21-10-2022, 12:47 PM
(This post was last modified: 21-10-2022, 03:47 PM by Prasad@143. Edited 2 times in total. Edited 2 times in total.)
అందరం conference hall లో వెయిట్ చేస్తున్నాము మా బాస్ కోసం.మా కంపెనీలో నుండి చేసే two projects demo ఉంది. మా కోలిగ్స్ ఎవరి ముచ్చట్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఇంతలో మా కొలీగ్ కీర్తి"కుమార్ ని మ్యారేజ్ అయ్యి 3మంత్స్ అవుతుంది ఇప్పటివరకు మాకు ని వైఫ్ ని పరిచయం చేయలేదు, అస్సలు పెళ్ళికి కూడా పిలవలేదు మాకు ని వైఫ్ ని ఎప్పుడు పరిచయం చేస్తావ్ ", నేను ఏం చెప్పాలో అర్ధం కాక సైలెంట్ గా ఉన్నాను. నా సైలెన్స్ ని చుసిన ఇంకొక కొలీగ్ " కుమార్ వైఫ్ బాగోదేమో అందుకే మనకు పరిచయం చేయట్లేదు ", మళ్ళీ వేరొక కొలీగ్ " అదేం అయ్యి ఉండదు కుమార్కేం చాలా అందంగా,ఆరు అడుగులు ఉంటాడు తన వైఫ్ కూడా కుమార్ లానే అందంగానే ఉంటుంది, ఏంటి కుమార్ మేము అంత ఇంతలా ని వైఫ్ గురించి అడుగుతుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా వున్నావ్. "మీకు నా వైఫ్ ని పరిచయం చేయటానికి నాకు ఇబ్బంది ఏం లేదు తను కొంచెం బిజీ, కొంచెం సిగ్గు కూడా అందుకే పరిచయం చేయలేదు " అని అందరితో చెప్పను "ఏంటి కుమార్ బిజీ నా ని కంటె బిజీ నా అస్సలు ని వైఫ్ ఏం చేస్తుంది " అని ఇంకొక కొలీగ్ అడిగింది. నాకు ఏం చెప్పాలో అర్ధం కాక టాపిక్ డైవర్ట్ చెయ్యాలి అని "అంత బిజీ ఏం కాదు మన ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే అందర్నీ డిన్నర్ కి పిలుస్తా " అని అందరితో చెప్పను. ఒక కొలీగ్ మాట్లాడుతూ " మర్చిపోకుండా ఖచ్చితంగా పిలవాలి, మా అందరికి ని వైఫ్ ని చూడాలని ఉంది ఇంతకీ ని వైఫ్ ఎలా ఉంటుందో చెప్పలేదు, మన బాస్ లా ఉంటుందా "అని నవ్వింది. ఆ మాటలకి అందరూ నవ్వారు. ఛీ ఈ రోజు వీళ్ళకి ఇలా దొరికేనేంట్రా బాబు ఏదో ఒకటి చెప్పేదాం అనుకోని " బాస్ లానా, మన బాస్ ఎక్కడా నా వైఫ్ ఎక్కడా, బాస్ కంటె చాలా అందం గా ఉంటుంది, తనకి నేనంటే చాలా ఇష్టం, ప్రాణం "అని చెప్పగానే, అందరూ" ఓహొ కుమార్ " అంటూ ఆట పట్టిస్తూ నవ్వుతున్నారు.నేను చిన్నగా నవ్వుతున్న ఏం చేయాలో తెలియక. ఇంతలో అందరూ సైలెంట్ అయ్యారు. ఏంటబ్బా అందరూ సైలెంట్ అయ్యారు అనుకుంటూ చూస్తే