12-11-2018, 12:06 PM
కిచెన్లోకి వెళ్ళి చూసా, అక్కడేమి లేదు. వెంటనే స్నేహ దగ్గరికివెళ్లా, తన గది తలుపు వారగా వేసి వుంది,మెల్లిగా తలుపు తట్టా,"స్నేహ, స్నేహ.." ఉహూ సమధానం లేదు. మెల్లిగా తలుపు నెట్టా, కొద్దిగా తలను లోపలికి పెట్టి చూశా, తను పడుకోని ఉంది అటు తిరిగి, వెంటనే తలుపు మెల్లిగా దగ్గరికి వేసి, ఇవతలకు వచ్చేశాను. వెంటనే కిచెన్లోకి వెళ్ళి, ఫ్రిజ్లో ఎగ్స్ ఉన్నై, అవి తీస్కోని ఆమ్*లెట్ వేస్కున్నాను. టీవీలో వార్తలు చూద్దామని, సోఫాలో కూర్చున్నా. వార్తల్లో అంతా వచ్చే తుఫాను గురించి చెబ్తున్నారు. తుఫాను ముదిరి సైక్లోన్ గా మారే అవకాశం వుందని అందుకే అందరు కూడా ముందు జాగ్రత్తగా, అన్ని సరుకులు, అవసరమైన సామన్లు, తిండి పదార్దాలు, కూరగాయలు సమకూర్చుకోవాలని టీవి యాంకర్ పదే పదే చెప్తుంది. అన్ని ఛాణెళ్ళు దాదాపుగా ఇదే వార్తలు చెబ్తున్నాయి.కాసేపు చూశాక నాకే విసుగు పుట్టి, టీవి కట్టేసి, నా రూంకి వెళ్ళిపోయా.ఎప్పుడు నిద్ర పట్టిందో కానీ, నేను లేచే సరికే రాత్రి ఏడు గంటలయ్యింది. వెంటనే మొహం కడుక్కోని, కిందకు వెళ్ళా. కింద హాల్లో స్నేహ బుజ్జిగాడిని ఒళ్ళో పెట్టుకుని, టీవి చూస్తోంది."హెయ్, స్నేహా నాకు బాగ నిద్ర పట్టింది, మొద్దులా నిద్రపోయా, ఏం చేస్తున్నావ్?" అంటూ సోఫాలో కూర్చున్న.తను మాత్రం టీవి చూస్తోంది, "హెయ్, నిన్నే స్నేహా, ఎక్కడ ఉన్నావ్? టీవీ లో మునిగిపోయావే?" అంటూ నవ్వుతూ మళ్ళీ అన్నా.తన వైఖరి నాకు అర్థం అవుతూనే ఉంది, కాని ఎందుకో నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అనుకుని ఊరికే ఉన్న.ఇంతలో ఉనంట్లుండి కరెంట్ పోయింది."అర్రే, అనుకున్నా, పొద్దున్నే టివిలో చెప్తుంటే, ఇక్కడె ఉండు నేను వెళ్ళి కొవ్వొత్తి తెస్తా..." అంటూ పైకి లేచా. కిచెన్*లోకి వెళ్ళి, నేను కొవ్వొత్తి తెచ్చే దాక స్నేహా అలానే కూర్చొంది, ఇంతలో బుజ్జిగాడు ఏడవటం మొదలు పెట్టాడు. తను వెంటనే అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళింది. నాకు చిర్రెత్తు కొచ్చింది, ఇంక నిగ్రహించుకోవడం నావల్ల కాలేదు.ఇవ్వాళ అటో్ఇటో తేల్చుకోవాలనిపించింది. అలాగే సోఫాలో కూర్చున్నా, బుజ్జిగాడు నిద్రపోయాడు అనిపించిన తర్వాత, తన రూమ్ దగ్గరికి వెళ్ళి, "స్నేహా, స్నేహా..కొంచెం బయటకు వస్తావా నీతో మాట్లాడాలి.. " బయట జోరుగా వాన, చాల పెద్దది అయ్యింది, ఉరుములు అప్పుడప్పుడు మెరుపులు, ఇంట్లో కరంట్ కట్ అయ్యి, కేవలం కొవ్వొత్తి వెలుగు మాత్రమే ఉంది. పిలిచినా పలకట్లేదు, నాకు ఇంకా ఒళ్ళు మండింది, ఇది టూ మచ్ అనుకుని, తలుపు కొంచెం తెరిచి చూసా. తను అలానే బెడ్ పైన ఉంది.బుజ్జిగాడు నిద్ర పోయాడు, "స్నేహా" తనకు మాత్రమే వింపడెట్లు అన్నా, తను ఉలుకు పలుకు లేదు, ఇంక లాభం లేదు అనుకుని, తన బెడ్ దగ్గరికి వెళ్ళి, కొంచెం గట్టిగానే "స్నేహా, నీతో కొంచెం మాట్లాడాలి, బయటకు వస్తావ?" అంటూ తన చేతి మీద తట్టా. చీకట్లో కనపడలేదు కాని, తను హెడ్*ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటునట్లుంది. ఉలిక్కిపడి నన్ను ఆ చీకట్లో చూసి, కెవ్వుమని అరవబోయి ఆ శబ్దం తన గొంతులోనే ఆగిపోయింది,"ఎంటి " అన్నట్లు సైగ చేసింది.బయటికి రా అనంట్లు నేను సైగ చేసి, ద్వారం వైపు నడిచా.తను నా వెనుకనే వచ్చింది.బయటకు వచ్చీ రాగానే,నేను ఇంక చెలరేగి పోయా, "స్నేహా, ఒక్కటడుగుతాను చెప్తావా?" "ఎంటీ?" "నాతో ఎందుకలా ప్రవర్తిస్తున్నావ్, నేను వచ్చినప్పటినుండి చూస్తున్నాను?నీకేం ద్రోహం చేశాను, నాతో బాగ ఉండోచ్చుగా అందరిలాగానే." నేను చెప్పటం అయిపోగానే, తను ఒక్క క్షణం నావైపు చూసి, గిరుక్కున తిరిగి తన రూమ్ వైపు వెళ్ళిపోసాగింది, నేను వెంటనే తన మోచెతిని పట్టుకుని వెన్నక్కు లాగా, తను తుళ్ళిపడబొయి, వెంటనే నావైపు కోపం గా తిరిగి, "వొదులు నన్ను, ఇంట్లో ఎవ్వరు లేని సమయం చూసి, నాతో ఇలా ప్రవర్తిస్తావా? ఉండు నీపని చెప్తా.." అంటూ, ఫోన్ వైపు వెళ్ళ సాగింది, నేను వెంటనే తనకంటే ముందుగా ఫోన్ దగ్గరుకు వెళ్ళి, దాని వైరు పీకేశా. "ముందు నాకు సమాధానం చెప్పు, ఆ తరువాత ఎవ్వరికి కావాలన్న ఫోన్ చేస్కో, ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నవ్? నాకు తెలియాలి." తన ప్రయత్నంలో ఫెయిల్ అయినందుకు ఉక్రోషంతో, "ఎందుకు, తెలుసుకోని ఏంచేస్తావ్? ముందు ఆ ఫోన్ వైర్ ఇలా ఇవ్వు, లేదంటే పోలిస్ కంప్లైంట్ ఇస్తాను..." అంటూ ఆవేశ పడ సాగింది. విచిత్రంగా అంత కోపంలో కూడా నాకు నవ్వు ఆగలేదు, పక పకామని నవ్వుతూ సోఫాలో పడ్డా, "పో..పోలి..పోలిస్ పిలిస్తావా, నాపైనా, హ హ హ హ...నిజ్జంగా స్నేహా, నిజంగా నువ్వు అలా చేస్తావా..? " అంటూ నేను నవ్వు ఆపుకుంటూ అడిగా. "చేస్తా.." అంటూ నా చేతిలోని వైర్ తీస్కోబోయింది, నేను వెంటన్నే దాన్ని లాక్కుని, "అసలు నీకు ఎమైంది, ఇలా ప్రవర్తిస్తున్నావ్? నేనిక్కడ ఉండదం నీకు ఇష్టంలేదా?" "లేదు" "అదే, ఎందుకని?" "తెలుసుకోని ఏం చేస్తావ్? వెళ్ళిపోతావ.." "..." నిశ్శబ్దం, నాలోనా? బయటా? "ముందు నువ్వు చెప్పు, ఆ తరువాత నేను వెళ్ళడమా, ఉండడమా అని ఆలోచిస్తా." "నీ లాంటి మగాళ్ళంటె నాకు అసహ్యం?" "నా లాంటి వాళ్ళు అంటే? నాగురించి నీకు పూర్తిగా తెలుసా?" "తెలుసు" "ఏం తెలుసు" "మీ మగాళ్ళు అందరు ఒకటే, ఒక ఆడ దాని దగ్గర మీ మగాళ్ళు ఏమి ఆశిస్తారో తెలియంటువంటి అమాయకురాల్ని కాదు నేను." "అంటె నేను ఏమి అశించి ఇక్కడికి వచ్చానను కున్నావ్?" "ఏముంది, నిస్సహాయురాలైన మా అమ్మని, మమ్మల్ని మోసం చేద్దామని, మా దగ్గర ఉన్న డబ్బుని, కుదిరితే మమ్మల్ని మోసం చేద్దామని వచ్చుంటావ్, అంతేనా?" తన మొహంలో ఎదో తెలియని సంతోషం, ఇలా నన్ను కడిగి పారేస్తున్ననందుకనుకుంటా...