16-10-2022, 12:36 AM
(This post was last modified: 16-10-2022, 12:59 AM by matured man. Edited 5 times in total. Edited 5 times in total.)
ఠింగ్ మంది నా మొబైల్, అది మెసేజ్, నాన్న గారి నుండి, వీడియో కాల్ లో రండి, ఈ రోజే కంప్లీట్ చేద్దాం, రాత్రి మీ అందరికీ నిద్ర ఉండదు అని.. కాసేపటికి నాన్న గారి సెక్రెటరీ ఆఫీస్ నుంది గూగుల్ మీట్ లింక్ పంపారు.. ఇంట్లోకి వెళ్ళాక, థియేటర్ రూం కి వెళ్ళి, టి.వి ఆన్ చేసి నెట్ కనెక్టివ్టీ చూసా అంతా సరిగా ఉంది... గూగుల్ మీట్ ఈ రూం లో అయితే పెద్ద స్క్రీన్, 20 మంది కి పైగా పడతాం, కాసేపటికి పెదనాన్న, పెద్దమ్మ, అక్క, అన్న, వదిన వచ్చారు.. నేను ఎక్స్ పెక్ట్ చేసినట్లుగా అమ్మ ఈ మీటింగ్ కి రాలేదు.. ఐశ్వర్య వాళ్ళ నాన్న, అమ్మ, మా పెదనాన్న, పెద్దమ్మ, వదిన అందరూ ఐశ్వర్య కి చెప్పారు.. పేగు బంధం, కన్న తల్లి ప్రేమ మాత్రమే ఐశ్వర్య చూడకూడదు అనీ, ఆ బిడ్డ భవిష్యత్తు ఆలోచించాలనీ చెప్పారు.. ఈ ఇంట్లో పెరిగే కన్నా, ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో పెరిగితే ఉండే గౌరవం మర్యాద వేరే గా ఉంటాయని చెప్పారు.. ఉదాహరణలు ఎన్నో ఇచ్చినా, నాకు నాగ చైతన్య ఎగ్జాంపుల్ బాగా నచ్చింది.. అక్కినేని ఫామిలీ లోనే ఉండటం వలన అతని జీవితం వేరే గా ఉంది.. ఆ ఇంట్లో ఉంటే ఫస్ట్ సిటిజెన్, ఈ ఇంట్లో ఉంటే ఫస్ట్ సిటిజెన్ అని మనం చెప్పినా అతనికి అలా అనిపించదు..ఎప్పటికీ కాలేడు కూడా..blood is thicker than water అని అందరం గ్రహించాలి.. పుట్టినప్పటి నుండీ 25 యేళ్ళు ఒకరికి ఒకరు తెలియకుండా పెరిగిన రాజు, పూజిత ఈరోజు అక్క తమ్ముళ్ళంటే ఇలా ఉండాలి అనే విధం గా వ్యవహరిస్తున్నారు అంటే అదే రక్త సంబంధం.. దాని ఎవరూ విడతీయలేరు.. ఇప్పుడు కాదు 20 సంవత్సరాలు దాటాక తెలుస్తుంది.. కనుక నీ ప్రేమని నీలో పెట్టుకుని ఆ బిడ్డ భవిస్యత్తు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోమని చెప్పారు.. ఎవరెంత చెప్పినా ఫైనల్ డెసిషన్ మాత్రం ఐశ్వర్య దే ననీ ఆమె డెసిషన్ కి అందరూ సమ్మతిస్తామనీ చెప్పారు.. భోజనాలు అయ్యాక అందరూ వెళ్ళారు, ఐశ్వర్య వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర పడుకుంది ఈరాత్రికి, నేను సౌభాగ్య నా రూం లో పడుకున్నాం.. మనసంతా అలజడిగా ఉండటం తో నాకు పడుకోగానే నిద్ర పట్టేసింది.. ప్రొద్దున లేచేసరికి, ఐశ్వర్య నా పక్కన పడుకోని ఉంది.. నేను లేచి, ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చేసరికి, ఐశ్వర్య కూడా లేచింది.. జలజ - నాకు, ఐశ్వర్య కి కాఫీ ఇచ్చింది.. ఐశ్వర్య చాలా నార్మల్ గా ఉంది.. నేను రూం లో రెడీ ఔతుంటే ఐశ్వర్య రూం లోకి వచ్చి తలుపు వేసింది.. నన్ను సోఫాలో కూర్చో పెట్టి తను క్రింద కూర్చుని - ఏవండీ "రాత్రంతా ఆలోచించాను.. నాకేమీ తెలియటం లేదు, నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన మీరే ఈ సమస్య కి పరిష్కారం చెప్పాలి" అంది.. నాన్న కూడా నువ్వు చెప్పేదే ఫైనల్ డెసిషన్ అన్నాడు అంది... సౌభాగ్య స్నానం చేసి బయటకి వచ్చింది, ఆమె కూడా శ్రద్ధగా వింటూ, డ్రెస్ చేసుకుంటుంది... ఐశ్వర్య ని పైకి లేపి, నా ఒళ్ళో కూర్చో పెట్టుకున్నాను.. ఇలా చూడు ఆమె కళ్ళలో చూస్తూ, (ఒకటి) నువ్వు ఆ ఇంట్లో వాళ్ళ బిడ్డతో ఉంటే అందరికీ చాలా మర్యాదగా ఉంటుంది... కానీ తమ కొడుకు - డబ్బు తీసుకు పోయి తగలేసాడు అనే కోపం తో కొడుకు - కులం మతం లేని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు అనే నెపం తో నిన్ను నీ బిడ్డని దూరం పెట్టేసారు... కానీ వాళ్ళు తమ కొడుకు కర్మ కాండలు అన్నీ చేసారు, కొడుకు పట్ల తమ ధర్మాన్ని నిర్వర్తించారు.... అదే కొడుకు పోయాక నిన్ను తమ మనమడిని తీసుకుని వెళ్ళి నీకు అండగా నిలబడి ఉండాల్సింది.. కానీ వాళ్ళు ఆ పని చెయ్యలేదు.. ఈ రోజు నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావని తెలిసి వాళ్ళు నీ నుండి తమ మనమడిని ఆశిస్తున్నారు.. అక్కడ ఉంటే నువ్వు నీ జీవితాన్ని పూర్తిగా కోల్పోతావు... వాళ్ళు నీకు మర్యాద ఎంత ఇస్తారో తెలిసిందే కదా.. (రెండు) వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంట్లో పెరిగితే అతనికి గౌరవం, మర్యాద వేరే గా ఉంటాయి.. అతను తన ఉనికిని కోల్పోడు, తన వంశాన్ని కోల్పోడు.. ఇక, ఆ బిడ్డని అక్కడ మన సూపర్విజన్ లోనే పెంచుదాం, అక్కడ ఉంటాడే కానీ, అంతా మనం అనుకున్నట్లే చదివిస్తాం, పెంచుతాం.. ఇండైరెక్ట్ గా మనం ఈ పని చేస్తాం.. ఇలా చేస్తే సంతోష్ ఆత్మ కూడా శాంతిస్తుంది.. ఇది నా సలహా... తన వద్ద కంటే తన కొడుకు వేరే చోట మంచి జీవితం లో పెరుగుతుంటే తల్లికి వచ్చే ఆనందం నీకు వస్తుంది..నీ బిడ్డ ఒక హాస్టల్ లో పెరుగుతున్నాడు అనుకో అంతే.. కానీ ఇక్కడ ఆ హాస్టల్ అతని స్వంత రక్తం.. ఇది తేడా.... నేను, నువ్వు ఎవరో తెలియకుండా అతన్ని మంచి పౌరునిగా తయారు చేస్తాను.. ఇది నేను నీకిచ్చే వాగ్దానం అని చెప్పాను.. అప్పటి వరకూ నా పక్కన కూర్చున్న సౌభాగ్య, క్లాప్స్ కొట్టింది, ఐశ్వర్య ఆమెతో కలిసింది.. సౌభాగ్య చప్పట్లు కొడుతుంటే ఐశ్వర్య డాన్స్ చేసింది.. ఆమె మనసులో ఉన్న కష్టం బాధ తీసేసినట్లు ఫీల్ అయ్యింది..... ఇద్దరినీ దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నా.. బయటకి వచ్చి, టిఫిన్ చేసి, ఫాక్టరీకి బయలు దేరాం... ఈ రోజు చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి..