14-12-2022, 11:38 AM
(This post was last modified: 14-12-2022, 11:59 AM by matured man. Edited 1 time in total. Edited 1 time in total.)
ప్రొద్దున్నే నిద్ర లేచే సరికి 6:40 అయ్యింది.. పక్కలో పెళ్లాలు లేరు.. బయట సవుండ్స్ వినపడుతున్నాయి.. నాన్నగారు ఉంటే ప్రొద్దున్నే పూజ అయిపోతుంది.. కోడళ్లు మామ గారి దగ్గర మార్కులు కొట్టెయ్యడానికి ప్రొద్దున్నే లేచేసారు.. అందుకే అందరూ లేచి వెళ్లిపోయారు.. బాబు కూడా ఉయ్యాలలో లేడు... ప్రొద్దునే రవుండ్ పడక పోతే రోజంతా గులగా ఉంటుంది.. వీళ్లిద్దరూ వెళ్లిపోతే ఎలా? అనుకుంటూ లేచి రెడీ అయ్యి బయటకి వచ్చాను.. పూజ రూం కి వెళ్లి దణ్ణం పెట్టుకుని వచ్చా.. అత్త గారు కషాయం ఇచ్చింది..
పూర్ణ లోపలికి వచ్చి నాన్న గారిని, నన్ను, విస్సు ని ఫోటో తీసాడు.. మూడు తరాల ఫోటో.. ఇదే వాడి ఫస్ట్ ఫోటో.. తర్వాత అందరి ఫోటోలు తీసారు..
నాన్న గారిని ఆఫీస్ రూంకి పిలిచి జరిగినదంతా చెప్పాను.. అమ్మ కూడా ఉంది.. ఈ రోజు 560 కోట్లు రిటర్న్ వస్తాయి అనీ, ఆల్రెడీ వాళ్ళు రిటర్న్ చేసిన 200 కోట్లు పరంజ్యోతి మామయ్య కూతురు అరుణకి ఇస్తాము అని చెప్పాను.. నాన్న గారు నవ్వుతూ అరుణ పరంజ్యోతి కూతురు కాదు.. పరంజ్యోతి కూతురు వేరే.. తిండికి కూడా కష్ట పడుతుంది అని చెప్పారు.. అరుణ అమ్మని అడుగు నిజం తెలుస్తుంది.. నాన్న గారు కంటిన్యూ చేసారు.. అరుణ మీ అమ్మ కజిన్ కూతురు.. అంటే నీ దూరపు మామయ్య కూతురు.. అరుణని అందుకే మంచి ధనవంతుల ఫామిలీ లో మీ మామయ్య పెళ్ళి చేసాడు.. శ్రీనివాసన్ వాళ్ళ నాన్న పరంజ్యోతి మీద కక్ష తీర్చుకోవాలనుకున్నాడు కానీ అతనికి పూర్తి వివరాలు తెలియవు.. శ్రీనివాసన్ లాగే అతని తండ్రి కూడా తింగరోడు.. శ్రీనివాసన్ అమ్మ మంచి కుటుంబం నుండి వచ్చింది.. ఆస్తిపరురాలు.. అన్నీ తెలిసిన ఆవిడ.. ఆమె కూడా నీకు నిజం చెప్తుంది.. ఈ 200 కోట్లు ఆమె తీసుకోదు.... నిజం కనుక్కొని అరుణ, శ్రీనివాసన్ లకి చెప్పి... ఆ తర్వాత పరంజ్యోతి కూతురికి ఆ 200 కోట్లు కొంచెం కొంచెం గా ఇవ్వు.. ఒక్కసారే మేనేజ్ చేసుకోలేదు.. ఆమె పెరిగింది సంపత్ గారి ఇంట్లో.. శ్రీనివాసన్ అమ్మకి కూడా ఈ విషయం తెలుసు.. చంద్ర శేఖరం గారికి కూడా ఈ విషయం తెలుసు అన్నారు...
చంద్ర శేఖరం ఎవరు అని అడిగాను... అమ్మ చెప్పింది అదేరా.. రాజారాం, సుభాషిణి ఇంటికి వెళ్ళాం కదా.. ఆ రాజారాం నాన్న చంద్ర శేఖరం అని చెప్పింది.. చంద్రశేఖరం నాకు దూరపు వరసలో బావ అవుతాడు అని చెప్పింది.. అందుకే రాజారాం నాకు అన్న, సుభాషిణి నాకు వదిన అనమాట.... నాకు తల తిరిగి పోయింది.. పక్కన బాంబు పేలి నట్లయ్యింది.. షాక్ ఆఫ్ ది లైఫ్ అంటే ఇదేనా? సంపత్ ఎవరు? ఎక్కడో విన్నట్లుందే??? ఎవరు? ఎవరు?? ఆయన కూతురు ఎవరు? ఈ 200 కోట్లు ఎవరికి ఇవ్వాలి??
ఎవరి పిల్లలు ఎవరి దగ్గర పెరిగారు? ఎవరిని ఎవరు పెళ్ళి చేసుకున్నారు? పిచ్చెక్కిపోతుంది..