22-10-2022, 10:42 PM
S3E5
ఇద్దరు తినేసి అంబులెన్స్ ఎక్కారు.
సుబ్బు : ఇప్పుడు ఎక్కడికి భయ్యా
చిన్నా : అక్షిత నాకు ఫోన్ చేసి మాట్లాడిన తరువాత నుంచి ఆఫ్ అయిపోయింది ఫోన్ ట్రేస్ అవ్వట్లేదు, ఫోన్ వస్తుంది అప్పటివరకు నడుపు.
సుబ్బు : సీట్ బెల్ట్
చిన్నా : ఓకే నా ఇక పోనీ, అవును నీకు అక్షితకి ఎలా పరిచయం
సుబ్బు : కాలేజీలో నా సీనియర్
చిన్నా : తన గురించి చెప్పు
సుబ్బు : నిజాలా అబద్దాలా, మంచా చెడా
చిన్నా : హహ నిజాలే చెప్పు, ముందు నెగటివ్స్ చెప్పు
సుబ్బు : అబ్బో మొండిది, అల్లరిది ఏ ముహూర్తాన మొహం చూశానో తన కంట్లో పడ్డాను నరకం చూపించింది, మాములుగా రాగ్గింగ్ చెయ్యలేదు నాతో గౌను ఎపించి స్టేజి మీద అందరి ముందు డాన్స్ కూడా ఏపించింది.
చిన్నా : నువ్వు ఎందుకు చేసావ్
సుబ్బు : అలా డాన్స్ చేస్తే నన్ను రాగ్గింగ్ చెయ్యనని మాటిచ్చింది.
చిన్నా : ఇచ్చిన మాట నిలబెట్టుకుందా
సుబ్బు : నువ్వే చెప్పు తరవాత ఏం జరిగి ఉంటుందో
చిన్నా : మళ్ళి రాగ్గింగ్ చేసిందా
సుబ్బు : మూడేళ్లు.. నాకు చుక్కలు చూపించింది. ఎంత గోలచేస్తుందో.. అంతే చెడు ఒట్టి అల్లరిది.. అంతే
చిన్నా : మరి మంచి
సుబ్బు : చాల మంచిది, ముఖ్యంగా తనలో నాకు నచ్చేది తను ఫ్రెండ్షిప్ కి ఇచ్చే వాల్యూ అందులో మాత్రం గోల్డ్. తనకి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం, అందరితో మాములుగా మాట్లాడుతుంది కానీ తన కొంటె తనం తెలియాలంటే మాత్రం తనకి మనం చాలా దెగ్గర వాళ్ళం అయ్యుండాలి. ఎవరిని పడితే వాళ్ళని దెగ్గరికి రానివ్వదు. కొంచెం హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువే.
చిన్నా : నీకు అక్షితకి మధ్యలో చాలా కెమిస్ట్రీ ఉన్నట్టు ఉంది.
సుబ్బు : అంటే భయ్యా నేను తనకి కాలేజీ కొత్తలో ప్రొపోజ్ చేసాను, నన్ను చాలా దారుణంగా రిజెక్ట్ చేసి వాడుకుంది మెంటల్ది.. సారీ.. మూడేళ్లు నన్ను ఫ్రెండ్ గా వాడుకుంది అప్పుడు దెగ్గరయ్యాను, ఇదంతా మీకు ఎందుకు చెపుతున్నాను అంటే రేపు మీ ముందు అక్షిత నాతో కొంచెం చనువుగా ఉంటె మీరు తప్పుగా అర్ధం చేసుకోకూడదని నా బాధ. మిమ్మల్ని చూస్తుంటే కొంచెం మీకు అనుమానం ఎక్కువలా ఉంది. అక్షిత నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు నన్ను స్టడీస్ విషయంలోనే కాకుండా లైఫ్ లో కూడా గైడ్ చేసిన వ్యక్తి. నా జీవితంలో నాకు చాలా తక్కువ పరిచయాలు ఉన్నాయి వాళ్లలో ఇష్టమైన వ్యక్తుల్లో అక్షిత కూడా ఉంది. అందుకే తను అడగ్గానే రిస్క్ అని తెలిసినా కూడా ఈ పనికి ఒప్పుకున్నాను.
చిన్నా : నాకు తెలుసు, అక్షిత ఎలాంటిదో కూడా తెలుసు. మరి ఆ తరువాత ఎవ్వరిని లవ్ చెయ్యలేదా
సుబ్బు : ఎందుకు చెయ్యలేదు అక్షిత రిజెక్ట్ చేసిన గంటకే తన ఫ్రెండుకి ప్రొపోజ్ చేసాను, అక్షిత చేతుల్లో కొట్టించుకున్నాను. ఆ తరువాత సుధా, రాధా, జానకి, మాలిని, దివ్య, భవ్య, సుధా, ఓ ఇలా తీసుకుంటూ పోతే ఒక రెండు మూడు వందలు దాటిపోద్ది కౌంటు.. ఒక పన్నెండు మందిని పడెయ్యడానికి నా బాధ చూడలేక స్వయంగా అక్షితనే హెల్ప్ చేసింది కానీ ఎవ్వరు సెట్ అవ్వలా.
చిన్నా : ఇప్పుడు ?
సుబ్బు : ఇప్పుడు కూడా కాళియే, అందరూ వాడుకుని వదిలేసే వాళ్ళే తప్పితే జెన్యూన్ గా లవ్ చేసే వాళ్ళు దొరకట్లేదు. లేటెస్ట్ గా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా.
చిన్నా : ఎంత వరకు వచ్చింది
సుబ్బు : చూడటం వరకు వచ్చింది. ఇంకా మాట్లాడలేదు
చిన్నా : నాకు అక్షితకి ఇంకా పెళ్లి కాలేదు
సుబ్బు : తెలుసు, తను ఒంటరిగా ఉన్నానని తెలిస్తే నేను మళ్ళి ప్రొపోజ్ చేస్తానేమో అని భయపడి అలా చెప్పింది.
చిన్నా : బాగుంది మీ ఫ్రెండ్షిప్, తనకి కాలేజీలో ఎవరైనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్...
సుబ్బు : లేదు, చెప్పాను కదా ఎవ్వరిని అంత దెగ్గరికి రానివ్వదు. తను కొంచెం నవ్వడానికి ఇష్టపడుతుంది. మనం ఎలాగో జోకర్లా ఉంటాం కాబట్టి నాతో ఫ్రెండ్షిప్ చేసింది. అంతే.. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, అంత కామెడీ పర్సన్ అనిపించట్లేదు. అక్షితకి మీరు ఎలా దెగ్గరయ్యారు
చిన్నా : నన్ను కూడా బానిసలా వాడుకుంటుంది, కానీ మీ సీనియర్ నాకు రెండు గంటల్లో, పది నిమిషాలు మాట్లాడితే పని అయిపోయింది.
సుబ్బు : కూస్తున్నారా లేదా నిజమేనా
చిన్నా : నిజంగా, తరవాత చాలా విసికించాననుకో అది వేరే విషయం
సుబ్బు : కొంచెం ఏమైనా టిప్స్ ఇచ్చి హెల్ప్ చెయ్యొచ్చు కదా భయ్యా
చిన్నా : నీ కధలు నీ మాటలు వింటుంటే నీ గురించి నాకు కొంచెం కొంచెం అర్ధం అవుతుంది.. నువ్వు ఒక రకమైన ఫాంటసీలో ఉన్నావ్. సినిమాలు ఎక్కువగా చూస్తావా
సుబ్బు : కొంచెం
చిన్నా : చూడు సుబ్బు అమ్మాయిలు అందరూ ఒకేరకం.. హీరోయిన్ల వరకు బానే ఉంటారు రియల్ లైఫ్ వేరే.. వేసుకునే చెప్పులు బాగుంటాయి అరికాళ్ళు మాత్రం పగిలి ఉంటాయి, డ్రెస్సులు బాగుంటాయి కానీ లోపలే... ఇవ్వాళ రేపు అంతా పైన పటారం లోన లొటారం టైపు.. అమ్మాయి కళ్ళు చూడు తన మైండ్లో ఏముందో తెలుస్తుంది. అక్షితకి ముందు నేను చాలా మంది అమ్మాయిలని కలిసాను కానీ అక్షితని చుసిన తరువాత నాకు వేరే అమ్మాయి మీదకి మనుసు పోలేదు. అలా అని వేరే అమ్మాయిని చూడను అని చెప్పట్లేదు. రోజంతా ఎటు తిరిగినా చివరికి ఇంటికి చేరుకున్నట్టు ఎంత మంది అమ్మాయిలని చూసినా చివరికి ప్రేమించిన అమ్మాయి దెగ్గరే వాలిపోతాం.
సుబ్బు : వీటిలో సగం అక్షిత డైలాగ్స్ కూడా ఉన్నాయి, మీ ఇద్దరు ఆలోచనలు కొంచెం ఒకేలా ఉన్నాయి అందుకే కలిసినట్టున్నారు.
చిన్నా : నీకు కూడా దొరుకుతుంది
సుబ్బు : దొరికేసిందనే అనుకుంటున్నాను, నువ్వు చెప్పిన సింటమ్స్ నాకు కనిపిస్తున్నాయి. అయినా అక్షితని దాటి నువ్వు ఇంకో అమ్మాయి వంక చూడవులే
చిన్నా : ఎందుకలా
సుబ్బు : నిజం చెప్పు నీకు అక్షిత అంటే భయం లేదు
చిన్నా : లేదు
సుబ్బు : అబద్ధం.. నిజం చెప్పు పర్లేదు.. ఒక వేళ నువ్వు చెప్పేది నిజం అయితే మాత్రం నీకు దండ వేసి దండం పెట్టొచ్చు.. ఆల్ఫా మేల్ అంటారు కదా ఆ కోవాకి చెందిన వాళ్ళు అయ్యుంటారు.
చిన్నా నవ్వుతుంటే సుబ్బు కూడా నవ్వాడు, ఇంతలో ఫోన్ మోగింది.
చిన్నా : చెప్పురా.. ఆ... ఆహా.. పంపించు.. అని ఫోన్ పెట్టేసి సుబ్బు వైపు చూసాడు. సుబ్బు అక్షిత సిగ్నల్ కొల్లం నుంచి ఆఫ్ అయ్యింది అక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక దీవి ఉంది నార్మల్ గా హైడ్ చేసేసారు సాటిలైట్ నుంచి మాత్రమే కనిపిస్తుంది. అక్కడ మనకి ఏదైనా క్లూ దొరకచ్చు.
సుబ్బు : ముందు మనం తనని ఎక్కడైనా సేఫ్ గా దాచిపెట్టాలి అని రక్ష ని చూసాను.
చిన్నా : నాకు ఒకరు తెలుసు, పోనీ అని సుబ్బుని ఒక గోడౌన్ దెగ్గరికి తీసుకెళ్లాడు. అంబులెన్స్ లోపల పార్క్ చేసి ఇద్దరు బైటికి వచ్చారు.
సుబ్బు : సేఫ్ ఏనా
చిన్నా : ఆయన మిలటరీ వాడు, నన్ను నమ్ము
సుబ్బు : భయ్యా నువ్వు సోల్జర్ వా
చిన్నా : కాదు సెక్యూరిటీ అధికారి.. IPS ఆఫీసర్ ని
సుబ్బు : నీకు ఇంకో IPS ని తీయించగలిగే అన్ని కాంటాక్ట్స్ ఉన్నాయా భయ్యా
చిన్నా : లేదు ఎందుకు, ఎవ్వరిని తీయించాలి
సుబ్బు : ఒకటి ఉందిలే శరణ్య అని.. సరే ఆ గొడవ ఎందుకు ఇప్పుడు మనకి ఒక కార్ కావాలి, ఎలా
చిన్నా : అదిగో కార్, ఇదిగో కీస్ అని చూపించాడు.
సుబ్బు : బాగా పాతదిలా ఉందే, సరే పద ఇదైనా దొరికింది. అని లోపల కూర్చుని ఇంజిన్ స్టార్ట్ చేసాడు. జూమ్ అని స్టార్ట్ అయ్యేసరికి, ఎమ్మటే దిగి ముందుకు వెళ్లి బానెట్ ఎత్తాడు. భయ్యా ఏంటిది భయ్యా బైటేమో అలా ఉంది లోపలేమో V9 ఇంజిన్ ఉంది. ఎవరు భయ్యా నువ్వు
చిన్నా : ఇక వెళదామా అనగానే సుబ్బు కార్ ఎక్కి కూర్చున్నాడు
సుబ్బు : ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్ అని యాక్సిలరేటర్ మీద కాలేసి గట్టిగా తొక్కాడు.
కార్ బీచ్ దెగ్గరికి ఎంటర్ అవుతుండగానే వీళ్ళకి ఒక వాన్ కనిపించింది. కార్ అక్కడే ఆపేసి, చిన్నా వంగి ఇళ్ల మధ్యలో నుంచి బీచ్ లోకి ఎంటర్ అయ్యి చెట్టు వెనక దాక్కున్నాడు అక్కడ నుంచి వాళ్ళు చూడకముందే అక్కడే వరసగా ఉన్న బోట్స్ దెగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చుని దాక్కున్నాడు. సుబ్బు ఇళ్ల దెగ్గరే ఆగిపోయి చిన్నా ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు.
వాన్ చుట్టూ నలుగురు ఉన్నారు ఎవరినో కిందకి దించారు, మొహాన్ని నల్ల ముసుగుతో కప్పేశారు, చేతులు కట్టేసి ఉన్నాయి. అప్పుడే ఒక పెద్ద స్టీమర్ షిప్ అక్కడికి వచ్చి ఆగింది నలుగురు స్టీమర్ ఎక్కబోతుండగా చిన్నా లేచి ముగ్గురిని కాల్లో షూట్ చేసాడు, వాళ్ళు పడుకొనే వాళ్ళ దెగ్గర ఉన్న గన్స్ తో కాల్చబోతే చిన్నా తప్పక వాళ్ళని చంపేశాడు. మిగిలిన వాడు ఈ లోపే కట్టేసిన వాడిని స్టీమర్ ఎక్కించి వాడు కూడా ఎక్కాడు. స్టీమర్ స్టార్ట్ అయ్యింది. షిప్ లో ఒకడు కనిపిస్తే వాడిని కాల్చేశాడు. స్టీమర్ వేగం అందుకోకముందే పట్టుకోవాలని పరిగెడుతుంటే హార్న్ వినిపించి చూసాడు.
సుబ్బు కారు వేగంగా వస్తుంది. సుబ్బు కారు టైర్లు కుడి వైపుకి తిరగ్గానే చిన్నా అటు చూసాడు చేపలని పట్టుకోడానికి చెక్కలతో కట్టారు అక్కడ. చిన్నా వేగంగా పరిగెడుతూ గన్ వెనకాల పెట్టుకుని స్పీడ్ గా పరిగెత్తి చెక్కలు ఎక్కి పక్కనే ఉన్న బొంగు ఎక్కి సుబ్బు కారు మీదకి దూకాడు.
సుబ్బు : ఓకే నా
చిన్నా : బొటన వేలు చూపించాడు
సుబ్బు నవ్వుతూ గట్టిగా పట్టుకో అని కారు రయ్యిమని లాగాడు. అదే స్పీడ్ లో షిప్ వైపు పెట్టి కళ్లు మూసుకుని మొహం పక్కకి తిప్పుతూ కింద ఇంకా గట్టిగా తొక్కాడు. కార్ గాల్లోకి ఎగిరి షిప్ కి ఒక్క అడుగు పక్కన పడి మునిగిపోతుండగా కారు పైనే ఉన్న చిన్నా అదే టైంలో షిప్ లోకి దూకి వెంటనే ఇద్దరినీ షూట్ చేసి డ్రైవర్ కి గన్ పెట్టి అక్కడే ఉన్న వాడి కట్లు విప్పాడు. అతను కట్లు ఊడదీసుకుని మొహానికి ఉన్న ముసుగు తీసాడు.
చిన్నా : వాసు నువ్వా
వాసు : చిరంజీవి నువ్వెంటి ఇక్కడ
సుబ్బు : ఒరేయి నాకు ఈత రాదు, మీ ముచ్చట్లు తరవాత ఎవరైనా నన్ను కాపాడండయ్యా
చిన్నా : అవన్నీ తరవాత, ముందు వాడిని పైకి లాగు, పోయేలా ఉన్నాడు అనగానే వాసు షిప్ లోనుంచి కిందకి దూకి సుబ్బుని పట్టుకుని షిప్ ఎక్కించాడు.
సుబ్బు : థాంక్స్ అన్నా
వాసు : తల తుడుచుకుంటూ ఇందాక ఒరేయి అన్నట్టున్నావ్
సుబ్బు : అహ్హహ.. సారీ
చిన్నా : నువ్వెంటి వీళ్ళతో
వాసు : నాది వీళ్ళతో ఒక పాత పంచాయితీ ఉందిలే. మరి నువ్వు
చిన్నా : అక్షితని ఎత్తుకెళ్లారు
వాసు : నా భార్యని కూడా, మరి నువ్వు అని సుబ్బుని చూసాడు.
సుబ్బు : అస్సలు ఇక్కడ ఏం జరుగుతుంది, నాకు ఒక్క ముక్క కూడా అర్ధం కావట్లేదు.
చిన్నా : ఇదో లైవ్ రియాలిటీ షో, మన బిగ్ బాస్ లాగా, ఎవరు ఎక్కువగా నటిస్తే వాళ్ళకే ప్రెస్ మనీ.. అనగానే వాసు నవ్వాడు.
సుబ్బు : నేను మరీ అంత ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా, ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా.. ఎంత పెద్ద జోక్ అన్నయ్య.. అక్షిత నీకు ఎలా పడిందో నాకు ఇంకా అర్ధం కావట్లేదు.. అని చిన్నాని ఉడికించాడు.
వాసు : ఇప్పుడు ఎక్కడికి
చిన్నా : వీడు చెపుతాడు.. అని గన్ డ్రైవర్ తలకి పెట్టి.. చల్ అన్నాడు.
వాడు భయంగా స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తుంటే వాసు, చిన్నా మాట్లాడుకుంటుంటే సుబ్బు షిప్ ఎలా నడుపుతున్నాడో గమనిస్తున్నాడు.