25-11-2022, 10:22 PM
(This post was last modified: 26-11-2022, 08:51 PM by Takulsajal. Edited 1 time in total. Edited 1 time in total.)
40
పొద్దున్నే తలుపు చప్పుడు కావడంతో మీనాక్షి లేచి కూర్చుంది, రాత్రి జరిగినవి ఏవేవో గుర్తుకొస్తున్నాయి.. సుశాంత్ లోపలికి వచ్చాడు.
మీనాక్షి : సుశాంత్ నన్ను పోనీ, టైం వేస్ట్ చేసుకోకు.. నీకు నేను దక్కడం ఇంపాసిబుల్.
సుశాంత్ : ఇవ్వాళ సాయంత్రం నీకు నాకు పెళ్లి, మధ్యాహ్నం డాక్టర్ వస్తున్నాడు నీ ప్రెగ్నెన్సీ కూడా తీసేస్తాడు. అప్పుడు ఆ తరువాత చూస్తావ్ నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో
మీనాక్షి : ఛీ..
సుశాంత్ నవ్వుతూ వెళ్ళిపోయాడు.
మీనాక్షికి వెంటనే రాత్రి జరిగిన సంభాషణ గుర్తొచ్చి కొంచెం అనుమానంగా తన పొట్ట మీద చెయ్యి వేసుకుని నిమిరి
మీనాక్షి : బుజ్జి
అమ్మా..
ఆ మాట వినగానే మరొక్కసారి ఆశ్చర్యపోయింది
మీనాక్షి : బుజ్జి.. ఎలా ఇదంతా నాకు ఏం అర్ధం కావడం లేదు
ఇప్పటికైనా నమ్ముతావా లేదా అని కసురుకున్నట్టు మాట్లాడేసరికి
మీనాక్షి : ఆమ్మో.. నమ్ముతాను నమ్ముతాను.. కోప్పడకు అని నవ్వుకుంది
కడుపు దెగ్గర వెచ్చగా అయ్యింది.. మీనాక్షి పొట్ట మీద చెయ్యి వేసుకుని బుజ్జి అంటూ కంగారు పడింది
అమ్మా కంగారు పడకు, నేను కూడా నవ్వుతున్నాను
మీనాక్షి : బుజ్జి ఏంటిదంతా, ఇది ఎలా..
అవన్నీ ఎందుకు.. సాధ్యం అయ్యిందిగా, నాకు నాన్నని చూడాలనుంది
మీనాక్షి : నువ్వు చూడగలవా
నీ కళ్ళున్నాయిగా.. నీ శరీరాన్ని నేను వాడుకోగలను
మీనాక్షికి ఒకింత ఆశ్చర్యం ఒకింత సంతోషం కొంత భయం కూడా పట్టుకుంది.
అమ్మా.. భయపడకు, ముందు ఇక్కడినుంచి వెళ్ళిపోదాం.. నీకు నాన్నని చూడాలని ఎంత ఆశగా ఉందొ నాకు తెలుస్తుంది.
మీనాక్షి : కానీ ఎలాగ బుజ్జి, మనల్ని బంధించేసారు
నువ్వు ముందుకు వెళ్ళు, అనుమాన పడకు నన్ను నమ్ము ఆ తలుపుని ముట్టుకొనవసరం కూడా లేదు. వెళ్ళు అనగానే మీనాక్షి ముందుకు నడిచింది, తలుపు దెగ్గర ఆగింది కాని తన కొడుకు మళ్ళీ వెళ్ళమనేసరికి అడుగు ముందుకు వేసింది. ఆశ్చర్యం.. తలుపు లోనుంచే బైటికి వచ్చేసింది.
మీనాక్షి : (సంతోషంగా) బుజ్జి ఎలాగా
పదా వెళదాం..
మీనాక్షి : అక్కడ చాలా మంది ఉన్నారు
వాళ్ళు నిన్ను ముట్టుకోలేరు, ధైర్యంగా ముందుకెళ్ళు. ఇన్ని రోజులు కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా ఇంకా బతికే ఉన్నావంటే నీకింకా అర్ధం కావట్లేదా
మీనాక్షి : అవును బుజ్జి నేనిది గమనించనేలేదు. సరే.. ఆ సుశాంత్ కూడా లేడు ఇదే మంచి టైం అని వేగంగా ముందుకు నడుస్తుంటే అక్కడే కాపలాగా ఉన్న వాళ్ళు మీనాక్షి దెగ్గరికి వచ్చారు
రేయి ఆవిడ బైటికి ఎలా వచ్చింది..
ఏమో ముందు ఆపండి, అన్న వచ్చాడంటే మనల్ని చీరేస్తాడు
అందరూ మీనాక్షిని పట్టుకోబోయరు కాని కనీసం మీనాక్షిని ముట్టుకోలేకపోయారు, మీనాక్షి మీద కనీసం చెయ్యి కూడా వెయ్యలేకపోయారు ఏదో శక్తి రెండు అడుగుల ముందే ఆపేసింది. మీనాక్షి అది చూసి తన పొట్ట మీద చెయ్యి వేసి బుజ్జి అంది.
నేను చెప్పాను కదమ్మా
మీనాక్షి : అవును బుజ్జి.. అక్కడ కారు ఉంది పదా వెళదాం అని అక్కడికెళ్లి చూస్తే తాళం దానికే ఉంది. వెంటనే స్టార్ట్ చేసి అక్కడనుంచి పోనించింది.
బైటికి రోడ్డు మీదకి వచ్చి ఎక్కడుందో తెలుసుకుని, నేరుగా శివ ఇంటికి వెళ్ళింది కాని ఇంటికి తాళం వేసి ఉండటంతో కంపెనీ దెగ్గరికి వెళ్ళింది అక్కడ ఫోన్ తీసుకుని వెంటనే కావేరికి ఫోన్ చేసింది.
కావేరి : హల్లో అంది నీరసంగా
మీనాక్షి : అత్తయ్యా
కావేరి : మీనాక్షి.. మీను..
మీనాక్షి : ఎక్కడున్నారు అత్తయ్యా
కావేరి : ఇక్కడే లైఫ్ కేర్ హాస్పటల్
మీనాక్షి : వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి కళ్ళు తుడుచుకుని హాస్పటల్ వైపు కారుని పరిగెత్తించింది.
హాస్పటల్లో ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న శివ పక్కన కూర్చుని, మాట్లాడుతుంది కావేరి.
కావేరి : శివుడు.. నీ మీనాక్షి ఫోన్ చేసింది.. వస్తుంది నాన్నా
సందీప్ : మీనాక్షి వస్తుందా
కావేరి : అవును ఇప్పుడే ఫోన్ చేసింది, వస్తున్నానంది.
పావుగంటలో మీనాక్షి కారుని హాస్పిటల్ ముందే వదిలేసి లోపలికి పరిగెత్తింది. రిసెప్షన్ లో కనుక్కుని మూడో ఫ్లోర్ ఎక్కి శివ ఉన్న రూం దెగ్గరికి వెళ్లి డోర్ దెగ్గరే శివని చూస్తూ ఏడుస్తూ ఉండిపోయింది.
కావేరి తల తిప్పి మీనాక్షిని చూసి లేచి వెళ్లి కౌగిలించుకొని ఏడ్చేసింది.
కావేరి : మీను.. ఎలా ఉన్నావ్.. ఏమైపొయ్యవ్ రా
మీనాక్షి : శివ..
కావేరి : అడుగో కోమాలో ఉన్నాడు అని వదిలేసారికి.. మీనాక్షి వెళ్లి శివని చూస్తూ మోకాళ్ళ మీద కూర్చుని శివ చెయ్యి అందుకుంది.
అమ్మా..
మీనాక్షి అటు ఇటు చూసింది, కంగారుగా
కంగారుపడకు నా మాటలు నీకు తప్ప ఇంకెవ్వరికి వినిపించవు. ముందు అందరినీ ఇక్కడ నుంచి పంపించేయ్యి.
మీనాక్షి : ఎందుకు
కావేరి : ఏంటి మీను..
మీనాక్షి : ఏం లేదు అత్తయ్య
ముందు పంపించేయ్యి.. నాన్నని లేపుదాం అనగానే శివ చేతిని పట్టుకున్న మీనాక్షి ఇంకొంచెం గట్టిగా పట్టుకుంది. ఆనందం వేసి
మీనాక్షి : సరే.. అని లేచింది
మీనాక్షి తన అత్తయ్య దెగ్గర కూర్చుని ఇన్ని రోజులుగా జరిగిందంతా వింటూ శివ ని చూస్తూ కూర్చుంది. ఇటు మీనాక్షికి కూడా అంతా అయోమయంగా ఉంది కడుపులో ఉన్న పిండం మాట్లాడడమేంటో ఎంత ఆలోచించినా పిచ్చి ఎక్కిపోతుంది కాని తన బిడ్డ వల్లే బయట పడి శివని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది, కాని బిడ్డ అలా ఉండటంతో చాలా భాయంగా ఉంది. చిన్నగా ఎవ్వరికి కనిపించకుండా పొట్ట మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరింది, అక్కడ వెచ్చగా అయ్యేసరికి తన బిడ్డ ఆనందంగా ఉన్నాడని గ్రహించి నవ్వుకుంది.. ఇదంతా గమనిస్తున్న కావేరికి మాత్రం ఏం అర్ధం కాలేదు.. ఇన్ని రోజులు శివకి దూరంగా ఉంది కదా ఇప్పుడు ఈ స్థితిలో వాడిని చూసి పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుందేమో అని తనకి తానే సర్ది చెప్పుకుని మీనాక్షి భుజం మీద చెయ్యి వేసింది. మీనాక్షి పొట్ట మీద చెయ్యి తీసేసి మాములుగా కూర్చుంది. కొంతసేపటికి సందీప్ లేచాడు
సందీప్ : అమ్మా రాత్రి కూడా ఏం తినలేదు, ముందు ఏమైనా తిందాం పదా
కావేరి : తిందాంలేరా
మీనాక్షి : అత్తయ్యా వెళ్ళండి, నేను వచ్చేసాను కదా.. మీరందరూ కూడా వెళ్ళండి. నాకు కొంత సేపు శివతో ఒంటరిగా గడపాలని ఉంది అని భరత్ చెల్లిని చూసింది.. అందరూ లేచి వెళ్లిపోయారు.
అందరూ వెళ్ళగానే మీనాక్షి లేచి డోర్ పెట్టేసి శివ దెగ్గరికి వచ్చి నిలుచుంది.
మీనాక్షి : బుజ్జి ఇప్పుడేం చేద్దాం, అని పొట్ట మీద చెయ్యి వేసింది
నాన్న తలని నాకు ఆనించు, అదే నీ పొట్ట మీద పెట్టుకొని పడుకోబెట్టుకో అనగానే, మీనాక్షి శివని పక్కకి జరిపి తన పక్కన పడుకుని చుడిధార్ పైకి లేపి శివని ఒళ్ళోకి తీసుకుని శివ తలని తన పొట్ట మీద ఆనించింది.
రెండు నిమిషాలకి మీనాక్షి కడుపు మొత్తం వెచ్చగా అవుతూ, ఏదో చిన్న వెలుతురు ఒకటి పొట్ట చీల్చుకుని వచ్చినట్టు అనిపించి మళ్ళీ మాములుగా అయ్యింది కాని మీనాక్షి పొట్ట ఎవరో కోసినట్టు పెద్ద గాటు ఒకటి ఏర్పడింది. శివ కళ్ళు తెరిచాడు.