23-11-2022, 10:40 PM
38
భరత్ : నాన్న తాగుబోతు.. తాగుడికి బానిస అయ్యి ఇంటిని పట్టించుకోకుండా మమ్మల్ని వదిలేసాడు అప్పులు పెరిగిపోయాయి ఉన్న ఒక్క ఇంటిని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుని అవి కూడా అవ్వగొట్టేసాడు, నేను చేతికిందకి రాకముందే అంతా అయిపోయింది, తెలుసుకోలేకపోయాను.. ముగ్గురు చెల్లెళ్ళతో చేతిలో ఉన్న డిగ్రీతో ఉద్యోగం వెతుక్కునే అవకాశం కూడా దొరకలేదు. ఇవన్నీ చూడలేక అమ్మ మంచాన పడింది. ఇప్పుడు మాకు వేరే దిక్కు కూడా లేదు. ఒక చిన్న రిక్వెస్ట్ నా చెల్లెళ్లని కొన్ని రోజులు మీ ఇంట్లో
శివ : చెల్లెళ్ళు నా ఇంట్లోనే ఉంటారు, నువ్వు కూడా.. ముందు ఇవి కాదు వాళ్ళకి కొంత ఉపశమనం కలగని ఆ తరువాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం.. ఇంతకీ వీడేడి.. అని ఫోన్ తీసి సందీప్ కి కాల్ చేశాను.
సందీప్ : హాల్లో
శివ : ఇవే తగ్గించుకుంటే మంచిది, ఎక్కడ చచ్చావ్ రా
సందీప్ : వస్తున్నా అయిపోయింది
శివ : ఎప్పుడు వస్తావ్.. నీకోసం వండిన అన్నం ఏం చేయమంటావ్
సందీప్ : పదే పది నిమిషాలు.
శివ : త్వరగా రా అని పెట్టేసాను
సందీప్ వచ్చి వాడు తినేసాక అంతా వివరించి భరత్ తో మాట్లాడించాను, మీనాక్షి వాళ్ళు బట్టలు తీసుకుని వచ్చారు, అమ్మ పోయింది కొత్త బట్టలు వేసుకోవడం ఇదంతా నాకు అంత మంచిగా అనిపించకపోయినా వాళ్ళని అలా చూడలేకపోయాను. అందరం తినేసి మీనాక్షి వెళ్ళిపోయాక పడుకున్నాం.
కావేరి : స్నానం చెయ్యకూడదు
శివ : రాగానే చేసాను, ఇప్పుడు ఓపిక లేదే..
కావేరి : ఆ అమ్మాయిల సంగతి ఏంటి, బాధలో ఉన్నారని నేను అంతగా ఏమి మాట్లాడలేదు వాళ్ళతో
శివ : మీనాక్షి చెప్పింది ఆ పెద్దమ్మాయి డిగ్రీ మధ్యలో ఆపేసిందని, మా ఏజ్ అని పేరు శ్రావణి, మధ్యలో అమ్మాయి ఇంటర్ ఇప్పుడు వెళ్లట్లేదట పేరు రవళి ఇక చిన్నదాని పేరు భాగ్య, ఐదో తరగతి.
అమ్మా నేను మాట్లాడుకుంటూ పడుకున్నాం.
తెల్లారి లేచి చూసేసరికి అన్నా చెల్లెళ్ళు కూర్చుని మాట్లాడుకుంటూ ఏడ్చుకుంటుంటే అమ్మ నేను వెళ్లి కూర్చుని ఓదార్చాము. కంపెనీకి వెలుతూ వస్తావా అని అడిగితే వస్తా అన్నాడు. భరత్ ని తీసుకుని ఆఫీస్ కి వెళ్లాను సందీప్ తో పాటు వెళ్లి మళ్ళి రాత్రికే వచ్చాడు. సందీప్ లా తోడు ఉండమన్నాను కానీ జాబ్ చేస్తా అన్నాడు ఓకే అన్నాను. భోజనాలు చేసాక మళ్ళి మాట్లాడుకున్నాం.
భరత్ : ఇక్కడ ప్లేస్ సరిపోవడం లేదు శివా నేను పైన పడుకుంటాను
శివ : కష్టం గాలి లేదు దోమలు.. ఒక పని చెయ్యి కొన్నిరోజులు ఇంతకముందు నా బెడ్ ఉండేది హాస్టల్లో సందీప్ పక్కది అక్కడికెళ్లి పడుకో ఈ లోపు ఏదో ఒకటి సెట్ చేద్దాం. అని సందీప్ తోపాటు పంపించి వెళ్లి అమ్మ పక్కన పడుకున్నాను
కావేరి : ఏంటంటా
శివ : ఏముంది మాములే, కొంచెం తల నొప్పిగా ఉందమ్మా
కావేరి : అస్సలు ఈ వారం రోజులుగా ఎప్పుడు ఏదో ఒకటి, ఆ పని ఈ పని అని తిరుగుతూనే ఉన్నావ్. కళ్ళు మూసుకుని ఏం ఆలోచించకుండా పడుకో అని మీద చెయ్యి వేసి తల నిమిరేసరికి నిద్రలోకి జారుకున్నాను.
తెల్లారి లేచినా అమ్మ ఒప్పుకోలేదు ఇవ్వాల్టి నుంచి వారం వరకు ఇంట్లో నుంచి బైటికి కదలకుండా కట్టేసింది. ఫోన్ చేసి చెప్పేసరికి మీనాక్షి కూడా వచ్చి కూర్చుంది.
మధ్యాహ్నం అమ్మ అందరికి భోజనం వడ్డిస్తూ మీనాక్షిని చూసింది
కావేరి : ఎంతసేపయ్యింది వచ్చి
మీనాక్షి : ఇప్పుడే.. కానీ థాంక్స్ చెప్పాలి నీకు.. నీ వల్ల మాకు వారం రోజులు రెస్ట్ దొరికింది అదే చేత్తో ఇంకో హెల్ప్ అత్తయ్య
కావేరి : ఏంటో అది
మీనాక్షి : మీరు కూడా అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళ్ళొస్తే...
శివకి పొరబోయింది, కావేరి వెంటనే తల మీద తడుతూ మంచినీళ్లు అందించి మీనాక్షిని చూసింది నవ్వుతూ
కావేరి : ఏంటి భయపెట్టేస్తావా పిల్లోడిని
మీనాక్షి : పిల్లోడు
కావేరి : అవును పిల్లోడు
మీనాక్షి : అవును పిల్లోడు.. ఏం పిల్లడా
కావేరి : నీకూ అన్నం పెట్టుకొస్తున్నా
మీనాక్షి : నేను తినే వచ్చా సరే ఒక ముద్ద పెట్టు టేస్ట్ చూద్దాం అని కావేరి చేత ఒక ముద్ద పెట్టించుకుని తినింది.
అందరూ బైట ముచ్చట్లు పెట్టుకుంటుంటే భరత్ పెద్ద చెల్లలు వచ్చింది.
శివ : చెప్పండి
శ్రావణి : చాలా థాంక్స్ అండి..
శివ : హహ
శ్రావణి : సారీ వచ్చినప్పటి నుంచి చెపుదామనుకున్నాను కాని మిమ్మల్ని కలిసే అవకాశం రాలేదు
శివ : పర్లేదండి.. మీరు కూడా కాలేజీ ఆపేసారని విన్నాను మళ్ళీ మొదలు పెట్టండి, వాళ్ళని కూడా కాలేజ్లో జాయిన్ చేద్దాం.
శ్రావణి : అదే మీతో మాట్లాడాలని వచ్చాను, మా అన్నకి జాబ్ ఇప్పించారు నాకు కూడా ఏదైనా చూస్తారని
శివ : ముందు కూర్చోండి.. ఇలా చుడండి.. మీ అన్నకి సాయంగా ఉండాలనుకుంటున్నారు నాకు అర్ధమవుతుంది. కానీ డిగ్రీ లేకుండా ఏం చేస్తారు చెప్పండి, ముందు డిగ్రీ పూర్తి చెయ్యండి ఆ తరువాత మన కంపెనీ లోనే జాబ్ చెయ్యండి అప్పటి వరకు ఈ భారం మీ అన్ననే మొయ్యనివ్వండి.. మీ అన్నయ్య మిమ్మల్ని చూసుకోగలరు. ఇల్లు జప్తులో పోవడం వల్ల ఇప్పుడు కట్టుకోవాల్సినవి ఏమి లేవు తను ఒక్కడే మిమ్మల్ని పోషించగలడు సాయానికి నేనెలాగో ఉన్నాను చదువుని మాత్రం వదలద్దు. తిరిగి మీ జీవితాలని మొదలు పెట్టండి.. ఈ సారి మీరు ఒంటరి వాళ్ళు మాత్రం కాదు కూడా ఇంత మంది ఉన్నారు.
శ్రావణి : అలాగే.. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి థాంక్ యు వెరీ మచ్.
శివ : ఇక వెళ్ళండి.. బి హ్యాపీ.. మీ అమ్మగారు పోతూ పోతూ మీ కష్టాలని కూడా తనతో పాటు తీసుకెళ్లిందని అనుకోండి.. అంతా మంచే జరుగుతుంది.. మంచికే జరుగుతుంది. అని ఏదో నచ్చచెప్పాను.
వారం రోజులు ఇంట్లోనే రెస్ట్ పేరుతో నేను మీనాక్షి అమ్మ.. ముగ్గురం తెగ ఎంజాయ్ చేసాం.. భరత్ వాళ్ళు మా ఇంట్లో మూడు నెలలు ఉండి ఆ తరువాత కొత్త ఇంట్లోకి మారి వాళ్ళ జీవితాలు మొదలు పెట్టారు. భరత్ బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, తన ముగ్గురు చెల్లెళ్ళు వాళ్ళ చదువులు కొనసాగిస్తున్నారు. అంతా సాఫీగా సాగుతుంది.
మధ్యలో ముస్కాన్ పెళ్లి గోల ఎక్కువైంది, ఇష్టంలేకపోయినా నా చెల్లిని ఆ లతీఫ్ గాడికి ఇచ్చి చెయ్యడం నాకు ఇష్టం లేక వెళ్లి మాట్లాడాను, అందరితో కాదు చాచాతో మాత్రమే, ఆయన కూడా ఒప్పుకున్నాడు వాళ్ళు గొడవ చేసినా పట్టించుకోలేదు.
ఒక శుభముహుర్తానా ముస్కాన్ చేతుల మీదగా హోటల్ తెరిచాము, హోటల్ బాధ్యత మొత్తం ముస్కానే తీసుకుంది, నేను చేసిన సాయం చాలా తక్కువ.
ఇక అనుకున్నట్టే మీనాక్షి తన తమ్ముణ్ణి హాస్టల్లో వేసింది. చందు కూడా బుద్ధిగా చదువుకుంటున్నాడు సివిల్ ఇంజనీరింగ్ చేస్తానని చెప్పి వెళ్ళాడు.. అలా రెండేళ్లు గాడిచాయి.. నేను, మీనాక్షి, ముస్కాన్, సందీప్, శ్రావణి ఒక గ్రూప్ అయిపోయాం.. మా డిగ్రీ అయిపోయింది, మీనాక్షి తమ్ముడు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం జాయిన్ అయ్యాడు.
ఈ రెండేళ్లలో నేను చదువు మీద కంటే బిజినెస్ మీదె ఎక్కువ దృష్టి పెట్టాను, చాలా పరిచయాలు అయ్యాయి.. నా కంటూ ఒక సొంత వ్యాపారం చెయ్యాలని కొంత వెనకేసాను..అమ్మ కోసం కట్టిస్తున్న ఇల్లు కూడా దెగ్గర పడింది, కొంచెం పెయింట్ వర్క్ ఉందంతే.
ఈ రెండేళ్లలో మీనాక్షి తన ఫ్యామిలీని దూరం చెయ్యడానికి చాలా ప్రయత్నించింది, కాని ఎంత చెప్పినా వాళ్ళ అమ్మ వినలేదు. మీనాక్షి కూడా విసిగిపోయింది. కాని ఈ రెండేళ్లలో మీనాక్షి నేను విడతీయలేనంతగా దెగ్గరైపోయాం. మీనాక్షి బావ కోలుకుని ఎలా మీనాక్షి కంపెనీని ఎలా నాశనం చెయ్యాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు.. వాడింకా మారలేదు అయినా ఇప్పుడు మీనాక్షి కంపెనీకి ఇబ్బందులు తీసుకురావడం అంత ఈజీ కాదు. లాభాలు లేకపోయినా కంపెనీ క్వాలిటీ అండ్ సెక్యూరిటీ చాలా పెంచాను చాలా కొత్త పద్ధతులు అమలుచేసాను అదే సందీప్ సాయంతో, నేను వేసే ప్రతీ అడుగులోనూ నాకు తోడు ఉన్నాడు.
ఒక రోజు అమ్మా నేను బైటికి వెళుతుంటే రోడ్ మధ్యలో పది మంది అడ్డంగా నిలుచున్నారు, ఐదు నిమిషాల వరకు ఆపకుండా కారు మీద రాళ్ళ వర్షం కురిపించారు. అమ్మ మీద ఒక్క రాయి కూడా పడనివ్వలేదు.
ఆ పది మంది వెనకే ఎవరో ఉన్నారు కొంచెం దీర్గంగా చూస్తే అప్పుడు అర్ధం అయ్యింది, ఎవరో కాదు సుశాంత్. అమ్మని కారులో కూర్చోబెట్టి కారు దిగి బైటికి వచ్చాను. ప్రతీ వాడి చేతిలో రాడ్ ఉంది.
సుశాంత్ : నన్ను కొట్టి ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నావు, నా బాకీ నేను తీర్చుకోవాలి కదా
శివ : ఓహ్.. తెలిసిపోయిందా, ఇప్పుడేంటి
సుశాంత్ : నాకు ఎప్పుడో తెలుసు, కాని ఈ రోజు కోసమే ఆగాను
శివ : ఈ రోజు నీ బర్త్ డే నా
సుశాంత్ : జోక్ బాగుంది, ఇన్ని రోజులు నన్ను కొట్టింది నువ్వే అని నాకు తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నానో అడగవా
శివ : అడక్కపోయినా చెపుతావ్ కదా, సరే చెప్పు
సుశాంత్ : నీకు పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుందిలే, ఇది విను చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్.
ఫస్ట్ దెబ్బ నీ లవ్ మీద కొట్టా, ఇంట్లో చెప్పాను అక్కడ మీనాక్షిని లాక్ చేసారు పాపం నీకోసం తెగ ఏడుస్తుంది.
సెకండ్ ఏంటో తెలుసా మీ లవ్ విషయం నాకు తెలిసి ఇంట్లో చెపుతానని నువ్వు నన్ను కావాలని కొట్టి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసావని చిన్న అబద్ధం ఆడాను, మా వాళ్ళు నీ అంతు చూడమని నాకు ఆఫీషియల్ గా చెప్పారు.
మూడో దెబ్బ ఇంకేం లేదు, వీళ్ళు కొడతారు.. హా ఇంకోటి ఇవ్వాళ నాకు మీనాక్షికి ఎంగేజ్మెంట్.. అవును ఇవ్వాళ నా బర్త్ డేనే అందుకే ఇన్ని రోజులు ఆగి మా నాయనమ్మ దెగ్గర ఇవ్వాళే వరం కోరాను, ఎంగేజ్మెంట్ ఇవ్వాళే జరిగిపోవాలని.. ఇచ్చేసింది.. రేయి కానివ్వండ్రా అని సైగ చెయ్యగానే పది మంది మీదకి వచ్చేసరికి నేనే ఎదురు వెళ్లి ముందు ఒకడిని కొట్టి వాడి చేతిలో ఉన్న రాడ్ తీసుకుని కొడుతుంటే దెబ్బలు వాళ్ళకి నాకు ఇరువైపులా తగులుతున్నాయి ఎవడు దెబ్బలని ఓర్చుకుంటే వాళ్ళే నిలబడతారు కొట్టుకుంటుంటే ఒక అరుపు వినిపించింది అమ్మది.
అమ్మ కారులో నుంచే అరుస్తుంది, అటు చెయ్యి చూపించగానే తల అటు తిప్పాను. సుశాంత్ చేతిలో గన్ ఉంది, అది నాకే గురి పెట్టి ఉంది. కాల్చేశాడు.. బుల్లెట్ నేరుగా గుండె కింద దిగింది మళ్ళీ కాల్చాడు పక్కకి జరిగాను ఎడమ భుజానికి తగిలింది ఇంకో బుల్లెట్.
వెంటనే వాడి వైపు పరిగెత్తుతూనే, నా కుడి చేతిలో ఉన్న రాడ్ వాడి మీదకి విసిరాను, అది వాడి చేతికి తగిలి వాడి చేతిలో ఉన్న గన్ కింద పడడం. వెంటనే అది తీసుకుని రెండు బుల్లెట్లు సుశాంత్ వైపు పెట్టి టపాసులు కాల్చినట్టు కాల్చేశాను కాని అవి వాడికి తగల్లేదు, నేను స్పృహ కోల్పోతూ ఏటో గురి పెట్టానని అప్పుడు అర్ధమయ్యింది. వాడు భయపడుతూ పారిపోవడం చూస్తూ కళ్ళు మూసుకున్నాను.