04-12-2022, 10:11 PM
48
శివ ఇంటికి వెళ్లి ఏం మాట్లాడకుండా కొంత సేపు సోఫాలో కూర్చున్నాడు, మీనాక్షి అది గమనించింది కానీ రూంలో నుంచి బైటికి రాలేదు. కొంతసేపు కూర్చుని లేచి మీనాక్షి దెగ్గరికి వెళ్లి టాబ్లెట్స్ తన పక్కన పెట్టి లేచాడు.
మీనాక్షి : ఏంటివి (కొంత గట్టిగానే అడిగింది)
శివ : నీకు అంతా తెలుసని నాకు తెలుసు, అవేంటో కూడా నీకు తెలుసు అని బైటికి వస్తుండగానే మీనాక్షి కోపంగా పక్కనే ఉన్న ఫోన్ విసిరి కొట్టింది. ఇంట్లో ఉన్న అందరూ బైటికి వచ్చారు.
మీనాక్షి : నువ్వు ఏమనుకుంటున్నావో అది నా ఖంఠంలో ప్రాణం ఉండగా జరగదు.. అని ఆ టాబ్లెట్స్ ని శివ మొహం మీదకి విసిరింది.
కావేరి : శివా.. మీనాక్షి.. ఏం జరుగుతుంది..
మీనాక్షి : మీ అబ్బాయినే అడగండి
అందరూ శివ వైపు చూసారు.. శివ వెళ్లి మీనాక్షి చెయ్యి పట్టుకుని తన కళ్ళలోకి చూసాడు. మీనాక్షి శివని చూస్తూనే తన కళ్ళలోనుంచి నీళ్లు జలజలా రాలిపోయాయి.. గట్టిగా శివని వాటేసుకుని ఏడ్చేసరికి శివ కూడా ఏడుస్తూ మీనాక్షిని గట్టిగా పట్టుకున్నాడు. అందరూ కంగారుపడి ఇద్దరి చుట్టు చేరారు.
రజిత : మీను.. ఏమైంది తల్లి..
చందు : అక్కా.. బావా.. ఏమైంది..
గగన్ చూస్తూ ఉండిపోయాడు.. కావేరి శివ చెయ్యి పట్టుకుని అడిగింది..
శివ : బిడ్డ పుట్టడంతోనే మీనాక్షి చచ్చిపోతుందట అని చెప్తూ చిన్న పిల్లాడిలా ఏడ్చేసాడు, కావేరిని కౌగిలించుకుని.
అందరికి ఏం మాట్లాడాలో తెలీలేదు, చందు అయితే ఏడ్చేసాడు. కావేరికి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు షాక్ అయిపోయింది.. గగన్ శివని చూసి మాట్లాడాడు
గగన్ : ఎంతో మంది సిద్ధాంతులు ఉన్నారు చూపిద్దాం, పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు.. పూజలు యాగాలు చేపిద్దాం..
శివ : అన్ని కనుక్కున్నాను.. డాక్టర్స్ ని కూడా కలిసాను.. మీనాక్షి పొట్ట మీద ఒక గాటు ఉంటుంది అది కేవలం పైకి మాత్రమే కాదు లోపల కూడా ఉంది అక్కడ ఏర్పడ్డ కండరం వల్ల బిడ్డని బైటికి తీయడం చాలా కష్టం అని.. నొప్పులు మొదలవ్వకుండానే బైటికి చీల్చుకు రావచ్చని చెపుతున్నారు.. వాళ్ళు కూడా బిడ్డని లోపల నుంచే చ..
మీనాక్షి : శివా.. అరిచింది గట్టిగా ఏడుస్తూనే.. పోతే పోతాను అంతే కాని నా బిడ్డని తాకే ప్రయత్నం చేసినా వాడికి హాని తలపెట్టాలని చూసినా నేనేం చేస్తానో నాకే తెలీదు.. వీడు నా బిడ్డ.. నా బిడ్డగానే పుడతాడు.
మళ్ళీ శివ దెగ్గరికి వెళ్లి చెయ్యి పట్టుకుని గొంతు తగ్గించి మాట్లాడింది.. శివా మీ అమ్మ గారు నీకోసం.. నువ్వు బతికుండడం కోసం నిన్నే వదులుకుంది, ఇంకో అమ్మ నీకోసం అటు అత్తింటి కుటుంబాన్ని ఇటు పుట్టినింటి కుటుంబాన్ని వదులుకుంది. అలాంటి ఇద్దరు గొప్ప వాళ్ళకి కోడలిని అయిన నేను.. నేను బతికుండడం కోసం నా బిడ్డని చంపుకుంటానా
రజిత : మీను.. ఇందులో తప్పేముంది.. ఎంతో మందికి ఇలా పిండం ముందుగానే చచ్చిపోతుంది.. ఇవ్వాళా రేపు ఎంత మంది అబార్షన్ చేపించుకోవడం లేదు.. మళ్ళీ కనవా మళ్ళీ పుట్టడా
శివ : అవును మీనాక్షి.. నాకు వాడు చెప్పాడు మనకి మళ్ళీ కొడుకే పుడతాడు..
మీనాక్షి : మళ్ళీ వాడే పుడతాడని చెప్పాడా
శివ మౌనంగా ఉండిపోయాడు.
మీనాక్షి : నాకు నా అరణ్య మళ్ళీ పుడతాడని వాడితో చెప్పించు.. మళ్ళీ వాడే పుడతాడని మాట ఇవ్వమను.. నువ్వు చెప్పింది చేస్తాను
శివ మీనాక్షిని ఒప్పించలేక కింద కూలబడిపోయాడు.. అక్కడ మీనాక్షి మాట్లాడుతుంది ఎవ్వరికి అర్ధం కాకపోయినా, అందరూ బాధ అయితే పడుతున్నారు. మీనాక్షి వెళ్లి పక్కన కూర్చుని ఏడుస్తున్న శివ తల ఎత్తింది.
మీనాక్షి : శివా.. వాడిని నాకు దూరం చెయ్యాలన్న ఆలోచన నువ్వు ఎలా చేసావు.. నీకు బాధగా లేదా
శివ : వాడంటే నాకు కూడా ప్రాణమే కానీ నువ్వు లేకుండా నన్ను నేను ఊహించుకోలేను మీను.. అరణ్య చెప్పినట్టు మధ్యలోనే వచ్చాడు మధ్యలోనే.. అంటుండగానే మీనాక్షి శివ నోరు మూసేసింది.
మీనాక్షి : ఇందాక నువ్వు చెప్పావే.. నా కడుపు మీద గాటు.. అదెలా ఏర్పడిందో తెలుసా.. అరణ్య నిన్ను కోమా లోనుంచి లేపడం వల్ల.. ఇవన్నీ వాడికి ముందే తెలుసు కాని తెలిసి కూడా నిన్ను కాపాడుకోలేదా.. నువ్వు మాత్రం ఎందుకు ఇంత స్వార్ధంగా ఆలోచిస్తున్నావు.
శివ : నాకు అవన్నీ తెలీదు, నాకు నువ్వు క్షేమంగా ఉంటే అదే చాలు.. అని నుదిటి మీద ముద్దు పెట్టుకుంటూ చిన్న పిల్లాడిలా మారం చేసాడు.
అందరూ మీనాక్షి శివలు మాట్లాడుకుంటుంటే పరిష్కారం కూడా వాళ్ళే తెలుసుకుంటారు, ఏ విషయం వాళ్ళే తెల్చుకుంటారని అక్కడ నుంచి వెళ్లిపోయారు.
కోప్పడింది, బతిమాలింది, ఏడ్చింది.. కాని మొత్తానికి మీనాక్షి తన మాటే నెగ్గించుకుంది, ఆ రోజు ఎవరూ ఇంట్లో ముద్ద ముట్టలేదు.. శివ మాత్రం మీనాక్షిని తీసుకుని బైటికి తీసుకెళ్లి ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేసాడు.. మీనాక్షి ఒప్పుకోకపోవడమే కాకా ఆ రోజు నుంచి మంచినీళ్లు కూడా తాగడం మానేసింది. తను తినకపోయినా అరణ్య చూసుకుంటాడని మీనాక్షికి తెలుసు, అరణ్యకి చెప్పింది చూసుకోమ్మని.. అరణ్యకి అమ్మ చెప్పింది చెయ్యడం తప్ప ఇంకేమి చెయ్యలేకపోయాడు.
రోజులు గడుస్తున్నాయి కాని అందరూ మౌనంగానే ఉంటున్నారు.. మీనాక్షి ఎవ్వరి మాట వినిపించుకోలేదు. ఈ విషయం రజిత ద్వారా రాజేశ్వరికి ఆ తరవాత సుశాంత్ కి తెలిసింది అది వెంటనే ప్రదీప్ కి చేరవేసాడు.
సుశాంత్ : వాడు ఇప్పుడు ఏ విషయం పట్టించుకునే స్థితిలో లేడు ఇదే రైట్ టైం.. ఏమంటావ్
ప్రదీప్ : అవును ఇంకో ఇరవై రోజుల్లో నా ప్లాన్, మనుషులు అన్నీ రెడీ అవుతాయి.. అప్పటి వరకు మానకొక వీక్ పాయింట్ కావలి.. ఆ శివ గాడి పక్కన ఎప్పుడు ఒకడుంటాడు సందీప్ వాడికి కూడా పెళ్ళైంది కదా వాడిని ఎత్తుకు రావాలి అది వాడికి డౌట్ రాకుండా
సుశాంత్ : వాడి మీద కూడా నాకు ఎప్పటి నుంచో ఉంది అలాగే అని మిగతా విషయాలు మాట్లాడుకుని ఫోన్ పెట్టేసి సంతోషంతో పిచ్చి పిచ్చిగా ఎంజాయి చేసాడు.
వారం రోజులు ముభావంగా గడిచింది.. ఇంట్లో వాళ్లందరిని బాదించడం ఇష్టం లేక మీనాక్షి మళ్ళీ మాములుగా అయిపోయింది, శివని కూడా అటు ఓదార్చుతూ ఏదైతే అదే అవుతుందన్న మాట మళ్ళీ మళ్ళీ చెపుతూ వీలైనంతగా మొత్తం శివతో తిరుగుతూ గడుపుతుంది. కస్తూరి కూతురు నవ్వులని చూస్తూ శివ ఆలోచనలని మాన్పించే ప్రయత్నం చేసింది.. శివ కూడా పిల్ల ముఖం తన నవ్వు చూడగానే అన్ని మర్చిపోయేవాడు.. కాని మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి బాధ పడేవాడు.. అస్సలు ఆఫీస్ కి వెళ్లడం మానేశాడు పనులన్నీ సందీప్ చూసుకుంటున్నాడు. పెద్ద విషయాలు కూడా శివ పట్టించుకోవట్లేదు సందీప్ కూడా అన్ని తానై చూసుకుంటున్నాడు.
మీనాక్షి తొమ్మిది నెలలు పూర్తి చేసుకుంది, ఇంతవరకు అరణ్య బైటికి వచ్చే జాడ కనిపించడం లేదు.. డాక్టర్లు కూడా ఏమి తెల్చాలేక చేతులు ఎత్తేశారు, ఇన్ని రోజులు మీనాక్షి నిద్ర పోయాక శివ ఎంత ప్రయత్నించినా అరణ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీనాక్షి కూడా అరణ్య మాటలు లేకపోవడంతో రోజు రోజుకి ధైర్యం కోల్పోతుంది అది శివకి తనకి ఇద్దరికీ మంచిది కాదని తనకి అనిపించింది.
అదే రోజు రాత్రి..
సుశాంత్ : నేనంతా సిద్ధం చేసాను.. మీ మనుషులు కూడా వచ్చేసారు ఇప్పుడే కలిసాను..
ప్రదీప్ : ఎటాక్ ఇక్కడ కాదు నేను మొత్తం మార్చేసాను
సుశాంత్ : అదేంటి
ప్రదీప్ : అవును నువ్వే చూద్దువు.. సప్రైస్.. ఇక్కడంతా రెడీ నువ్వు మొదలుపెట్టు
సుశాంత్ : అలాగే అని ఫోన్ పెట్టేసి ప్రదీప్ మనుషులకి సైగ చేసాడు.
పొద్దు పొద్దున్నే లేచి జాగ్గింగ్ కి వెళుతున్న సందీప్ ని రెండు వాన్లతో వచ్చి చుట్టూముట్టారు, సందీప్ కి జేబు లోనుంచి గన్ తీసే అవకాశం కూడా ఇవ్వలేదు వెంటనే కట్టేసి ఎత్తుకు పోయారు.. అరగంటలో శ్రావణికి ఫోన్ చేసారు.. సుశాంత్ ద్వారా ఏమి చెప్పాలో ఏమి చెయ్యాలో వేరే వాడి ద్వారా చెప్పించి సుశాంత్ పేరు బైటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు.
మీనాక్షి తెల్లారే లేచింది.. ఎందుకో ఇవ్వాలంతా తన మనస్సు ప్రశాంతంగా అనిపించింది.
మీనాక్షి : బుజ్జి.. అరణ్య.. ఇక చాలు నాన్నా.. నీ మాటలు వినకుండా నేను ఉండలేను.. మాట్లాడరా బంగారు.. ఇవ్వాళ అంతా హాయిగా ఉంది కాని ఏదో భయంగా ఉంది.. నీ మాటలు నాకు తోడుంటే చాలా ధైర్యంగా ఉంటుంది.
అరణ్య ఏమి మాట్లాడలేదు..
మీనాక్షి : అలిగావా బుజ్జులు.. నా బుజ్జి కదా.. నిన్ను నా చేతులతో ఎలా నాన్నా.. ఏ తల్లి అలా చెయ్యలేదు చిన్నోడా.. ఒకానొక సమయం దెగ్గర నుంచి నువ్వే నా సర్వస్వం అనుకున్నాను తెలుసా.. నాన్నని దాటి తనకంటే నిన్నే ఎక్కువగా ప్రేమించాను.. అలక మాని నాతో మాట్లాడరా బుజ్జి..
అరణ్య : లవ్ యు అమ్మా
మీనాక్షి : అదీ.. ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది.. బైట చూడు ఎవరివో తెలిసిన వారి మాటలలా ఉన్నాయి, అని లేచింది.
అరణ్య : ఒక మాట
మీనాక్షి : చెప్పు బుజ్జి
అరణ్య : ఇవ్వాళ నేను పుడుతున్నాను..
మీనాక్షి : బుజ్జి.. నిజంగా.. వావ్.. అని ఆనందంలో పిచ్చిది అయిపోయింది.. అరణ్య.. బుజ్జి.. నిన్ను చూడాలని నిన్ను నా చేతులతో ఎత్తుకోవాలని ఎప్పటి నుంచో ఉన్న కోరిక.. చందు మామ అయితే నిన్ను మొట్ట మొదటిసారి తనే ఎత్తుకోవాలని ఆశపడుతున్నాడు.
అరణ్య : అన్నీ మర్చిపోయావా
మీనాక్షి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.. అన్నీ నెమరు వేసుకుంది.. మెల్లగా మంచం కోడు పట్టుకుని కూర్చుంది.
మీనాక్షి : అంటే ఈ రోజే నేను కూడా..
అరణ్య : అవును..
మీనాక్షి : మరేం పరవాలేదు.. నాకేం బాధ లేదు.. కానీ ఒక్క విషయం.. ఈ విషయం నాన్నకి చెప్పకు.
అరణ్య : ఉమ్.. అన్నాడు అంతే
మీనాక్షి : బాధ పడుతున్నావా
అరణ్య : లేదు నేను ఇప్పటి వరకు దేనికి బాధపడలేదు, నేను బాధపడితే నువ్వు ఆ నెప్పి తట్టుకోలేవు
మీనాక్షి : నా కోసం బాధని కూడా దిగమింగుకుంటున్నావా బుజ్జులు.. నీ లాంటి కొడుకుని కన్న నా జన్మ ధన్యం.. చాలా సంతోషంగా ఉంది.. కానీ భయంగా ఉంది బుజ్జి.. నేను లేకుండా నువ్వు ఎలా.. అయినా నీకు శక్తులు ఉన్నాయిగా నాకు పెద్దగా బెంగ లేదు.. నిన్ను చూసే అవకాశం నాకు కలుగుతుందా బుజ్జి.. కళ్ళు తుడుచుకుంటూ అడిగింది.
అరణ్య ఏమి మాట్లాడలేదు..
మీనాక్షి : బుజ్జి నొప్పిగా ఉంది.. బాధ పడుతున్నావా.. నిన్ను ఇంకేమి అడగనులే.. ఎనివే ఇవ్వాళ నీ బర్తడే కదా.. హ్యాపీ బర్తడే బుజ్జి.. పద ఇవ్వాళ మనం చాలా హ్యాపీగా ఉండాలి, నాన్నకి తెలియకుండా చాలా చెయ్యాలి అని లేచి బాత్రూంలోకి దూరి స్నానం చేసి రెడీ అయ్యి బైటికి వచ్చింది.
శ్రావణి, కస్తూరి కూతురి దెగ్గర కూర్చోవడం చూసి మీనాక్షి వెళ్లి పలకరించింది..
మీనాక్షి : ఏం శ్రావణి.. అస్సలు ఇటు రావడం లేదు, సందీప్ ఎలా ఉన్నాడు తన మొహం చూసి ఎన్ని రోజులు అయ్యిందో తెలుసా.. ఒకసారి వచ్చి కనపడమని చెప్పు.. మొన్న ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసాడు అంతే మళ్ళీ అడ్రెస్ లేడు అని నవ్వింది.
శ్రావణి ముభావంగా నవ్వుతూ పలకరించి మళ్ళీ పిల్లని చూస్తుంది
మీనాక్షి : మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు
శ్రావణి సిగ్గు పడింది
మీనాక్షి వెళ్లి తన కోడలు పక్కన కూర్చుంది, కొంత సేపటికి పాప చిన్నగా కళ్ళు తెరిచి చూసింది..
మీనాక్షి : అమ్ములు తల్లీ.. గుడ్ మార్నింగ్.. నా ముద్దుల తల్లే ఇది అని ముద్దు పెట్టుకుంది.. కస్తూరి.. బుజ్జిది లేచింది పాస్ పోపించు..
శ్రావణి : నేను పోపిస్తాను.. అని ఎత్తుకొగానే పాప ఏడ్చింది.. కస్తూరి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది.
మీనాక్షి : అమ్ములు.. మన శ్రావణిరా.. అందుకే అప్పుడప్పుడు వచ్చి మొహాలు చూపించాలనేది అని శ్రావణిని చూసి నవ్వింది.. రెండు నిముషాలు నిన్ను మొదట చూస్తుంది ఆ తరువాత వచ్చేస్తుందిలే అని లేచింది.
శ్రావణి : ఎటైనా వెళుతున్నావా
మేనాక్షి : కొంచెం పని ఉంది.. డ్రాప్ చెయ్యనా
శ్రావణి : లేదు కొంచెం సేపు కూర్చుని వెళతాను
మీనాక్షి బైటికి నడిచి డ్రైవర్ ని కార్ తీయమని వెనకాల కూర్చుంది.
మీనాక్షి : బుజ్జి ముందు కొంచెం తిని ఆ తరవాత కేక్ కట్ చేద్దాం.. నువ్వు నేను కలిసి సెలెబ్రేట్ చేసుకునే మొదటి ఆఖరి బర్తడే కదా.. అని పొట్ట నిమిరింది ప్రేమగా
నేరుగా రెస్టారెంట్ కి వెళ్లి కొంత జ్యూస్ తాగి అరటిపళ్ళు తిని బైటికి వచ్చి చిన్న రూం ఒకటి బుక్ చేసి డ్రైవర్ తో చిన్న కేక్ తెప్పించి కట్ చేసింది ఆనందంగా..
మీనాక్షి : హ్యాపీ బర్తడే రా బుజ్జి.. నాన్న కూడా ఉండుంటే బాగుండు కాని ఉంటే భరించలేం అబ్బా.. కదిలిస్తే ఏడుస్తాడు.. చూడ్డానికే బలవంతుడు కానీ చాలా సున్నితం తన వాళ్ళకి ఏదైనా జరుగుతుందంటే అస్సలు తట్టుకోలేడు.. నీతో ఇంకా చాలా మాట్లాడాలి బంగారు.. నేను పోయాక.. ఒకవేళ నాన్న నీ మీద కోపం తెచ్చుకుంటాడేమో.. నేను పోయిన బాధని నీ మీద కోపంగా మార్చితే నువ్వు అస్సలు బాధ పడకూడదు.. సరేనా.. నిన్ను చూసుకోడానికి ఎంత మంది ఉన్నారో.. నానమ్మ నిన్ను ప్రాణంలా చూసుకుంటుంది..
మీనాక్షి ఏవేవో మాట్లాడుకుంటుంటే అరణ్య మౌనంగా వింటున్నాడు ఇంతలో శివ దెగ్గర నుంచి ఫోన్ వచ్చింది.
శివ : మీనాక్షి ఎక్కడా
మీనాక్షి : ఊరికే కొంచెం గాలి కోసం బైటికి వచ్చాను, వస్తున్నాను.
శివ : అమ్ములు కనిపించటం లేదు
మీనాక్షి బైటికి నడుస్తూనే బిల్ పే చేయ్యమని డ్రైవర్ కి చెపుతూ బైటికి వచ్చేసింది కారు ఎక్కుతూ అదేంటి.. అదెక్కడికి పోద్ది..
శివ : ఇందాక శ్రావణి ఎత్తుకుందట.. ఆడిస్తానని అటు ఇటు తిరుగుతుంటే పట్టించుకోలేదట..
మీనాక్షి : ఎటైనా తీసుకెళ్లి ఉంటుంది.. కంగారు పడకండి.. తనకి ఫోన్ చెయ్యండని కొంచెం కంగారు గానే చెప్పింది.
శివ : నేను ఫోన్ చేసాను స్విచ్ ఆఫ్ వస్తుంది, సందీప్ ఫోన్ కూడా కావట్లేదు ఎంగేజ్ వస్తుంది. వీడు ఎక్కడున్నాడో.. ఇవ్వాళ ఆఫీస్ కి కూడా రాలేదట.
మీనాక్షి : నేను వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి వెంటనే ఇంటికి వచ్చేసింది..
అందరి మొహాల్లో కంగారు.. భరత్ కూడా ఇక్కడే ఉన్నాడు. మీనాక్షి వెళ్లి కస్తూరి పక్కన కూర్చుని తన చెయ్యి పట్టుకుంది..
మీనాక్షి : కస్తూరి.. కంగారు పడకు.. మన శ్రావణినే కదా తీసుకెళ్ళింది.
కస్తూరి : లేదు వదినా.. వెతకడానికి అన్నయ్యతో పాటు అందరూ వెళ్లారు.. కంగారు ఏమి లేదు.. నెలల పిల్ల కదా.. ఇప్పటికే అది కనిపించక రెండు గంటలు అవుతుంది.. పాలకి ఏడుస్తుందేమో అని బైటకి అలా అనేసింది కానీ కస్తూరి చేతులు వణకడం చూసి మీనాక్షికి కూడా భయం పట్టుకుంది..
* * * * * *
శివ కోడలిని ఎత్తుకొచ్చిన శ్రావణి నేరుగా సుశాంత్ దెగ్గరికి వెళ్ళింది బైట తన మనుషులు ఆపారు..
శ్రావణి : మీకు కావాల్సిన పాపని తీసుకొచ్చాను.. ప్లీజ్ మీ కాళ్లు పట్టుకుంటాను సందీప్ ని వదిలెయ్యండి.
సుశాంత్ మనుషులు లోపాలకి ఫోన్ కొట్టారు.
గోడౌన్ లో సీలింగ్ కి వేలాడదీసిన సందీప్ తో బాక్సింగ్ ఆడుతూ ఫోన్ వచ్చేసరికి ఆగి సందీప్ ని నవ్వుతూ చూసాడు.. సందీప్ రెండు కాళ్లు విరిచేసారు.. అది వీడియో తీసి శ్రావణికి పంపించే తనని లొంగదీసుకున్నారు.
సందీప్ : ఏరా.. అసాధ్యం.. అమోఘం అని ఏదేదో కూసావ్.. నీ పెళ్ళాం చూడు ఎలా తీసుకొచ్చిందో నా పార్సెల్ ని.. భయపడకు నేను చిన్న పిల్లలని చంపను.. ఆ పాపం నాకొద్ధు.. కానీ నీ పెళ్ళాన్ని మాత్రం విడిచి పెట్టను.. నన్ను కొడతావ్ రా నా కొడకా నువ్వు.. నువ్వెంత నీ బతుకేంత.. బస్తీ జనాలు బస్తీలోనే ఉండాలి కాదని ఇలా ఒక్కసారిగా కోట్లల్లో ఎదిగితే జీవితాలు ఇలాగే తగల బడతాయి.. పాపం నీ భార్య.. నా గురించి నిజం తెలియకపోయి ఉంటే వదిలేసే వాడిని కానీ ఈ సాక్ష్యాలు ఉన్నాయే చాలా పవర్ ఫుల్ అందుకే తప్పట్లేదు అని సందీప్ మొహం దెగ్గరికి వచ్చి నవ్వాడు.
సందీప్ కోపంగా చూస్తూ తన నోటి నుంచి కారుతున్న రక్తం మొత్తం తీసుకుని సుశాంత్ మొహం మీద తుపుక్కుమని ఉమ్మాడు..
సందీప్ : చేతగాని నా కొడకా.. పిల్లల్ని ఆడోళ్ళని అడ్డం పెట్టుకుని పగ సాధిస్తున్నావ్.. ఆడంగి నా కొడకా
సుశాంత్ : నా కొడకా.. నీకింకా మదం తగ్గలేదు.. ఇదంతా వాడిని చూసుకునే కదా.. ఇవ్వాల్టితో వాడు కూడా చస్తాడు.
ఇంతలో శ్రావణి ఏడుస్తూ పాపతో లోపలికి వచ్చింది.. గాల్లో వేలాడుతున్న సందీప్ ని చూసి ఏడుస్తూ దెగ్గరికి వస్తుంటే సందీప్ ఆపేసాడు.
సందీప్ : అక్కడే ఆగిపో.. నీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు
శ్రావణి : నేను ఇదంతా చేసింది నీ కోసమే
సందీప్ : ఇదంతా నీ స్వార్ధం.. నడి రోడ్డు మీద కనీసం మీ అమ్మ దేహాన్ని చూడలేని స్థితిలో ఉన్న మిమ్మల్ని చేరదీసిన దేవుడికి నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ప్రయాశ్చిత్తం లేని పాపం చేసావు.. నీకు ఇవ్వాళ ఉన్న చదువు, పేరు, బట్ట, తిండి ఆఖరికి నేను కూడా వాడు పెట్టిన భిక్ష.. వాడికి ద్రోహం చెయ్యాలని ఎలా అనిపించింది నీకు.. పాప వాళ్ల చేతిలోకి వెళితే శివని ఎలా ఆడిస్తారో.. శివని ఏం చేస్తారో నీకు తెలీదా.. నీకు ప్రతీ ఒక్క విషయం చెపుతూనే ఉన్నాను కదా.. అన్ని తెలిసే చేసావు.. నువ్వు వాడిని మాత్రమే కాదు నా నమ్మకాన్ని కూడా కోల్పోయావు..
* * * * * *