18-12-2022, 01:19 PM
జగ్గు : అన్నా... అన్నో....
శీను : ఏంట్రా
జగ్గు : దెగ్గరికొచ్చింది చిన్న పడవలోకి మారాలి
శీను : పదా అని లేచి బ్యాగ్లో కొన్ని బీడీ కట్టలు వేసుకుని షిప్ చివరికి వచ్చి నిల్చున్నాడు తన తమ్ముడితోపాటు
జగ్గు : అదిగో వస్తున్న పడవ మనకోసమే
శీను : ఇంతకీ మనంఎక్కడికి వెళ్ళేది
జగ్గు : ముందు వైజాగ్ లో దిగి పరోటా తినేసి తరవాత విజయవాడ వెళ్ళాలి.
శీను : నువ్వింకా పరోటాని మర్చిపోలేదా
ఇద్దరు పెద్ద పడవ నుంచి చిన్నదానిలోకి మారి అక్కడ నుంచి బై రోడ్ విజయవాడ చేరి బస్టాండ్ లో కూర్చున్నారు కొంతసేపటికి వాళ్ళిద్దరి దెగ్గరికి ఒక యాభై ఏళ్ళ వయసుగల ఒక హాఫ్ షర్ట్ వేసుకున్న బట్టతలాయన వచ్చాడు.
జగ్గు : అన్నా సూర్యం బాబాయి వచ్చాడు
సూర్యం : ఏరా బాగున్నారా
శీను : బాగే.. ఏంటీసారి ఏదో సెటప్ చేసావంట
సూర్యం : ఈ సారికి నేను ఉండట్లేదురా అందుకే ఇదంతా, పదండి భోజనం చేస్తూ మాట్లాడుకుందాం.
-----------------------------------------
జగ్గు : ఇంట్లోవాళ్లంతా ఎలా ఉన్నారు
సూర్యం : బానే ఉన్నారు, జగదీష్ నీకొక నెంబర్ ఇస్తాను ఫోన్ చెయ్యండి. వాడి పేరు బబ్లు వాడే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లి డ్రాప్ చేస్తాడు ఎం చెయ్యాలో ఎక్కడ ఉండాలో అన్ని వాడే చూసుకుంటాడు. గాలికి తిరిగే కుర్రోళ్ళు ఎవ్వరు లేరు ఆనాధలు అని చెప్పాను ఇక్కడనుంచి ఇక మీరే చూసుకోండి.. ఏం శీను ?
శీను : సరే
జగ్గు : ఆగండి నాదింకా అయిపోలేదు, అన్నా... ఇంకో ప్లేట్ పరోటా.. పరోటా మీద సూప్ మొత్తం పోసి తీసుకురా ఇందాకటి లాగా గిన్నెలో పోసి తెచ్చావంటే అది నీ మొహం మీద కొడతా అని అరిచాడు.. ఏంటి బాబాయి వీళ్ళకి పరోటా ఎలా తినాలో కూడా తెలీదు..
దానికి సూర్యం శీను ఇద్దరూ నవ్వుకున్నారు, తిన్నాక అక్కడ నుంచి లేచి బైటికి వచ్చి వాళ్ళ బాబాయిని పంపించేసి ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసాడు.
జగ్గు : హలో బబ్లు
బబ్లు : హా నేనే ఎవరు
జగ్గు : సూర్యం గారు నీ నెంబర్ ఇచ్చారు
బబ్లు : సూర్యం అన్న చెప్పిన కుర్రోళ్ళు మీరేనా.. ఇప్పుడు ఎక్కడున్నారు
జగ్గు : విజయవాడ బస్టాండ్ లో ఉన్నాం
బబ్లు : వస్తున్నా అక్కడే ఉండండి, అని పెట్టేసిన అరగంటకి మళ్ళీ ఫోన్ చేసి బైట తెల్లది మినీ వాన్ ఉంది ఎక్కండి అని పిలిచాడు
జగ్గు : అన్నయ్య పదా బండోచ్చింది
శ్రీను : పదా
ఇద్దరు బస్టాండ్ బైటికి వచ్చి వాన్ దెగ్గరికి వెళ్లి జగ్గు పరిచయం చేసుకుని ఇద్దరు లోపల కూర్చున్నారు.
బబ్లు : చెప్పింది అర్ధమైందా, పెళ్లి అయ్యి ఆవిడ చనిపోయేదాకా అక్కడే ఉండి వచ్చేటప్పుడు ఏడు లక్షలు ఇస్తారు తీసుకుని వచ్చేయండి రెండు లక్షలు నాకు ఐదు లక్షలు మీకు. ఇంకేం ఎక్సట్రాలు చెయ్యమాకండి.
జగ్గు : అలాగే అన్నా
బబ్లు : వాడేంటి ఇందాకటి నుంచి.. ఏం మాటలురావా
జగ్గు : చావుతో ఎందుకులే అన్నా
బబ్లు : ఏంటి
జగ్గు : ఆయనతో ఎందుకులే అన్నా
బబ్లు : సరే పదండి మిమ్మల్ని అక్కడ వదిలి పెడతాను అని వాన్ నేరుగా తీసుకెళ్లి హైవే నుంచి దిగి ఒక కిలోమీటర్ వెళ్లి ఒక పెద్ద గేట్ ముందు ఆపి సెక్యూరిటీతో మాట్లాడగానే వాళ్ళు గేట్ తెరిచారు గేట్ దెగ్గర నుండి పాలస్ వరకు వెళ్లాలంటే వెహికల్ ఉండాల్సిందే లేకపోతే అది జాగ్గింగ్ అవుతుంది అని చెపుతూ అన్ని చూపిస్తూ కారు ఒక పక్కన ఆపి దిగి జగ్గుని శీనుని అక్కడే ఉండమని చెప్పి పాలస్ బైట ఉన్న చిన్న రూంలోకి వెళ్ళాడు.
శీను : వీడి ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నారా
జగ్గు : పొడిచేయనా
శీను : వద్దులే
జగ్గు : ఇంతవరకు వదిన గారి జాడ కూడా లేదే
శీను : నిన్ను పొడుస్తా ఒక్క పోటు అని బీడీ వెలిగించాడు.
అది చూసి బబ్లు పరిగెత్తుకుంటూ వచ్చి శీను చేతులో ఉన్న బీడీ తీసి అవతల పారేసాడు.
జగ్గు : వీడైపోయాడు.. అని తల మీద చేతులు పెట్టుకున్నాడు.
శీను కోపంగా బబ్లు మెడ పట్టుకుని గాల్లోకి లేపాడు. బబ్లుకి ఉచ్చ పడింది.
జగ్గు : అన్నా ఎవ్వరు చూడట్లేదు ఏసేయి నా కొడుకుని ఇందాకటి నుంచి తెగ వాగుతున్నాడు.
ఎవరక్కడా అన్న గొంతు విని బబ్లు శీను జగ్గు ముగ్గురు అటు వైపు చూసారు. చీర కట్టులో దేవతలా తెల్లగా మెరిసిపోతూ ఉందా మొహం. తనని చూడగానే శీను బబ్లుని కిందకి దించాడు. బబ్లు మేడం నమస్తే వీళ్ళే నేను చెప్పింది నాకు అర్జెంటు పని ఉంది అని మెడ పట్టుకుని భయపడుతూ బైటికి పరిగెత్తాడు.
బబ్లు అంత భయపడటానికి కారణం లేకపోలేదు, ఇందాక శీను బబ్లుని పైకి ఎత్తినప్పుడు శీను షర్ట్ కొంచెం లేచింది తన జీన్స్ బొడ్డు దెగ్గర ఉన్న గన్ చూడగానే బబ్లుకి ఉచ్చ పడిపోయింది అందుకే ఒక్క క్షణం కూడా ఆగకుండా అక్కడినుంచి పరిగెత్తాడు.
ఎవరు మళ్ళీ అడిగింది జరిగిందంతా చూసి అయోమయంతో.. జగ్గు ఏదో మాట్లాడబోతుంటే వాడి కాలర్ పట్టుకుని వెనక్కి లాగాడు.
శీను : ఇక్కడ నేను పెళ్లి చేసుకోవాల్సింది ఎవరిని
దానికి ఆ అమ్మాయి ఒకింత ఆశ్చర్యపోయింది ఎందుకంటే మూడు వందల కోట్లకి వారసురాలు తను, అలాంటిది తన ముందు నిలుచుని కనీసం మర్యాద ఇవ్వకుండా పైగా తను పెళ్లి చేసుకోవాల్సింది ఎవరిని అని అడిగేసరికి కొంత ఇగోగా అనిపించినా దాన్ని సరదాగా తీసుకుని నవ్వుతూ నన్నే మీరు పెళ్లి చేసుకోవాల్సింది అని చెప్పి జగ్గు వైపు చూసింది.
శీను : తను నా తమ్ముడు, నాతోనే ఉంటాడు
శీను మాటలు వినగానే పక్కా మాస్ అని అర్ధమయ్యింది.. ఇక మాములుగా మాట్లాడుతూ.. అలాగా.. నీ పేరేంటి అని అడిగింది.
శీను : నా పేరు శీను, వీడి పేరు జగ్గు.. నీ పేరేంటి ?
అప్పుడే ఎవడో వచ్చాడు చూడ్డానికి పొట్టిగా తొమ్మిది నెలలు నిండినట్టు నిండా పొట్టతో ఉన్నాడు.. యాభై ఏళ్ళు ఉంటాయేమో.. వస్తూనే శీను మీద పడిపోయాడు.. నీ.. ఏంట్రా నీ.. మేడం అని పిలవాలి ఎలా నడుచుకోవాలో ఎలా ఉండాలో ఆ బబ్లు గాడు చెప్పలేదా అని శీను మీదకి వెళ్ళాడు. జగ్గు నవ్వుకోగా శీను కోపంగా చూసాడు.
ఇందాక బబ్లుని మెడ పట్టుకుని గాల్లోకి ఎగరేయ్యడం చూసి తన బాబాయికి కూడా అదే గతి పడుతుందేమో అని భయపడి.. బాబాయి నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి అని పంపించేసింది.. ఆ అమ్మాయి బాబాయి అనేసరికి శీను కూడా వెనక్కి తగ్గాడు.
నా పేరు కనిక అని చెయ్యిచ్చిందా ముప్పై రెండేళ్ల యువతి.
శీను తన కళ్ళలోకి చూస్తూ వాడికి తెలియకుండానె చెయ్యి లేపాడు.. అది చూసి జగ్గు భయపడ్డాడు.. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోతుందని తెలిసే పెళ్లి చేసుకోవడానికి వచ్చారు. అస్సలు ఈ పని ఒప్పుకోవడానికి కారణం వాళ్ళు హైడ్ అవుట్ లో ఉంటారని.. కానీ ఎప్పుడు కోపంలో లేదంటే యాక్షన్లో మాత్రమే చూసిన తన అన్నని మొదటి సారి తన అన్న మోహంలో ఇంకో ఫీలింగ్ కనిపిస్తుంటే భయపడ్డాడు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని...