుకోట్లా.. అవును వీడితో కలిసి వచ్చావేంటి
కనిక : మనకంటే పెద్ద వాళ్ళని వాడు వీడు అనకూడదు
దీపాలి : అబ్బో.. ఏంటి విషయం.. ఇంతకీ ఏం చేస్తాడేంటి అతగాడు
కనిక : అడిగితే క్రైమ్ చేస్తానని చెప్పాడు
దీపాలి : ఏంటి....???
కనిక : భయపడకు మంచోడే, పరిస్థితులు అనుకూలించలేదు అంతే.. తన తమ్ముడే చూస్తేనే భయం వేస్తుంది నాకు
దీపాలి : ఏంటి మళ్ళీ వీడికి ఒక తోక కూడా ఉందా
ఈరోజు రెండు రోజులు జరిగిన విషయాలు అన్ని చెపుతూ నడుచుకుంటూ కార్ దెగ్గరికి వెళ్లేసరికి శీను కార్ స్టార్ట్ చేసి రెడీగా పెట్టాడు.. ఇద్దరు ఎక్కి కూర్చున్నారు. సగం దూరంగా వెళ్ళాక ధాభాలో భోజనం చేసి దీపాలిని కొంచెం సేపు పడుకొమ్మని చెప్పి ముందుకు వచ్చి శీను పక్కన కూర్చుంది.
పొద్దున్నలాగే ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు సాయంత్రానికి సరిగ్గా హైవే నుంచి ఊళ్ళోకి దిగి ఒక రెండు కిలోమీటర్లు వచ్చారో లేదో.. ఇటికల బట్టి దెగ్గర రోడ్డుకి రాళ్లు అడ్డంగా పెట్టారు అది చూడగానే శీనుకి అర్ధం అయ్యింది ఎవడో సెటప్ చేసాడని. శీను కారు ఆపగానే అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న కనిక లేచింది.
శీను చుట్టూ చూసాడు కనిక ఏమైంది అని అడిగేలోపే ఒక రాయి వచ్చి సరిగ్గా కనిక కూర్చున్న వైపు అద్దం మీద పడింది.. దెబ్బకి దీపాలి లేచింది.. ఆ వెంటనే రాళ్లు వరసపెట్టి కారు చుట్టూ పడ్డాయి అద్దాలు అన్నీ పగిలిపోయాయి.. కనిక భయంతో శీనుని కౌగిలించుకుంది.. దీపాలి వెనక వంగి కూర్చుంది భయంగా.. శీను కూడా కనిక మీద రాళ్లు పడకుండా చేతులు అడ్డం పెట్టాడు.. ఒక రాయి తన తెల్లని వీపు మీదె పట్టుకున్నాడు కూడా.. రెండు నిమిషాల వరకు ఆపకుండా రాళ్లు విసిరిన తరువాత ఒక్కసారిగా అంతా నిశబ్దం అయ్యింది.. ఆ వెంటనే నలుగురు కత్తులు, రాడ్లు పట్టుకుని కారుని చుట్టుముట్టారు.
శీను వెంటనే తన డోరుని గట్టిగా నెట్టాడు ఇద్దరు పక్కకి జరగగానే దిగి కనిక వైపుకి పరిగెత్తి ఒకడి మెడ పట్టుకుని పక్కకి లాగి ఇంకొకడు కత్తి పట్టుకున్న చేతిని గట్టిగా పట్టుకుని కనిక వైపు ఉన్న డోర్ వాడి చేతితోనే తెరిచాడు. వెనక ఉన్న దీపాలి కూడా కారు దిగి కనిక చెయ్యి అందుకుని పరిగెత్తింది.
అది చూసి ఇటుకల వెనక దాక్కున్న మిగతావాళ్ళు కూడా లేచి కనిక వెనక పడ్డారు, శీనుకి వాళ్ళని చూడగానే అర్ధమయ్యింది బీహార్ వాళ్ళని వెంటనే పట్టుకున్న ఆ చేతిని కార్ లోకి నెట్టి డోర్ ని ఒక్క తన్ను తన్నాడు వాడి చెయ్యి విరిగిపోయింది. వెంటనే ఇంకొకడిని కూడా మట్టి కరిపించి కనిక వెనకాల పరిగెడుతున్న వాళ్ళ వెనక పరిగెత్తాడు.
ఇటు దీపాలి కనికని వెళ్ళమని చెప్పి ఆగిపోయి పక్కనే ఉన్న ఇటుకల దెగ్గరికి వెళ్లి పగిలిన ఇటుకలని వాళ్ళ మీదకి విసిరింది.. బీహార్ కొడుకులు ఆగుతారా ముందు కనికని వెంబడించడం ఆపి దీపాలి విసురుతున్న రాళ్ళని తప్పించుకుంటూ నవ్వుతూ దీపాలి ముందు నిలుచుని దీపాలి తెరుకునే లోపే పొట్టలో పొడవడానికి కత్తి పైకి లేపాడు.. దీపాలి భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది కానీ కత్తి తన కడుపులోకి దిగక పోయేసరికి కళ్ళు తెరిచింది.
తెరిచిన దీపాలి కళ్ళు శీను ఇటుకతో వాడి తల పగల గొట్టడం చూసేసాయి, ఇద్దరు వెనక్కి తిరిగి శీనుని కొట్టేలోపే ఒకడి నడ్డిని తన మోకాలుతో గుద్ది కింద పడేసాడు ఇంకొకడి కడుపులో గుద్దగానే వాడు అరుస్తూ నోరు తేరిచ్చాడు వెంటనే ఇందాక ఇటుకతో ఒకడి తల పగల గొట్టినప్పుడు చిన్న ముక్క ఒకటి చేతిలోనే ఉంది అది వాడి నోట్లో కొట్టి దవడ కింద ఒక్కటి గుద్దాడు అంతే వాడు రక్తం కక్కుతూ కింద పడుతుంటే దీపాలి చూస్తూ ఉండిపోయింది.
శీను వెంటనే ఆగకుండా పరిగెత్తాడు, చీర వల్ల కనిక వేగంగా పరిగెత్తలేకపోతుంది తన వెనకాల ముగ్గురు కత్తులతో వెంబడిస్తుంటే వెనక చూస్తూ ముందుకు పరిగెత్తుతుంది.. శీను వేగంగా పరిగెడుతూ కింద పడ్డ రాయి తీసుకుని వెనకాల ఉన్న వాడి తలకి గురి చూసి కొట్టాడు.. వాడు కిందపడ్డ క్షణంలోనే వాడి తల మీద నుంచే తొక్కుతూ ముందుకు పరిగెత్తి ఇంకొకడిని మెడ పట్టుకుని కింద ఉన్న పూట్ రాయికేసి కొట్టాడు.. దెబ్బకి వాడి తల దానికి కొట్టుకుని దొల్లుకుంటూ మట్టిలో పడ్డాడు.
చివరగా ఉన్న వాడు కనికని అందుకోబోతుండగా వెంటనే గన్ తీసి వాడి కాలి మీద కాల్చబోయాడు కానీ బుల్లెట్ ఎవరైనా చూస్తే డాన్ శీను విజయవాడలో ఉన్నాడని అందరికి తెలిసిపోతుందని వెంటనే గన్ లోపల పెట్టేసి ఇంకా వేగంగా పరిగెత్తాడు.. సరిగ్గా కనికని అందుకోబోతున్నాడనగా వాడి పక్కన చేరుకొని చెయ్యితో గట్టిగా పక్కకి తోసాడు వాడు స్థంబానికి కొట్టుకుని అక్కడికక్కడే పడిపోయాడు.
కనికకి అప్పటికే ఆయాసం పెరిగిపోతుంది, ఎందుకు పరిగెడుతుందో కూడా తనకి అర్ధంకావట్లేదు విపరీతంగా రోప్పుతుంది ఎదురుగా ఇటికలు పేర్చి ఉన్నా కూడా కనిక ఆగకుండా పరిగెడుతూనే ఉంది.. శీనుకి కనిక పరిస్థితి అర్ధం అయ్యింది.. వేగంగా పరిగెత్తి కనికని దాటుకుని వెళ్లి ఎదురు నిలబడ్డాడు.. కనిక శీనుని గట్టిగా గుద్దుకుని ఆగిపోయింది.
కనిక మొహం పట్టుకున్నాడు కానీ తను కంట్రోల్లో లేదు కనికకి ఎదురుగా ఉన్నది శీను అని తెలిసిందో ఏమో గట్టిగా వాటేసుకుంది. శీను వెంటనే కనికని రెండు చేతుల మీద ఎత్తుకుని కారు వరకు తీసుకొచ్చాడు, దీపాలి వెంటనే తన బ్యాగ్ లోనుంచి వాటర్ బాటిల్ తీసి కనిక తల మీద పోసి గట్టిగా ఊపిరి పీల్చమని సైగ చేస్తూ గుండె మీద నిమురుతుంటే పావుగంటకి కనిక చిన్నగా శాంతించింది.. అక్కడ నుంచి ఇంటికి బైలుదేరారు కనిక సెట్ అయ్యి దీపాలి ఒళ్ళో పడుకుని ఉంది. దారిలో షాప్ కనిపించగానే, దీపాలి బావా ఇక్కడ ఆపు వాటర్ బాటిల్ కొందాం అంది.. దెబ్బకి ఇటు కనిక అటు శీను హడలిపోయి దీపాలి వంక చూసారు.
శీను ఏం మాట్లాడకుండా నేను తీసుకొస్తాను అని వెళ్ళాడు
కనిక : ఏంటే బావా అని పిలిచావు
దీపాలి : అవును, నాకు నచ్చాడు.. ఇందాక గమనించాను నిన్ను ఎలా అయినా కాపాడుకోగలను అన్న కాంఫిడెన్స్ తన కళ్ళలో కనిపించింది.. భలే కాపాడాడు నిన్ను నన్ను.. అంతకంటే మగాడు ఎక్కడ దొరుకుతాడు అక్కా.. ఇందాక నిన్ను ఎత్తుకొచ్చేప్పుడు చూసాను తనలో కంగారు. పైకి మాత్రం ఏదో రాయిలా ఉన్నాడు కానీ లోపల నీ గురించి బెంగ ఉంది. నన్ను నమ్ము..
కనిక : నాకు ఆల్రెడీ చావు రాసి పెట్టి ఉంది కదే..
దీపాలి : వస్తున్నాడు తరవాత మాట్లాడుకుందాం
శీను వాటర్ బాటిల్ అందించి ఇక ఎక్కడా ఆపకుండా కనిక నీళ్లు తగినంత సేపు చిన్నగా పోనిచ్చి తను తాగి సీటుకి ఆనుకోగానే వేగం పెంచి నేరుగా ఇంటికి పోనిచ్చాడు. కారు దిగాక ఏం ఆలోచించకుండానే కనిక దెగ్గరికి వెళ్లి ఓకేనా అని అడిగాడు.. కనిక నవ్వేసరికి అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
జగ్గు : అయిపోయాయా తిరుగుళ్ళు
శీను : హ్మ్..
జగ్గు : (అన్నయ్య మొహం చూడగానే కనిపెట్టేసాడు) ఎవరు ?
శీను : తెలీదు
జగ్గు : ఉన్నారా పోయారా
శీను : తెలీదు, పది మంది వచ్చారు
జగ్గు : ఎవరిమీదకి
శీను : తన మీదకే
జగ్గు : తనా.. తనంటే
శీను : ఏంట్రా... తనంటే కనిక.. ఆ అమ్మాయే..
జగ్గు : అది ఆంటీ..
శీను : నా కంటే ఆరు నెలలు చిన్నది.. నీకంటే రెండున్నరేళ్లు పెద్దది అంతే
జగ్గు : ఓహో... వయసు కూడా తెలుసుకున్నవన్నమాట
శీను : మరి వెళ్ళిపోదాం పదా, ఈరోజే.. ఈరాత్రికే పదా పోదాం..
జగ్గు : పెళ్లి రేపే అంట.. ఇప్పుడు హ్యాండ్ ఇస్తే బాబాయి మీద పడతారు
శీను : నేను పడుకుంటున్నా
జగ్గు : పో.. బొజ్జో..
ఇంతలో దీపాలి బావా అంటూ లోపలికి వచ్చింది
జగ్గు : అబ్బో అప్పుడే వరసలు కూడా కలిపేసుకున్నారేంట్రా మీరు
శీను ఏం మాట్లాడకుండా దుప్పటి ముసుగేసి పడుకున్నాడు.
దీపాలి : ఏవండీ అక్కకి మెడిసిన్ కావాలి, కొంచెం తోడుగా వస్తారా
జగ్గు : పదండి.. తప్పుతుందా అని మొహం మీద కొట్టుకుంటూ బాబాయి నీకుందిరా అని తిట్టుకుంటూ బైటికి నడిచాడు.
ఇద్దరు వెళ్లి మెడిసిన్ తెచ్చారు, దీపాలి కార్ దిగుతూ థాంక్స్ అండి మీ పేరు ?
జగ్గు : జగదీష్
దీపాలి : థాంక్స్ జగదీష్ గారు.. నైస్ టు మీట్ యు
జగ్గు : ఈ ఇంట్లో అదీ ఒక అమ్మాయి దెగ్గర ఇంత రెస్పెక్ట్.. ఊహించనేలేదు
దీపాలి : నేను ముందు కొంచెం అలానే ప్రవర్తించాను అందుకు మీ అన్నయ్యకి సారీ చెప్పాలి, కానీ మీ అన్నయ్య ఏం కొట్టాడండి ఒక్కొక్కడిని పిచ్చ కొట్టుడు కొట్టాడు.. అబ్బా ఆ స్టైల్ ఆ రన్నింగ్.. వేరే లెవెల్ అంతే.. నేనైతే ఫ్యాన్ అయిపోయాను.
అంతే జగ్గు బుట్టలో పడిపోయాడు..
జగ్గు : ఓహ్.. అవును.. పరిగెత్తుకుంటూ వచ్చి ఒకణ్ణి తోసాడా
దీపాలి : అవును.. చూసినట్టే చెప్పారే
జగ్గు : అంతా మన ట్రైనింగే..
దీపాలి : ఓహ్.. మీకు కూడా ఫైటింగ్ వచ్చా
జగ్గు : నాకు ఫైటింగ్ వచ్చా.. మా అన్నకి నేర్పిందే నేనూ
దీపాలి : జగదీష్ గారు ప్లీజ్ నాక్కూడా ఫైటింగ్ నేర్పిస్తారా.. మొత్తం కాదు కొంచెం డిఫెన్స్ కోసం
జగ్గు : అయితే నాకు ఇంగ్లీష్ నేర్పిస్తారా
దీపాలి : డీల్.. డీల్.. థాంక్ యు అని నవ్వుతూ వెళ్ళిపోయింది.
అమ్మాయి వెళ్ళిపోయాక గాని జగ్గు ఈలోకంలోకి రాలేదు, ఛ ఏంటి అలా పడిపోయాను.. అన్నయ్యని పొగిడింది.. నా వీక్నెస్ మీద కొట్టింది సర్లే మనదేం పోయింది.. మనకీ నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వస్తే పడుంటాయి అనుకోని రెండు చేతులు వెనక పెట్టుకుని ఏం తెలీనట్టు రూంలోకి వెళ్లి గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాడు.
శీను రాత్రికెప్పుడో జగ్గు లేపితే కానీ లేవలేదు..
శీను : ఏంట్రా
జగ్గు : వస్తే తిందాం
శీను : ఆకలిగా లేదు, నువ్వు తినుపో
జగ్గు : ఏమైంది
శీను : చాలా రోజుల తరవాత పరిగెత్తాను కదా కొంచెం ఒంట్లో తిప్పుతుంది, నువ్వెళ్లు నేనలా దమ్ము కొట్టి వస్తా
జగ్గు : డైరెక్టుగా ఆంటీ దెగ్గరికి వెళ్ళొస్తా అని చెప్పొచ్చుగా
శీను : నీ బొంద.. మూసుకుని పొయ్యి మెక్కు.. అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు..
జగ్గు : ఆ వెళుతున్నాలే.. నిజాలు మాట్లాడితే అంత కోపం దేనికి
శీను : నీ.. వస్తున్నా అక్కడే ఉండ్రా.. అనేసరికి జగ్గు పరిగెత్తాడు.
శీను లేచి నవ్వుతూ బ్యాగ్ తీసేసరికి బీడీ కట్ట కనిపించలేదు, ప్యాంటులో ఎక్కడ చూసినా కనిపించకపోయేసరికి లెక్కేసుకుంటే అయిపోయాయని తేలింది.. వద్దద్దు అనుకుంటూనే చిన్నగా నడక మెట్ల వైపు వేసాడు.. మీదకి వెళ్లి పైనున్న కనికని చూడటం మొదలు పెట్టాడు.
ఇటు కింద మన జగ్గుకి మాత్రం ఏ డోకా లేదు, పని మనిషి కొసరి కొసరి వడ్డీస్తుంటే జగ్గు కుమ్ముతున్నాడు కానీ అక్కడ కూర్చుని చూస్తున్న దీపాలికి అది నచ్చలేదు.
కనిక : రండి అంది శీనుని చూసి
తెల్లటి బ్లౌజ్, మాచింగ్ చీర.. బంగారపు అంచు.. వెనక్కి తిరిగి ఉన్నప్పుడు కనిపించే ఆ తెల్లని వీపు.. చల్ల గాలికి అలల ఎగురుతూ రేగుతున్న జుట్టు.. చూస్తూ ఉన్న శీనుకి కనిక మాటలు వినిపించగానే తేరుకుని వెళ్లి నిన్నటి లాగే గోడకి ఆనుకుని కూర్చున్నాడు.
కనిక : కాపాడినందుకు థాంక్స్
శీను : ఎటాక్ చేసింది ఎవరు
కనిక : తెలీదు కానీ ఎందుకు చేసారో తెలుసు
శీను : ముందే పోతే ఆస్తి ట్రస్ట్ కి వెళుతుంది.. అందుకేనా
కనిక : నోటి నుంచి ఎప్పుడూ.. పోతావు, చస్తావు ఇవి తప్ప మంచి మాటలు రావా
శీను నవ్వాడు
కనిక : ఇదే మొదటి సారి నిన్ను నవ్వుతూ చూడటం
శీను : ఇంకా
కనిక : చెప్పు.. రేపు పెళ్లి ఎల్లుండి సంతకాలు.. నీ పని అయిపోయినట్టే.. ఆ తరవాత మనం కలిసే అవకాశం లేదు.. చివరిగా నేను చనిపోయాక నన్ను చూడ్డానికి వస్తావా
శీను : తెలీదు.. రావాలా
కనిక : నేను పోయాక నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి.. నాకు తెలుస్తుందా అని నవ్వింది.
శీను : నిన్ను ఒకటి అడగనా
కనిక : ఏంటి
శీను : ఆ రోజు పాట పాడుతూ డాన్స్ చేసావ్ కదా, అదేం పాట ?
కనిక సిగ్గుపడి తల దించుకుంది.. శీను నేను వెళతాను అని లేచాడు.. కనిక కూడా లేచి చిన్నగా పాడటం మొదలు పెట్టింది.. శీను ఆగిపోయాడు.. కనిక అటువైపు తిరిగి
పూచేనే ఓ రోజా పువ్వు.. తెచ్చివ్వు నాకోసం
పుట్టింది నీ మీద లవ్వు.. ముద్దివ్వు నా కోసం
నా కనులే వేయి కనులయి వెతికేను నీ కోసం
నీతోడై నన్ను కలుపుకో.. ఉంచుకో.. నాతో ఆడుకో.. (అని పాడుతూ చిన్నగా ధైర్యం తెచ్చుకుని పాటకి అనుగుణంగా కదులుతూ అటు ఇటు తిరుగుతూ ఆడుతుంది)
(పాట వేరైనా లిరిక్స్ మార్చేసి తన మనసులో ఉన్న బాధ, తపన వెళ్ళగక్కింది పాట రూపంలో)
నా మదిలో నిట్టూర్పు.. కావాలి ఓదార్పు.. ఉంటావా నా కోసం
మది తరుమూతుంది నీ వైపు.. నాతో నా చేయంది నిలబడవా నా కోసం
నీలో నన్ను కలుపుకొ.. చలి కాచుకో.. వెచ్చగా దాచుకో
నా మది వణికే నీ మత్తులో.. నీ స్పర్శలో.. నీ తలపులో (అని శీను కళ్ళలోకి చూసింది నడుము ఊపుతూ చిన్నగా శీను ముందుకు వచ్చి నిలుచుంది)
దాచలేని ప్రేమే శిక్ష అనిపిస్తు, ఆపలేకున్నాను ఈ విరహం
కైపేక్కిన ప్రేమతో అడుగుతున్నా అయిపోవా నా సొంతం
నీ మీదె ఆశతో (అని ఆపేసి కంటి నుంచి కారుతున్న కన్నీటిని పట్టించుకోకుండా)
నా కోసం నిన్ను గతాన్ని మరిచి తోడై నా దిగులు పోగొట్టు
అని శీను చెయ్యి పట్టుకుని తన ఇంకా దెగ్గరికి వెళ్లి శీను పెదాలకి తన పెదాలని జోడించి అలా ఉండిపోయింది.. శీను మాత్రం ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, కనిక మూసిన కళ్ళలో నుంచి ఆగకుండా కారుతున్న కన్నీళ్ళని చూస్తూ అలా ఉండిపోయాడు.
ఒక్క ముద్దుతో కనిక గుండె ఆగిపోయింది, కింద పడిపోతుంటే పట్టుకున్నాడు చూస్తే శ్వాస తీసుకుంటున్నట్టు అనిపించలేదు కదిలించాడు కానీ కదలలేదు.. వెంటనే ఎత్తుకుని బైట ఉన్న మనుషులకి చెప్పి కారు తీయమని వెనకాల కనికని ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు.. కారు హాస్పిటల్ వైపు బైలుదేరింది.