Thread Rating:
  • 14 Vote(s) - 2.93 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నా ముగ్గురు పెళ్లాలు
#45
నీ భర్త నీకు చేసింది అన్యాయమే, కాదనను అందుకని నువ్వు నీ జీవితం ఇలా ఒంటరిగా నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు మళ్ళీ నీ జీవితాన్ని మొదలు పెట్టాలి, మళ్ళీ నీ జీవితంలో నవ్వులు చిగురించాలి, ఇదే నేను కోరుకుంటాను. ఇక ఉంటాను, మళ్ళీ నా మొహం నీకు చూపించను." అంటూ వెళ్ళడానికి పైకి లేచి, ఒక్కసారి బుజ్జిగాడిని చూసి, తలుపు వైపు వెళ్ళాను. తలుపు దగ్గిర ఉన్న నా బ్యాగ్*ని తీస్కుని, బయటకు వెళ్ళబోతుండగా, "బావా.." నేను బొమ్మలాగా నిలబడిపోయా. "బావా, నిజంగానే వెళ్తున్నావా?" గొంతులో జీర స్పన్ష్టంగా వినిపిస్తుంది. "నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా?" ఈసారి నేను వెనక్కు తిరిగాను. తన కళ్ళు కన్నీరు కారుస్తూనే ఉన్నాయి. నా కళ్ళలోకి చూస్తూ, బాధగా అడుగుతుంది. "బావా, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావా?" అంటూ అమాంతంగా లేచి నన్ను కావలించుకుంది.నా బ్యాగ్ కిందపడిపోయింది.నా చేతులు అప్రయత్నంగా తనని నా గుండెలకేసి హత్తుకున్నాయి. తను నా చుట్టూ చేతులు వేసి, ఘాడంగా నన్ను హత్తుకుని, వెక్కి వెక్కి ఏడ్చింది. తన అశ్రుధారలు నా షర్ట్*ని తడిపేస్తున్నాయి. నాకు ఆనందం పట్టలేకపోతున్నా.మనసు ఇప్పుడు కుదుటపడింది. "నన్ను వదలి వెళ్ళకు బావా, మమ్మల్ని వదిలి వెళ్ళకు" అంటూ మళ్ళీ నన్ను గట్టిగా హత్తుకుంది. "వెళ్ళను స్నేహా, నిన్ను వదిలి వెళ్ళను.." అని మరింతగా హత్తుకున్నా. నా రెండు చేతులతో తన మొహాన్ని పైకెత్తి, నా రెండు బొటనవేళ్ళతో, తన కణ్ణీళ్ళని తుడుస్తూ, "నీమీద నీకు నమ్మకం పోగొట్టుకోకు, అప్పుడే మనకి ఈ ప్రపంచం మీద నమ్మకం పోతుంది.ఇక నించి నువ్వు నవ్వుతూ, తుళ్ళుతూ ఉండాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికి ఆనందం పంచాలి. ముఖ్యంగా బుజ్జిగాడి ఫ్యూచర్ నీ మీద ఆధారపడుంది. సరేనా.." "హు అలాగే.." మా ఇద్దరి కళ్ళు కాసేపు అలానే లాక్ అయిపోయాయి, ఆ ఒక్క క్షణంలో కోటి భావాలు పలికాయి. తను మంద్రంగా నవ్వింది. అందులో సిగ్గు, ఆనందం, గుండెల్లో ఒక భారం దిగిపోయినట్లు, మనసంతా తేలికగా అయ్యినట్లు నవ్వింది. తన అందమైన పలువరుస, నా గుండెల్లో కోటి వీణలు మ్రొగించాయి. మెల్లగా నేను తన నవ్వులో నవ్వు కలిపాను, కాసేపు ఇద్దరం మనసార నవ్వుకున్నాం, ఒకర్నొకరం కొత్తగా పలకరించుకున్నాం. "ఆకలిగా ఉందా.." "హు..మరి నీకు.." "నాకు కూడా,పద నీకు ఎదైనా చేసి పెడతా.." అంటూ తనతో పాటుగా కిచెన్లోకి వెళ్ళాను. ఈ కొత్త అనుభవంతో పాపం న బ్యాగ్ మళ్ళీ యధా స్థానంలోకి వెళ్ళిపోయింది, అదే, గది మూలకి. ఆ రాత్రి అలా గడిచిపోయింది, ఇద్దరం ఎన్నో చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాం. హాయిగా నవ్వుకున్నాం. తను ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మనలో మార్పు రావడానికి ఎంతో సమయం పట్టదు. ఒకే ఒక్క క్షణం చాలు, మనకి మనం కొత్తగా కనపడతాం.  మర్నాడు పొద్దున్నే నేను లేచే సరికి, తుఫాను కాస్త తగ్గినట్లు ఉంది. బయట కొంచెం వెలుగు వచ్చింది, వర్షం పడుతూనే ఉంది, నేను ఫ్రెషప్ అయ్యి కిందకు వెళ్ళే సరికి, స్నేహా కిచెన్లో ఏదో చేస్తుంది, "హెయ్ స్నేహా, గుడ్ మార్నింగ్..అప్పుడే లేచావా? బుజ్జిగాడికి ఎలా వుంది.." "హెయ్ బావ, గుడ్ మార్నింగ్..వాడికి తగ్గింది, కూర్చో నేను టిఫిన్ తెస్తా.. అమ్*లెట్ చేశాను" "ఓకే..బుజ్జిగాడిని చూస్తాను.." అంటూ వాళ్ళ రూమ్*కి వెళ్ళాను. వాడు బాగ నిద్దరలో ఉన్నాడు. "నేను హాల్ కి వచేప్పటికే, స్నేహా నాకు టిఫిన్ టేబిల్ పైన పెట్టింది. తనూ తెచ్చుకుంది, తనని చూస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. "స్నేహా, ఐ యాం వెరీ హ్యప్పీ ఫర్ యు, నువ్వు ఇలా సంతోషంగా ఉంటే ఎంత బాగున్నావో తెలుసా,యు లుక్ గ్రేట్" "అంతా నీ వల్లనే బావా, చాల థాంక్స్, నిన్న నువ్వు చెప్పినప్పుడు నేను బాగా ఆలోచించాను, నువ్వే కరెక్ట్, ఐ యాం రియల్లీ థాంక్ ఫుల్ టు యు.." "ఓకే ఓకే, ఫార్మాలిటీస్ కొంచెం ఎక్కువయ్యాయి..సరే ఇవ్వాళ ఏం చేద్దాం, ఈ వర్షం కొంచెం తగ్గింది, కాని సైక్లోన్ అలానే ఉంది అనుకుంటా.." "అవును బావ, వర్షం కొంచెం తగ్గితే అలా బీచ్ వైపు వెళ్దాం.." "ఓకే డన్.." ఇద్దరం టిఫిన్ తినేసి, కిచెన్లోకి వెళ్ళాం. అక్కడంతా క్లీన్ ఇద్దరం కలిసే చేశాం. తర్వాత తన రూంలోకి వెళ్ళి, పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. తను ఎంత మాట్లాడుతుందంటే, నాకు అస్సలు టైమే తెలియట్లేదు. తననే చూస్తున్నాను, మనసులో తనమీద ఎందుకో తెలియని ఆరాధనా భావం కలుగుతుంది.






[+] 9 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: నా ముగ్గురు పెళ్లాలు - by LUKYYRUS - 12-11-2018, 12:09 PM



Users browsing this thread: 7 Guest(s)