13-10-2022, 01:07 AM
(This post was last modified: 13-10-2022, 07:06 AM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
ముగ్గురు మళ్ళీ ముందుకు వస్తుంటే ఇక లాభం లేదని ఒకడి కాలర్ పట్టుకుని గుండ్రంగా తిప్పి ఒక్క తన్ను తన్నగానే వెళ్లి సోఫాలో కూర్చున్నట్టు పడిపోయాడు ఆ వెంటనే మిగతా ఇద్దరు కూడా ఒకరి పక్కన ఒకరు సోఫాలో కూలబడ్డారు. అక్షిత దెగ్గరికి వెళ్లి తన పక్కనే గోడకి గుద్దుకుని కింద కూర్చున్న మొదటి వాడిని లేపి సోఫాలో కూర్చోపెట్టి కిచెన్ లోకి వెళ్లి ఫ్రిడ్జ్ లోనుంచి మంచినీళ్లు తెచ్చిస్తే తాగారు, అక్షిత చెయ్యి పట్టుకుని బైటికి తీసుకొచ్చాడు.
అక్షిత : ఎవరు నువ్వు?
చిన్నా : నీకు తెలుసుగా
అక్షిత : లేదు నీ గురించి నాకేం తెలీదని నాకు ఇప్పుడే తెలిసింది.
చిన్నా : కింద కూర్చుని అక్షితని నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను, అక్షితా నేను బతికున్నంత వరకు నీతోనే ఉంటాను, అదే జీవితాంతం నీకు తోడుగా ఉంటాను.. ప్రామిస్.. కానీ దీనికి బదులుగా నువ్వు నాకు ఇంకొక ప్రామిస్ చెయ్యాలి, చేస్తావా
అక్షిత : ఏంటీ...
చిన్నా : నా గురించి చెప్పమని కానీ నా గురించి తెలుసుకునే ప్రయత్నాలు కానీ చెయ్యనని నాకు ఒట్టు వెయ్యి.
అక్షిత : హ్మ్మ్... సరే మా అమ్మ మీద ఒట్టు ఎప్పుడు నిన్ను అడగను.. సరేనా.. కానీ నువ్వు తప్పులు చేస్తు...
చిన్నా : నా గుండెలో మా అమ్మతో పాటు సమానమైన స్థానం సంపాదించిన మీ ఇద్దరి మీద ఒట్టు పెట్టి చెపుతున్నా నేను తప్పుడు మార్గంలో లేను, చెడ్డవాడిని అస్సలే కాదు నా ఆలోచనలు మాత్రమే కొంచెం క్రూరంగా ఉంటాయి నీ పనస తోన వాసన లాగా కొంచెం పచ్చిగా అంతే..
అక్షిత : ఛీ... అవును.. చిన్నా నీ అస్సలు పేరేంటి?
చిన్నా : చిరంజీవి
అక్షిత : బాగుంది.
చిన్నా : పదా, మీ తమ్ముళ్ళకి ఏమైనా పెడదాం.. బిర్యానీ తీసుకురానా
అక్షిత : నేను తెప్పిస్తాను.
అందరూ కూర్చుని భోజనాలు చేసిన తరువాత వాళ్ళని పంపించేసింది, మధ్యలో వాళ్ళు అడిగిన ఫైటింగ్ టెక్నీక్స్ గురించి ప్రశ్నలకి చిన్నా మౌనంగా ఉన్నా అక్షిత ఇంకేం అడగకుండా వాళ్ళని పంపించేసింది. ఇద్దరు సోఫాలో కౌగిలించుకుని కూర్చున్నారు అక్షిత చిన్నా కండలని తడుముతుంది.
చిన్నా : అక్షిత అడగడం మర్చిపోయాను, ఆ డైరీ చదివావా ఏముంది అందులో..
అక్షిత : అదీ విక్రమాదిత్య కధ అంతే.. ఇంకా చదవలేదు.. కొంచెం పని పడింది.. చదవాలి..
చిన్నా : చదువుదాం తీసుకురాపో అనగానే అక్షిత లేచి డైరీ తెచ్చింది. ఇద్దరు చదవడం మొదలు పెట్టి రాత్రి ఎనిమిదింటి వరకు ముగించారు. ఇంతలో పార్వతి ఫోన్ చేసింది.
పార్వతి : రేయి రేపే అన్నయ్య పెళ్లి, కనీసం పనులు ఎలాగో చెయ్యవు.. వచ్చిన చుట్టాలకైనా నీ మొహం చూపించు.. ఎక్కడ చచ్చావ్.
చిన్నా : నీ కోడలు దెగ్గర.
పార్వతి : అక్షిత దెగ్గర ఉన్నావా, రేపు పెళ్ళికి తీసుకురా తనతో మాట్లాడాలి.
చిన్నా : మాట్లాడతావా ఇప్పుడు, పక్కనే ఉంది.
పార్వతి : లేదురా చాలా బిజీగా ఉన్నాను రేపు పెళ్లి అయిపోయాక తీరికగా మాట్లాడతాను. సరే ఉంటా పెందలాడే ఇంటికిరా
చిన్నా : సరే.. సరే.. బై
అక్షిత : నవ్వుతూ... ఉండు డైరీ లోపల పెట్టి వస్తాను.
చిన్నా : నాకొక డౌటు.. విక్రమాదిత్య కధ బానే ఉంది అన్నీ బాగున్నాయి కానీ ఒక్కటి మాత్రం తేడా కొడుతుంది.. ఈ కధ రాసిన వారు ఎవరు తనకి ఈ కధకి ఏంటి సంబంధం.. అంటే అయన ఎవ్వరిని అంత దెగ్గరగా రానివ్వలేదు కదా.. అందుకే డౌట్.. ఇంతలో ఇంకో ఫోన్ వచ్చింది. సాటిలైట్ ఫోన్.. బైటికి తీసాను అక్షిత చూసింది కానీ ఏమి అడగలేదు.. డైరీ లోపల పెట్టడానికి లోపలికి వెళ్ళింది
ధీరజ్ : రేయి ఎక్కడా
చిన్నా : ఇక్కడే ఉన్నాను చెప్పు
ధీరజ్ : మన వాడు ఒకడు దొరికిపోయాడు, రెస్క్యూ ఆపరేషన్ కి వెళ్ళాలి.
చిన్నా : రేపు మధ్యాహ్నం బైలుదేరతాను, అప్పటి వరకు మనోళ్లని గ్రౌండ్ వర్క్ చేయమనండి.
ధీరజ్ : ఇద్దరు జూనియర్స్ ని తీసుకెళ్ళు..
చిన్నా : అవసరమా.. నేనళ్ళొస్తా కదా
ధీరజ్ : అలా అనకురా.. నీ కింద ఒక్క మిషన్ అయినా చెయ్యాలని నన్ను చంపుతున్నారు.
చిన్నా : ఎవరా మహానుభావులు
ధీరజ్ : మీ వదిన తన ఫ్రెండు నిత్య
చిన్నా : అస్సలు వద్దు..
ధీరజ్ : వాళ్ళకి ట్రైనింగ్ అవసరంరా.. నువ్వైతే సేఫ్ గా తీసుకొస్తావ్.. మా బాబే ఈ ఒక్కసారి వెళ్ళిరా..
చిన్నా : సరే కానీ నేను వాళ్ళకి కనిపించను..
ధీరజ్ : నో రూల్స్ నో రెగ్యులషన్స్ సరేనా నీ ఇష్టం
చిన్నా : ఇది బాగుంది.. ఇప్పుడు ఓకే
ధీరజ్ : అక్షిత ఎలా ఉంది
చిన్నా : అప్పుడే మీ ఫ్రెండ్ తో సిట్టింగ్ అయిపోయిందా
ధీరజ్ : సరే బై.. జాగ్రత్త కొంచెం దూకుడు తగ్గించు.. అని ఫోన్ పెట్టేసాడు.
చిన్నా : ఇప్పుడు చెప్పవే... ఎవరు ఈ డైరీ రాసింది.. చదివేటప్పుడు నీ మొహం గమనిస్తూనే ఉన్నాను.. నా నుంచి చాలా దాస్తున్నావ్.
అక్షిత : చెప్తాను.. ఈ డైరీ రాసింది మా అమ్మ
చిన్నా : అదేంటి మీ అమ్మ వాళ్ళు నీ చిన్నప్పుడే చనిపోయారు కదా
అక్షిత : కన్న అమ్మ కాదు, పెంచిన అమ్మ..
చిన్నా : ఎవరు..?
అక్షిత : అమ్మ నాన్న చనిపోయాక నన్ను దెగ్గరికి తీసింది.
చిన్నా : ఇప్పుడు ఎక్కడ ఉంది..
అక్షిత : బతికే ఉంది.. కానీ కోమాలో ఉంది.
చిన్నా : అలాగా.. అయినా తనకి ఈ కధకి ఏంటి సంబంధం?
అక్షిత : ఎందుకంటే తను విక్రమాదిత్య కూతురు కాబట్టి.
చిన్నా : కానీ.. అసలు...
అక్షిత : అవన్నీ నాకు తెలీవు.. కన్నది మాత్రం విక్రమాదిత్య భార్య అనురాధ.. అస్సలు తల్లి మాత్రం వేరేనట
చిన్నా : అర్ధం అవ్వలేదు.
అక్షిత : సరగోసి పద్ధతి.. కన్నది అనురాధ కానీ అసలు తల్లి ఎవరో అమ్మ నాకు చెప్పలేదు.. తనే మా తెగకి నాయకురాలు.. తనని కాపాడడానికే నేను తపిస్తుంది..
చిన్నా : ఎందుకు
అక్షిత : పూర్తి కధ నాకు తెలీదు, కానీ ఎవరు చంపాలని తిరుగుతున్నారో తెలుసు, తీరికగా తరువాత చెపుతాను.. ముందైతే వాళ్ళని ఎవరినో కాపాడి రాపో
చిన్నా : విన్నావా, అదీ
అక్షిత : నేను నిన్నేమి అడగను.. వెళ్ళు
చిన్నా : రేపు పెళ్లి అయిపోయాక అటు నుంచి ఆటే వెళ్ళొపోతాను.. వస్తావా
అక్షిత : వస్తాను.
చిన్నా బైటికి వెళుతూ వెనక్కి తిరిగాడు.
చిన్నా : మీ అమ్మ పేరేంటి?
అక్షిత : రక్ష