Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
S3E8
FANTACY ALERT !

విక్రమ్ రుద్ర మాట్లాడుతుండగానే చిరంజీవి కూర్చున్న వాడు అలానే పడిపోవడంతో వాసు పిలిచేసరికి రుద్ర వెళ్లి చిరంజీవి చెయ్యి పట్టుకుని చూసాడు.

విక్రమ్ : ఏమైంది 

రుద్ర : ఏదో శక్తి, ఇంకా పూర్తిగా నయం అవ్వలేదు.. ఇంత పవర్ ఒక మాంత్రికురాలికి ఎలా సాధ్యం. లిఖితా... లిఖితా... ఇలా రా 

లిఖిత : ఏంటి 

రుద్ర : ఇలా చూడు ఇది ఏ శక్తి.. నాకు అంతు చిక్కటం లేదు.. అంటుండగానే లిఖిత చిరంజీవి చెయ్యి పట్టుకుని చూసింది.

లిఖిత : ఏమో తెలియడం లేదు కానీ ఇది ఒక్క శక్తి కాదనిపిస్తుంది 

రుద్ర : ఏంటి నువ్వనేది 

లిఖిత : అవును నాకు ఉగాది పచ్చడిలో రుచులు తెలిసినట్టు ఈ శక్తిలో కూడా ఇంకా ఏవో తెలుస్తున్నాయి. ఎన్నో నాకు తెలియదు కానీ ఇది ఒక్కటి మాత్రం కాదు.. ఎవరో కలపకుడనటువంటి శక్తులని కలిపారు. 

రుద్ర : వెళ్లి నీ అక్కని పిలుచుకురాపో

లిఖిత : అక్కా తొక్కా అన్నావంటే నీ పిక్కలు పగులుతాయి.. అది నా శత్రువు.

రుద్ర : నీయమ్మ..(అని తిట్టుకుంటూ) కంధరా... అంటూ లోపలికి వెళ్ళాడు. కంధర బైటికి వచ్చి చిరంజీవిని చూసి తన అక్కని తలుచుకోగానే ప్రత్యక్షమయింది. కంధర చిరంజీవి చెయ్యి అందించగా పట్టుకుని చూసి తనలో కొంత శక్తిని చిరంజీవి శరీరంలోకి పంపించి మళ్ళీ తనలోకి తీసేసుకుంది.

నల్ల కంధర : ఎక్కడుంది ఈ శక్తి..

రుద్ర : నిన్ను పిలిచింది దాని గురించి చెపుతావని..

నల్ల కంధర : అప్పట్లో మా రాక్షస జాతి మీ దేవుళ్ళ జాతి కొట్టుకున్నారు గుర్తుందా..

రుద్ర : కొట్టుకోకపోతే ఆశ్చర్యపోవాలి.. దేని కోసం 

నల్ల కంధర : ఇంక దేనికి అమృతం కోసం.. సరే మొదటి నుంచి చెపుతాను వినండి..

ఈ దేవతలు అంతా మా శక్తికి, బలానికి తట్టుకోలేక వెళ్లి ఆ విష్ణువు కాళ్లు పట్టుకుంటే అయన క్షీరసాగర మధనం జరపమని చెప్పాడు, అందుకు ఈ దేవతల బలం సరిపోక ఆ ఇంద్రుడు మాకు కూడా అమృతం పంచుతామని చెప్పి ఆశ పెట్టి మమ్ములని నమ్మబలికి మధనానికి తీసుకుపోయాడు. మందరగిరిని తవ్వబోగా అది కింద పాడబోతే విష్ణువు వచ్చి దాన్ని లేపి మధనానికి కవ్వంగా మందరగిరిని...   తాడుగా వాసుకిని అమృతం తనకి కూడా ఇస్తామని మాటిచ్చి తీసుకొచ్చి ఉపయోగించారు.. అప్పటికి మా ముందు ఈ దేవతలు తగ్గి మేము తోకని పట్టుకోము అంటే మాకు సర్దిచెప్పి మాకు తలని ఇచ్చి వాళ్ళు తోకని పట్టుకున్నారు అప్పుడైనా ఆలోచించాల్సింది కానీ అమృతం దక్కుతుందనే ఆశ ముందు మా వాళ్ళకి అవేమి కనిపించలేదు.

అలా చిలకగా ఆ మంధరగిరి క్రిందనిలిచే ఆధారము లేక క్షీరసాగరము లోనికి జారిపోతుండగా మహావిష్ణువు కూర్మావతారము ఎత్తి, ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకొన్నాడు. మంధరగిరితో మథనం జరుపుతుండగా విపరీతమైన రొద వచ్చింది. ఆ రొదకు ఎన్నో జీవరాశులు మరణించాయి. చిలుకుతుండగా ముందు హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవదానవులకు తోచక బ్రహ్మ వద్దకు వెళ్తారు. బ్రహ్మ విష్ణువు వద్దకు అక్కడ నుండి కైలాసంలో ఉన్న శివుడి వద్దకు వెళ్ళి, క్షీరసాగర మథనం జరుపుతుండగా వచ్చినదానిని అగ్రతాంబూలంగా స్వీకరించుమని ప్రార్థించగా శివుడు హాలాహలం అని గ్రహించి పార్వతితో సేవించమంటావా అని అడుగగా సకల సృష్టిని రక్షించడానికి సేవించమని చెబుతుంది. అప్పుడు శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకొన్నాడు. 

రుద్ర : నీ శివ భక్తి ఆపి కథ చెప్పు 

నల్ల కంధర : ఆ.. హాలాహలం తరువాత పుట్టిన అమృతాన్ని తీసుకుని వచ్చిన విష్ణువుకి ముందుగా వాసుకి అడ్డుపడగా ఎవ్వరికి తెలియకుండా తన కిరీటం పైన ఉన్న చిన్న గోపురాన్ని విరగ్గొట్టి అందులో పోసి ఇచ్చాడని కానీ వాసుకి తాగకుండా ఏటో తీసుకువెళుతుంటే చేజారి పోవడం కింద భూమి మీద ఒకరికి దొరికిందని వినికిడి.. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలియదు.. కానీ విష్ణువు వాసుకి కి ఇచ్చిన కీరీటం ముక్క చుట్టూ ఐదు రాళ్లతో కూడిన ఉంగరాలు లాంటివి ఉండేవి ఒక్కోటి ఒక్కో శక్తికి నిలయం అని మాత్రమే తెలుసు.. ఇప్పుడు ఈ దేహంలో నేను గ్రహించిన శక్తి ఆ ఉంగరాల లోనివే కానీ ఎవరో అన్ని కలిపేశారు. అందుకే ఇంత భయంకరంగా ఉంది.

రుద్ర : మరి తనని ఎలా నయం చెయ్యడం.. అనగానే కంధర తన అక్కని తనలోకి తీసుకుని చిరంజీవి చెయ్యి పట్టుకుని నయం చేసి ఆ వెంటనే తన శరీరంలో నుంచి తన అక్కని బయటకి విడిచింది 

కంధర : ఇదిగో ఇలా, నా ఒక్కదాని శక్తి సరిపోదు.

అక్కడ నుంచి నల్ల కంధర వెళ్లిపోగా రుద్ర చిరంజీవిని లేపాడు.

చిన్నా : అంతా ఓకే నా

రుద్ర : ఓకే ఓకే

విక్రమ్ : ఇప్పుడు ఏమి చెయ్యాలో అర్ధం కావట్లేదు.. ఇంతకీ ఆ రక్ష ఎవరో ఆమె ఎక్కడుందో.. ఏమి తెలీదు 

చిన్నా : రక్ష నా దెగ్గరే ఉంది, ఇంతకీ సుబ్బు ఏడి

ఆదిత్య : నేను మరిచిపోయా వాడు రాత్రి నుంచి కనిపించట్లేదు.

చిన్నా : మనవాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు 

విక్రమ్ : తెలీదు కానీ అందరిని అక్షిత విక్రమాదిత్య ఇంటికి తీసుకెళ్లి ఉంటుంది.

చిన్నా : వెళ్ళాలి అని లేచాడు.

రుద్ర : నేనూ వస్తాను పదండి.

.................................................................

గొడ్డలి పట్టుకున్న రక్షని చూడగానే ఎక్కడివాళ్ళు అక్కడ తప్పించుకుని పారిపోయారు. సుబ్బు మాత్రం ఇంకా అలానే వంగి చూస్తున్నాడు. 

సుబ్బు : ఏమో అనుకున్నాను కానీ మరీ ఇంత హైట్ ఉందేంటి నాకంటే ఒక అడుగు ఎత్తు ఉంది.. ఆ గొడ్డలిని ఏదో పెన్సిల్ ని తిప్పినట్టు తిప్పుతుంది తనని చూడగానే అందరూ పారిపోయారు.. ఇప్పటివరకు సరిగ్గా గమనించలేదు ఏదో యుద్ధానికి వెళ్లేముందు వేసుకున్నట్టు ఆ డ్రెస్సు.. 

రక్ష : ఎవరు నువ్వు 

సుబ్బు : నేను.. అక్షిత.. సుబ్బు.. మిమ్మల్ని..

రక్ష : ఆ....

సుబ్బు : మీ ఫ్రెండు అక్షిత మిమ్మల్ని కాపాడమని చెప్పింది.

రక్ష : నా కూతురు.. అంటూనే గొడ్డలి తన వీపుకి తగిలించుకుంది.. తన పొడుగాటి కురులను ముందుకు అనుకుని జడ వేసుకుంటూ...

సుబ్బు : కూతురా...

రక్ష : అవును అక్షిత నా కూతురు 

సుబ్బు : అంటే మీరు అమ్మాయి కాదా అంటీనా.. అని కళ్లు తిరిగిపడిపోయాడు..
Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమాదిత్య - (విక్రమ్--రిచి రిచ్) - by Pallaki - 26-10-2022, 12:11 PM



Users browsing this thread: 26 Guest(s)