Thread Rating:
  • 7 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు)
సంధ్య ఇంకా అభి ఇద్దరు చెన్నై లో ఇరుక్కుపోయారు…

అభి.. wt the fuck sir ఇది చాలా సెన్సిటివ్ మేటర్ అయి ఉండొచ్చు కానీ మేము ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేము . Already 3 days నుండి మీరు ఇదే చెప్తున్నారు.. sorry sir మేము ఇక్కడ ఉండబోయేది లేదు. Yeah do wt ever u can అంటూ ఫోన్ పెట్టేసాడు..

సంధ్య…అభి ఎంటి ఏమైంది…ఏం అంటున్నారు.

అభి…విన్నావు కదా ఇప్పుడు చెన్నై లోకి బయట వాళ్ళు రావడం గానీ లేదా ఇక్కడ నుండి బయటకు పోవడం గానీ లేదు అంట ఎబోలా చాలా ఫాస్ట్ గా spread అవుతుంది అని అన్నారు..

మరి ఇప్పుడు ఎలా అభి అంటూ సంధ్య ఆలోచిస్తూ ఉంది…

…..సరిగ్గా 3 రోజుల క్రితం అంటే ఇక్కడ చెన్నై లో ఉన్న హిమజ వాళ్ళు వెళ్లిపోయిన 2 రోజుల తర్వాత . అర్ధం అయ్యేలా చెప్తాను పూర్తిగా చదవండి….

హిమజ తన frnds తో కలిసి సంధ్య ఇంటి నుండి వచ్చేసింది..ఆ తర్వాత జరిగిన కథ మీకు తెలుసు కదా చదవకపోతే ఇంకో సారి సింపుల్ గా చెప్తాను..

హిమజ ఇంకా భాను వాళ్ళు చెన్నై నుండి ఫారెస్ట్ కి వచ్చారు. అక్కడ ఉన్న ఆ అటవీ వాసుల గ్రామానికి వెళ్లారు. అక్కడ ఇంతకు ముందే విశ్వాస్ తనతో వచ్చిన కాంట్రాక్ట్ కిల్లర్స్ తో ఊరిని స్మశానం లాగా మార్చేసి శవాలను మాయం చేశాడు. అలాగే ఆ కిల్లర్స్ ఎవరైనా ఫాలో అవుతూ వస్తె పట్టుకోడానికి deadly traps సెట్ చేసి పెట్టారు. హిమజ బ్యాచ్ అక్కడికి వచ్చిన తర్వాత విజయ్ అనుకోకుండా ఆ ట్రాప్ లో పడి అతి దారుణంగా చనిపోయాడు. దాని తర్వాత మిగిలిన ముగ్గురు అంటే భాను, రవి ఇంకా హిమజ లను ఆ కిల్లర్స్ బంధించారు….ఇది pervious updates చదివిన వారికి తెలిసిన కథ…

ఇప్పుడు నేను చెప్పేది హిమజ చెన్నై నుండి వచ్చిన రోజు నుండి అక్కడ జరిగిన కథ…

అదేరోజు సాయంత్రం అభి ఇంకా చిన్నా ఇంటికి తిరిగి వచ్చారు. వాళ్ళు వచ్చే సరికి సంధ్య ఇల్లు మొత్తం శుభ్రంగా తుడిచి సామాన్లు సర్ది ఉంచింది. 

చిన్నా రాగానే సంధ్య దగ్గర కు వెళ్లి గట్టిగ వాటేసుకుని అమ్మ అంటూ పిలిచాడు…సంధ్య కూడా తన కొడుకుని దగ్గరకు తీసుకొని హేయ్ చిన్నా ఎలా ఉంది అభి అంకుల్ వాళ్ళ ఇల్లు అని అడిగింది.

చిన్నా.. అభి నీ చూస్తూ సంధ్య చెవి లో బాగాలేదు అని చెప్పాడు.

సంధ్య నవ్వుతు అభిని చూసి సరే వెళ్ళి స్నానం చేసి రా పో అని కొడుకు కి చెప్పింది..

చిన్నా వెళ్ళిపోగానే అభి అటు ఇటు చూస్తూ అవును సంధ్య వీళ్లు ఎక్కడ ఉన్నారు బయటకు ఏమైనా వెళ్ళారా అని భాను వాళ్ళ గురించి అడిగాడు..

సంధ్య … ఎమో అభి నేను ఉదయం లేచే సరికి ఒక్కరూ కూడా లేరు . హా అన్నట్టు నీకు ఒక విషయం చెప్పాలి ఆగు అంటూ విక్రమ్ రూం లోకి వెళ్లి xerox చేయబడిన బుక్ తీసుకొని వచ్చి అభికి చూపిస్తు ఈ బుక్ అని చెప్పింది .

అభి.. హా ఏదో xerox copy అయితే ఎంటి ..

సంధ్య.. అది కాదు దీని అసలు నా అర్ధం ఇది xerox కదా కానీ ఒరిజినల్ బుక్ ఆ అమ్మాయి ఇంకా ఆ కుర్రాళ్ళ దగ్గర ఉంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే. (ముందు రోజు రాత్రి బుక్ లో మంటలు అంటుకోడం ఏవో పేజీలు మిస్స్ అయ్యాయి అని చెప్పుకోవడం ఇవన్నీ ) ఆ బుక్ లో ఏదో మిస్టరీ ఉంది .విక్రమ్ దగ్గర దీని xerox ఉంది కానీ ఈ ఒరిజినల్ వీళ్లకు ఎలా దొరికింది నీకు తెలుసా అంటూ . ఆ కథ కూడా చెప్పింది. 

అభి… అయితే విక్రమ్ మిస్సింగ్ కి కారణం ఈ బుక్ లో విషయం అని అంటావా..

సంధ్య…ఖచ్చితంగా చెప్పలేను.ఛాన్స్ తీసుకోవడం మంచిది అని నా అభిప్రాయం…

అభి…కానీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి. 

సంధ్య…ఇక్కడికి అంటూ( విక్రమ్ రూం సర్దేటప్పుడు కింద పడిన పేపర్ చూపించింది.అందులో ఒక మ్యాప్ పాయింటింగ్ ఉంది).

ప్రియమైన మిత్రులారా.. ఇది హిమజ వాళ్ళు అడవి లో ప్రమాదం లో పడినప్పుడు ఇంకా ఇక్కడ సంధ్య వాణి తన చెల్లి అయిన సంధ్య రాణి ఇంట్లో ఉన్నప్పుడు ఓకే సమయం లో జరిగిన కథ. సో రెండు ఘటనల సమయం లో అక్కడ మరియు ఇక్కడ జరిగింది.. ఏమిటంటే ….

అభి.. సరే సంధ్య నువ్వు చెప్పినట్టే చేద్దాం .ఎంత తొందరగా వీలు అయితే అంత తొందరగా ఈ సమస్య నీ solve చేద్దాం ..

సంధ్య..yeah sure ..

ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు.. అప్పుడే బయట ఎమర్జెన్సీ అలారం మోగిస్తూ అక్కడి సిటీ కార్పొరేషన్ వాళ్ళు వెళ్తున్నారు. ఆ సౌండ్ విని వీళ్లిద్దరూ బయటకు వచ్చారు..

…సిటీ లో ఉన్నట్టు ఉంది ఎబోలా వ్యాధి వచ్చింది. కేవలం గంట లో 15 మంది వరకు చనిపోయారు. ఈ వ్యాధి మొత్తం చెన్నై నగరాన్ని చుట్టూ ముట్టింది అని సమాచారం కాబట్టి ఈ వ్యాధి పూర్తిగా తగ్గే వరకు సిటీ నీ lockdown చేస్తున్నాం . అత్యవసర కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. సంప్రదింపు కోసం ఈ నంబర్స్ కి ఫోన్ చేయండి అంటు ఏనోన్స్ చేస్తూ వెళ్తున్నారు…ఇది సరిగా ఈరోజు కి 3 రోజులు …

ఒక వైపు సంధ్య వాళ్ళు lockdown situation లో ఇరుక్కున్నారు. ఇంకో వైపు విశ్వాస్ దగ్గర హిమజ వాళ్ళు బంధి అయ్యి ఉన్నారు.. మరొక వైపు కాల సందిగ్ధం నుండి బయట పడిన ఆ హిమజ వాళ్ళు ఉన్నారు . 

హిమజ…సరే ఇప్పుడు మనం ఏమి చేద్దాం ఏమి చేయాలో కూడా తెలియదు. ఏదో ఫాంటసీ థ్రిల్లర్ మూవీ లా ఉంది ఇదంతా..

విజయ్…నవ్వుతూ హిమజ నువ్వు చెప్పేది ఫన్నీగా ఉన్న ఇదే నిజం మనం ఇప్పుడు ఒక ? క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయాము…

రవి…ఇక్కడ ఉన్న మనం ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు . మనం ఆ నిధి దగ్గరకు ఎలా వెళ్ళాలో కూడా తెలియదు . భాను నువ్వు ఏదో ఒకటి ఆలోచించు ..

భాను…నేను ఇలా చెప్తాను అని నాకు కూడా తెలియదు.కానీ చెప్తున్న అంత ఆ పరమేశ్వరుడి మీద వేసి ఆయన అంశ అయిన నాగ సాధువులు దగ్గరకి వెళ్దాం .

విజయ్…ఎంటి…

భాను…అవును రా నేను ఇదే ఆలోచించా  చూడండి ఇదేమి మూవీ కాదు అలాగే ఏదో బుక్ లో వచ్చే పేదరాశి పెద్దమ్మ కథలు కూడా కాదు.మనం ఏమి చేయలేము . కొన్ని సార్లు ఇలాంటి దారులు కూడా చూడాలి.మీరు ఒకటి గమనించారా యే జాతర నుండి అయితే మనం దూరంగా వచ్చేశామో మళ్లీ అదే జాతర కి ఇప్పుడు వెళ్ళబోతున్నం అని అన్నాడు..

వేరే అవకాశం లేక మిగిలిన ముగ్గురు భాను మాట కి ఒప్పుకున్నారు .

నలుగురు కలిసి అడవిలో నుండి బయట పడ్డారు. రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఉదయం ఎప్పుడో అడవిలో నుండి వచ్చి ఆ అడవి లోని మైన్ రోడ్ మీద నుండి నడుచుకుంటూ వెళ్తున్న వీళ్లకు కనీసం ఒక్క సైకిల్ కూడా కనిపించలేదు లిఫ్ట్ అడగటానికి అంత దారుణంగా ఉంది . జాతర సమయంలో రద్దీగా ఉండే రోడ్ మీద ఇప్పుడు మనుషులు లేరు . చూస్తూ వుండగానే చీకటి పడింది. ఎటు వంటి బండ్లు ఇటు రావు అని కాస్త ఆలస్యంగా గ్రహించిన వీళ్లు ఆరోజు రాత్రి ఆ రోడ్ మీదే క్యాంప్ వేసుకొని పడుకున్నారు..

చాలా దూరం నడవటం తో నలుగురు వెంటనే నిద్ర లోకి జారుకున్నారు…


పయనం ఆరంభము.... యాత్ర ఇది చిక్కు ముడులు తో కూడిన బాట...

ఎప్పుడు అయితే సృష్టి కి విరుద్ధం గా నువ్వు అడుగులు వెస్తావో అప్పుడు ఈ ప్రకృతి వికృత రూపం దాల్చి నిన్ను నాశనం చేస్తుంది..

అంటే దీని అర్థం ఎంటి నాయనమ్మ అని అడిగారు . లావణ్య ఇంకా శరణ్య..

బామ్మ...పూర్వం ఒక రాజు ఉండేవాడు . అతనికి ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు ఇద్దరి మతాలు వేరైనా భాషలు వేరు అయిన అవి ఎవి వీరి స్నేహానికి అడ్డం రాలేదు. అయితే వీరు ఇద్దరు వారి స్థానాల ప్రకారం అత్యంత సమర్థంతంగా ఉన్న రాజులు. ఇందులో హంస నందుడు అనేవాడు.ఉదార భావి. కానీ నంబియార్ అల కాదు ఏదైనా తనకు కావాలి అని పట్టు పడితే దానిని చేజిక్కిచుకోవడానికి ఎంత దూరం అయిన వెళ్తాడు . అలా ఒక విందు లో జరిగిన సంఘటన ఇద్దరు ప్రాణ స్నేహితులను బద్ద శత్రువులుగా చేసింది..

లావణ్య...ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు మేము అడిగింది ఎంటి నీకు నువ్వు ఏమి చెప్తున్నాువ్..

బామ్మ... కథ నీ అర్ధం చేసుకునే తత్వం ఉండాలి . ఏ విషయం కూడా ఊరికే జరగదు . మళ్ళీ చెప్తాను వినండి.

ఎప్పుడైతే విరి జిత్ ఆ నిధి నీ దాచాలి అని వెళ్ళాడో అతనికి దారిలో ఆ అడవి ప్రయాణం లో ఎదురైన కొన్ని అనుభవాలు గురించి ఇప్పుడు మీకు చెప్తాను...

విరిజిత్ కి మూడు సార్లు మూడు రకాల అనుభవాలు ఎదురు అయ్యాయి..అతను సాధారణ సైనికుడు అయిన కూడా అపర చాణక్యుడు మంత్ర శక్తులు ఉన్న వాడు .

అతనికి ముందుగా ఒక అటవీ గ్రామం ఎదురు అయింది..అక్కడ ఎర్ర జాతి మనుషులు ఉండేవారు. ఎర్ర జాతి అని ఎందుకు అన్నాను అంటే వీరు ఎప్పుడు కుంకుమ నీ వొంటికి రాసుకొని ఉండేవారు.. ఎలాగైతే అఘోరాలు బూడిద వొంటికి రాసుకుంటారు అని తెలుసో ఆ విధంగా . వీరికి ఒక వరం ఉంది అది ఏమిటి అంటే ఎప్పుడు అయితే వీరి మొత్తం తెగ అంతం ఐపోతుందో అప్పుడు ఏదో ఒక వైపరీత్యం జరుగుతుంది..

వీరికి ఆ వరం ఇచ్చింది. ఇక్కిలాం దేవి అందుకే వీరు ఆ దేవికి నిత్యం పూజలు చేస్తూ వొంటికి కుంకుమ రాసుకుంటారు..

అయితే విరిజీత్ ఆ గ్రామం వెళ్ళినప్పుడు వాళ్ళు బదులు అడిగారు అప్పుడు విరీజిత్ తన దగ్గర ఉన్న నిధి లో నుండి తాల పత్రాలు వారికి ఇచ్చి వీటిలో మంత్ర శక్తులు ఉన్నాయి వీటితో మీరు మాంత్రికులు అవ్వొచ్చు అని చెప్పి నన్ను ఊరు దాటనిస్తే ఇవి మీ చేతికి ఇస్తాను అని చెప్పి అసలు విద్య అంటే ఏమిటి అనేది తెలియని ఆ తెగ వారికి ఆ తాల పత్రాలు అందజేశాడు.. అవి ఎంతో సంతోషంగా తీసుకొని విరీజీత్ నీ వెళ్లనిచారు..[Image: IMG-20221023-153621.jpg]



మీ అనుమానం అర్ధం అయ్యింది నాకు.. అంత విలువైన తాల పత్రాలు వారికి అల ఎలా ఇచ్చేశాడు అనే కదా..

సరిగ్గా గమనిస్తే వారికి చదువు రాదు. తాల పత్రాలు చదవలేరు కదా అదే విధంగా ఇక్కడ తాల పత్రాలు ఉండే విషయం ఎవరికి తెలియదు. 

ఆ గ్రామం దాటిన విరిజిత్ కొన్ని మైళ్ళ ప్రయాణం తర్వాత ఒక చోటు కి చేరుకున్నారు . అక్కడ అతని మజిలీ లో జరిగిన మరో సంఘటన ...

అతనికి అక్కడ ఒక బ్రాహ్మణ యువకుడు కనిపించాడు . విరీజిత్ ఉన్న బలగం అతనిని పట్టించుకోకుండా దాటుకుంటూ వెళ్లబోయారు . అయితే అప్పుడు ఆ యువకుడు తనను దాటిన వారికి శాపం ఇచ్చాడు శిలలు వలె మారిపొండి అని..[Image: images-2022-11-13-T123556-143.jpg]



విరిజిత్ ఆ యువకుడికి నమస్కరించి అతనిని దాటి వెళ్ళడానికి అనుమతి అడిగాడు..

అప్పుడు ఆ యువకుడు నేను ఒక యువరాణి నీ ప్రేమించాను. నేను తనని వివాహం ఆడాలి కానీ అందుకు ఆమె నన్ను ఒక బహుమతి కోరింది. అది ఏమిటంటే ఈ ప్రపంచంలో అత్యంత అరుదైన పుష్పం తనకి బహుమతి గా ఇవ్వాలి అని ఆ పుష్పం ఎప్పటికీ ఎందిపోకుడడు అని చెప్పింది. ఓ బాటసారి నువ్వు నాకు ఆ పుష్పం తెచ్చి ఇస్తే నిన్ను ముందుకు వెళ్లే అవకాశం ఇస్తాను అని అన్నాడు..

విరిజిత్ కాసేపు ఆలోచించి తన దగ్గర ఉన్న స్వర్ణ కంబళి పుష్పం తీసి అతని చేతికి ఇచ్చాడు. [Image: magical-flower-pupple-flower.gif]



విరిజిత్.. ఓ బ్రాహ్మణ కుమార ఈ పుష్పం ఎన్ని యుగాలు గడిచినా ఇలాగే తాజాగా ఉంటుంది.అలాగే ఇది దేవలోకం నుండి ఇక్కడికి వచ్చినది ఇది మీ వివాహం కు నా చిరు కానుక అని ఇచ్చాడు..

ఆ యువకుడు సంతోషంగా ఆ పువ్వు తీసుకున్నాడు.. ధన్యుడునీ ప్రభు అంటూ విరిజిత్ కి కృతజ్ఞతలు చెప్పాడు..

విరిజిత్..కుమార నా సైనికుల కు విమోచనం కలిగించు అని అడిగాడు.. 

యువకుడు.. వీరు మీ మార్గం లో మీకు ఇక్కడి వరకే తోడు అంటూ అక్కడ నుండి వెళ్లిపోయాడు...

మరొక విషయం మీరు గమనిస్తే ఇక్కడ కూడా విరిజిత్ తన తెలివి నీ ఉపయోగించాడు. తను అనుకుంటే అమృత సేఖి ఇవొచ్చు కానీ స్వర్ణ కంబళి పుష్పం ఇవ్వడానికి కారణం ఆ పుష్పం కేవలం చనిపోయిన వారి మీద మాత్రమే ప్రభావం చూపుతుంది. బ్రతికి ఉన్నవారి దృష్టి లో ఇది కేవలం ఒక అందమైన పువ్వు మాత్రమే..

విరిజిత్ మిగిలిన బలగం తో మళ్ళీ ప్రయాణం కొనసాగించాడు..అతనికి ఎదురు అయిన మరొక సంఘటన ఈ అడవి లో ఇప్పుడు అంటే మృగాలతో నిండి పోయింది కానీ ఒకప్పుడు ఈ అడవులే మనకు రహదారుల వలె ఉండేవి కదా.అందుకే మీకు చెప్తున్న...

అయితే విరిజిత్ కు ఎదురైన మరో అనుభవం ఒక అవ్వ రూపం లో ... ఆవిడ చిన్న పిల్లలకు కథలు చెప్తూ ఉండేది . ఆ కథలు ఎలా ఉండేవి అంటే ఒక్కో కథ పూర్తి అయ్యేసరికి కొన్ని రోజులు పట్టేది.

అవ్వ కథ చెప్పేటప్పుడు మధ్య లో ఎవరు అయిన ఏదైనా ప్రశ్న అడిగిన లేదా కథ పూర్తిగా వినకుండా వెళ్లిపోవాలి అని చూసిన వారిని ఏదో ఒక జంతువు లాగా కానీ లేదా గబ్బిలాలు లాగా మార్చేది.. విరిజిత్ వెళ్తూ ఉండగా తన సైనికులు ఆకలి అంటు ఒకరిని ఒకరు అడుగుతూ ఉన్నారు..

విరిజిత్ ఇది గ్రహించి కొద్ది దూరం లో కనిపిస్తూ ఉన్న ఒక గుడిసె దగ్గరకు వెళ్ళాడు . అక్కడ ఒక అవ్వ చెట్టు కింద కూర్చొని తన ఎదురుగా ఉన్న జంతువులకు కథ చెప్తూ ఉంది. అది చూసి విరిజిత్ కి కాస్త విచిత్రంగా అనిపించింది. తను అలాగే చూస్తూ ఉన్నాడు.. కాసేపటికి అవ్వ విరిజిత్ నీ చూసి ఏమి కావాలి అని అడిగింది..

విరిజిత్...అవ్వ నాకు నా సైనికులకు భోజనం కావాలి . ఏమైనా ఉంటే పెట్టామ్మ నీకు ఎంత బంగారం కావాలి అన్న ఇస్తాను అని అన్నాడు .

అవ్వ...రాజ నాకు బంగారం వద్దు నేను మీ అందరి కడుపు నింపుతాను కానీ దానికి బదులుగా మీరంతా నేను చెప్పే కథ వినాలి పూర్తిగా మధ్యలో ఎవరు మాట్లాడకూడదు అల నా కథ వింటాను అంటే మీకు ఆకలి దప్పికలు తీరుస్తాను అని చెప్పింది..

విరిజిత్ బాగా ఆలోచించి సరే అవ్వ నాది కూడా ఒక షరతు నేను కథ వినేటప్పుడు నువ్వు రెప్పపాటు కాలం కూడా కథ ను ఆపకూడదు అలా ఆపితే నేను కథ వినను అని అంటాడు...( రెప్పపాటు కాలం అంటే కళ్ళు మూసి తెరిచే సమయం అది ఒక సెకండ్ లో కూడా చాలా తక్కువ సమయం)...

అవ్వ కూడా విరిజిత్ చెప్పిన దానికి ఒప్పుకొని కథ చెప్పడం మొదలు పెట్టింది. ముందుగా ఏదో మంత్రాలు చదివి కథ మొదలు పెట్టింది..

పూర్వం యక్ష రాజు అయిన యక్షసేనుడు ఒక యాగం మొదలు పెట్టాడు.ఆ యాగం లో అంటూ కథ చెప్తూ వచ్చింది.. సమయం గడిచిపోతూ ఉంది.. సైనికులు ఆకలికి తట్టుకోలేక పోతున్నారు..
అయితే ఆ సైనికులలో ప్రవీణుడు అని ఒక సైనికుడు ఉన్నాడు అతను ఆకలి వల్ల కోపం తో హేయ్ అవ్వ ఎంటి నీ చాదస్తం మేము ఆకలి అని అడిగితే కథ అని కూర్చోబెట్టావు . అని అరిచాడు కథకు మద్యలో ఆటంకం కలిగించడం తో ప్రవీణుడు తనకు ఉన్న కోపానికి అడవి దున్న గా మారిపోయాడు . అది చూసి కొంత మంది భయం తో అరిచారు దాదాపు సగం మంది ఏదో ఒక జంతువు లాగా మారిపోయారు. అలా చూస్తూ ఉన్న విరీజిత్ తన మంత్ర శక్తి తో ఒక చిన్న దోమ లాగా సృష్టించి అవ్వ ముక్కులో వెళ్లేలా చేశాడు.దాంతో అవ్వ తుమ్మడం మొదలు పెట్టింది అలాగే కథ కూడా ఆగింది..

విరిజిత్ వెంటనే పైకి లేచి నువ్వు కథ ఆపెసావు కాబట్టి ఇంకా నీ మాట ప్రకారం నేను కథ విన్న ఇప్పుడు నువ్వు నీ మాట నిలబెట్టుకో అని అన్నాడు.. విరిజిత్ పన్నాగం గ్రహించిన అవ్వ విరిజిత్ ను శపించింది.

అవ్వ...నువ్వు ఏ కార్యం మీద అయితే బయలు దేరి వచ్చావో దానిని నువ్వు ఎప్పటికీ పూర్తి చేయలేవు అని శపించింది..

విరిజిత్ వెంటనే అవ్వ నీ క్షమించమని కోరాడు.అందుకు అవ్వ శాపం ఇప్పుడు తోలిగుపోదు ఎప్పుడు అయితే నీ గమ్యం లో వేరే వారు ఇటుగా వస్తారో అప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ప్రత్యేక్షం అవుతాను.వారికి కథ చెప్తాను వారు పూర్తిగా నా కథ వింటే నువ్వు ఇప్పుడు వరకు నీ మార్గం లో దానం చేసిన తాల పత్రాలు, అలాగే స్వర్ణ కంబళి కూడా వచ్చి ఒక చోట చేరుతాయి అని చెప్పి మాయం అవుతుంది...

మీకు ఒక అనుమానం వచ్చి ఉంటుంది.అవ్వ కి వీటి గురించి ఎలా తెలుసు అని ఆ అవ్వ కి దివ్య దృష్టి ఉంది . అలాగే ఎదుటి వారి మొఖం చూసి వారు ఎవరు అనేది దేనికోసం ఉన్నారో కూడా తెలుసుకో గల విద్య అవ్వ కి ఉంది...

అలా తన ప్రయాణం మొదలు పెట్టిన విరిజిత్ చివరిగా మిగిలిన అమృత సేఖి నీ అక్కడే తను ఎక్కడ అయితే శాపానికి గురి అయ్యాడో ఆ ప్రదేశం లో దానిని నిక్షిప్తం చేశాడు..

లావణ్య...బామ్మ కథ బాగుంది కానీ ఇలాంటివి నిజంగా జరుగుతాయా హ్మ్మ్ నాకు నిద్ర వస్తుంది అంటూ లేచి తన అమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది..

శరణ్య ...ఈ కథ నీకు ఎలా తెలుసు బామ్మ..

బామ్మ...నాకు మా బామ్మ చెప్పింది మీకు నేను చెప్పాను .సరే వెళ్ళి పడుకోండి మన ఊరి జాతర ఇంకా 3 రోజులు ఉంది ఈ చివరి మూడు రోజులు చాలా ఘనంగా ఉంటుంది అని చెప్పి మెల్లిగా లేచి బయటకు వచ్చింది..

....చెన్నై .....

సంధ్య కి ఏమి అర్ధం కావటం లేదు మూడు రోజులు నుండి బయటకు వెళ్ళటానికి కూడా లేదు.ఇక్కడే ఉంటే ఆ వ్యాధి వీళ్లకు కూడా వస్తుంది ఎమో అని భయం....

అభి మైన్ డోర్ క్లోజ్ చేసి లోపలికి వస్తు ఈ ఏరియా లో నలుగురికి వచ్చింది అంట ఎబోలా అంటూ వాటర్ తీసుకొని తాగుతూ ఉన్నాడు..

సంధ్య...మరి ఇప్పుడు ఎలా అయిన ఇంత సడెన్గా ఎలా జరిగింది ఇదంతా..

అభి...నాకు మాత్రం ఏమి తెలుసు . కనీసం ఆ కుర్రాళ్ళు అయిన తప్పించుకున్నారు లే సరే నేను నిద్ర పోత కాసేపు అంటూ విక్రమ్ రూం లోకి వెళ్తూ నువ్వు ఇక్కడ పడుకో అని అన్నాడు...

...అడవి లో విశ్వాస్ గ్రూప్ హిమజ ఇంకా భాను , రవి లను కట్టేసి ఉంచారు.rio హిమజ ను చూస్తూ దగ్గరకి వచ్చి నవ్వుతూ భుజం మీద చెయ్యి వేసి నొక్కుతూ ఉన్నాడు..

హిమజ తు అంటూ rio మొఖం మీద ఉసింది..rio కి కోపం వచ్చి హిమజ నీ కొట్టాడు . భాను హేయ్ u bloody అంటూ rio ను కొట్టబోయాడు.. rio తన దగ్గర ఉన్న గన్ తో భాను మొఖం పగల గొట్టి హిమజ దగ్గరకు వచ్చి హిమజ ను పైకి లేపుతున్నాడు.వెంటనే రవి leave her bastard అంటూ కట్టేసి ఉన్న తన కాళ్ళతో రియో నీ కొట్టాడు. Rio రవి నీ కొట్టడానికి వచ్చాడు.ఈ గొడవ లో rio దగ్గర ఉన్న pocket knife కింద పడటం చూసి భాను వెంటనే దాని మీదకు కూర్చొని fucking bastard అని తిట్టాడు.. rio కి కోపం ఎక్కువ అయి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply


Messages In This Thread
RE: నిధి రహస్యం... అంతు చిక్కని కథ... - by Jani fucker - 13-11-2022, 12:39 PM



Users browsing this thread: 3 Guest(s)