Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
సుబ్బు : అమ్మా నువ్వేనా అని గట్టిగా వాటేసుకున్నాడు ఏడుస్తూ

లిఖిత : సుబ్బు ఇలా చూడు.. ఈ అమ్మకి ఎప్పుడు ఏడవను అని మాటిచ్చావా లేదా

సుబ్బు : లేదమ్మా నేను ఎప్పుడు ఏడవలేదు.. ఇప్పుడే నిన్ను చూడగానే ఆగట్లేదు.. నువ్వు చెప్పినట్టే బాగా చదువుకున్నానమ్మా కానీ నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం అందుకే చెప్పుకోదగ్గ ఉద్యోగం చెయ్యట్లేదు. కానీ నువ్వు కోరుకున్నట్టే చాలా మంచి వాళ్ళని ఆప్తులుగా సంపాదించుకున్నాను అమ్మా.

మానస అక్క లాగ.. విక్రమ్, ఆదిత్య ఇద్దరు నన్ను తమ్ముడిలా చూసుకుంటారు.    అరవింద్ నా ఫ్రెండ్ ఇక్కడ లేడు వాడే నా బెస్ట్ ఫ్రెండ్.   వాసు అన్నయ్య.. చిరంజీవి అన్నయ్య..  ఇక అక్షిత తనతో ఉంటె నీతో ఉన్నట్టే ఉంటుంది.. చాలా మంచిది.. నన్ను వాళ్ళ సొంత మనిషిలా చూసుకుంటారు.

లిఖిత : మరి నీ లవ్ గురించి చెప్పవా

సుబ్బు : కళ్ళు తుడుచుకుని.. లేదమ్మా నువ్వు నా పక్కన ఉండుంటే కనీసం అమ్మాయిలతో ఎలా మెలగాలో తెలిసేది.. అలాంటిదేమి లేదు

లిఖిత : మరి రక్ష

సుబ్బు : లేదు ఏమి లేదు.. అని మోకాళ్ళ మీద కూర్చుని లిఖిత ఒళ్ళో తల పెట్టుకుని ఏడ్చేశాడు

లిఖిత : చూడు బంగారం.. మనస్ఫూర్తిగా ప్రేమించినవాళ్లు నీకు దెగ్గర కాకుండా ఉండలేరు.. నన్ను నమ్ము

సుబ్బు : నిజంగానా

లిఖిత : ఒట్టు

సుబ్బు : అమ్మా నిన్ను ముద్దు పెట్టుకోనా

లిఖితా : అడగాలా నాన్నా రా.. అని దెగ్గరికి తీసుకోగానే గట్టిగా వాటేసుకుని ఇన్ని సంవత్సరాల బాధని ఏడుపుని మొత్తం తీర్చుకున్నాడు.

లిఖిత కూడా సుబ్బు ఏడ్చేంత వరకు వాడి వీపు నిమురుతూనే ఉంది. ఒక ఐదు నిమిషాలకి సుబ్బు తేరుకుని తనివితీరా తన అమ్మని చూసుకున్నాడు.

లిఖిత : ఇక నేను వెళ్ళనా సుబ్బు..

సుబ్బు : ఎక్కడికి.. అని ఏడ్చేస్తూ.. నేను వదలను.. అమ్మా ప్లీజ్ మా నన్ను వదిలి వెళ్ళకు.. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అని కాళ్ళు పట్టుకున్నాడు గట్టిగా. సుబ్బు ప్రాణం పోయేలా ఏడుస్తూ బతిమిలాడుకోవడం చూడగానే లిఖితలోని రాక్షస గుణాలు పూర్తిగా చచ్చిపోయి తను కూడా ఏడ్చేసింది.


లిఖిత : సుబ్బు.. తప్పదు కదా నాన్నా.. ఇటు చూడు బైట లిఖిత అని ఒకావిడ ఉంది కదా తనతో నేను మాట్లాడాను నిన్ను కొడుకుగా స్వీకరిస్తానని బైటున్న విక్రమాదిత్యతో పాటు నాకు కూడా మాటిచ్చింది.

సుబ్బు : ఎవరు తను  అని ఏడుస్తూనే అడిగాడు

లిఖిత : సుబ్బు కళ్ళని తుడుస్తూ.. తను ఒకప్పటి నా ఫ్రెండ్ నిన్ను నేను ఎలా ప్రేమగా చూసుకునేదాన్నో అలానే చూసుకుంటుంది.. నేను పంచినంత ప్రేమని పంచుతుంది.. నేను ఇక్కడ ఉండటం కుదరదు కదా అందుకే నా బదులు తనని నా స్థానంలో పెట్టి వెళుతున్నాను

సుబ్బు : కానీ తానెవరో కూడా నాకు తెలీదే

లిఖిత : ఒకప్పుడు వీళ్ళు నీకు తెలుసా.. ఇది కూడా అంతే నాన్నా.. వెళ్లి నోరు తెరిచి అమ్మా అని ఒక్కసారి పిలిస్తే నీ దెగ్గర వాలిపోదు?

సుబ్బు : అలాగే.. కాని నాకు నువ్వు మళ్ళీ కనిపించవు కదా?

లిఖిత : లేదు నాన్నా.. ఇక నన్ను లిఖిత లోనే చూసుకో సరేనా?

సుబ్బు : అలాగే.. కానీ నువ్వే నా బెస్ట్ అమ్మవి.. అని కౌగిలించుకున్నాడు.

లిఖిత : నాకు తెలుసు.. అని నుదిటిన ముద్దు పెట్టుకుని ఇక వెళ్ళనా

సుబ్బు : కళ్ళు తుడుచుకుని.. తన నవ్వు మొహం చూపించి బై అని చెయ్యి ఊపాడు

లిఖిత : ఎప్పుడు ఈ నవ్వుని వదలద్దు అని తల మీద చెయ్యి వేసి మాయం అయిపోయింది..

సుబ్బు బైటికి వచేసాడు కానీ లిఖిత మళ్ళీ లోపలే కూర్చుని దిగులుగా ఏడుస్తుంది.

విక్రమాదిత్య : రుద్రా ఇక నేను వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది, నీకు నా ధన్యవాదాలు.. ఇక సెలవు

రుద్ర : ఇందాక నాకు ఏమైంది?

విక్రమాదిత్య : అన్ని సమాధానాలు నీకు పరుశురాముడిని కలిసాక అవగతమవుతాయి.. కొన్ని రోజులు ఇంట్లో వాళ్ళతో గడిపి నీ తదుపరి ప్రయాణం కొనసాగించు

రుద్ర : మరి మీరు ?

విక్రమాదిత్య : నేను తిరిగి అక్కడికే వెళ్ళిపోతున్నాను

రుద్ర : ఎందుకు మీకు మీరే శిక్ష వేసుకున్నారు?

విక్రమాదిత్య నవ్వాడు తప్పితే ఇంకేం మాట్లాడలేదు

రుద్ర : ఇక ఈ దేవి ?

విక్రమాదిత్య : నాతో పాటే తీసుకెళతాను అని దేవిని చూడగానే దేవి భయంగా ఇద్దరి వంకా చూసింది.. ఒక్క నిమిషం అని మాయమయ్యి ఇంట్లో ఏడుస్తున్న లిఖిత ఎదురు ప్రత్యక్షమయ్యాడు

లిఖిత : చేతులు ఎత్తి దణ్ణం పెట్టింది

విక్రమాదిత్య : నీకు బిడ్డలు పుడితే రాక్షసులు పుడతారనే కదా ఆ ప్రయత్నం మానుకున్నావు.. అందుకే నీకు ఈ బిడ్డని కానుకగా ఇచ్చాను

లిఖిత : కృతజ్ఞరాలిని

విక్రమాదిత్య : ఏ కల్మషం ఎరుగని సుబ్బు నీలో ఉన్న రాక్షస గుణాలన్నీ చెరిపేసినట్టున్నాడు?   నాకు నీలో ఏ చెడ్డ గుణాలు కనిపించటం లేదు

లిఖిత అవునని తల ఊపుతూ కళ్ళు తుడుచుకుని విక్రమాదిత్యని ముట్టుకోబోయి ఆగిపోయింది.

విక్రమాదిత్య : ఆగిపోయావే

లిఖిత : నేనొక రాక్షస జాతికి సంబంధించిన దాన్ని

విక్రమాదిత్య : నేను అందరివాడిని అయినా నీలో ఆ గుణాలు శాశ్వతంగా చచ్చిపోయాయి, కొన్నిటిని నేను నిన్ను మొదటి సరి రుద్ర గుండె దెగ్గర ముట్టుకున్నప్పుడే చెరిపేసాను.. అనగానే లిఖిత వంగి విక్రమాదిత్య కాళ్ళకి మొక్కి లేచింది.

విక్రమాదిత్య బైటికి వచ్చి అందరిని చూసి రక్ష వైపు చూసాడు, అక్కడున్న ప్రతీ ఒక్క జంట ఒకరి చేతులలో ఒకరు చెయ్యి వేసుకుని సంతోషంగా చూస్తున్నారు.

విక్రమాదిత్య : ఇక సెలవు అని సంధ్యని చూసాడు.. అమ్మా నేను చెప్పినట్టుగానే చూసావా నీ చుట్టు ఎంతమంది ఉన్నారో.. ఇప్పుడు చెప్పు వచేస్తావా నాతో అనగానే సంధ్య ఆనందంగా అందరిని ఒకసారి చూసి అందరిని కౌగలించుకుని ఇన్నేళ్లు ఉన్న ఇంటిని ఒకసారి చూసుకుని రక్షకి అప్పగించి తిరిగి కొడుకు వైపు చూసింది సిద్ధంగా

సంధ్య : ఎంత మంది ఉన్నా నువ్వు లేకపోతే నా కడుపు కోత ఎవ్వరు తీర్చలేనిది.

విక్రమాదిత్య చెయ్యి చూపించి ఆశీర్వదించగానే సంధ్య శరీరం మాయమయ్యి చిన్న వెలుగు ఒకటి విక్రమాదిత్య గుండెలో కలిసిపోయింది.. అక్కడున్న అన్ని జంటలు పిల్లలు చేతులెత్తి మొక్కగా నవ్వుతూ వెనక్కి తిరిగి దేవిని చూసి తన మెడకి ఉన్న పాముని విప్పాడు.


విక్రమాదిత్య : మంజీరా... ఇబ్బందిపెట్టానా అని నవ్వి పాముని వదిలేసి దేవి చెయ్యి పట్టుకుని రక్షని చూసాడు.. రక్షా నాకు ఇంకేమైనా చెప్పాలా అని అడిగాడు.

రక్ష సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్లి సుబ్బు చెయ్యి పట్టుకుని లాక్కెళ్లి తన తండ్రి ముందు నిలుచుంది.. విక్రమాదిత్య అరచెయ్యి చూపించి తధాస్తు అనగానే సుబ్బు చేతిలో పసుపు తాడు ప్రత్యక్షమయింది.. సుబ్బు ఇంకా కప్పలా నోరు తెరుచుకుని అలానే చూస్తున్నాడు.

రక్ష : కట్టు అని ఆశ్చర్యపోతున్న సుబ్బుని చూసి నవ్వింది.


సుబ్బు ఆశ్చర్యంగా తాళి కడుతుంటే అక్కడున్న ప్రతి ఒక్క మగాడు ఆశ్చర్యంగా దవడలు కింద నేలకి తగిలేలా తెరిచారు నోళ్లు.. విక్రమాదిత్య   ఆశీర్వదిస్తూ అక్షింతలు వెయ్యగా.. రుద్ర కూడా లిఖిత సమేతంగా అక్షింతలు వేసి ఆశీర్వదించాడు.. లిఖిత చిటికె వెయ్యగానే అందరి చేతుల్లోకి అక్షింతలు వచ్చేసాయి.. అందరూ సంతోషంగా అక్షింతలు వేస్తుంటే చిరంజీవి, వాసు, విక్రమ్, ఆదిత్య మాత్రం అసూయగా అక్షింతలు వెయ్యడం చూసి సుబ్బు నవ్వుకున్నాడు.. మానస అయితే తన కళ్లెదురు జరుగుతుంది చూసి గాల్లోకి ఎగురుతూ కేరింతలు కొడుతూ మనస్ఫూర్తిగా అక్షింతలు వేసింది.

విక్రమాదిత్య వెళ్లిపోతుండగా సుబ్బు పరిగెత్తుకుంటూ వెళ్లి తన కోరిక కోరాడు.. విక్రమాదిత్య అది విని గట్టిగా నవ్వుతూ.. ఆఖరికి నన్ను కూడా నవ్వించావే.. నీ కోరిక తీరుతుంది తధాస్తు అని మాయం అయిపోయాడు.. సుబ్బు కోరిన కోరిక విని రుద్ర కూడా నవ్వుకుంటూ తన వాళ్ళని తీసుకుని గాల్లోకి ఎగిరి వెళ్ళిపోయాడు.

సుబ్బు వెనక్కి తిరగగానే అందరూ సుబ్బు చుట్టూ చేరారు

రక్ష : మా నాన్నతో ఎం మాట్లాడావు??

అక్షిత : వీడు ఏదో అడిగాడు దానికి ఆయన నవ్వి తధాస్తు అన్నాడు.. రేయి ఎం కోరుకున్నావ్??

ఆదిత్య : చెప్పరా

మానస : రేయి చెప్తావా లేదా

సుబ్బు నవ్వుతూ : అంగ పార్ అనగానే అందరూ వెనక్కి తిరిగి చూసారు.. అక్కడ నుంచి ఇంటి గడప వరకు ఉన్న అమ్మాయిలని అంటీలని చూసి దడుచుకున్నారు అంతా..

సుబ్బు : మీరు కూడా వెళ్లి వరసలో నిలుచోండి.

అనురాధ : మేమా మేమెందుకు?

సుబ్బు : నేను ప్రొపోజ్ చెయ్యాలనుకున్న వాళ్ళు, నన్ను చూసి నవ్వినవాళ్లు, నన్ను రిజెక్ట్ చేసినవాళ్లు నన్ను వాడుకున్న ప్రతీ ఒక్కళ్లని కోరుకున్నాను అని నవ్వుతూ చెప్పాడు.

అక్షిత : దొబ్బేయి.. ఎలా కనిపిస్తున్నామురా నీకు.. వీడికి బాగా ఎక్కువైంది అందరూ కలిసి నాలుగు తగిలించండి.

సుబ్బు : అక్షితా ఆగక్కడా

అక్షిత : నన్నే పేరు పెట్టి పిలుస్తావా

సుబ్బు : నీకింకా నా రేంజ్ అర్ధంకావట్లేదు పాపా.. నా మీద చెయ్యేసే ముందు నా భార్యని చూడండి.. అక్కడ గొడ్డలి కనిపిస్తుందా.. అనగానే అక్షిత చిన్నబోయింది.. అయినా ఈ కధకి అస్సలు హీరోని నేనే

అక్షిత : అబ్బా ఛా

సుబ్బు : మీరంతా రూంలో కూర్చుని ఏడుస్తుంటే వచ్చి కాపాడింది ఎవరు?

వెనకున్న అందరి వైపు చూసి ఎవరండీ మిమ్మల్ని ప్రాణాలకి తెగించి కాపాడింది అని అరవగానే సలీమా నువ్వే అన్నయ్యా అని అరిచింది నవ్వుతూ..

సుబ్బు : వినిపించట్లా గట్టిగా అనగానే కావ్యతో సహా అందరూ నవ్వుతూ నువ్వే అని అరిచారు..

అక్షిత ఇంకా ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తుంటే

సుబ్బు : హలో పాపా అని అక్షిత ముందు చిటికె వేసి.. చూసావా అది మన ఫ్యాన్ ఫాలోయింగ్.. ఎమ్మా చిరంజీవి, వాసు, విక్రమ్, ఆదిత్య మిమ్మల్ని కుక్కని కొట్టినట్టు కొడితే ఎవరు కాపాడింది..?

చిరంజీవి సుబ్బు వేషాలు చూసి నవ్వుకుంటుంటుంటే వాసు ఏంట్రా అంటూ ముందుకు వచ్చాడు

సుబ్బు : ఏయి ఆగక్కడా.. నా వెనక ఎవరున్నారో తెలుసుగా అని రక్ష వెనక్కి వెళ్లి దాక్కున్నాడు..

రక్ష నవ్వుకుంది..

సుబ్బు :  చెప్పాలి చెప్పాలి ముహూర్తం దెగ్గర పడుతుంది.

ఆదిత్య : నువ్వేరా బాబు మమ్మల్ని కాపాడింది ఇకపో..

సుబ్బు : విక్రమ్ చెప్పట్లా

విక్రమ్ : మమ్మల్ని కాపాడింది నువ్వేనయ్యా మహానుభావా.. ఇక దయచెయ్యి అని దారి చూపించాడు.

సుబ్బు : రా బంగారం.. వీళ్ళతో మనకేంటి.. అక్షితా వెళ్లి ముందు వరసలో నిలుచో

అక్షిత : నేను వెళ్ళను

సుబ్బు : నీకు వేరే ఆప్షన్ లేదమ్మా.. మావయ్యా.. అని అరవగానే అక్షిత, మానస, అనురాధ కూడా వాళ్ల ప్రమేయం లేకుండానే అందరికంటే మొదటగా నిలుచున్నారు.. పద్మ ఒక్కటే బతికిపోయింది.. వాసు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు.

అనురాధ : సుబ్బు నేనేం చేసానురా

సుబ్బు : నన్ను వాయిలాహట్ అని మోసం చెయ్యాలె.. మర్చిపోయాననుకున్నావా అనగానే అనురాధ కళ్ళుమూసుకుని తనని తానే తిట్టుకుంది.

సుబ్బు రక్ష చెయ్యి పట్టుకుని అటు ఇటు తన చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ప్రేమించిన అక్షిత, మానస, అనురాధతో కలిపి మొత్తం ఐదు వందల పద్దెనిమిది (518) మంది ఇష్టం లేకుండా మొహం మాడ్చుకుని చేతిలో పూలతో రెడీగా ఉన్నారు.

సుబ్బు మొదటి అడుగు రాక్షతో పాటు వెయ్యగానే అటు మానస ఇటు అక్షిత నిలుచొని ఉన్నారు.

మానస : అక్కని రా

సుబ్బు : ఈ విషయంలా తగ్గేదేలే

అక్షిత : నీ సంగతి తరవాత చెపుతా అని చేతిలో ఉన్న పూలని సుబ్బు మొహం మీద విసిరింది

సుబ్బు : థాంక్స్ పాపా.. నాకు అదే కావాలి మొదట నువ్వే పూలు చల్లాలి అనుకున్నాను

అక్షిత : యదవ అని తిట్టుకుంది 

కొత్త జంట అయిన సుబ్బు రక్ష ఇంట్లోకి నడుస్తూ అందరూ వాళ్ల మీద పూలు చల్లుతుంటే ఒక్కొక్కరి మొహం వంకా చూస్తూ గర్వంగా తల ఎత్తి రక్షని తీసుకుని విక్రమాదిత్య ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకోగానే అందరూ మాయం అయ్యారు.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
అక్షిత మానస అనురాధ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.. ఇక అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు.. ఒక పక్క ఆదిత్య ఫామిలీ.. ఆదిత్య వాళ్ల నాన్న తన చెల్లిని వదలకుండా చెయ్యి పట్టుకున్నాడు.

ఇంకో వైపు విక్రమ్ కుటుంబం ఆ పక్క వాసు పద్మ, ఆ పక్కనే చిరంజీవి అందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోడానికి బైలుదేరారు.

అక్షిత : అవును.. అందరూ వాడు కోరుకున్నట్టు వచ్చారు కానీ ఆ అమ్మాయి, అదే మన సుబ్బుని మోసం చేసిన తన మరదలు రాలేదేంటి?

అనురాధ : అవును కదా నాకు కనిపించలేదే తన పేరేంటి శరణ్య కదా

మానస : ఆ అమ్మాయి చేసిన తప్పులు తెలుసుకుని ఇంట్లో వాళ్ల ముందు తల ఎత్తుకోలేక ఆత్మహత్య చేసుకుంది

అక్షిత : ఓహ్..

చిరంజీవి : అక్షితా..

అక్షిత : వస్తున్నా.. మళ్ళీ ఎప్పుడు కలిసేది అందరం?

అనురాధ : అందరి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి.. ముందు మన జీవితాలు చక్కపెట్టుకుని ఆ తరువాత ఒకరోజు చూసుకుని కలుసుకుందాం

మానస : అవును ఎలాగో మన సుబ్బు గాడి రిసెప్షన్ పెట్టుకోవాలి కదా

అక్షిత : సంగీత్ కూడా పెట్టుకుందాం.. అని అందరికి బై చెప్పి చిరంజీవి దెగ్గరికి వెళ్ళింది.. ఏంట్రా ఇంకా మొహం అదోలా పెట్టావ్

చిరంజీవి : ఆ సుబ్బు గాడే వాడిని చూస్తే అసూయగా ఉంది

అక్షిత : మీ అందరికంటే అందమైన భార్య వాడికి దొరికిందని కుళ్ళు.. మగ బుద్ధి ఎక్కడికి పోద్ది అని కసిరింది చిరంజీవి మొహం చూసి.

చిరంజీవి : అది కాదే వాడు పిల్లని ట్రై చేసాడు, కానీ దాని తల్లి పడింది.. అదే బాధగా ఉందే.. పిల్లని కొడితే తల్లి బుట్టలో పడిందన్న సామెతని  వాడు నిజం చేసి చూపించాడు.

అక్షిత కోపంగా వెళుతుంటే వెనకే మానస, అనురాధ, పద్మ కోపంగా రావడం చూసింది.

అక్షిత : మీది కూడా అదేనా

మానస : అదే.. కుళ్ళుబోతు మొహాలు అని నలుగురు కోపంగా ముందు వెళుతుంటే వెనక నలుగురు బతిమిలాడుకుంటూ పెళ్ళాల వెనక పడ్డారు , తప్పైపోయింది క్షమించమంటూ.. వెనక ఉన్న అందరూ అది చూసి నవ్వుకున్నారు.

సమాప్తం
❤️❤️❤️
❤️
Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమాదిత్య - by Pallaki - 15-11-2022, 07:43 PM



Users browsing this thread: 39 Guest(s)