Thread Rating:
  • 2 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అష్టావధానం స్క్వేర్ సాఫ్ట్వేర్
#2
కాల్ అయిపోగానే హాల్ లోకి వచ్చి ఒకసారి షాక్ తిన్నాను వ్యోమగామి ఎవరబ్బాఅని. నెమ్మది గా అర్థం అయ్యింది అది సరుకుల కోసం బయటకు వెళ్ళటానికి రెఢీ అయిన కిరణ్ అని. మా పాపకూడా కూడా వెళ్తానని మారాం చేస్తే వద్దని గట్టిగా చెప్పాను. అందుకు అదిఒక మూల చేతులు కట్టుకొని బుంగ మూతి పెట్టుకునికూర్చుంది. అది చేతులు కట్టుకుందంటేఏదో బాధ పడుతోందని అర్థం. కిరణ్ వెళ్ళిపోయాక ఏమయ్యింది అమ్మాఅని దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను.
 
అమ్మా మామూలుగా అయితే పాటికి సమ్మర్ సెలవులకి వేరే ఊరు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అపార్ట్మెంట్ దాటి వెళ్లటానికే వీలు లేదు. నాకు కరొన నచ్చలేదమ్మాఅంది.
 
అప్పుడు మా పాప కి నేనెప్పుడో చిన్నప్పుడు చదివిన కధ చెప్పాను. నన్ను నేను రోజూ సమాధాన పరచుకుంటున్న కధ.
 
పూర్వం ఒకతను ఒక తన బాధ నుండి ఉపశమనం పొందటానికి ఒక స్వామీజీ ని వెళ్ళి కలిశాడుట.
 
స్వామీ నా ఇల్లు చాలా ఇరుకు గా ఉంది, నాకు ఏదైనా ఉపాయం చెప్పండిఅని అన్నాడుట.
 
మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు?” అని అడిగాడుట స్వామీ జీ. “మా అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, తమ్ముడు, చెల్లెలు అందరం ఒక చిన్న గది లోనే ఉంటున్నాంఅన్నాడుట.
 
నీ వద్ద ఇంకా ఏమైనా జంతువులు ఉన్నాయా?” అని అడిగాడుట స్వామీజీ
 
“4 గేదెలు, 5 గొర్రెలు, 10 కోళ్ళు ఉన్నాయిఅని చెప్పాడుట అతను.
 
అయితే కోళ్లను ఇంట్లో కట్టేయిఅని చెప్పాడుట స్వామీజీ.
 
అతను భక్తి గా స్వామీజీ చెప్పిన మాట విన్నాడు. ఇల్లు ఇంకా ఇరుకు అయ్యింది .
 
మళ్ళీ స్వామీజీ దగ్గరకు వెళ్ళి చెప్పాడుట. సారి స్వామీజీఆ మేకలను కూడా ఇంట్లో కట్టేయమన్నారు.
 
ఇదేమి స్వామీ జీ అమ్మా ఇలా చెప్తున్నారు. ఇల్లు ఇంకా ఇరుకు అయిపోదుఅన్నది పాప అసహనంగా.
 
పూర్తి గా విను , అతను గురువు గారి మాట మళ్ళీ విన్నాడు. ఇల్లు ఇంకా ఇరుకు అయ్యింది, ఇంట్లో అందరికీ పడుకోవటమే కష్టం అయ్యింది అని ఒక నిమిషం ఆగాను.
 
తరువాత కధ నేను చెప్తాను స్వామి మిగిలిన గేదెలను కూడా ఇంట్లో కట్టేయమంటాడు ఇంకేముంది, అబ్బాయి వింటాడు, ఇల్లు ఇంకా ఇరుకు అయిపోతుంది. సరే మరి తరువాత ఏమవుతుంది, ఇంక అతని దగ్గర జంతువులు ఏమి లేవు కదాఅంది పాప తొందరగా విషయం చెప్పమన్నట్లు గా.
 
అప్పుడు స్వామి అతన్ని ఇంట్లో ఉన్న గేదె లను, మేకలను, కోళ్లను అన్నింటినీవదిలేయమని చెప్పారుట . అప్పుడు అతను ఆనందం గా ఇంటికి పరిగెత్తాడుట. అలా విప్పేశాక ఎంతో ఆనందంగా అనిపించిందిట, ఇల్లు విశాలం గా అనిపించిందిట అని నేను కధ ముగించాను.
 
ఇప్పుడు అర్థం అయ్యింది స్వామీ జీ క్రొత్త గా అతనికి జాగా ఇవ్వలేదు కానీ ఉన్నదే ఇప్పుడు పెద్ద గా అనిపింస్తోంది.” అంది పాప జ్ఞానోదయంఅయినట్లు.
 
అంతే, సరిగ్గా దేవుడు కూడా అంతే. మనకు ఉన్న జీవితం పట్ల సంతృప్తి లేనప్పుడుదేవుడు మధ్యలో ఇలా చిన్న చిన్న కష్టాలు ఇస్తాడు. అవి తీరిపోయాక మనకి ఉన్న జీవితం మునుపటి కంటే సంతోషం గా అనిపిస్తుందిఅని కధను పూర్తి చేశాను.
 
పాప సరే అని గెంతుకుంటూ వెళ్ళిపోయింది. నిజం గా కధలకు ఎంత శక్తి ఉంది, చిన్నప్పుడు ఎప్పుడో చదివిన కధ ఇప్పుడు ఉపయోగపడింది అనుకుంటూ
 
డైరీ ఓపెన్ చేసి కధరాయటం మొదలు పెట్టాను - " కరొన వచ్చినప్పటి నుండి నాకు ఎందుకో నచ్చటం  లేదు
 
కొద్ది సేపటికి ఎవరో కొట్టిన శబ్దం. అన్నా చెల్లెళ్ల యుద్ధం మొదలైనట్లుంది. ఇంకేముంది కధ ఇంతటితో అయిపోయింది

నా అష్టావధానం సాఫ్ట్వేర్ మాత్రం పరిగెత్తుతూనే ఉంటుంది.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అష్టావధానం స్క్వేర్ సాఫ్ట్వేర్ - by k3vv3 - 04-11-2022, 06:40 PM



Users browsing this thread: 1 Guest(s)