Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సుబ్బిగాడు ≠ World Famous Lover
నాలుగు రోజులకి సుబ్బు తేరుకున్నాడు, రాత్రికి లేచి అటు ఇటు నడిచి సెట్ అయ్యి కూర్చుని ఆలోచిస్తూ కూర్చున్నాడు. తెల్లారి అరవింద్ వచ్చి సుబ్బుని చూసి ఆనందించి పని వాళ్ళతో కావాల్సిన ఫ్రూట్స్ నట్స్ అన్ని తెప్పించాడు.

సుబ్బు : దేనికిరా ఇదంతా 

అరవింద్ : నీకే నీ టైం బాగుంది అనుభవించు, వారానికి సరిపడా ఉన్నాయి ఇంకేమైనా కావాలంటే ఫోన్ చెయ్యి నేను అలా ఆఫీస్ దాకా వెళ్ళొస్తా అని వెళ్ళిపోయాడు.

అరవింద్ సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి సుబ్బు గాడి రూంలో సుబ్బు లేడు పొద్దున తెప్పించిన ఫ్రూట్స్ లేవు.

అరవింద్ : మల్లయ్య.. మల్లయ్యా 

మల్లయ్య : బాబుగారు 

అరవింద్ : వీడేడి

మల్లయ్య : చిన్న బాబుగారు వద్దన్నా కూడా పళ్ళు మొత్తం తినేసారు అన్నం బదులు జూస్ చేపించుకుని తాగేసారయ్యా జిమ్ రూంలో ఉన్నారు.. పిలవమంటారా 

అరవింద్ : లేదు నేనే వెళతాను, మీరు వెళ్ళండి.. అని చెప్పేసి జిమ్ రూంకి వెళ్ళాడు.. అక్కడ సుబ్బు ట్రెడ్ మిల్ మీద చిన్నగా నడుస్తున్నాడు.

సుబ్బు : హాయి రా 

అరవింద్ : అస్సలు ఎం జరుగుతుంది ఇక్కడా

సుబ్బు : ఏమైంది రా

అరవింద్ : నువ్వే చెప్పాలి, పంది తిన్నట్టు వారానికి సరిపడే ఫుడ్డు మొత్తం ఒక్క రోజులోనే తినేశావంట..

సుబ్బు : అదా..ఈ నాలుగు రోజులు అస్సలు ఎం తినలేదు కదరా అందుకే బాలన్స్ చేసాను.. మళ్ళి తెప్పించు.. ఇక దొబ్బేయి.

అరవింద్ : అలాగే (అని వీడు నాకు అర్ధం కాడు అనుకుంటూ వెనక్కి తిరిగాడు)

సుబ్బు : ఇంకోటి.. కొంచెం జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది, డోలో - 650  ఒక రెండు తెప్పించు.

అరవింద్ : సరిగ్గా రెండే ఎందుకో..

సుబ్బు : అదా 650 + 650 రెండు కలిపితే 1350 బాగా పవర్ ఎక్కువ ఉంటుంది లే. ఒక టాబ్లెట్ జ్వరం రాకుండా ఆపుతుంది. మొదటి టాబ్లెట్ ఆపలేకపోతే రెండో టాబ్లెట్ ఆపుతుంది.

అరవింద్ : సుబ్బు... ఆ శివరాం గాడేమైనా తల మీద కొట్టాడా 

సుబ్బు : జోకులు ఆపి చెప్పింది చెయ్యి అని మళ్ళి ట్రెడ్ మిల్ స్పీడ్ పెంచి నడవడం మొదలు పెట్టాడు.

అరవింద్ మాత్రం సుబ్బు గాడి తిక్క పనులకి అస్సలు ఐదు రోజులు ఇంటికి రావడమే మానేశాడు వచ్చినా సుబ్బు గాడిని తప్పించుకుని తిరిగేవాడు.. ఇక సుబ్బు అస్సలు ఇంట్లో నుంచి బైటికి కదలలేదు తినడం ఎక్సర్సైజులు చెయ్యడం మళ్ళి బాడీని ఇంతకు ముందు ఎలా ఉండేదో అదే షేప్ కి తీసుకొచ్చేసాడు. ఆరో రోజు పొద్దున్నే లేచి అరవింద్ ముందుకి వెళ్ళాడు.

అరవింద్ : ఏంట్రా 

సుబ్బు : నాకు నీ ఫోర్డ్ మాస్టాంగ్ కావాలి 

అరవింద్ : తీసుకెళ్ళు మళ్ళి అడగడం దేనికి 

సుబ్బు : మళ్ళి తిరిగిరాదు అందుకని, వర్క్ షాప్ ఓపెన్ చేపించు పని ఉంది.

అరవింద్ : (సుబ్బు ఎప్పుడు ఇంత సూటిగా మాట్లాడలేదు అలాంటిది కళ్ళలోకి చూసి మాట్లాడడంతో లేచి నిలబడ్డాడు అనుమానంగా) కార్ బానే ఉందిగా 

సుబ్బు : నెంబర్ ప్లేట్స్ తీసెయ్యాలి, రిపెయింట్ చెయ్యాలి టైర్లు కూడా ఇవి కాదు వేరే ఉన్నాయి.. మనకి పార్ట్స్ సప్లై చేసే విల్సన్ కి ఫోన్ చెయ్యి ఈ సారి ఇల్లీగల్ గా పార్ట్స్ కావాలని చెప్పు అని లోపలి వెళ్ళిపోయాడు.

అరవింద్ సుబ్బు వెనకే వెళ్లి : ఆ శివరాం గాడిని ఎం చేద్దామనుకుంటున్నావ్ 

సుబ్బు : చూస్తావుగా 

అరవింద్ : వద్దురా నా మాట విను వాడి వెనుక చాలా పెద్ద తలలు ఉన్నాయి.

సుబ్బు : హెల్ప్ చేస్తావా నన్నే చూసుకోమంటావా, ఇప్పుడు ఎవ్వరు చెప్పినా వినే మూడ్ లో అస్సలు లేను అని లోపలికి వెళ్ళిపోయాడు.
+++++++++++++++++++++++
++++++++++++++++++++
+++++++++++++++++++++++

రెండు జంటలు వాసు దెగ్గర సెలవు తీసుకుని విక్రమాదిత్య గురించి తెలుసుకోవడానికి తన అమ్మ సంధ్య దెగ్గరికి వెళ్లేముందు కొంచెం రెస్ట్ తీసుకుని వెళదామని ఆగి రెండు రోజులు అక్కడే ఎంజాయి చేసిన తరువాత ప్రయాణానికి సిద్ధమయ్యారు. విక్రమ్ ఆదిత్యలు ఇద్దరు బండి మీద రెడీగా ఉన్నారు, అను కూడా బండి ఎక్కింది..

విక్రమ్ : మానస..

మానస : వస్తున్నా అమ్మ ఫోన్ చేసింది.. ఒక్క నిమిషం.

అను : నేరుగా సంధ్య గారి దెగ్గరికి వెళదాం, అస్సలు ఇప్పుడు తను ఎక్కడ ఉందొ ఎలా ఉందొ ఎలా తెలుసుకోవడం.

విక్రమ్ : ఇంటి అడ్రస్ తెలిసింది వెళ్లి చూస్తే కానీ తెలీదు.

ఇంతలో మానస లోపలి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది.

మానస : విక్రమ్... సమస్య 

విక్రమ్ : ఏమైంది అనగానే అను బండి దిగింది ఆదిత్య బండి కీస్ తిప్పి ఆపేసాడు.

మానస : ఎవరో మా ఇంటి గోడలు బద్దలు కొట్టి ఇంటి నుంచి ఎలక్షన్ ఫండ్ డబ్బులు మొత్తం ఎత్తుకుపోయారట.. రెండు రోజుల్లో నాన్నని చంపేస్తామని లెటర్ పెట్టి వెళ్ళిపోయాడట 

విక్రమ్ : మీ నాన్నకి కావాల్సిందేలే.. అయినా అంతా దొంగ డబ్బేగా.. పోతే పోయింది ఇక మీ నాన్నని కాపాడమని నన్ను అడక్కు నేను చెయ్యలేను నా వల్ల కాదు.

మానస : అది కాదు, ఇంటిని బద్దలు కొట్టుకుని వచ్చింది ఒక కారుతో 

ఆదిత్య : అయితే 

మానస : నాకెందుకో అది సుబ్బు అని అనుమానంగా ఉంది.

ఆదిత్య : వాడికంత సీన్ లేదు 

ఇంతలో విక్రమ్ ఫోన్ లో న్యూస్ టైపు చెయ్యగానే ఫుటేజ్ లింక్ చూసి ఓపెన్ చేసాడు ఆదిత్యతో పాటు అందరూ విక్రమ్ పక్కన చేరి ఫోన్ చూసారు. ఇరవై సెకండ్స్ లో కార్ దూసుకుంటూ గేట్ బద్దలు కొట్టుకుని వెళ్లి బైటికి అదే స్పీడ్ లో రెవెర్స్ గేర్లో వచ్చేసింది.. 

మానస : అది సుబ్బు గాడి పనే 

విక్రమ్ : అంత కచ్చితంగా ఎలా చెపుతున్నావ్

మానస : నాకు తెలుసు ఆ స్పీడ్ లో కార్ ని కర్వ్ లో అదీ రెవెర్స్ లో తిప్పడం వాడి వల్లే అవుతుంది. వాడి కార్ ఎక్కింది నేను వాడు ఎలా నడుపుతాడో నాకు తెలుసు. మా నాన్న నుంచి తప్పించుకునేటప్పుడు మా వెనుక ఏడు కార్లు వెనకపడ్డాయి కనీసం వాడి కళ్ళలో భయం కూడా చూడలేదు నేను..  అంత తెలివిగా అంత స్పీడ్ గా నడిపాడు.. నాకు భయంగా ఉంది వాడు మళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాడు. మా నాన్న కూడా మారిపోయాడు కదా ప్లీజ్ వెళదాం.

విక్రమ్ : పద.. అయినా సుబ్బు గాడు ఇంత మంచి డ్రైవరా

మానస : ఒకసారి వాడి కార్ ఎక్కి చూడు తెలుస్తుంది.. అని సుబ్బుకి కాల్ చేసింది కానీ నో రెస్పాన్స్ 

ఇటు పక్క సుబ్బు వాడి కారు విరిగిపోయిన పార్ట్స్ ని వెల్డింగ్ చేసి పెయింట్ మార్చి నల్ల రంగు వేసి కొత్త టైర్లు తొడిగాడు ఎల్లుండి హత్య చెయ్యాల్సిన శివరాంని ఎలా ప్లాన్ చేసి చంపాలా అని ఆలోచిస్తుండగా రింగ్ అవుతున్న ఫోన్ గురించి పట్టించుకోలేదు.
Like Reply


Messages In This Thread
RE: సుబ్బిగాడు ≠ World Famous Lover - by Pallaki - 15-10-2022, 04:11 PM



Users browsing this thread: 48 Guest(s)