20-11-2022, 05:58 PM
(This post was last modified: 20-11-2022, 06:00 PM by Pallaki. Edited 2 times in total. Edited 2 times in total.)
శివపురం,
నందిగామ.
సుమారు రాత్రి పదకొండు గంటల సమయం, ఊరు మొత్తానికి కరెంటు పోయింది, ఈదురు గాలులు, ఏదో తుఫాను వచ్చిందేమో అన్నట్టు తలపిస్తుంది అక్కడి వాతావరణం.. సాయంత్రం ఆరింటికి మొదలైన వాన జోరుగా ఏమాత్రం తగ్గకుండా కురుస్తూనే ఉంది. ఇంటి నుంచి అడుగు బైట పెడితే మళ్ళీ ఇంట్లోకి వస్తామన్న గారంటీ లేదు. నేల మొత్తం బురదగా అయిపోయింది.
ఊరి చివర ఆ ఊరికి తగ్గట్టే చిన్న రైల్వే స్టేషన్, చుట్టూ పొలాలు.. స్టేషన్ కిందే గోడకి ఆనుకుని ఉన్న ఒక చిన్న ఇల్లు, నాలుగు గోడలు, ఒక తలుపు, తాటాకులతొ కప్పిన చిన్న పైకప్పు.
ఆ చిన్ని ఇంట్లో కిరోసిన్ బుడ్డి వెలిగించి కొక్కానికి తగిలించింది అనసూయ, పక్కనే గచ్చు మీద పడుకుని కాలు మీద కాలు వేసుకుని వర్షాన్ని అమ్మనా బూతులు తిడుతూ విసిన కర్రతో విసురుకుంటున్నాడు భైరవ.
అనసూయ భైరవల పెళ్ళై ఈ నాటికి నెల కావొస్తుంది ఇద్దరిది ప్రేమ పెళ్లి కావడంతో సంతోషంగా ఉన్నారు. పెళ్ళికి గిఫ్ట్ గా వచ్చిన రెండు కోట్ల డబ్బుతొ పొలం కొనుక్కుని ఇప్పుడు తను ఉండే ఆ చిన్న ఇంటి పక్కనే పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాడు.
ఇల్లంతా సర్ది వచ్చి మొగుడి పక్కన కూర్చుని భైరవ మోకాలి మీద తన గడ్డం పెట్టుకుని కాలు ఊపుతూ తన మొగుడిని చూస్తూ వాడి చేతిలో ఉన్న విసినకర్ర తీసుకుని ఊపుతూ కూర్చుంది.
అనసూయ : బావా, నేనొకటి అడుగుతాను చెప్తావా?
భైరవ : చెప్పవే.
అనసూయ : ఉన్న పళంగా నీకు ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి, పొలం కొన్నావ్ ఇల్లు కట్టిస్తున్నావ్, కారు కూడా కొంటానన్నావ్ కానీ ఇవన్నీ ఈ మారుమూల ప్రాంతంలో ఎందుకు చేస్తున్నావ్. సిటీలో కూడా కట్టుకోవచ్చు కదా.. నువ్వేదైనా తప్పు చేసావా?
పడుకుని ఉన్న భైరవ లేచి.. నీయమ్మ మీ ఆడోళ్ళకి అన్నీ కావాలే.. నేనే తప్పు చెయ్యలేదు ప్రతీ కుక్కకి ఒక రోజు వస్తుంది అలానే నాకూ వచ్చింది అంతే.
అనసూయ : కానీ ఇంత చిన్న వయసులో.. ఎలా
భైరవ : నీయమ్మ మూసుకుని పడుకోకపోతే చంపుతా.. డబ్బులు లేనప్పుడూ ప్రశాంతత లేదు ఇప్పుడు ఉన్నా లేదు, నా ఖర్మ అనుకుంటూ లేచి తలుపు తీసి వర్షంలో బైటికి వెళ్లి చెప్పులు అతుక్కుని నడవటం వల్ల విసుగుపుట్టి అక్కడే విప్పేసి వెళ్లి చెట్టు కింద నిల్చున్నాడు.
బురదలో నడవడం వల్ల కాళ్ళకి బురద అంటుకుని ఉంది, చెట్టు కింద నిల్చుని చెట్టుకి అంటుకున్న బురద రాస్తూ జేబులో నుంచి సిగరెట్ తీసాడు.
ఒక్కసారే సడన్ గా వర్షం గాలి రెండు ఆగిపోయాయి, కొంత ఆశ్చర్యంగానే చుట్టూ చూసాడు చుట్టు పక్కల చాలా చెట్లు ఉన్నాయి కానీ ఒక్క ఆకు కూడా కదలట్లేదు. ఏంటో ఈ వింతలు అనుకుంటూ లైటర్ వెలిగించాడు వెలగ గానే ఆగిపోయింది మళ్ళీ వెలిగించాడు ఆగిపోయింది ఎన్ని సార్లు వెలిగిస్తే అన్నీ సార్లు ఆగిపోయింది.
చివరిసరిగా ప్రయత్నిస్తూ బూతులు తిడుతూ గట్టిగా నొక్కాడు ఒక్కసారి పెద్ద మంట ఏదో బాంబు పేలినట్టు వచ్చింది అందులో ఒక మోహము అమ్మాయిది తనకి బాగా తెలిసిన మోహము కొన్ని సంవత్సరాలుగా ఆ మొహం గల అమ్మాయి దెగ్గర డ్రైవర్ గా పని చేసాడు ఎంతో నమ్మకంగా.. అందుకే చూసింది నిజమా కాదా అన్నట్టు ఆలోచిస్తుండగానే మళ్ళీ లైటర్ నొక్కాడు ఈ సారి ఇంకా క్లియర్ గా పెద్ద మంటల్లో తననే చూస్తూ నవ్వుతూ కనిపించింది. అమ్మగారు అంటూ రెండడుగులు వెనక్కి వేసి వెనక ఉన్న చెట్టుని గుద్దుకుని ఆగిపోయాడు.
సడన్ గా వర్షం మొదలయింది కానీ భైరవ ఉన్న ఆ చెట్టు కింద మాత్రం వర్షం పడట్లేదు.. గట్టిగా ఒక నవ్వు దాని వెంటే ఒక మూగ రోధన వినిపించేసరికి భైరవ ఒళ్ళంతా చెమటలు పట్టి తన శరీరం చల్లగా అయిపోయింది.
"భైరవా...." అని నవ్వుతూ ఒక గొంతు వినపడింది.. తల పక్కకి తిప్పి చూసాడు.. వాడి పక్కనే నిల్చుని ఉంది ఒక నల్లటి పొగ లాంటి శరీరం దానికి తల, తల మీద పెద్ద జుట్టుతొ భైరవని చూస్తూ గట్టిగా పిచ్చి పిచ్చిగా నవ్వుతూ అదే క్షణంలో హృదయవికారకంగా రోధించడం మొదలు పెట్టింది.
ఆ ఆకారం ఆ నవ్వులు గట్టిగా ఏడుపులు ఆ భీకరమైన గొంతు ఇవన్నీ చూడగానే భైరవ ఉచ్చ పొసేసాడు.. ఆ భయంకరమైన రూపాన్ని చూస్తూ చెట్టుకి ఆనుకునే చిన్నగా కింద కూర్చుండిపోయాడు.. ఒక్కసారిగా ఆ భయానక రూపం భైరవ మొహంలోకి వాడి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసింది.
"నీకు నా మీద మోజు కదా.. అందుకే నీకోసమే వచ్చాను భైరవ రా.." అని అమాయకంగా పిలుస్తూ వాడి పెదాలు అందుకుని అందినంత వరకు కొరికేసింది.. భైరవ మొహం అంతా రక్తం.. ఆ రూపంకి అప్పటికప్పుడు చెయ్యి ఎలా వచ్చిందో తెలీదు కానీ.. తన చెయ్యి భైరవ కడుపులోకి దూర్చి అరచేయికి గుండె దొరికేంత వరకు లోపలికి దూర్చి గుండె చేతి చుట్టు చెయ్యి వేసి గాల్లోకి ఎగిరింది భైరవతొ పాటు.
ఆకాశంలోకి ఎగిరి భైరవని చూస్తూ "ఏంట్రా ఇంకా చావలేదని చూస్తున్నావా నీ చావు నీ చేతుల్లో లేదు నా చేతిలో ఉంది.. ఇప్పుడు చావు... విశ్వాసం లేని కుక్క" అంటూ గుండెని పట్టుకుని గట్టిగా పిసికింది. ఆ రూపానికి తెలియంది ఏంటంటే అప్పటికే భైరవ చచ్చి చాలా సేపైయింది.
పిచ్చి పిచ్చిగా నవ్వుతూ భైరవ చేతులు కాళ్ళు విరిచి పక్కకి విసిరేస్తూ రక్తం తన మీద పోసుకుని ఏదో స్నానం చేస్తున్నట్టు తల రుద్దుకుని బాడీని పీసులు పీసులుగా విసిరేసింది.. తలని గట్టిగా పీకి శరీరం నుంచి వేరు చేసి బాడీని కింద పడేసి తలని ఫుట్ బాల్ తన్నిన్నట్టు తన్నింది గాల్లోకి.
కొంత సేపు ఇష్టం వచ్చినట్టు డాన్స్ ఆడుతూ రాక్షసానందం పొంది చిన్నగా ఏడవడం మొదలు పెట్టింది, గట్టిగా రోదిస్తూ మూలుగుతూ కోపంగా ఏడుపు ఆపేసి "ఎవ్వడినీ వదిలిపెట్టను పోతారు అందరూ పోతారు.." అని అరుస్తూ అక్కడ నుంచి మాయం అయిపోయింది.
అప్పటివరకు కురుస్తున్న కుండపోత వర్షం ఆగిపోయింది, ఈదురు గాలులు ఆగిపోయాయి.. మళ్ళీ శివపురం మాములుగా ఐయ్యింది.