03-12-2022, 04:27 PM
(This post was last modified: 04-12-2022, 10:29 AM by Takulsajal. Edited 2 times in total. Edited 2 times in total.)
46
శివ : రేయి మీ సర్ అదే వాడి పేరేంటి.. ప్రతాప్. వాడి గురించి చెప్పండి.
ఎవ్వరు ఏం మాట్లాడలేదు.
శివ : చూడండి మీరంటే నాకు కోపం లేదు, మీరు ఎవరో కూడా నాకు తెలీదు. ఇవ్వాల్టితో వాడో నేనో తెలిపోతుంది. మీకేం ప్రాబ్లమ్ లేదు వాడెవడో కూడా నాకు తెలీదు కొంచెం చెప్పండ్రా
ఒకడు ముందుకొచ్చాడు.. ప్రతాప్ అంటే ఒక్కడు కాదు, ఇద్దరు.. అన్న ప్రతాప్ తిరగడం, పనులు చూసుకోవడం ఎవరైనా తన దారికి అడ్డొస్తే లేపేయ్యడం ప్రతాప్ సర్ చూసుకుంటారు.. ఇక ప్రతాప్ సర్ బాడీ అయితే, బ్రెయిన్ ఆయన తమ్ముడు ప్రదీప్. బిజినెస్ నడపడం, కోర్టులు కేసులు అన్ని ఆయన చూసుకుంటాడు. ఇద్దరు అన్నదమ్ములు.. ప్రతాప్ సర్ ని ఎదిరించి నిలబడ్డ వాళ్ళని మేము ఇప్పటి వరకు చూడలేదు.
శివ : ఇప్పుడు చూస్తారులే.. నేను నిలబడి సలాం కొట్టడానికి రాలేదు, ఎక్కి తొక్కడానికి వచ్చాను
ఇంతలోనే అక్కడికి నాలుగు నల్లటి స్కార్పియోల మధ్యలో ఒక తెల్లని ఆడి కార్ తో వచ్చి అక్కడ ఆగాయి.. అందరి చూపులు అటు వైపు మళ్లాయి.. మనుషులు వెళ్లి డోర్ తీయగానే కారుకి అటు వైపు నుంచి ఒకడు ఇటు నుంచి ఒకడు దిగి మావైపు నడుచుకుంటూ వచ్చారు. చిన్నగా వర్షం పడుతుంటే వాళ్ళిద్దరికీ గొడుగులు పట్టారు.
శివ : వీళ్లేనా ప్రతాప్, ప్రదీప్.. ప్రతాప్ ఎవడు
ప్రతాప్ : నేనేరా
శివ : అదే మమ్మల్ని చంపాలని ఊర కుక్కలా తిరుగుతున్నావు కదా అందుకే ఇక్కడే తెల్చుకుందాం రమ్మన్నాను
ప్రతాప్ : ఏంట్రా నువ్వు తెల్చేది అని గన్ తీసి శివ తలకి పెట్టగానే వెంటనే శివ కూడా గన్ ప్రతాప్ వైపు పెట్టాడు.. అక్కడున్న సందీప్ కూడా గన్ తీసి గురి పెట్టగా ఇంకో ముగ్గురు కూడా గన్స్ తీశారు. అందరూ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటున్నారు.
ప్రదీప్ : రేయి అనవసరంగా ఛస్తావ్
శివ : నా గన్ లో కూడా బుల్లెట్లే ఉండేది.. దమ్మున్న మగాడు అయితే కాల్చమను వీడిని..
అరణ్య : అమ్మా వెంటనే ఒక రాయి తీసుకుని నాన్నని గురి చూసి కొట్టు
మీనాక్షి : నాన్ననా...?
అరణ్య : ఇప్పుడే.. అనగానే మీనాక్షి రాయి తీసి శివ మొహం మీదకి విసిరేసింది.
అదే టైంకి బాడీ తప్ప ఆలోచన లేని ప్రతాప్.. ఏంట్రా నీకు భయపడేది అని కాల్చాడు అదే టైం కి శివ కూడా కాల్చాడు.. ప్రతాప్ కాల్చిన బుల్లెట్ కి మీనాక్షి విసిరిన రాయికి తగిలి శివకి ఏమి కాకపోగా శివ కాల్చిన బుల్లెట్ మాత్రం ప్రతాప్ గుండెలోకి దూసుకుపోయింది.
వెంటనే అందరూ కాల్చడం మొదలు పెట్టారు, సందీప్ మీనాక్షిని కస్తూరిని అక్కడే ఉన్న సమాధి వెనక దాచి అటు వైపు ఎవరు వచ్చినా కాల్చడం మొదలు పెట్టాడు. ఇంకో వైపు శివ చెట్టు వెనక దాక్కుని మిగిలిన ముగ్గురు గన్స్ తో కాలుస్తుంటే తప్పించుకుని తిరిగి కాలుస్తున్నాడు. ఒకడి తల కనపడుతుంది కాని షాట్ దొరకడం లేదు వెంటనే వాడి తల మీదకి ఒక చిన్న రాయి విసిరాడు దానికి కొంచెం కదలగానే షాట్ దొరికింది వెంటనే షూట్ చేసాడు. ఆ వెంటనే వాడి ప్లేస్ లోకి వెళ్లి మిగతా ముగ్గురిని లేపాడు.
ఇంతలో గన్ సౌండ్ విని అటు చూసేసరికి ప్రతాప్ పడుకునే సందీప్ ని కాల్చాడు అది సందీప్ చేతికి తగిలింది.. వెంటనే ప్రతాప్ అని అరిచాడు.. వాడు శివ వైపు తిరగగానే హెడ్ షాట్ కొట్టేసాడు నా కొడకా అని తిడుతూ..
మిగతా మనుషులు అది చూసి బెదిరిపోయారు.. ప్రదీప్ అక్కడనుంచి తప్పించుకుని పారిపోయాడు, వెంటనే సందీప్ ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లిపోయారు. అక్కడ నుంచి శివ తన అమ్మ జ్ఞాపకాలను చెల్లెలికి సంబంధించిన సామాను తీసుకుని మొత్తానికే ఇంటికి వచ్చేసారు.
కస్తూరికి కూడా తన అన్నయ్య ఇంట్లో ఉండటానికి జరిగింది మొత్తం తలుచుకుని తన తదుపరి జీవితాన్ని కొనసాగించడానికి కొన్ని రోజుల సమయం పట్టింది. ఇంట్లో ఏదో ఒక మంచి పండగ వాతావరణం నెలకొలిపితే జరిగింది మర్చిపోయి అందరూ మళ్ళీ మాములు జీవితాలకి అలవాటు పడతారని శివ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఒక శుభముహుర్తాన శివకి మీనాక్షితో.. భరత్ ని ఒప్పించి సందీప్ కి శ్రావణితో పెళ్లి జరిపించారు. శివ రోజు రోజుకి ఎదుగుతున్నాడు.. తన జీవితంలో జరిగిన సంఘటనలన్ని తనని నిద్ర పోనివ్వడం లేదు. ఏ ఆపద ఎటు వైపు నుంచి వస్తుందో అని తన కొడుకు అరణ్య హెచ్చరిస్తూనే ఉన్నాడు దానికి తగ్గట్టే శివ అందరినీ ముని వేళ్ళ మీద కాపాడుకోవాలంటే ఈ పవర్ సరిపోదని ముందు డబ్బులు సంపాదించాలని.. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంవత్సరాలుగా వచ్చే ఎదుగుదలని నెలల్లో చూపిస్తున్నాడు.. ఇందులో అరణ్య సూచనలు, తను పెట్టె ముహుర్తాలు శివకి చాలా ఉపయోగ పడ్డాయి.
రాత్రికి అందరూ తిని కుర్చున్నారు.. ఏమైందో కాని గత రెండు గంటలగా మీనాక్షి పొట్ట వెచ్చగానే ఉంది.. మీనాక్షి అందరూ మాట్లాడుతుండగానే లేచి వెళ్లిపోవడంతో శివ లేచి తన వెనకే వెళ్ళాడు.
శివ : ఏమైంది
మీనాక్షి : పొట్టంతా జిల పుడుతుంది.. ఇందాకటి నుంచి ఒకటే నవ్వుతున్నాడో మరి సంతోషంగా ఉన్నాడో తెలియట్లేదు కాని వెచ్చగా ఉంది.. అడిగితే ఇంకా వెచ్చగా అవుతుంది.. దేనికో తెగ సంబర పడుతున్నాడు.
శివ : ఏమై ఉంటుంది.. ఒకసారి అడిగి చూడు
మీనాక్షి : బుజ్జి.. మాకు చెపితే మేము కూడా ఆనందపడతాం కదా
అరణ్య : నాన్నని కార్ కీస్ రెడీగా పెట్టమని చెప్పు, ఈ రాత్రికి ఎవ్వరికి నిద్ర ఉండదు.. ఏ టైంలో అయినా హాస్పిటల్ కి వెళ్లాల్సి రావచ్చు
మీనాక్షి : ఏమైందిరా అలా మాట్లాడుతున్నావ్.. హిస్పిటల్ దేనికి
శివకి అర్ధమయ్యింది.. ఆనందం పట్టలేక పోయాడు.. కాని మీనాక్షి ముందు నటించాలిగా..
శివ : ఏమైంది హాస్పిటల్ ఏంటి
మీనాక్షి అరణ్య చెప్పిన విషయమే చెప్పింది
శివ : పిచ్చిదానా నీకింకా అర్ధం కాలేదా.. నా చెల్లి కస్తూరి.. అంటే ఇవ్వాళే డెలివరీ.. అని బైటికి పరిగెత్తుతుంటే
మీనాక్షి : ఇవ్వాళ కాదట.. రేపట అని తను కూడా ఆనందంగా బైటికి వెళుతు ఒక్కసారిగా ఆగిపోయి మంచం మీద కూర్చుంది.. పొట్ట మీద చెయ్యి వేసుకుని నిమురుతూ.. బుజ్జి ఈ విషయానికేనా అప్పటి నుంచి తెగ ఆనంద పడుతున్నావ్.. ఆ.. ఏంటి విషయం.. అని అడగ్గానే మీనాక్షి పొట్ట ఇంకా వెచ్చగా అవుతుంటే.. బుజ్జి ఇంకా వెచ్చగా అవుతే నేను మాడిపోతానురా.. అని నవ్వుతూ.. నీ దెగ్గర ఎన్ని వేషాలు ఉన్నాయో నువ్వు పుట్టక ముందే నాకు అన్ని చూపించేస్తున్నావ్ రా.. ఇక నువ్వు పుట్టాక నేను ఎన్ని చూడాలో అని నవ్వుతుంటే అప్పటివరకు వెచ్చగా ఉన్న పొట్ట ఒక్కసారిగా చల్లబడి పోయింది..
మీనాక్షి : బుజ్జి ఏమైంది నాన్నా.. అరణ్య.. అరణ్య..
అరణ్య ఏమి మాట్లాడలేదు.. మీనాక్షికి చిన్నగా ఏదో భయం అనిపించింది కాని ఇంకేమి మాట్లాడలేదు లేచి బైటికి వెళ్ళిపోయింది అందరూ మాట్లాడుకుంటుంటే కస్తూరి తన అన్నయ్య తల నిమురుతుంటే తన ఒడిలో పడుకుని హాయిగా చందు మరియు రజిత జోకులు వేస్తుంటే అందరి నవ్వులతో తన నవ్వుని కలిపింది.
ఇప్పటికే లేట్ అయ్యిందని కావేరి గుర్తు చేసేసరికి ఇష్టంలేకపోయినా అందరూ లేచారు..
శివ : కూర్చోండి.. రేపు ఎవ్వరికి పెద్దగా పనులు ఏమి ఉండవు
కావేరి : అదేంట్రా
శివ : రండి ఇవ్వాళ కూర్చుందాం.. కస్తూరి నిద్ర వస్తుందా
కస్తూరి : లేదు అని నవ్వింది..
మళ్ళీ అందరూ కూర్చున్నారు.. మీనాక్షి వెళ్లి తన తమ్ముడిని ఆనుకుని కూర్చుంది.. చందు కూడా మీనాక్షిని పడుకోబెట్టుకుని వాడి కాలేజీలో అమ్మాయిల గురించి వాడు వేసిన వేషాల గురించి చెపుతుంటే అందరూ నవ్వుకుంటున్నారు.
రాత్రి ఒంటి గంటకో ఎప్పుడో అప్పటికే అందరూ ముచ్చట్లాడుతూ నవ్వుతూ పడిపోతుంటే కావేరి అందరినీ లేపి పడుకోమని లోపలికి పంపించింది.
కావేరి : శివా నువ్వు కూడా వెళ్లి పడుకో
శివ : మీనాక్షి ఏదీ
కావేరి : పడుకుంది
శివ : నేను కొంచెం సేపు ఇక్కడే ఉంటాను.. అని తన ఒళ్ళో పడుకున్న కస్తూరిని చూస్తూ ఉన్నాడు.. అది చూసిన కావేరి శివకి కస్తూరికి ఇద్దరి నుదిటిన ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది.
రాత్రి రెండున్నరకో ఎప్పుడో కస్తూరికి మెలుకువ వచ్చి లేచింది, శివ అలానే గోడకి ఆనుకుని పడుకోవడం అన్నయ్య కాళ్ళ మీద తను పడుకోవడం చూసింది.. శివ చెయ్యి ఇంకా తన చెంప మీదె ఉంది.. చిన్నగా నొప్పులు మొదలయ్యేసరికి అన్నయ్యని లేపింది.
శివ : ఏమ్మా..
కస్తూరి : నొప్పిగా ఉందన్నయ్య.. నొప్పులు స్టార్ట్ అవుతూన్నాయేమో..
శివ లేచి కార్ కీస్ అందుకుని అమ్మని లేపాడు.
కావేరి : ఇంకా నొప్పులు మొదలవ్వలేదుగా
శివ : అయినా సరే.. ఏముంది.. ముందే వెళ్లి అడ్మిట్ అయితే మంచిదే కదా
ఇంతలోనే కస్తూరికి నొప్పులు మొదలవ్వటంతో రజిత కూడా నిద్రలోనే లేచి బైటికి వచ్చింది.. అందరూ హాస్పిటల్ కి వెళ్లారు. కొంత సేపటికి నొప్పులు తగ్గి మళ్ళీ మొదలయ్యాయి.
సరిగ్గా తెల్లారి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకి, నవరాత్రుల దుర్గా దేవిని పూజించే రోజున అరణ్య చెప్పినట్టే ఎర్రగా తలనిండా జుట్టు ఉండలు కట్టి అరచేతిలో గోరింటాకు పెట్టినట్టు నల్లని మచ్చతో పుట్టింది.
అందరూ సంతోషించారు.. కస్తూరి అయితే పాపని చూసుకుని ఏడ్చేసింది.
శివ : ఏంట్రా.. అని బుజ్జగిస్తూ.. చూడు నా కోడలు ఎంత అందంగా పుట్టిందో, ఈ టైములో నువ్విలా ఏడవచ్చా.. మన అమ్మే పుట్టిందేమో కదా
మీనాక్షి : ఎప్పుడో చనిపోవాలనుకున్నాను అన్నయ్యా.. దీని కోసమే చావుని అంచుల నుంచి తప్పించుకుంటూ పారిపోతూ వచ్చాను.. అవును అమ్మే పుట్టిందని అనుకుంటాను. అని శివని వాటేసుకొగా ఓదార్చాడు.
ఇంటికి ఆడ పిల్ల వచ్చిన వేళా విశేషమో ఏమో.. ఇల్లంతా కళకళలాడుతూ ఉంది.. కస్తూరి మరియు శివ ఇద్దరు పాప పుట్టిన పది రోజుల తరువాత పాపకి మొదటగా స్నానం చేపించడానికి కావేరి అమ్మని పిలవగా.. ఏడ్చేసింది..
కస్తూరి : అమ్మా.. నిజంగా అమ్మ చెప్పినట్టు.. తన స్థానంలో నువ్వు తప్ప ఇంకెవ్వరు ఉండలేరు.. అని చెయ్యి పట్టుకుంది.
కావేరి ఆనందబాష్పాలతో పిల్లకి స్నానం పోసి ఆడిస్తూ.. వెన్ను మీద తడుతూ.. ముక్కు నుదురు అన్ని సరిగ్గా వచ్చేలా నొక్కుతుంటే కస్తూరి పిల్ల ఏడుపుకి భయపడుతూ చూస్తుంది. స్నానం చేపించి కస్తూరికి అందంచగా ఒళ్ళు తుడిచి పక్కన పండేసుకుంది.. ఆ చిన్ని చిన్ని చేతులని చూస్తూ.. తను గుప్పిట పట్టిన వెళ్లాలోకి తన వేలిని పోనించి.
శివ : కస్తూరి.. అమ్మాయి చాలా ఆరోగ్యంగా పుట్టింది చాలా మంది పిల్లలని ఇంక్యుబేటర్ లో పడతారట కాని మనకి ఆ అవసరమే రాలేదంది డాక్టర్.. కంగారు పడకు.
రాత్రికి అందరూ పడుకున్నాక మీనాక్షి కూడా నిద్రపోయిందాక వేచి చూసి అప్పుడు మాట్లాడుకున్నారు తండ్రి కొడుకులు
శివ : అరణ్య.. నాకొక సందేహం.. నీకు చచ్చిపోయిన వాళ్ళని బతికించే శక్తి ఉన్నదా
అరణ్య : ఎందుకు అడుగుతున్నావు
శివ : లేదు నిన్ను అటువంటి కోరికలు నేను కోరను.. అది సృష్టి విరుద్దం అని నాకు తెలుసు
అరణ్య : ఇప్పటికి లేదు కాని ఒకవేళ ఉన్నా అది సాధ్యం కాదు, ప్రకృతికి ఎదురు వెళ్లినా వికృతికి ఎదురు వెళ్లినా అది తీవ్ర నష్టాన్ని కలగచేస్తుంది.
శివ : నాకు ఇంకా ఏమైనా చెప్పాలా
అరణ్య : నేను ఒకరిని చావుని కోరుకుంటున్నాను.. నా కోరిక తీరుతుందా
ఉలిక్కిపడ్డాడు శివ.. ఎవరు.. ఎవరిని..
అరణ్య : అందరి మంచి కోసమే అడుగుతున్నాను, నా కోరిక తీర్చుతావా నాన్నా
శివ : కచ్చితంగా బంగారు..
అరణ్య : మాట ఇవ్వు.. సమయం వచ్చినప్పుడు నేను ఎవరిని చంపమంటే వాళ్ళని ఆలోచించకుండా చంపుతానని.
శివ : కాని అదీ..
అరణ్య : అమ్మకి కాని నానమ్మకి కాని అత్తయ్యకి కాని ఏ హాని జరగదు.. నన్ను నమ్ము
శివ : మాటిస్తున్నాను.. అని మీనాక్షి పొట్ట మీద చెయ్యి వేసాడు.. ఆలోచించకుండా