Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అంతటి దేవకన్య దేవతల మధురస్మృతుల మాధుర్యాలతో హాయిగా నిద్రపోతున్న నా మనసుకు మరింత హాయిదనం ........ బుజ్జిదేవుడా - బుజ్జిహీరో అంటూ మిక్కిలి హాయిని గొలిపే ప్రియాతిప్రియమైన పిలుపులు , అంతటి ప్రాణంలా ఎవరు పిలిచి ఉంటారో ఈపాటికి అర్థమయ్యి ఉండాలే ...... బుజ్జిదేవుడా అంటూ నా తొలి శృంగారదేవత పెద్దమ్మ నిద్రపోతున్న నా పెదాలపై తియ్యదనం - ఇక బుజ్జిహీరో అంటూ పెద్దమ్మ కంటే ప్రాణంలా స్వరంలో మిక్కిలి సంతోషంతో పలకరించినది జానకమ్మ , అంతటి సంతోషమైన పిలుపుకు నా పెదాలపై మరింత తియ్యదనం పరిమళించడం చూసి పెద్దమ్మ తియ్యగా అసూయ చెందడం ....... , లవ్ యు పెద్దమ్మా అంటూ నిద్రలోనే ఫ్లైయింగ్ కిస్ వదలడంతో సిగ్గు ...... , ఆహ్హ్ పెద్దమ్మా ........ అంటూ నిద్రలోనే నా చెయ్యి గుండెలపైకి చేరింది , ఈ సిగ్గు - కొంటె నవ్వులతోనే కదా ఎలాంటి మగాళ్లనైనా అదే అదే నాలాంటి బుజ్జి మగాళ్లనైనా కొంగున కట్టేసుకుంటారు లవ్ యు లవ్ యు లవ్ యు సో సో మచ్ పెద్దమ్మా ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........
పెద్దమ్మ మరింత సిగ్గుపడటం చూసి మీమధ్యన పానకంలో పుడకలా నేనెందుకు అంటూ జానకమ్మ దూరంగా వెళ్లబోవటం చూసి ఆపారు పెద్దమ్మ , బుజ్జిదేవుడా ..... మేమిద్దరం నిన్ను అభినందించడానికి వస్తే నువ్వు మమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తున్నావు పొగడ్తలతో కాస్త విరామం ఇవ్వు అంటూ పొగడ్తలను మనసారా ఆస్వాదిస్తూనే అన్నారు .
నన్ను అభినందించడానికా దేనికి పెద్దమ్మా .......
జానకమ్మ : పెద్దమ్మా ...... ఒక సవరణ , పొగుడుతున్నది ఇద్దరినీ కాదు మిమ్మల్ని మాత్రమే .......
పెద్దమ్మ : నిన్ను పొగిడే సమయం కూడా దగ్గరలోనే ఉందిలే జానకీ అంటూ జానకమ్మ నుదుటిపై ముద్దుపెట్టారు .
Wow బ్యూటిఫుల్ ....... ఈ అందమైన ముద్దు దృశ్యాన్ని నా బుజ్జిజా ...... మీ మహి చూసి ఉంటే చాలా అంటే చాలా ఆనందించేది జానకమ్మా ........
జానకమ్మ : నా బుజ్జిజానకి .......
క్షమించండి జానకమ్మా ......
జానకమ్మ : ఎందుకు క్షమాపణ నీ బుజ్జిజానకేలే అదే నాకూ సంతోషం ...... , నువ్వు పంచిన ఆ సంతోషాన్ని తనివితీరా చూసే కదా పెద్దమ్మను కోరిక కోరి నీకలలోకి వచ్చింది .
పెద్దమ్మ : అవునవును ఎందుకు క్షమాపణ - సీక్రెట్ ఏదీలేకుండా చేసేసావుకదా ...... 
పెదాలపై తియ్యదనం ...... మరి నా ముద్దుల పెద్దమ్మ పేరుని తలుచుకోకుండా చూడకుండా ఉండటం నావల్ల కానేకాదమ్మా - ఇప్పటికైనా మించిపోయింది ఏమీలేదు మీ మిషన్ కోసం వేరెవరినైనా సెలెక్ట్ చేసుకొని ఉండాల్సింది - అయినా నాకూ ఇష్టమేలే జానకమ్మ సంతోషంగా ఉండాలి , జానకమ్మా ...... మహి సంతోషాన్ని చూసారా ? .
జానకమ్మ : ఎవరో ఏమౌతానో తెలియని నాకోసం .......
" అమ్మ జానకమ్మ ...... " ఈ ఒక్కటి చాలదూ ...... , అమ్మా ...... బాధపడకండి స్మైల్ స్మైల్ ...... మీ పెదాలపై చిరునవ్వు దూరం కాకుండా చేస్తానుగా .......
జానకమ్మ : లవ్ ....... sorry థాంక్యూ సో మచ్ బుజ్జిహీరో అంటూ సిగ్గుపడుతున్నారు .
పెద్దమ్మ : అంతకంటే ప్రేమతో పిలిచే రోజుకూడా వస్తుందిలే జానకీ అంటూ మరొక ముద్దు .......
జానకమ్మ : సంతోషంతో పెద్దమ్మ గుండెలపైకి చేరారు .
పెద్దమ్మ : తల్లీజానకీ ఏదో సవరణ అన్నావు , అన్న క్షణాల్లోనే సిగ్గులొలికిపోతున్నావు .......
జానకమ్మ : లేదు లేదు అంటూనే సిగ్గుపడటం చూసి ఇద్దరూ నవ్వుకుంటున్నారు - మీరు అన్నది నిజమే పెద్దమ్మా ...... మనం , బుజ్జిహీరోని అభినందించడానికి వస్తే మనల్ని అంటూ మరింత మరింత మురిసిపోతున్నారు .

అభినందించడానికి వచ్చామని అంటున్నారే తప్ప ........ కలవరిస్తుండగానే ఇద్దరూ చెరొకవైపుకు చేరి వొళ్ళంతా తియ్యదనం పులకరించేలా చెరొకబుగ్గపై గట్టిగా ముద్దులుపెట్టి సంతోషంతో నవ్వుకుంటున్నారు .
ఆహ్హ్ ....... అంటూ బుగ్గలపై స్పృశించుకుంటూ ఆనందానికి లోనౌతున్నాను , wow wow పెద్దమ్మా - జానకమ్మా ...... మీ అభినందన ఎంతబాగుందో లవ్ యు థాంక్యూ సో సో మచ్ , జానకమ్మా ...... మీ ముద్దులోనే తెలిసిపోతోంది మహి సంతోషాన్ని ఎంతలా ఆస్వాదించారో ....... , అంతే ఒక్కసారిగా నిశ్శబ్దం ...... , జానకమ్మా పెద్దమ్మా జానకమ్మా పెద్దమ్మా ....... 
పెద్దమ్మ : ఎక్కడికీ వెళ్లలేదులే .......
జానకమ్మ : మహికాదు , నీ బుజ్జిజానకి .......
సరే జానకమ్మా ....... నా బుజ్జిజానకి అంటూ మురిసిపోతున్నాను .
జానకమ్మ : నీ మనసులో మరొక పేరుని కూడా ముద్రించుకున్నావే ఏమిటి ఏమిటి బుజ్జిహీరో ....... , పెద్దమ్మా ...... విన్నారుకదా ....
పెద్దమ్మ : విన్నాను విన్నాను .
పెదాలపై తియ్యదనంతోనే లేదే ఏమేలేదే అన్నాను .
అంతే ఇద్దరూ తియ్యనైనకోపంతో బుగ్గలను గిల్లేసారు , ఏమిటీ ఏమిటీ ..... నీ హృదయస్పందననే కదా .......
మీకు సంతోషమైతేనే జానకమ్మా ........
జానకమ్మ : మా మాటలు - సంతోషంలో అంతులేని ఇష్టం అని తెలియడం లేదా బుజ్జిహీరో ....... , స్వయానా బుజ్జిదేవుడి హృదయస్పందన కావడం కంటే మరొక సంతోషం ఏముంటుంది అంటూ నా బుగ్గపై ముద్దులవర్షమే కురుస్తోంది .
మరొక బుగ్గ ఖాళీనే కదా అన్నట్లు జనకమ్మతోపాటు పెద్దమ్మ ముద్దులు ........
యాహూ యాహూ ..... రెండు మూడు ..... ఐదు ఆరు ..... పది ...... అంటూ కౌంట్ చేస్తూ ఆనందం పట్టలేక థాంక్యూ సో మచ్ జానకమ్మా అంటూ లేచి కూర్చున్నాను , అంతే ఒక్కసారిగా ముద్దులు ఆగిపోయాయి - జానకమ్మా పెద్దమ్మా జానకమ్మా ..... అంటూ రెండువైపులా చూస్తే లేరు , అయ్యో ...... అనవసరంగా లేచానే బుద్ధిలేదురా నీకు ఎంత సంతోషమైతే మాత్రం లేచెయ్యడమేనా అంటూ లెంపలేసుకోబోయి నో నో నో ముద్దుల మాధుర్యం అంటూ బుగ్గలపై ముద్దులను గుండెలమీదకు తీసుకుని మురిసిపోతున్నాను , లవ్ యు పెద్దమ్మా - థాంక్యూ జానకమ్మా ......... , ఈ బ్యూటిఫుల్ - హ్యాపీఎస్ట్ విషయాన్ని బుజ్జిజానకి నా బుజ్జిజానకి నా హృదయస్పందన మరియు హెడ్ మిస్ట్రెస్ మేడమ్ తో పంచుకోవాలి రేపు కాలేజ్లో ....... , ప్చ్ చెబితేమాత్రం నమ్ముతారా ఏమిటి మెప్పు పొందడానికి చెబుతున్నానని అనుకుంటారు , ఇప్పుడెలా ఇప్పుడెలా పెద్దమ్మా ..... ఐడియా ...... లవ్ యు లవ్ యు పెద్దమ్మా అంటూ ప్రక్కనే ఉన్న కాలేజ్ బ్యాగులోనుండి చార్ట్ మరియు డ్రాయింగ్ ఐటమ్స్ తీసుకుని పెద్దమ్మ - జానకమ్మ కలిసి ఒకేసారి ముద్దులు పెడుతున్న అందమైన దృశ్యాన్ని అంతే అందంగా డ్రా చేసి కలర్స్ వేసాను , జానకమ్మ రూపు అందంగా వచ్చింది కానీ పెద్దమ్మకు మాత్రం కలర్స్ అంటుకోవడం లేదు , స్కెచస్ మార్చినా ఉపయోగం లేకపోయింది , అంతా పెద్దమ్మ మాయ అనుకుని అలానే వదిలేసాను , బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటూ గుండెలపై హత్తుకుని వెనక్కు వాలిపోయాను , పెద్దమ్మా పెద్దమ్మా ...... మరొక కోరిక - జానకమ్మను ...... మహి అదే అదే నా హృదయస్పందన దగ్గరకు తీసుకుళ్లగలరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ బుజ్జిజానకి సంతోషం ....... మాటల్లో వర్ణించడం అసాధ్యమే .......
బుగ్గపై ఘాడమైన ముద్దు ....... నో నో నో కళ్ళుమాత్రం తెరవకూడదు అంటూ మరింత గట్టిగా మూసుకుని , ముద్దుని ఆస్వాదిస్తూనే జానకమ్మను థాంక్యూ చెబుతూనే హాయిగా నిద్రపోయాను - మళ్లీ మెలకువ వచ్చినది అలారం చప్పుడుకే ..........

అలారం మొదటి చప్పుడుకే లేచి ఆఫ్ చేసాను , గుండెలపై ఉన్న ముద్దుల చార్ట్ లోని పెద్దమ్మ పెదాలపై ముద్దుపెట్టాను - స్వయానా నా శృంగారదేవత పెద్దమ్మ పెదాలను తాకినట్లు మృదువుగా వెచ్చగా అనిపించడంతో నవ్వుకుని లవ్ యు పెద్దమ్మా అంటూ చార్ట్ ను జాగ్రత్తగా కాలేజ్ బ్యాగులో ఉంచాను , అంటీ వాళ్ళను చూసి దాదాపు 6 గంటలు పైనే అయ్యింది వెంటనే చూడాలి లేకపోతే ఎలా ఈ బుజ్జి హృదయం గోల గోల చేసేలా ఉంది అంటూ పెదాలపై తియ్యదనంతో బాత్రూం వైపుకు పరుగులుతీసాను . 
కాలకృత్యాలు తీర్చుకుని షవర్ కిందకు చేరాను , నిన్న రాత్రి ఫుడ్ - tastiest ఐస్ క్రీమ్స్ వలన అంటీ వాళ్ళు చాలా హ్యాపీ వాళ్లకు మళ్లీ దగ్గరవ్వడానికి ఇదే సమయం అంటూ చకచకా స్నానం పూర్తిచేసి వచ్చి కాలేజ్ డ్రెస్సులోకి మారిపోయాను .
కాలేజ్ బ్యాగ్ అందుకునేంతలో పెద్దమ్మ లోకం నుండి పెద్దమ్మ వండినట్లు టిఫిన్ ప్రత్యక్షం అయ్యింది టేబుల్ పై , లవ్ యు పెద్దమ్మా ...... ఇప్పుడైతే ఆకలిగా లేదు - రాత్రి ప్రేమతో తినిపించిన ముద్దులే ఇంకా అరగలేదు అంటూ నవ్వుకున్నాను , వెంటనే అంటీ వాళ్ళను చూడాలి - మన లోకపు ఈ అమృతం లాంటి మా పెద్దమ్మ చేతివంటను అంటీలు తిని ఆనందిస్తే అంతకంటే ఆనందం మరొకటి లేదు - నా కడుపు కూడా నిండిపోతుంది అంటూ ప్రకృతి ప్రసాద టిఫిన్ ను బుట్టలో ఉంచుకుని వడివడిగా బయటకు చేరాను .

తల్లులూ ...... కాలేజ్ సమయం అవుతోందికదా ఇంకా టిఫిన్ కూడా తినాలి తొందరగా రెడీ కండి అంటూ అంటీలు ప్రాణంలా అక్కయ్యలను ఆత్రం పెట్టడం విని ఆహ్హ్ ....... అంటూ హృదయంపైకి ఆటోమేటిక్ గా చెయ్యి వెళ్ళిపోయింది - అమ్మో ......... అంటీలు అంటే నాకంటే ఇష్టం అన్నమాట నా హృదయానికి అంటూ మురిసిపోయాను . 
అంతలో అంటీలు ఒక్కొక్కరుగా బయటకు రావడం , hi hi hi అంటీ అంటూ చిరునవ్వులు చిందిస్తూ పలకరించి గుడ్ మార్నింగ్ చెప్పడం - అంటీలు రుసరుసలాడే కోపాలతో చూసి వెళ్లడం చూస్తూ ఆనందిస్తున్నాను , అమ్మో చూస్తుంటే అంటీల కోపం తగ్గనట్లు లేదు - పెద్దమ్మ చెప్పినట్లు ఎంత కోపం ఎక్కువైతే అంత ప్రేమ కురుస్తుంది అని తలుచుకుని బయటకు వచ్చిన ప్రతీసారీ చిరునవ్వుతో పలకరిస్తూనే ఉన్నాను , టిఫిన్ చల్లారిపోతుందని ధైర్యం చేసి మెయిన్ గేట్ దగ్గరికి వెళ్లి అంటీ అంటీ అని పిలిచాను .

మహేష్ తమ్ముడూ మహేష్ అంటూ గుమ్మాల దగ్గరికి పరుగునవచ్చారు ముగ్గురు అక్కయ్యలు - మూడు ఫ్లోర్స్ నుండి గుడ్ మార్నింగ్ తమ్ముడూ గుడ్ మార్నింగ్ తమ్ముడూ గుడ్ మార్నింగ్ మహేష్ అంటూ పలకరించి చిరునవ్వులు చిందిస్తున్నారు .
గుడ్ ....... మీరా అక్కయ్యలూ , అంటీలేమో అనుకున్నాను any వే గుడ్ మార్నింగ్ అక్కయ్యలూ ........
తమ్ముడూ తమ్ముడూ మహేష్ ..... నిన్నూ అంటూ చిరుచిరు కోపాలతో కిందకువచ్చి కొట్టబోయి ఆగి బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి విషెస్ చెప్పారు - ఏంటి ఉదయం ఉదయమే ధైర్యంగా అమ్మలను పిలుస్తున్నావు .
తప్పలేదు అక్కయ్యలూ ....... మిమ్మల్ని చూడకపోయినా ఉండగలను కానీ అంటీలను చూడకుండా - అంటీల కోపాలను ఆస్వాదించకుండా ఉండనేలేను అంటూ అక్కయ్యల కోపాలను చూస్తూనే నవ్వుకుంటూ అన్నాను .
అక్కయ్యలు : అంటీలు అంటీలు ....... అయితే నీ అంటీలతోనే మాట్లాడు అంటూ కోపాలతో వెళ్లిపోతున్నారు .
అక్కయ్యలూ అక్కయ్యలూ .......
అక్కయ్యలు : ఇలా కోప్పడితేనేకానీ మనపై ప్రేమ బయటకు రాలేదు అంటూ సంతోషంతో వెనక్కు వచ్చారు .
లేదు లేదు అలాంటిదేమీ లేదు అక్కయ్యలూ ....... , అంటీలకోసం నిన్నటిని మించిన టిఫిన్ తీసుకొచ్చాను .
అక్కయ్యలు : నిన్నటి వంటలను మించినదా చెప్పవే లోపలికి రా ....... అమ్ములు స్వయంగా పిలిస్తేనేకదా ప్చ్ ప్చ్ ప్చ్ ...... అంటూనే టిఫిన్ అందుకుని బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు .
అక్కయ్యలూ ....... మీకు కాదు అంటీ వాళ్లకు .......
కోపంతో బుగ్గలపై గిల్లేసి కింద ఇంటిలోపలికి వెళ్లారు ఆతృతతో ....... 
అయ్యో ...... అంటీలకు మిగులుతుందో లేదో , అక్కయ్యలూ అక్కయ్యలూ ...... అంటీలు కనీసం టేస్ట్ చేసేలా అయినా చూడండి ప్లీజ్ ప్లీజ్ ...... 
తల్లులనే తినకండి అని చెబుతున్నాను మేము తింటామా అంటూ వాసంతి అంటీ గుమ్మం దగ్గరకువచ్చి కోపంతో చూస్తున్నారు .
మా అంటీ కోపంతో చూసినా హ్యాపీ .......
వాసంతి అంటీ : బయటకు రావడం నా బుద్ధి తక్కువ అంటూ రుసరుసలాడుతూ లోపలికివెళ్లిపోయారు .
అంటీ అంటీ ...... అమృతం లాంటి టిఫిన్ కాస్తయినా టేస్ట్ చేయండి తరువాత మీరే కావాలి కావాలి అంటారు .
వాసంతి అంటీ : అలా జరగనే జరగదు .
తమ్ముడూ మహేష్ తమ్ముడూ ....... సూపర్ సో సో టేస్టీ ...... అమ్మలను మించిన టేస్ట్ , లవ్ యు అమ్మా మొత్తం మేమే తినేస్తాము , అమ్మా అమ్మా ...... మీ టిఫిన్ కూడా అవసరం లేదు అంటూ అంటీ బుగ్గలపై ముద్దులుపెట్టి లోపలికివెళ్లారు .
అక్కయ్యలూ అక్కయ్యలూ ....... కొద్దిగా కొద్దిగా అంటీలకు ఉంచండి .
వాసంతి అంటీ : నాకేమీ అవసరం లేదులే .......
అంతలో కాంచన - సునీత అంటీలు కూడా వచ్చారు - చిరునవ్వులు చిందిస్తూ చూసి అంటీలూ ...... tastiest టిఫిన్ కాస్త టేస్ట్ చేయండి .
అంటీలు : పైనుండి మొత్తం విన్నాములే , వాసంతి చెప్పింది కదా , మాకేమీ వద్దు లోపలికి వెళదాము పదండి లేకపోతే కళ్ళతోనే కోరుక్కుతినేలా చూస్తున్నాడు .
అంటీలను కొనుక్కుని తినడమా ఆహ్హ్ ....... ఆ ఊహనే ఎంత బాగుంది , తప్పు తప్పు అంటూ లెంపలేసుకున్నాను .
ఇంకా గట్టిగా కొట్టుకో కొట్టుకో అంటూ నవ్వుకుంటూ లోపలికివెళ్లిపోయారు .
అక్కయ్యలూ అక్కయ్యలూ ....... కొద్దిగా కొద్దిగానైనా అంటీలు టేస్ట్ చేసేలా చూడండి ప్లీజ్ ప్లీజ్ అని చెబుతూనే ఉన్నాను .

కొద్దిసేపటి తరువాత కాలేజ్ సమయానికి wow wow సూపర్ టేస్ట్ ఇలాంటి టిఫిన్ టేస్ట్ చెయ్యడం మా అదృష్టం అంటూ ఫుల్ గా తిన్నట్లు స్కూటీ కీస్ తీసుకుని వచ్చి బ్యాగ్స్ ను - లంచ్ బ్యాగ్స్ ను స్కూటీలలో ఉంచారు . తమ్ముడూ తమ్ముడూ ...... నీ అంటీలకు ఏమాత్రం మిగల్చకుండా మొత్తం తినేసాము the best థాంక్యూ థాంక్యూ సో మచ్ ........
అక్కయ్యలూ ........
అక్కయ్యలు : అంత టేస్ట్ ఉంటే ఇలానే జరుగుతుంది మరి , కాలేజ్ కు లేట్ అవుతుంది వెళదాము పదా , ఈరోజు వాగ్దేవి వంతు .......
అంటీలు : తల్లులూ ...... బస్సులో వెళతాడులే .
అవునవును అంటీలు ఎలా ఆర్డర్ వేస్తే అలా బస్సులోనే వెళతాను .
అంటీలు : ఆర్డర్ వెయ్యడానికి నువ్వేమైనా మావాడివా ...... , నువ్వు వేరే మేము వేరే , తల్లులూ ...... జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళండి అంటూ అక్కయ్యల నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టారు .
Wow బ్యూటిఫుల్ అంటూ మొబైల్లో క్లిక్ మనిపించాను - అంతటి అదృష్టం నాకెప్పుడో అంటూ ఊహల్లోకి వెళ్ళిపోయాను .
అంటీలు : హాల్లో హాల్లో ...... ముందు ఆ ఫోటోలను డిలీట్ చెయ్యి అంటూ కోపంతో చెప్పారు .
అంటీలూ ........
అమ్మలూ అమ్మలూ అమ్మలూ ...... లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ గుండెలపైకి చేరి మాటమార్చి నావైపు చూసి కన్ను కొట్టడంతో , థాంక్స్ అక్కయ్యలూ అంటూ అంటీలవైపుకు తిరిగి తిరిగి చూస్తూనే బస్టాప్ వైపుకు నడిచాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 03-12-2023, 09:04 AM



Users browsing this thread: 25 Guest(s)