29-11-2022, 06:50 PM
43
పొద్దున్నే శివ లేచి అరణ్య చెప్పినట్టే వెళ్ళాడు ఎప్పుడు హడావిడిగా ఉండే రోజు ఇవ్వాళ ప్రతీ పని సజావుగా సాగిపోవడం ఆ వెంటనే తన షేర్స్ అమ్ముడు పోవడం అనుకున్నదానికంటే ఎక్కువ లాభాలు రావడంతో అరణ్య చెప్పిన అన్ని విషయాలను చాలా సీరియస్ గా తీసుకున్నాడు. త్వరలోనే మంచి రోజు చూసి అరణ్య చెప్పిన టైం బట్టి సొంత బిజినెస్ చెయ్యాలనుకున్నాడు.
*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*
ఇంకోవైపు సుశాంత్ ఇంటికొచ్చాడు, లోపలికి అడుగు పెట్టగానే తన తల్లి ఏడుస్తూ వెళ్లి ఇంట్లోకి తీసుకొచ్చింది.
రాజేశ్వరి : ఆగిపో అక్కడే
అత్తయ్యా అది..
రాజేశ్వరి : ముందు వాడిని చేసిన పాపలకి లొంగిపొమ్మను
సుశాంత్ : నా మనిషి ఒకడు లొంగిపోయాడు, నాకు బుద్ధిచ్చింది.. ఇక నుంచి బుద్ధిగా మన బిజినెస్లు చూసుకుంటాను. కావాలంటే మీనాక్షికి క్షమాపణలు చెపుతాను
అత్తయ్యా విన్నారుగా, ఈ ఒక్కసారికి వదిలెయ్యండి
రాజేశ్వరి : నీ వల్ల ఇంకోసారి మీనాక్షి కుటుంబం ఇబ్బంది పడిందని నాకు తెలిస్తే ఊరుకునేది లేదు.. నేనేం చేస్తానో నాకే తెలీదు అని వాడి మొహం చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది.
సుశాంత్ : అలాగే అని కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు..
తన అమ్మ ఏమైనా తినమంటే తరవాత తింటానని చెప్పి లోపలికి వచ్చి డోర్ పెట్టేసి మోకాళ్ళ మీద కూర్చుని కోపంగా పక్కనే ఉన్న దిండ్లు అన్ని విసిరికొట్టి, ఫోన్ ఓపెన్ చేసాడు.. వాట్సాప్ లో ఇంకో వీడియో వచ్చింది. శివ ఇంటిని గమనించమని ఒక మనిషిని పెట్టి వచ్చాడు వాడు పంపించిన వీడియోలు చూస్తూ కూర్చున్నాడు.
వీడియోలో మీనాక్షి తన పొట్ట పట్టుకుని మాట్లాడుకుంటూ తనలో తానే నవ్వుకుంటుంటే అక్కసుతో చూడసగాడు.. శివ మీనాక్షి దెగ్గరయినప్పుడల్లా కోపంగా పక్కనే ఉన్న వస్తువులు విసిరికొట్టాడు. వీడియో అంతా చూసి ఫోన్ మంచం మీద విసిరేసి.. లేచాడు
సుశాంత్ : దాన్ని వదలను, వాడిని కూడా.. ముందు నా ఆస్తులు నా చేతికి రావాలి. ఒక మూడు నెలలు నటిస్తే చాలు అంతా నా కంట్రోల్లోకి వస్తుంది.. అప్పుడు.. ఆ తరువాత దాన్ని ఎలా దక్కించుకోవాలో చూస్తాను.. ఆ శివ గాడి అంతు చూస్తాను. అవును ఇలాగే చెయ్యాలి.. అని పిచ్చి పిచ్చిగా వాడిలో వాడే నవ్వుకుంటూ సంతోషంగా కిందకి వెళ్లి అందరితో మంచిగా ఉంటూ నటించడం మొదలు పెట్టాడు.
*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*
మీనాక్షి : అరణ్య, చెప్పు ఇవ్వాళ మనం ఏం చేద్దాం
అరణ్య : ఎక్కడికైనా పచ్చటి వాతావరణం, చుట్టూ చెట్లు, చక్కటి గాల, పక్కనే చెరువు లేదా ఏదైనా జలపాతం లాంటిది అలాంటి ఒక చోటుకి వెళదాం అమ్మా
మీనాక్షి : నీకు కూడా మీ నాన్నలానే చెట్ల పిచ్చి ఉన్నట్టుందే
అరణ్య : అవును, నాన్న ఎప్పుడైనా చెట్లు నాటాడా
మీనాక్షి : చూపిస్తా పదా అని ఇంట్లో కావేరికి తన అమ్మ రజితకి చెప్పేసి చెప్తున్నా వినకుండా ఒక్కటే కార్ తీసుకుని ఆశ్రమానికి బైలుదేరింది, మూల మలుపు తీరుతుండగానే అమ్మా బ్రేక్ అని అరిచాడు అరణ్య.. వెంటనే మీనాక్షి బ్రేక్ నొక్కింది.. అప్పుడే రోడ్డు దాటుతున్న లారీ ఒకటి అదుపు తప్పి మీనాక్షి కారు ముందు నుంచి స్పీడ్ గా వెళ్లి అక్కడ ఉన్న ట్రాన్స్ఫర్ ని గుద్దింది.
మీనాక్షి : బుజ్జి.. వి ఆర్ వెరీ లక్కీ.. అని కారు తిప్పి పోనించింది..
అరణ్యతో మాట్లాడుతూ ఆశ్రమానికి అక్కడ శివ పెట్టిన చెట్లు తను పెరిగిన విధానం ఎలా ఆలోచిస్తాడు, కావరీకి శివకి ఉన్న బంధం.. ఎలా తను శివ కలుసుకున్నది.. శివ అస్సలు అమ్మ గురించి చెపుతుంటే అంతా వింటూ ఊ కొడుతున్నాడు అన్ని తెలిసినా.. ఆ తరువాత అక్కడ నుంచి పార్క్ కి వెళ్లి అక్కడ నుంచి రెస్టారెంట్ కి వెళ్లి ఓన్లీ ఫ్రూట్స్ తినేసి జ్యూస్ తాగేసి తిరిగి ఆశ్రమానికి వచ్చి సాయంత్రం వరకు అక్కడే పిల్లలతో గడిపారు.
శివ : హలో మీనాక్షి, పొద్దుననంగా వెళ్ళావట.. ఎక్కడున్నావ్
మీనాక్షి : ఆశ్రమంలో, అరణ్యకి బాగా నచ్చింది.
శివ : అక్కడే ఉండు వస్తున్నాను, కలిసి వెళదాం.. ఇంట్లో మనకి చిన్న ఎంగేజ్మెంట్ సెటప్ చేసారంట..
మీనాక్షి : అవునా.. హహ.. అలాగే అని ఫోన్ పెట్టేసి అరణ్యా.. నాన్న వస్తున్నారు.. యే..
*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*
చీకట్లో నీళ్లలోకి దూకిన ఆ అమ్మాయి ఎక్కువ లోతు లేనందున అరి కాళ్ళకి రాయి తగిలి కొంచెం కొట్టుకుపోయింది, పైనున్న గుండాలు ట్రైన్ వెళ్లిపోయిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి అక్కడే ఎవరో వదిలేసిన చిన్న పడవ బహుశా రోజు బ్రిడ్జికి ఉన్న మెట్లు దిగి ఆ పడవలో వెళ్లి చేపలు పట్టుకుంటారేమో అది ఎక్కి తాడు తీసి తెప్ప సాయంతో అవతలి ఒడ్డుకి పోవడానికి తెప్ప కదిలించింది.
గూండాలు కిందకి దిగి వచ్చేసరికి ఆ అమ్మాయి సగం దూరం వెళ్ళిపోయింది.
అన్నా ఇప్పుడు ఏం చేద్దాం
ఇంకో పడవ లేదు, మనం తిరిగి అటు వైపుకు వెళ్లేసరికి ఆ అమ్మాయి చేజారిపోతుంది. ఆ అమ్మాయి బతికుందంటే మనం బతికుండం
ఈ సుపారి అనవసరంగా ఒప్పుకున్నాము అన్నా
ఒప్పుకోకపోయినా మనల్ని చంపేసేవాళ్ళు.. వాడు చెప్పింది చెయ్యడం తప్ప మనకి ఇంకో దారి లేదు.. అటు వైపున మన వాళ్ళు ఉంటే ఫోటో పంపించి రెడీగా ఉండమనండి అని వెనక్కి మళ్ళాడు.
ఆ అమ్మాయి శక్తి లేకపోవడం వల్ల అటు వైపుకు వెళ్ళేవారికి తెల్లారింది, అక్కడ ఆల్రెడీ తనకోసం వెతుకుతున్నారని తెలిసి మధ్యలోనే ఆపేసి చిన్నగా వెళ్లి పిచ్చి చెట్లలో నుంచి బైటికి వచ్చి మట్టి రోడ్డు గుండా సిటీలోకి వెళ్ళింది.. మధ్యలో ముళ్ల చెట్లు ఉన్నాయేమో జాకెట్ దెగ్గర కొంచెం చినిగింది.
ఎవ్వరికంటా పడకుండా వెళ్లి బస్సు ఎక్కి కూర్చుంది, కండక్టర్ వచ్చి టికెట్ అడిగి ఆ అమ్మాయిని చూసి అనుమానంగా తన ఫోన్ కి వచ్చిన ఫోటో చూసుకున్నాడు.. ఆ అమ్మాయి వెంటనే ఏడుస్తూ కండక్టర్ కాళ్ళ మీద పడిపోయి తన మెడలో ఉన్న తాళి తీసి వాడి చేతిలో పెట్టి.. అన్నా కడుపుతో ఉన్నానన్నా దయ చూపించన్నా కావాలంటే ఈ కమ్మలు కూడా తీసుకో అని చెవులకి ఉన్న కమ్మలు కూడా తీసి వాడి చేతిలో పెట్టింది. వాడు ఇంకేం మాట్లాడకుండా చివరి సీట్లో కూర్చోమని చెప్పి టికెట్ కొట్టి తన చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు.
బస్సు బైలుదేరింది.. చిరిగిన జాకెట్ చూసుకుని చీర కొంగుని చుట్టూ కప్పుకుంది, జాకెట్ లో చెయ్యి పెట్టి తన అమ్మ ఇచ్చిన ఒక ఉత్తరం దానితో పాటు ఒక ఫోటో రెండు చేతిలో పట్టుకుని మరొక్కసారి చదివి.. ఏడుస్తూ చనిపోయిన అందరినీ తన అమ్మని తన భర్తని తలుచుకుని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
బస్సు హైవే మీదకి ఎక్కగానే కడుపులో తిండి లేక పరిగెత్తి పరిగెత్తి అరికాళ్ళ మంటలకి త్వరగానే అలిసిపోయి నిద్రపోయింది.. మళ్ళీ కండక్టర్ వచ్చి లేపాకే.. బస్సు దిగి బస్టాండ్ నుంచి బైటికి వచ్చి అందరినీ కావేరి ఆశ్రమం దెగ్గరికి దారి అడుగుతుంటే ఎవ్వరు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు
పొద్దున్ననుంచి బేరం తగలక విసుగ్గా కూర్చున్న ఒక పిల్లోడు ఆటోలో కూర్చుని ఉన్నాడు, అస్సలు వాడికి ఆటో నడపడం అంటే ఇష్టంలేదు.. కాని ఇంటర్ ఫెయిల్ అయ్యేసరికి వాడి నాన్న ఆటో కొనిచ్చి తోలుకొమని ఇంటి నుంచి గెంటేసరికి తప్పక వేరే దారిలేక ఆటో నడుపుతున్నాడు.
ఆ అమ్మాయి నేరుగా వాడి దెగ్గరికే వెళ్ళింది. తమ్ముడు కావేరి ఆశ్రమం దెగ్గరికి తీసుకెళ్ళవా.
నూట యాభై అవుతుంది అన్నాడు చిరాగ్గా తన మొహం, రేగిపోయిన జుట్టు, వాళ్లంతా చమట చినిగిన జాకెట్ చూసి..
అక్కడికి వెళ్ళాక ఇస్తాను తమ్ముడు కొంచెం త్వరగా తీసుకెళ్ళవా అని ఎక్కి కూర్చుంది.
ఏయి ముందు ఆటో దిగు.. నీ వాలకం చూస్తుంటే నాకు డబ్బులు ఇచ్చేదానిలా ఉన్నావా.. దిగు.. అని కసిరాడు.. భయంగా ఆటో దిగింది.
ఇంతలో రెండు సుమోలు వచ్చి ఆగి అందులో నుంచి నాలుగు రోజలుగా అమ్మాయిని వెంటాడుతున్న ఆ పది మంది దిగి బస్టాండ్ లోపలికి పరిగెత్తారు.
తమ్ముడు నీకు దణ్ణం పెడతాను తమ్ముడు, చూస్తే చంపేస్తారు తమ్ముడు.. అని ఇష్టం లేకపోయినా తన కడుపు చూపించి.. ఒక్క దాని వల్ల కావట్లేదు తమ్ముడు.. కావాలంటే ఇది తీసుకొ అని చివరిగా తన ఒంటి మీద ఉన్న ముక్కు పుడక తీసి వాడికి ఇచ్చింది.. వాడి నాన్న అన్నాడు నువ్వు ఎందుకు పనికిరావని.. వాడి చెల్లి మాత్రమే చెప్పింది.. నిన్ను నువ్వు ఎప్పటికి వదులుకోవద్దని.. నీ స్వభావాన్ని మార్చకోవద్దని..
ముందుకు చాచిన చెయ్యిని అలానే పట్టుకుని గుప్పిట బిగించాడు వద్దని.. నా దెగ్గర చదువు లేనంత మాత్రాన మనసు లేదనుకోకు అక్కా.. పదా నేను దించుతాను అనగానే థాంక్స్ తమ్ముడు అని కళ్ళు తుడుచుకుని ఆటో ఎక్కుతుంటే అక్కడే ఉన్న సుమో డ్రైవర్ అది చూసాడు.
ఆటో నేరుగా ఎక్కడా ఆపకుండా వయసుకు మించిన దూకుడుతో కట్లు కొడుతూ ఆటోని కావేరి ఆశ్రమానికి చేర్చి గేట్ లోనుంచి లోపలికి పోనించి అక్కడ ఉన్న కారు ముందు ఆపాడు.
సాయంత్రాన చీకటి పడుతుండేసరికి శివ మీనాక్షిలు ఇద్దరు మాట్లాడుకుని ఇంటికి వెళదాం అని కారు ఎక్కుతుంటే అదే సమయానికి ఒక ఆటో వచ్చి అందులో నుంచి ఆ అమ్మాయి దిగి వేగంగా శివ వైపు నడిచింది.
ఆటో వాడు వెనకాల ఫాలో అవుతూ వచ్చిన సుమోలని చూసి బెదిరిపోయి ఆటో వేగంగా వెనక్కి తిప్పి పారిపోయాడు.
ఆ అమ్మాయి ముందుకు వస్తూనే శివా.. అంది
శివ : నేనే అన్నాడు ఆశ్చర్యంగా
పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుని ఏడ్చేసింది అన్నయ్యా.. అంటూ
శివ అయోమయంగా ఆ అమ్మాయి వైపు, వెనకున్న గూండాల వైపు మీనాక్షి వైపు చూసాడు.
అరణ్య : అమ్మా.. ఎట్టి పరిస్థితుల్లో అత్తయ్యని కాపాడమని చెప్పు
మీనాక్షి : శివా..
శివ : వినపడింది.. మీనాక్షి అమ్మాయిని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టు. అని పక్కనే శివ పోయిన నెల నాటిన కొబ్బరి చెట్టు మొక్కని పీకి వాళ్లకి అడ్డంగా నిలబడ్డాడు.