Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
అక్షిత లేచి కూర్చుంది, అందరూ తనని చూసారు.

సంధ్య : అక్షితా

అక్షిత : ఆ.. చెప్పు

సంధ్య : ఎందుకే నేనంటే అంత కోపం నీకు 

అక్షిత : నువ్వు మాట్లాడకా.. నీ వల్లే మనందరికీ ఈ గతి పట్టింది.

విక్రమ్ : ఏమైంది, అమ్మా నువ్వేం అడిగినా ఏది సరిగ్గా చెప్పవేంటి 

అక్షిత : ఏమో మరి ఏది సరిగ్గా చెప్పిసావదు, నువ్వు ఏం చెప్పకు. మీకేం కావాలో నన్ను అడగండి నేను చెపుతాను, తనని అడిగితే కళ్లలోనుంచి నీళ్లు తప్పితే నోటి నుంచి మాట రాదు.

సంధ్య : రక్ష ఎలా ఉంది, ఎక్కడుంది  

అక్షిత : అలానే ఉంది, ప్రస్తుతానికి సురక్షితంగానే ఉంది.

మానస : ఇందాక మీ నోటి నుంచి సుబ్బు సుభాష్ డ్రైవర్ అని విన్నాము, ఆ పేరుతో మాకు ఒకరు తెలుసు.

అక్షిత : సుబ్బు నావాడే, ఇంతకీ ఈ అమ్మాయిల పిచోడు ఎక్కడ చచ్చాడో ఏమో 

మానస : ఏమన్నారు

అక్షిత : అమ్మాయిల పిచ్చోడు

మానస : అయితే మీకు తెలిసినవాడు, మాకు తెలిసినవాడు ఇద్దరు ఒక్కడే 

అక్షిత : నవ్వుతూ వాడు నీకెలా తెలుసు, నీకు ప్రొపోజ్ చేశాడా 

మానస : లేదు కానీ చెయ్యబోయేలోపే నా గురించి తెలిసింది. ఆగిపోయాడు. మరి మీకు ?

అక్షిత : వాడి కౌంటు మొదలయ్యింది నా తోనే, నేనే వాడి ఫస్ట్ లవ్ 

సుబ్బు గాడి గురించి తెలిసిన వాళ్ళందరూ నవ్వారు. 

మానస : నా లవ్ కి హెల్ప్ చేసింది తనే.. ఆ ప్రాసెస్ లోనే ఈ విక్రమాదిత్య కథలోకి వచ్చి పడ్డాము. మా కోసం చాలా రిస్క్ తీసుకున్నాడు.

అక్షిత : వాడంతే.. వాడు నమ్మినా వాడికి నచ్చినా ప్రాణాలు ఇచ్చేస్తాడు. ఆపదలో ఉన్న అమ్మాయి చెయ్యి చాపితే చాలు. చావు వరకైనా తోడు వస్తాడు. ఈ అమ్మాయిలని లవ్ చెయ్యడం ఉట్టి టైం పాస్ ఫన్ కోసం చేస్తుంటాడు.

మానస : మీకు తన గురించి చాలా తెలుసు 

అక్షిత : నా కాలేజీ లైఫ్ వాడితోనే గడిచింది. మూడేళ్లు నా కిందే ఉన్నాడు .

మానస : సుబ్బు మూడేళ్లు ఒకే అమ్మాయితో ఉన్నాడా, నేను నమ్మను 

అక్షిత : అలా ఏం లేదు, అమ్మాయిలు అమ్మాయిలే ఆ ట్రాక్ వేరు. నేను ఫ్రెండ్ అంతే.

విక్రమ్ : విక్రమాదిత్య దెగ్గరికి వద్దాం. తన గురించి ఒక క్లారిటీ ఇవ్వండి.

అక్షిత :

విక్రమాదిత్య + అనురాధ = శశి (బెంగుళూర్ అడవిలో ఒకడు, మానస్ సిటీలో ఒకడు) 
విక్రమాదిత్య + (మానస) అనురాధ = రక్ష 
విక్రమాదిత్య + శశి = కావ్య(విక్రమ్ అమ్మ) , రాజు(ఆదిత్య నాన్న) , సరిత(అను అమ్మ)

ఇక శశి.. వీడు అడవిలోనే ఉంటాడు స్మగ్లింగ్, అడవిలో చెక్కలు అమ్మటం. వీళ్ళ నాన్న ఏ తెగ కైతే అప్పగించాడో, ఆ అడవి కింద మైనింగ్ చేస్తే కోట్లు సంపాదించవచ్చని వీడి అన్న మానస్ ఇచ్చిన సలహాతో ఆ తెగని నాశనం చేసి మైనింగ్ మొదలు పెట్టాడు.. వీడు బలవంతుడు అయితే మానస్ తెలివికలవాడు వాడు సిటీలో ఉంటూ సంధ్య ఫౌండషన్స్ వెనుక అమ్మాయిలు, గంజాయి, డ్రగ్స్, వెపన్స్ వీడు చెయ్యని ఇల్లీగల్ పని లేదు. వీడికి ఎదురు వచ్చిన వాళ్ళు ఎవ్వరు బతికి లేరు మనం తప్ప.

ఇక వీళ్ళ ముగ్గురి జీవితాల గురించి మీకు తెలిసిందే మీకు తెలియాల్సింది రక్ష గురించి. రక్ష ని వాళ్ళ నాన్న ఆఫ్రికా అడవుల్లో ఉన్న తెగకి అప్పగించి తన సమస్య చెప్పి ట్రైనింగ్ ఇవ్వమన్నాడు. ఆఫ్రికాలోనే ఎందుకంటే ఈ సంధ్యకి తెలుసు కానీ మనకి చెప్పదు. నేను రక్ష అమ్మ దెగ్గర చేరిన మొదటి శిష్యురాలిని, నాకు అక్కడి శక్తులు, విద్యలు అబ్బలేదు.. నాకు ఫైటింగ్ నేర్పించి రక్ష అమ్మ నన్ను కూతురుగా దత్తత తీసుకుంది. రక్ష అమ్మ యుద్ధానికి సిద్ధం అయ్యాక తన తండ్రి రాసిన లెటర్ చదివి నన్ను తీసుకుని ఇక్కడికి వచ్చింది.

అప్పటికే విక్రమాదిత్య చనిపోవడంతో...

విక్రమ్ : ఆగండి ఆయన ఎలా చనిపోయారు 

అక్షిత : శశి మానస్ ఇద్దరు కలిసి విషం పెట్టి చంపేశారు 

అందరూ సంధ్య వైపు చూసారు.. సంధ్య ఏడుస్తూ.. ఒక రోజు ఇద్దరు వచ్చి ఇంట్లో భోజనం చేసి నా కొడుకు చూడకుండా విషం పెట్టిన పాయసం నా కోడలికి తినిపించారు. పిచ్చిది వాళ్ళ ప్రేమలో పడి మోసపోయింది నా అనురాధ.. విక్రమాదిత్యకి కూడా తినిపించబోతే వాడు వేలితో ముట్టుకుని పసిగట్టేసాడు కానీ అప్పటికే అనురాధ ఆ పాయసం తినింది అని తెలుసుకుని వాడు కూడా కావాలని ఆ పాయసం తాగేశాడు.

విక్రమ్ : ఎందుకు 

సంధ్య : అప్పటికే నా కొడుకు మానస లేకపోవడం, జరిగిన రక్తపాతం వల్ల తనలోని శాంతిని కోల్పోయాడు. వాళ్ళు కలిపింది ఏదో ఒంటి కొమ్ము విషం అది నా కొడుకుని అంతకముందే ఒకసారి చంపింది కానీ అప్పుడు ఆ తెగ నాయకుడు ఇచ్చిన మందు వల్ల రెండు సార్లు చనిపోయే అవకాశం ఉన్నందు వల్ల బతికాడు. అందుకే ఎలాగో అనురాధ చనిపోతుందని తెలుసు, అను లేకుండా వాడు ఉండలేడు అందుకే.....

అందరూ ఏదో ఆలోచిస్తుంటే మానస విక్రమ్ వైపు చూసింది.. విక్రమ్ ఇంకేదో ఆలోచిస్తున్నాడు..

అక్షిత : మేము వచ్చేటప్పటికి విక్రమాదిత్య చనిపోవడంతో అమ్మ (రక్ష) యుద్ధానికి వెళ్ళింది. శశిని మానసని కుక్కని కొట్టినట్టు కొట్టింది. కానీ అప్పుడే తెలిసింది ఆ రాక్షసి ఇంకా బతికే ఉందని..

ఆదిత్య : ఎవరు ?

సంధ్య : దేవి 

అను : తను ఎలా బతికింది, విక్రమాదిత్య చంపేశాడు కదా.. దీవి మొత్తం బాంబులతో నాశనం అయ్యింది కదా 

అక్షిత : మీరు ఇప్పుడు ఉన్నదీ ఆ దీవి మీదే 

మానస : నమ్మ బుద్ధి కావట్లేదు 

అక్షిత : విక్రమాదిత్య బాంబులతో పేల్చక ముందే అందరిని నాశనం చేసి సంపాదించిన ఐదు రింగులతో అమృతం తెరిచి తాగేసింది. ఇక్కడ అస్సలు సంగతి ఏంటంటే అమృతం తాగేటప్పుడు ఆ ఐదు రింగులు తనలో ఐక్యం అయిపోయి శక్తివంతురాలిగా మారిపోయింది. రక్ష అమ్మ బలం చాలలేదు.. ఫలితం రక్ష అమ్మ నిద్రలోకి వెళ్ళిపోయింది. విక్రమాదిత్యకి మరదలు మానసకి ఇది తెలిసే ఎందుకైనా మంచిది అని తన వీర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆ దేవిని చంపగలిగే వాళ్ళు ఈ తెగకి సంబంధించిన రక్తం అయ్యుండాలి.. అందుకు బైట వాళ్ళైన అనురాధ కొడుకులు శశి కానీ మానస్ కానీ, ఇక తొడ సంబంధం(పిన్ని వరస) వల్ల పుట్టిన ఈ ముగ్గురు కూడా తనని చంపలేరు. మానస విక్రమాదిత్య ఇద్దరు శక్తివంతులు బావ మరదలు వరస, ఇద్దరు ఒకే తెగకి సంబంధించిన వాళ్ళు. వారిద్దరి నుంచి పుట్టిన రక్ష అత్యంత శక్తివంతురాలు, దేవిని చంపే అర్హత ఉన్నది తనే అవుతుంది. అని ముగించింది.

అందరూ మాట్లాడుకుంటుంటే విక్రమ్ లేచి గోడకి అనుకుని నిలబడ్డాడు. అది చూసి ఆదిత్యతో పాటు మానస, అనురాధ కూడా వెళ్లారు. నలుగురు అందరికి దూరంగా నిలబడ్డారు.

మానస : అప్పటి నుంచి చూస్తున్నాను, ఏమైంది ?

విక్రమ్ : లేదు సంధ్య గారు చెప్పింది విన్నావా, విక్రమాదిత్య విషం తిని చనిపోయాడు అని చెప్పింది. కానీ ఆయనని ప్రపంచంలో ఉన్న ఏ విషం దరి చేరకుండా.. ఆ తెగ నాయకుడికి ఇచ్చేది మాత్రమే కాకుండా ఇంకో ద్రవం కూడా ఇచ్చారు అని సంధ్య గారే చెప్పారు.

ఆదిత్య : నాకు గుర్తు లేదు 

విక్రమ్ : నాకు గుర్తుంది. ప్రతీ అక్షరం గుర్తుంది.

మానస : అలా అయితే ఆయన చనిపోకూడదు కదా 

విక్రమ్ : అదే అర్ధం కావట్లేదు, ఇక అక్షిత చెప్పింది.. ఆ రాక్షసిని చంపాలంటే పర్ఫెక్ట్ గా పుట్టాలి అని చెప్పింది. కానీ విక్రమాదిత్య తండ్రి ఒక తాగుబోతు.. ఈ కధకి సంబంధం లేని వాడు.. అప్పుడు విక్రమాదిత్య కూడా పర్ఫెక్ట్ కాదు.. కానీ ఆయన నుండి పుట్టిన రక్ష ఎలా పర్ఫెక్ట్ అవుతుంది. సరే ఇవన్నీ పక్కకి పెట్టేస్తే రక్ష ఎందుకు ఆ రాక్షసిని చంపలేక పోయింది. ఈ సంధ్య గారు మన నుంచి ఏదో దాస్తున్నారు అది ఇక్కడున్న ఎవ్వరికి తెలీదు. తనే నోరు విప్పాల్సింది కానీ ఆవిడ ఏమి చెప్పట్లేదు అన్నిటికి భయపడుతుంది. ఏం మాట్లాడినా ఆచి తూచి మాట్లాడుతుంది.

ఆదిత్య : విక్రమ్ ఆ సౌండ్ విన్నావా 

విక్రమ్ : ఏ సౌండ్ 

ఆదిత్య : క్లియర్ గా విను.. అనేసరికి అందరూ మౌనంగా ఉన్నారు 

చిన్నగా ఆ శబ్దం పెరుగుతూ వస్తుంది.. జూఊఊఊమ్ అంటూ ఉండే కొద్ది పెద్దగా అయ్యే శబ్దం ఏంటో తెలుసుకోడానికి వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు.

మానస : నవ్వుతూ అది కార్ సౌండ్.

అను : ఆ సౌండ్ చూడు ఎంత పెద్దగా వస్తుందో.. ఎంత స్పీడ్ గా నడిపితే అంత సౌండ్ వస్తుంది.

విక్రమ్, ఆదిత్య ఏదో హోప్ దొరికినట్టు అలెర్ట్ అయ్యారు.

ఆదిత్య : ఇలాంటి ఒక ప్లేస్ లో అంత స్పీడ్ గా నడిపేవాడు ఒక్కడే ఉన్నాడు.

విక్రమ్ : సుబ్బు.....?

కారు మోత ఎక్కువైంది... రీసౌండ్ కి అందరూ చెవులు మూసుకున్నారు.
Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by Pallaki - 22-10-2022, 10:43 PM



Users browsing this thread: 31 Guest(s)