Thread Rating:
  • 14 Vote(s) - 2.93 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నా ముగ్గురు పెళ్లాలు
#42
ఇంకొంచెం వెన్నక్కు అడుగు వేసి, విన్నా, "అవును అది బుజ్జిగాడి ఏడుపే..అనుమానం లేదు.." అనుకుంటూ వెంటనే తలుపు వేసేసి, స్నేహా రూమ్ వైపు నడిచా, రూమ్ డోర్ తెరిచే వుంది, దగ్గరికి వెళ్ళే కొద్ది ఎడుపు స్పష్టంగా వినిపించ సాగింది, రూమ్ లోకి వెళ్ళి చూసే సరికి, స్నేహ వాడిని తన వొళ్ళో కూర్చోపెట్టుకుని సముదాయిస్తుంది, హఠాత్తుగా వచ్చిన నన్ను చూసి, అలాగె ఉండి పోయింది నా వైపు చూస్తూ, నాకు ఎమి చెప్పాలో అర్థం కాలేదు, ఇద్దరం ఒకరి వైపు ఒకరం చూసుకున్నాం, ఎవ్వరికి ఏం అనాలో అర్థం కావట్లేదు, ఇంతలో మళ్ళీ బుజ్జిగాడి ఏడుపు వినిపించింది, ఇద్దరం ఒకే సారి కిందకు వాడి వైపు చూశాం, అప్పుడు గమనించా వాడి నుదుటి పైన చిన్న గుడ్డ ముక్క, తడిపి ఉంది, "ఎమయింది వాడికి.." "..." "స్నేహా ప్లీజ్, చెప్పు.." "రాత్రినించి జ్వరం.." ముక్తసరి సమాధానం "మరి ఎమన్న మందులు వేశావా?" "వాడాను కాని ఎమి పని చెయ్యటంలేదు.." కొద్దిగా ఏడుపు తన మాటల్లో. నేను దగ్గరికి వెళ్ళి వాడి చేతిని పట్టుకుని చూశా, వొళ్ళు కొంచెం వేడిగానే ఉంది. "షిట్, జ్వరం ఉన్నట్లుంది, ఇప్పుడేం చెయ్యాలి.." నాకు ఏం పాలుపోవట్లేదు. తన ఏడుపు ఎక్కువయ్యింది. "స్నేహ, ప్లీజ్, కంగారు పడకు, నన్ను ఆలోచించనీ.. " "మనం వెంటనే హాస్పిటల్్*కి వెళ్దాం పద" తను మాత్రం వాడి వైపు చూస్తూ ఇంకా ఏడుస్తుంది.. నేను గట్టిగా తన భుజాలను పట్టి ఊపా. "స్నేహా, పిచ్చి పట్టిందా నీకు, ఇంకా ఇలానే ఉన్నావంటె, వాడికేమవుతుందో తెలుసా? పద వెళ్దాం.." తను నా వైపు తీక్షణంగా చూసింది కసేపు, ఇంతలో వాడి ఏడుపు పెద్దదవటంతో వెంటనే తన మనస్సు మార్చుకుంది, తనలో కదలికలు రావటంతో నేను కూడ నా బ్యాగ్ ను పక్కనే పడేసి, "ఏ హాస్పిటల్ లో చూపించాలి, ఫోన్ నంబర్ ఉందా.." "ఆ డ్రాయర్్*లో ఉంది.." నేను వెంటన్నె ఫోన్ నంబర్ తీస్కుని, హాల్లోకి వెళ్తూ "త్వరగా వాడి బట్టలు, తీకుని రా.." అంటూ హాల్లోకి పరిగెత్తాను. తను కూడ వెంటనే లేచి, వాడి మందులు చీటీ, ఇంకా కొన్ని బట్టలు సర్దడం మొదలు పెట్టింది. నేనె ఫోన్ ట్రై చేస్తుంటె ఎంగేజ్ వస్తుంది, ఇంతలో తను బుజ్జిగాడి బ్యాగ్ తగిలించుకుని, వాడిని భుజాన వేస్కుని హాల్లోకి వచ్చింది. "ఎంగేజ్ వస్తుంది, ఇంకో నంబర్ ఏమన్నా ఉందా.." "ఉహు లేదు..ఎప్పుడూ ఆ హాస్పిటల్కే వెళ్తాము..." తను కంగారు పడటం మొదలు పెట్టింది. ఇల్లంతా చీకటిగా, బయట వాన రొద పూర్తిగా నా బ్రెయిన్ పనిచేయట్లేదు.. "సరే పద వేరే హాస్పిటల్్*కి వెళ్దాం.." "కాని తుఫాన్లో ఎలా.." "ట్రస్ట్ మీ..నన్ను నమ్ము.. నేను తీస్కెళ్తాను.." అంటూ కార్ కీస్ తీస్కుని, తలుపు వైపుకు నడిచా. లో లోపల నాకే భయంగా ఉంది, "ఈ తుఫాన్లో ఎలా ఈ గండం గట్టెక్కిచేది.. అసలే నాకు గిల్టీగా ఉంది రాత్రి నుండి, తనకేమో ఇప్పుడు రాత్రి జరిగిన దానికంటే బుజ్జిగాడి పరిస్థితి భయంగా ఉంది, అందుకే నా సహయాం అడగకపోయినా ఒప్పుకుంది." ఇలా ఆలోచిస్తూ నా మనసుని నేనే ధ్రుడపరుచుకున్నా, ఎలాగైనా తనకి ఈ సహాయం చెయ్యాలి. కనీసం నా ఆత్మ సంత్రుప్తికైనా సరే. మేయిన్*డోర్ పక్కనే ఉన్న గొడుగు తీకుని బయటకు తెరిచి తనవైపుకు తిరిగి రమ్మన్నట్లుగా తల ఊపాను. తను వెంటనే వచ్చి, వాడి తల తడవకుండా చెయ్యిపెట్టి గొడుగులోకి వచ్చింది. హోరు గాలి, వాన, ఇద్దరం కార్లోకి వెళ్ళాం, కార్ కాసేపు మొరాయించి, వెంటనే స్టార్ట్ అయ్యింది.






[+] 4 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: నా ముగ్గురు పెళ్లాలు - by LUKYYRUS - 12-11-2018, 12:08 PM



Users browsing this thread: