Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
S3E11

లిఖిత : ఇది ఎలా సాధ్యం 

రుద్ర : ఎవరు ఈ విక్రమాదిత్య, మాములు మనుషులకి ఊహకి కూడా  అందనటువంటిది ఈ గొడ్డలి, అలాంటిది..

లిఖిత : నీది మనిషి పుట్టుకేగా కానీ దేవుడవ్వలె

రుద్ర కంధరని తలుచుకోగానే కంధర ప్రత్యక్షమయింది. రుద్ర చేతిలో ఉన్న గొడ్డలి తన చేతిలోకి తీసుకుని చూసింది.

కంధర : ఇది...

రుద్ర : అవును ఆయనదే 

కంధర ఆశ్చర్యంగా చూసింది.

రుద్ర : నాకు కొంత సమయం కావాలి 

కంధర : అలాగే అని తన అక్కని తలుచుకోగానే నల్ల కంధరతో పాటు ఇంతకు ముందుకు రుద్రని చంపడానికి వచ్చిన తెల్లటి పాము మనిషి ఆకారంలో ప్రత్యక్షమయ్యారు, వెంటనే తన అక్కని తనలో కలిపేసుకుని దేవి మీదకి యుద్ధానికి వెళ్ళింది.

రుద్ర లిఖిత అని పిలవగానే.. లిఖిత రుద్ర శరీరంలో కలిసిపోయింది. రుద్ర గొడ్డలి తీసుకొని తేరిపారి చూసాడు ఇప్పటిదాకా మాములుగా ఉన్న గొడ్డలి ఇప్పుడు రుద్ర చేతిలో ఎదురు తిరుగుతుంది, ఏదో వైబ్రేషన్ మొదలయింది గొడ్డలి బరువు పెరుగుతుంది అందరూ చూస్తుండగానే వెళ్లి విక్రమాదిత్య సమాధిని బద్దలు కొట్టాడు ఆ సౌండు విని సంధ్యతో పాటు అందరూ అక్కడికి వెళ్లారు. లోపల ఏమి లేదు కాళీ.. ఒక గుంత అంతే.. రుద్రతో పాటు అందరూ ఆశ్చర్యంగా సంధ్య వైపు చూసారు. అక్కడికి దేవి కంధరతో పాటు రక్ష కూడా వచ్చింది.

సంధ్య : (ఏడుస్తూ) నా కొడుకు చనిపోలేదు, ఏటో వెళ్ళిపోయాడు అని ఆరోజు ఏం జరిగిందో గుర్తు చేసుకుంది.

విక్రమాదిత్య : అమ్మా

సంధ్య : చెప్పు నాన్నా

విక్రమాదిత్య : ఇవ్వాల్టితో అనురాధ సమయం ముగిసింది.. నాది కూడా

సంధ్య : ఏంటి నువ్వనేది, అను చనిపోయింది తనని ఇంకా.. అని చనిపోయిన అను కాళ్ళని పట్టుకుని ఏడ్చేసింది

విక్రమాదిత్య : తను చనిపోయింది.. తనతో పాటే నేనూ.. ఉన్నా లేనట్టే..

సంధ్య : నాకేం అర్ధంకాలేదు

విక్రమాదిత్య : మరేం పరవాలేదు

సంధ్య : చిన్నా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్.. ఏమైంది

విక్రమాదిత్య : చెప్పేది జాగ్రత్తగా విను, ఇవ్వాల్టితో నీ కొడుకు చనిపోయాడు.. చనిపోతాడు

సంధ్య : (నోరు మూసేసి) అలా అనకు, అయితే నన్ను కూడా మీతో తీసుకుపోండి నేను కూడా చచ్చిపోతాను అని ఏడ్చేసింది

విక్రమాదిత్య : అమ్మా.. ఏడవకు తప్పు నాది.. నేనేంటో నాకు అర్ధమయ్యేసరికి లేట్ అయిపోయింది.. ఇది నాకు నేనే వేసుకున్న శిక్ష.. అను, మానస లేని నా జీవితం అల్లకల్లోలం. ఇక ఈ భూమి మీద నేను ఉండలేను.. నాకోసం ఏడవద్దు నీకోసం చాలా మంది వస్తారు నిన్ను కష్టపెట్టకుండా చూసుకుంటారు.

సంధ్య : ఎవరు

విక్రమాదిత్య : అదేంటి మర్చిపోయావా నా బిడ్డలు.. కావ్య, రక్ష, రాజు, సరిత.. ఇంకా చాలా మంది..

సంధ్య : నాకు వాళ్లెవ్వరు వద్దు, నీతోనే వస్తాను..

విక్రమాదిత్య : నా బుజ్జి కదు.. నీ ఆయుష్షు ఇంకా అయిపోలేదమ్మా.. ఇంకా పనులు మిగిలే ఉన్నాయి.. భయపడకు బాధపడకు.. కచ్చితంగా నీ ముందుకు వస్తాను అని కళ్ళు మూసుకుని తలలో నుంచి రెండు వెంట్రుకలని తీసి గాల్లోకి విసిరాడు.. అమ్మా నీకోసం మళ్ళీ వస్తాను ఒక్కడిగా కాదు ఇద్దరిగా వస్తాను అప్పటి వరకు జాగ్రత్త అని మాయం అయిపోతూ నీ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా నిన్ను  నాలో కలిపేసుకుంటాను.. అని మాయం అయిపోయాడు... ఆశ్చర్యపోవడం సంధ్య వంతు అయ్యింది.

సంధ్య : అదీ జరిగింది ఆ రోజు నుంచి ఒక్కదాన్నే నా కొడుకు చెప్పినట్టు మీరు వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాను..

రుద్ర : మాయం అయిపోయాడా

సంధ్య : అవును.. తన కోసం సమాధిని తన ఇరువురి భార్యల మధ్యన కట్టించమని చెప్పి మరీ వెళ్ళిపోయాడు.

రక్ష : మరి ఆయన చనిపోయాడని ఆయనని పాతి పెట్టింది, మేమందరం చూసింది ఎవరిని?

సంధ్య : నేను చనిపోయానని నమ్మించి నన్ను మా వాళ్ళు ఎలా ఎత్తుకుపోయారో.. నేను కూడా అదే చేసాను

విక్రమ్ : ఏం చేసావ్

సంధ్య : బాడీ డబల్ టెక్నిక్

రుద్ర : అంటే ఇప్పుడు విక్రమాదిత్య బతికే ఉన్నాడా

సంధ్య : నాకు తెలీదు, చచ్చిపోతాను అని చెప్పాడు

రుద్ర : అందరూ వెనక్కి జరగండి..
అని కిందపడిన గొడ్డలిని ఎత్తి, దాని పదును మీద రక్ష చెయ్యి పెట్టి వత్తాడు కళ్ళు మూసుకుని ఏదో మంత్రం చదివాగానే... రక్ష రక్తం గొడ్డలి మీద పడగానే గొడ్డలి వణుకుతూ లేచి నిలుచుంది.. అందరూ వెనక్కి జరిగారు..

దేవుళ్ళకి సైతం కనిపించినంత వేగంతో ఎగిరిపోయింది.. అదే మిల్లి సెకండ్లో అర రెప్ప పాటులో ఎగురుతున్న గొడ్డలి చివరని రుద్ర గట్టిగా పట్టుకున్నాడు.. అంతే గొడ్డలితోపాటు రుద్ర కూడా ఎగురుతూ పావు నిమిషంలోపే భూ కక్షని.. మరో పది సెకండ్లలో మిగతా గ్రహాలని దాటి ఐదు నిమిషాల్లో సౌర కుటుంబాన్ని దాటేసి.. ఇంకా ఎత్తుకి వెళ్ళిపోయాడు.. రెండు నిమిషాల విపరీతమైన ప్రయాణం తరువాత చీకటిలో గొడ్డలి ఆగిపోయింది.

అటు ఇటు చూసాను పక్కనే ఒక పెద్ద ఉల్క నన్ను ఢీ కొట్టబోతే పక్కకి జరిగాను, అంతా చీకటి సూర్యుడి వెలుగు కూడా పడటం లేదు.. చుట్టు నక్షత్రాలు ఉల్కలతో నిండి పోయింది, ఆగిన గొడ్డలని పట్టుకుని చూడబోతే నా ఎడమ చేతికి ఏదో తగిలింది.. అవును చుట్టు ఉల్కలు ప్రయాణిస్తున్నాయి కాని ఈ మధ్యలో మాత్రం కాళీ ఉంది.. కాని ఏమి కనిపించటంలేదు అంతా కాళీ అటువైపునున్న ఉల్కలు కూడా కనిపిస్తున్నాయి.. కాని ఉల్కలు గొడ్డలి ఆగిన కాళీ ప్రదేశానికి రాగానే పక్కకి తప్పుకుంటున్నాయి.. చుట్టు తిరిగి చూసాను ఒక చిన్నా గ్రహం అంత ఉంది.. ముట్టుకుంటే గట్టిగా తగిలింది.. ఎంత ప్రయత్నించినా లోపలికి వెళ్లలేకపోయాను.. గొడ్డలి అందుకుని దూరంగా విసిరేసాను మళ్ళీ తిరిగివచ్చి అక్కడే ఆగింది.. అంటే ఇంకా నా మంత్ర అదీనంలోనే ఉంది తన యజమాని దెగ్గరికి వెళ్ళమని అనుగ్రహించాను..

లిఖిత : గొడ్డలితో పగలగొట్టి చూడు

గొడ్డలి అందుకుని పగలగొట్టాలని చూసాను కాని పగలలేదు, మళ్ళీ కొట్టాను.. లాభం లేదు.. నా శక్తీ లిఖిత శక్తి కలిపాను.. అయినా మా ఇద్దరి వల్ల కాలేదు.. ఎందుకో ఇక్కడ నా శక్తి సన్నగిల్లుతుందనిపించింది అది నాకు నచ్చలేదు.. నాకు తెలీకుండానే కోపం వచ్చేస్తుంది.

లిఖిత : రుద్ర నీ శరీరం నా మాట వినట్లేదు

రుద్ర : ఏమైంది

లిఖిత : నీ బాడీని కంట్రోల్ చెయ్యలేకపోతున్నాను.. అంటూ గొడ్డలితో వేటు మీద వేటు వేస్తున్న రుద్రనే చూస్తుంది.. గొడ్డలి దెబ్బ పడినప్పుడల్లా చిన్న నిప్పు రవ్వ.. ఆ చిన్న వెలుగులో రుద్ర నుదిటిన చెమట చుక్క ఒకటి లిఖిత గమనించింది.. ఎప్పుడు లేనిది రుద్ర అలిసిపోయినట్టు చిన్నగా అరిచాడు.. ఒక్కసారిగా ఎవరో బైటికి తోసినట్టు లిఖిత రుద్ర శరీరంలో నుంచి బైటికి వచ్చి పడింది

రుద్ర : ఏమైంది అని బలాన్నంతా కూడదీసుకుని గొడ్డలితో వేటు వేస్తున్నాడు.

లిఖిత : నీ శరీరం.. అనింది చిన్నగా భయపడుతూ.. నల్లగా అవుతున్న రుద్ర శరీరం చూసి

రుద్ర : ఏంటి అని కోపంగా చూసాడు.. రుద్ర కళ్ళు ఎర్రటి నిప్పు కనికలళ్లా అవ్వడం చూసి లిఖిత ఒక అడుగు వెనక్కి వేసింది.. ఓపిక నశించి గట్టిగా అరుస్తూ ఒక్క వేటు వేసాడు.. రుద్ర నుదిటి నుంచి నిలువు కన్ను రూపంలో తెరుచుకుని చిన్న వెలుగు ఒకటి బైటికి వచ్చి ఎమ్మటే మాయమైంది. కాని రుద్ర వేటు వేసిన దెగ్గర చిన్న పలుగు అందులోనుంచి వెలుగు ఒకటి వచ్చి ఉండేకొంది పెరుగుతూ ఉన్నట్టుండి మాయమైపోయి రుద్ర వెనకనుంచి ఒక స్వరం వినిపించింది..

విక్రమాదిత్య : రుద్రా

రుద్ర వెనక్కి తిరిగాడు, తెల్లటి దుస్తుల మధ్యన ఆరు అడుగుల పైన ఉన్న ఒక మనిషిని చూసి రుద్రతో పాటు లిఖిత కూడా ఆశ్చర్యపోయి రుద్ర శరీరంలోకి దూకేసింది.

రుద్ర : ఎవరు నువ్వు?

విక్రమాదిత్య : నాకోసమే కదా నువ్వు ఇంత దూరం వచ్చింది

రుద్ర : విక్రమాదిత్య..?

విక్రమాదిత్య : అవును.. ఆ గొడ్డలి నాదే అని చెయ్యి చాపగానే రుద్ర చేతిలో నుంచి విడిపించుకుని విక్రమాదిత్య చేతిలోకి వచ్చేసింది.. ధ్యానంలో ఉన్న నన్ను ఎందుకు లేపావో తెలుసుకోవచ్చా

రుద్ర : అస్సలు ఎవరు నువ్వు?

విక్రమాదిత్య : విక్రమాదిత్యనే నీలా నాకు రెండు రూపాలు లేవు.. శివుడి తల మీద గంగని ఉంచుకున్నట్టు లిఖితని నీ శరీరంలో దాచుకున్నావు.. నీకు ఇంకో సలహా ఇవ్వనా

రుద్ర : ఏంటి?

విక్రమాదిత్య : ఆ రాక్షస కంధరని నీ గొంతులో దాచుకో లేకపోతే నువ్వు చాలా కష్టాలు పడాల్సొస్తుంది.

రుద్ర : నా గురించి నీకు ఎలా తెలుసు?

విక్రమాదిత్య : నాకింకా చాలా తెలుసు, నీకు కూడా తెలిసే సమయం ఆసన్నమైంది.. అవన్నీ తరువాత ఇప్పుడు వచ్చిన విశేషం...?

రుద్ర : దేవి

విక్రమాదిత్య : మళ్ళీ వచ్చిందా.. తనని వధించడం అసాధ్యం

రుద్ర : మరి ఎలాగా

విక్రమాదిత్య : అదే ఇన్ని వర్షాలు చింతయత్తు.. ఏకం మార్గః తత్ర

లిఖిత : మీరు ఈ కాలం వాళ్ళే కదా ఎందుకు పురాతన సంస్కృతం మాట్లాడుతున్నారు

విక్రమాదిత్య : ఓహ్.. సారీ.. ఋషులతో, నా గురువుగారు పరుశురాముడితో సావాసం చేసి భాష మారుతుంది.

రుద్ర : మీరు ఆయన్ని చూసారా

విక్రమాదిత్య : ఆయన దెగ్గర శిష్యరికం చేసే మహాభాగ్యం నాకు కలిగింది వారితో పాటు ఆంజనేయుల వారి దర్శనం కూడా కలిగింది

రుద్ర : నిజమా.. ఎక్కడున్నారు(ఆతృతగా అడిగాడు.. కాని లిఖితకి మాత్రం ఆంజనేయుడి పేరు ఎత్తగానే ఉచ్చ పడిపోయింది.. కొన్ని తరాలుగా రాక్షస జాతిని ముప్పు తిప్పలు పెట్టిన ఆ ఏకసంతాగ్రహీ, కపీశ్వరుడు.. కుడి చేత్తో ద్రోణగిరి కొందని ఎత్తిన ఆ వీరాధివీరుడు, అసలు సిసలైన బ్రహ్మచారి.. రామభక్త హనుమ అంటే రాక్షసులకి ఎన్ని తరాలు ఎత్తినా ఇంకా హడలే.. ఆ భయమే లిఖిత కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది)

విక్రమాదిత్య : హహ.. మా గురువుగారి తపోవనానికి వెళితే మీకు శ్రీ రామ నామ జపం వినిపిస్తుంటుంది.. అవన్నీ తరవాత ఆ దేవి దెగ్గరికి వద్దాం.

రుద్ర : వచ్చి ఏదో ఒకటి చెయ్యి.. నాకు దారి దొరకడం లేదు

విక్రమాదిత్య : ఎంత మాట.. ఇంకా నీ శక్తిని నువ్వు తెలుసుకోలేదా

రుద్ర : లేదు నా శక్తుల గురించి నాకు తెలుసు

విక్రమాదిత్య : ఏది ఇలా రా అని రుద్ర నుదిటి మీద తన బొటన వేలు పెట్టి కళ్ళు మూసుకున్నాడు.. లేదు నీకేం తెలీలేదు.. ఇప్పుడు నీకు నీ గురించి తెలిసిన శక్తి గోరంత మాత్రమే..

లిఖిత : ఇందాక నేను చూసింది..

విక్రమాదిత్య : అది నిజమే.. అన్ని విషయాలు నీ తదుపరి ప్రయాణంలో తెలుస్తాయి.. వెళ్లి నా గురువుగారిని కలవండి మీకు సహాయం చేస్తాడు.

రుద్ర : ముందు దేవి...?

విక్రమాదిత్య : ఇలా రా ఏం చెయ్యాలో చెప్తాను.. అని రుద్ర చెవిలో ఏదో చెప్పాడు అది రుద్ర శరీరంలో ఉన్న లిఖితకి కూడా వినిపించలేదు.. ఆశ్చర్యంతో భయపడిపోయింది.. లిఖిత.. భయపడకు నేనే నీకు వినిపించేలా చెప్పలేదు.. అని రుద్ర గుండె మీద ధైర్యంగా ఉండమని తట్టాడు..  లిఖిత ఉన్న ప్రదేశం అదే అని ఆయనకి ఎలా తెలిసిందో అని లిఖిత ఇంకా ముడుచుకుపోయింది.

రుద్ర : ఇదంతా నువ్వే చెయ్యొచ్చు కదా

విక్రమాదిత్య : నేను ఆయుధం పట్టను

లిఖిత : రేయి.. ఇక్కడనుంచి వెళ్ళిపోదాం ఈయన ఎవరో పెద్ద మంత్రగాడిలా ఉన్నాడు..

విక్రమాదిత్య : వెళ్ళండి.. వెనకే వస్తున్నాను.. నా చెయ్యి పట్టుకో అనగానే రుద్ర విక్రమాదిత్య చెయ్యి పట్టుకున్నాడు.. రుద్రని ఎత్తి ఒక్క రౌండు తిప్పి కింద ఉన్న భూమి మీదకి విసిరేసాడు..

రుద్ర శరీరం కిందకి వస్తున్న వేగానికి రుద్ర తట్టుకోలేక కళ్ళు మూసుకుంటే లిఖిత బిక్కు బిక్కుమంటూ రుద్ర శరీరంలో కూర్చుంది. విక్రమాదిత్య నవ్వుతూ తన గొడ్డలని చూసాడు.

విక్రమాదిత్య : (గొడ్డలని చూస్తూ) మిత్రమా ఎలా ఉన్నావ్.. నా రక్షకి రక్షగా ఉండమన్నాను నీ కర్తవ్యాన్ని బాగానే నిర్వర్తించినట్టున్నావ్.. పద మనం కూడా వెళదాం అని గొడ్డలిపై తన పిడికిలి బిగించగానే తెల్లటి దుస్తులు మాయమయ్యి మాములు ప్యాంటు షర్ట్ వచ్చేసాయి.
Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమాదిత్య - by Pallaki - 12-11-2022, 06:49 PM



Users browsing this thread: 37 Guest(s)