12-04-2023, 10:22 AM
పిల్లలూ - బుజ్జితల్లీ బుజ్జినాన్నా ...... జాగ్రత్తగా లేకపోతే తగిలించుకుంటారు , చిన్న చిన్న రాళ్లను కర్రలను తీసేయ్యండి .
అలాగే మహారాజా - నాన్నా ...... , దేవుడే మాతోడుగా ఉన్నారుకదా మాకేంటి భయం .
అమ్మలు - చెల్లెళ్లకు ...... సులభమైన పనులను అప్పజెప్పాను . మహారాణీవాళ్ళు అందరిలో కలిసిపోయి సంతోషంగా శ్రమిస్తుండటం చూసి ఆనందించాను , మిత్రులారా ...... మీ మహారాణీ గారి ప్రక్కనే ఉండండి అంటూ చిరుకోపంతో పెద్ద పెద్ద గుళ్లను తాళ్లతో ప్రక్కకు లాగేస్తున్నాను .
మహారాజా - అన్నయ్యా ...... జాగ్రత్త .
అలాగే చెల్లీ ....... , కంగారుపడకండి ఊహతెలిసినప్పటినుండీ శ్రమను ఇష్టంగా చేస్తూ పెరిగాను .
యువరాణి : నాతోపాటు మహారాణీగారు కూడా ఆందోళన చెంది జాగ్రత్త అన్నారు - కేవలం నాకు మాత్రమే బదులిస్తే ఎలా .......
వినబడటం లేదు చెల్లీ ...... చాలాపని ఉంది అంటూ తలదించుకుని ముందుకువెళ్ళాను .
మహారాణీ వాళ్ళు నవ్వుకున్నారు .
సమయం వేగంగా గడిచిపోయింది - బామ్మలు అందిస్తున్న నీటితో కొద్దికొద్దిగా దాహార్తిని తీర్చుకుని మధ్యాహ్నం వరకూ నిరంతరాయంగా శ్రమించాము .
మహారాజుగారూ ...... భోజనం సిద్ధం మిట్ట మధ్యాహ్నం అవుతోంది .
అవునవును పిల్లలకు ఆకలివేస్తూ ఉంటుంది అంటూ పనులను ఆపించి విశ్రాంతి తీసుకున్నాము .
ప్రభూ అంటూ అందించారు .
బామ్మలూ ...... ముందు పిల్లలు - ఆడవాళ్లు - మిత్రులు .
మా దేవుడు సామీ అంటూ అందరికీ అందించారు - బామ్మలు అందించిన గంజిని ఇష్టంగా సేవిస్తున్న మహారాణీవాళ్లను చూసి మళ్లీ ఆశ్చర్యపోయాను .
నాన్నా నాన్నా .......
బుజ్జాయిలను ఒడిలో కూర్చోబెట్టుకుని , పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని ధైర్యాన్ని పెంచే యదార్థ గాథలను వినిపిస్తూ గంజిని సేవించాము .
ఆకలితీర్చుకున్న తరువాత మరింత హుషారుగా శ్రమించారు .
సంతోషిస్తూ రెండు కొండల మధ్యన ఉన్న పెద్ద గుండుకు తాళ్లను - ఊడలను కట్టి లాగేయొచ్చులే అంటూ ఎంత లాగినా కదలడం లేదు , నన్ను చూసి బుజ్జాయిలు - మిత్రుడు మరియు అడవిరాజు - రాణి నోళ్ళతో పట్టుకుని లాగినా ప్రయోజనం లేకపోయింది , ప్రభూ ..... మేమున్నాం కదా అంటూ మాహారాణి ఆ వెనుక చెల్లి రాణులు అటుపై ఆడవాళ్ళంతా జతకలిసినా ఫలితం సూన్యం .......
అందరమూ హోయ్ సా హొయ్ సా అంటూ చెమటలు చిందిస్తున్నాము - గుండు శతాబ్దాలుగా భూమిలో పాతుకుపోయినట్లు కదలను కూడా కదలడం లేదు .......
నాన్నా నాన్నా ...... ఒక్క గుండునే కదిలించలేకపోతున్నాము ఎలా ? అంటూ బాధపడుతున్నారు బుజ్జాయిలు .
ఆత్మవిశ్వాసం ఉంటే ఏమైనా చెయ్యొచ్చు బుజ్జాయిలూ - పిల్లలూ ..... జై భజరంగభళీ ........
అందరూ ఒకేసారి జై భజరంగభళీ జై భజరంగభళీ అంటూ నినదిస్తూ లాగుతున్నారు .
అంతలో అనూహ్య సంఘటన ....... , అడవిరాజు - రాణి ..... గుండు దగ్గరకువెళ్లి ఒకేసారి గర్జించారు .
ఆశ్చర్యం నలువైపుల నుండీ అడవి జంతువుల అరుపులు ....... , మాచుట్టూ చేరుకుని మా శ్రమను చూసి అడవిరాజువైపుకు చూస్తున్నాయి .
జీవితాంతం మన దాహం తీర్చే ప్రయత్నం అన్నట్లు అడవిరాజు ..... జంతువులన్నింటికీ అర్థమయ్యేలా సైగలు చేసినట్లు , మరు క్షణంలో సంతోషపు అరుపులతో ఊడలను నోళ్ళతో అందుకున్నాయి , నాలుగు పెద్ద ఏనుగులు గుండు వెనుకకు వెళ్లి తోస్తున్నాయి .
గుండు కదులగానే భలేభలే అంటూ బుజ్జాయిలిద్దరూ చప్పట్లుకొడుతున్నారు , అప్పటివరకూ క్రూర - సాధు జంతువులను చూసి భయపడుతున్న పిల్లలు - ఆడవాళ్లు చిరునవ్వులు చిందిస్తూ తాళ్లను లాగారు .
పైకి ఎంత ఉందో భూమిలోపల అంతకు రెండింతలు ఉన్నట్లు పైకిలేచింది .
ప్రక్కకు తప్పుకోండి అంటూ అడవిరాజు ...... మంజరి ద్వారా తెలియజెయ్యడంతో అందరమూ ఒకప్రక్కకు చేరాము , ఏనుగులు తోసుకుంటూ వెళ్లి ఇబ్బంది లేనిచోటకు చేర్చారు .
అందరూ సంతోషంతో చప్పట్లుకొడుతూ కేకలువెయ్యసాగారు .
ఇక అక్కడ నుండి జంతువులు కూడా జతకలవడంతో చకచకా శుభ్రం చెయ్యసాగాము .
సాయంత్రానికి రాజ్యం చుట్టూ దున్నడం పూర్తయినట్లు మగవాళ్ళు కూడా తోడయ్యారు , సంపద తీసుకుని వెళ్లినవారు బండ్లలో సున్నపురాయిని - బంకమట్టిని తీసుకొస్తున్నారు . చీకటి పడేంతవరకూ విశ్రమించకుండా శ్రమించాము , అమ్మలూ ..... ఈరోజుకు ఇక్కడితో ఆపుదాము మీ మీ ఇళ్లకు వెళ్లి విశ్రాంతి తీసుకోండి .
మహారాజా మహారాజా ...... తెల్లవారగానే వచ్చేస్తాము , ఈరోజులానే బోలెడన్ని కథలు చెప్పాలి .
సంతోషంగా పంపించాను , అడవిరాజా ...... రాజ్యపు ఉద్యానవనపు కొలనులలో నీరు ఉంటాయి జంతువులన్నీ ఎప్పుడైనా వచ్చి దాహార్తిని తీర్చుకోవచ్చు .
అడవిరాజు అలాగే చెప్పడంతో ముందుగా రాజ్యం లోపలికే వెళ్లి దాహార్తిని తీర్చుకుని అడవులలోకి వెళ్లిపోయాయి .
అడవిరాజా - రాణీ ...... మీ గౌరవనీయురాలైన మహారాణీ - రాణులు - యువరాణిని జాగ్రత్తగా రాజమందిరాలకు చేర్చండి , బుజ్జాయిలను కూడా అంటూ సింహాలపై కూర్చోబెట్టాను .
మాహారాణి : మరి మీరు ప్రభూ .......
ఈ ఆనకట్ట పూర్తయ్యేంతవరకూ నిద్రాహారాలు లేకుండా నా మిత్రుడితోపాటు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను - నిర్మాణానికి ముందు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే తెగిపోతుంది అప్పుడు రాజ్యానికి మరింత అపాయం .
కాబట్టి రాత్రులు ఇక్కడే ఉండి మార్పులు చేర్పులు చేసుకోవాలి .
అయితే మేముకూడా నాన్నతోపాటే అంటూ సింహాల నుండి కిందకుదిగి నా పాదాలను చుట్టేశారు .
యువరాణి : అన్నయ్యా ఇక్కడ చీకటిలోనా ? .
నాకు అలవాటేలే చెల్లీ ....... , ప్రకృతి ఒడిలోనే పుట్టి పెరిగాను .
మాహారాణి : ప్రభూ ...... మేముకూడా మీతోపాటే ఉంటాము .
అవును ఇక్కడే ఉంటాము అంటూ చెల్లి - రాణులు కూడా అన్నారు .
లేదు లేదు ఈ ఒక్కదానికి మాత్రం నేను ఒప్పుకోనే ఒప్పుకోను - దయచేసి నన్ను ఒప్పించడానికి ప్రయత్నించకండి - మిమ్మల్నే కాదు మీ స్థానంలో నా ప్రాణమైన నా దేవకన్య ఉన్నా ఒప్పించి పంపించేదానిని - చెల్లీ ...... తెల్లవారగానే వచ్చేయ్యొచ్చు రాత్రిళ్ళు ప్రమాదకరం మరియు అనువుగా ఉండదు , మహారాజుగా ఆజ్ఞాపిస్తున్నాను అడవిరాజా - మంజరీ ..... పిలుచుకునివెళ్లండి .
బుజ్జాయిలు : మేము మాత్రం వెల్లమంటే వెళ్ళము నాన్నా - నాన్నా ...... ఏడుస్తూ నాపాదాలను వదలకుండా పట్టేసుకున్నారు .
మహారాణీ ........
మాహారాణి : వాళ్ళను గనుక మాతోపాటు పంపిస్తే రాత్రంతా యుద్ధమే ........
నిజం చెబుతున్నాను బుజ్జాయిలూ ...... మిమ్మల్ని వదిలి ఉండలేననే అనిపించింది అంటూ గుండెలపైకి ఎత్తుకుని ముద్దుచేసాను .
బుజ్జాయిలు : కన్నీళ్లను తుడుచుకుని చిరునవ్వులు చిందిస్తున్నారు , బుజ్జిసింహాలూ ....... రాత్రిళ్ళు మీకు ఆకలి వేస్తుందేమో మీ అమ్మ వెంట వెళ్ళండి .
ఊహూ ఊహూ ...... అన్నట్లు నా పాదాల చుట్టూనే తిరుగుతున్నారు .
అడవిరాజు ...... మంజరి ఎక్కడ ఉంది అంటూ పైకి చూస్తున్నాడు .
మంజరి : ఇక్కడే ఉన్నాను అడవిరాజా ...... , ఏమిటీ ఇక్కడ కూడా యుద్ధమేనా ? , ప్రభూ ...... తీసుకెళితే భీకరమైన యుద్ధమేనట - సంతృప్తిగా పాలు త్రాగాయట ఉదయం వరకూ కంగారుపడాల్సిన అవసరం లేదట .......
అందరితోపాటు బుజ్జాయిలు నవ్వుకుని కిందకుదిగి , మాతోనే ఉంటారన్నమాట మేమంటే ప్రాణం అంటూ బుజ్జిసింహాలను ఎత్తుకుని ఎత్తుకోండి నాన్న నాన్నా అంటూ చేతులను చాపడంతో ఎత్తుకున్నాను .
మాహారాణి : ప్రభూ ...... ఎక్కడ నిద్రపోతారు అంటూ ఆందోళన చెందుతున్నట్లు అడిగారు .
బుజ్జాయిలను ......
మాహారాణి : మా ప్రభువుల గురించి మాకు తెలియదా ? .
యువరాణి : వదినమ్మా ...... ఆసంగతి నాకు వదిలెయ్యండి , భటులారా ...... అక్కడ అక్కడ గట్టుపై పడుకోవడానికి అనువుగా ఉన్నటువంటి సమతలపు రాతిపై పూరిగుడిసెను నిర్మించండి .
ఆజ్ఞ యువరాణీ అంటూ చూస్తుండగానే కర్రలు - ఎండిపోయిన ఆకులతో చక్కనైన గుడిసెను నిర్మించి లోపల కాగడాను వెలిగించి దూరంగా నిలుచున్నారు .
బుజ్జాయిలు : అత్తయ్యా భలేభలే ......
మాహారాణి : చెల్లిని ప్రేమతో కౌగిలించుకుని నుదుటిపై ముద్దుపెట్టింది .
చెల్లీ ...... పూర్తి చీకటిపడేలోపు రాజభవనం చేరుకోవాలి బయలుదేరండి .
మాహారాణి : ప్రభూ జాగ్రత్త అంటూ ముందుకువచ్చారు .
అమ్మమ్మా ....... జాగ్రత్త అన్నారుకదా చాలు చాలు వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకోండి వెళ్ళండి వెళ్ళండి .
( ఒకవైపు నవ్వుతూనే మరొకవైపు బాధపడుతున్నట్లు నావైపుకు తిరిగి తిరిగి చూస్తూనే వెళుతున్నారు )
మాహారాణి గారు - చెల్లి - రాణులకు తోడుగా అడవిరాజుతోపాటు మంజరి - మిత్రుడు కూడా వెళ్లిపోతుండటం చూసి రేయ్ రేయ్ .......
వినపడినా వినపడనట్లు మహారాణీ వెనుకే వెళ్లిపోతున్నాడు .
బుజ్జాయిలు : ఒకవైపున తెగ ఆనందిస్తూ మరొకవైపు మాత్రం నాన్నా నాన్నా ...... మీకు తోడుగా మేమున్నాం కదా , మీకు భయమేస్తే మమ్మల్ని గట్టిగా పట్టుకుని పడుకోండి .
అవునా అవునా అంటూ గిలిగింతలుపెట్టి , అమ్మ పిలిచినా వెళ్లలేదు .
బుజ్జాయిలు : నాన్న గొప్పతనం గురించి ప్రాణంలా చెబుతూ పెంచారు ఇక నుండీ నాన్నతోనే అంటూ ముద్దులుపెట్టారు .
అర్థం కాలేదు బుజ్జాయిలూ ......
బుజ్జాయిలు : ఇన్నాళ్లూ అమ్మతో ఉన్నాము ఇకనుండీ నాన్నతోనే ....... , మానాన్న పెరిగినట్లుగానే మేముకూడా ఇలా ప్రకృతి ఒడిలోనే పెరుగుతాము , తోడుగా మా నాన్న ఉండటం మా అదృష్టం అంటూ గట్టిగా హత్తుకున్నారు .
బుజ్జాయిలతో ప్రేమతో మాట్లాడుతూ చంద్రుడి వెలుగులో ఆనకట్ట ప్రదేశాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నాను .
కొద్దిసేపటి తరువాత బుజ్జాయిలూ ....... నాకంటే అందరికంటే ఎక్కువగా కష్టపడ్డారు , ఆకలివేస్తోందా ? అని అడిగాను .
బుజ్జాయిలు : మా నాన్నకు వేస్తోంది అంటే మాకుకూడా ....... , మా నాన్న ఎంత కష్టపడ్డారో అందరూ చూసారు అంటూ ముద్దులుపెట్టారు .
నవ్వుకున్నాను , ఉండండి ఎక్కడైనా పళ్ళు ఉన్నాయేమో చూస్తాను అంటూ చుట్టూ ఉన్న చెట్లన్నీ వెతికినా ఒక్క పండు కూడా దొరకలేదు