Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సుబ్బిగాడు ≠ World Famous Lover
బెంగుళూరు నుంచి ఎత్తుకెళ్లిన పుల్లయిస్లు సుబ్బుని నేరుగా తీసుకెళ్లి హైదరాబాద్ వాళ్ళకి అప్పగించారు అక్కడ నుంచి వాళ్ళు సుబ్బుని ఒక ఫార్మ్ హౌస్ కి తీసుకెళ్లి మానస నాన్న అయిన శివరాం దెగ్గర విడిచిపెట్టి వెళ్లిపోయారు.

సుబ్బు కొంచెం భయంగానే నిల్చున్నాడు వెంటనే ఆలోచన వచ్చి జేబులో ఉన్న ఫోన్ తీసుకుని అరవింద్ కి కాల్ చేసి ఎదురుగా కుర్చీలో కూర్చున్న శివరాంని చుట్టూ నిలబడి ఉన్న మనుషులని చూసాడు. శివరాం కోపంగా లేచి సుబ్బు గుండె మీద కాలితో ఒక్క తన్ను తన్నాడు.

కింద పడ్డ సుబ్బు : మీకు నా గురించి తెలీదు నా వెనకాల శరణ్య ips ఉంది.. నాకేమైనా జరిగితే మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టదు.

శివరాం : హ హా హా... రేయి నిన్ను పట్టించిందే అది రా, అది నా కుక్క.   ఎంత ధైర్యం ఉంటే నా కూతురుని లేపుకుపోతావ్.. లంజాకొడకా అని ఇంకోటి కడుపులో తన్నాడు.

సుబ్బు : రేయి.. నువ్వేరా లంజ.. నా అమ్మని తిడతావా.. నువ్వు బతికి ఉండాలనుకుంటే నన్ను ఇప్పుడే చంపేసుకో.. ఈ క్షణం నుంచి నేను గనక బైట పడ్డానే అనుకో నీకు ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వను.. మధ్యలో మా అమ్మ ఏం చేసిందిరా నిన్ను అని ఏడ్చేసాడు.

( ఆఫీస్ లో ఏసీ కింద కూర్చుని తన పిఏ ప్రసాద్ తో సొల్లు వేస్తున్న అరవింద్ కి ఫోన్ రాగానే నవ్వుతూ ఎత్తి, అక్కడి మాటలు వినపడగానే లేచి నిల్చొని ఫోన్ స్పీకర్ లో పెట్టాడు

ప్రసాద్ : సర్ అది మీ కాబోయే మామగారు శివరాం గారి వాయిస్)

శివరాం : ఆడంగి వెధవలా ఏడుస్తున్నావ్ మళ్ళీ చంపుతా అని నన్నే బెదిరిస్తున్నావ్.. రేయి వీడు బతికే ఉండాలి.. వీడిని మీరు చేసే టార్చర్ చూసి నా కూతురిని ప్రేమించిన ఆ నా కొడుకు ఉచ్చ పోసుకోవాలి అప్పుడు వాడి ముందే వాడి ఫ్యామిలీని ఆ తరువాత వాడిని చంపేద్దాం. ఇంతలో శివరాంకి ఫోన్ వచ్చింది చూస్తే అరవింద్ నుంచి.. హలో అరవింద్ బాబు నేను మళ్ళీ చేస్తాను కొంచెం బిజీగా ఉన్నాను.

అరవింద్ : అంకుల్ మీరు ఎత్తుకెళ్లిన సుబ్బు నా స్నేహితుడు

శివరాం : వీడు ఏం చేసాడో తెలుసా

అరవింద్ : నేను మాట్లాడతాను, వాడికి ఏమి తెలీదు మానస నేను చేసుకునే అమ్మాయి అని నేను ఇంకా వాడికి చెప్పలేదు వాడికి మీ గురించి మన బిజినెస్ డీల్స్ గురించి ఏమి తెలీదు.. తప్పు నాది ముందే చెప్పుంటే అయిపోయేది.. నా పెళ్ళిలో దెగ్గరుండి పనులు చూసుకునే వాడు.. నాకున్న ఏకైక బంధువు.. ప్లీజ్.. అలా కాకపోయినా మీ ప్రతీ ఎలక్షన్ కి ఫండ్స్ పంపిస్తున్నాను ఆ చొరవ మీద అయినా వాడిని వదిలెయ్యండి ప్లీస్.

శివరాం : బాబు ఎంత మాట.. ఇంతగా అడగాలా నాకూ తెలీదు లేకుంటే ఇలా జరిగేది కాదు. కానీ మా వాళ్ళు ఆల్రెడీ కొద్దిగా కొట్టారు ఏమనుకోకు తెలీకుండా జరిగిపోయింది.

అరవింద్ : నేను వస్తున్నాను. అని ఫోన్ కట్టేసి బైటికి పరిగెత్తాడు.. తన వెనుకే అంబులెన్సుకి ఫోన్ చేస్తూనే ప్రసాద్ కూడా వెళ్ళాడు.

శివరాం : రేయి అల్లుడు బాబు వచ్చేలోపు వీడిని తుక్కు తుక్కుగా కొట్టండి.. అని కుర్చీలో కూర్చున్నాడు. సుబ్బు మీద పది మంది ఎక్కి కిక్ బాక్సింగ్ బ్యాగ్ లా వాడుకుని పిచ్చి పిచ్చిగా పంచులు కాళ్ళతో కిక్కులు కొడుతుండగా, శివరాం అక్కడనుంచి లేచి బైటికి వచ్చాడు అరవింద్ వచ్చేలోపే వెళ్లిపోవాలని అప్పుడే ఒక dcm వచ్చి ఆగింది.. అందులోనుంచి ఆదిత్య దిగాడు.. ఆదిత్యని చూడగానే శివరాం కోపం నషాలానికి అంటింది.. రేయి వీడేరా ఈ నా కొడుకు వీడి మొడ్డ కోసెయ్యండి.

ఆదిత్య : వాడు వీడెందుకు పోనీ నువ్వే వచ్చేయి తొందరగా అయిపోద్ది.. అని పరిగెత్తుకుంటూ వెళుతునే నలుగురిని గుద్దాడు.. మిగతా వాళ్ళు తెరుకునే లోపే ఒక్కొక్కడి మెడ విరిచేసాడు.. Dcmలో ఉన్న శవాలని కూడా శివరాం ముందు కిందపడేసి శివరాంకి ఉచ్చ పోపించాడు.. శివరాం కి మనుషులతో పాటు వాసన రక్తం చూసి ఒళ్ళు జలదరించింది, భయపడిపోయాడు.. ఆదిత్య  కింద పడి ఉన్న సుబ్బుని వాడి స్థితిని చూసి శివరాం చెంప మీద ఒక్కటి పీకాడు.. మళ్ళీ నీళ్లు మొహం మీద కొడితే కాని లేవలేదు శివరాం.

శివరాం : నన్ను వదిలేయి, నీకు దణ్ణం పెడతాను.

ఆదిత్య : వాడు ఏం చేసాడని ఇంతలా కొట్టావ్, మానస నాన్న వన్న ఒకే ఒక్క కారణం నిన్ను ఏం చెయ్యకుండా నన్ను ఆపుతుంది.. అని సుబ్బు దెగ్గరికి వెళ్లి రెండు చేతులతో పైకి ఎత్తాడు.. సుబ్బు.. నేను ఆదిత్య వచ్చేసానురా..  ఏ భయం లేదు పద హాస్పిటల్ కి వెళదాం. అని గేట్ దెగ్గరికి నడుస్తుంటే పెద్ద కార్ ఒకటి ఆగింది.. అందులో నుంచి అరవింద్ ప్రసాద్ ఇద్దరు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి ఆదిత్య చేతిలో ఉన్న సుబ్బుని చూసి కోపంగా వెనక ఉన్న శివరాంని చూసాడు.

అరవింద్ : నేను ఇందాక వాడి మాటలు విన్నాను.. నేను వచ్చేలోపు వీడిని ఇలా కొట్టించావ్.. గుర్తు పెట్టుకో ఇక నుంచి నేనూ నీ శత్రువునే నువ్వు రాబోయే ఎలక్షన్ లో ఎలా గెలుస్తావో నేనూ చూస్తాను.. నీ కూతురుకి అస్సలు పెళ్లే కానివ్వను.. చూస్తూ ఉండు.. నీ టైం దెగ్గర పడింది.. ఇప్పటి వరకు నీ పవర్ చుపించావ్ డబ్బుతో ఏం ఏం చెయ్యగలనో నా పవర్ కూడా చూద్దువు అని తిరిగి ఆదిత్యని చూసాడు.. నేను తీసుకెళ్తాను.

ఆదిత్య : నేనూ వస్తాను, పదండి.

సుబ్బుని హాస్పిటల్లో జాయిన్ చేసి లోపలికి తీసుకెళ్లగానే ఆదిత్య అరవింద్ తో మాట్లాడి వెళ్ళిపోయాడు.. సుమారు పది గంటలు అరవింద్ ప్రసాద్ తోపాటు హాస్పిటల్లోనే ఉన్నాడు.. స్పృహ రాగానే వెంటనే సుబ్బు వాళ్ల మావయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పి లోపలికి వెళ్ళాడు.

అరవింద్ : సుబ్బు ఎలా ఉన్నావ్ రా, ఏంట్రా ఇదంతా నువ్వు గొడవలకి వెళ్లడం ఏంట్రా

సుబ్బు : నీకు వాడు తెలుసా

అరవింద్ : శరణ్య గొడవ అయిపోయాక నువ్వు ఊరు వదిలి వెళ్లిపోయావ్ అప్పుడే మా పెద్దమ్మ నాకోసం ఒక సంబంధం తీసుకొచ్చింది అది ఆ శివరాం గాడి కూతురు.

సుబ్బు : మానస అందుకే ఇంట్లో నుంచి వచ్చేసింది.

అరవింద్ : నీకు మానస తెలుసా

సుబ్బు : తెలుసు నాకు చాలా కావాల్సిన మనిషి

అరవింద్ : అంటే...

సుబ్బు : అక్క

అరవింద్ : నాకు తెలీకుండా ఇదంతా ఎప్పుడు పరిచయం అయ్యింది.. అస్సలు ఇన్ని రోజులు ఏమై పోయావు.

సుబ్బు : ఈ వారంలోనే చాలా జరిగిపోయాయి.. మానసకి నేనే దెగ్గరుండి తన లవ్ కి హెల్ప్ చేసాను.

అరవింద్ : అలాగా, సరేలే మీ మావయ్య వాళ్ళకి ఫోన్ చేసాను వస్తున్నారు.

సుబ్బు : మానస మీద నువ్వేమైనా....

అరవింద్ : అలాంటిదేమి లేదు అందంగా ఉందని సరే అన్నాను, చుసిన అన్ని సంబంధాలు సెట్ అవ్వవు కదా.. మళ్ళీ నీకు కావాల్సిన వాళ్లంటే నాకూ కావాల్సిన వాళ్ళే కదా...

ఇంతలో ప్రసాద్ లోపలికి వచ్చాడు, సర్ సుబ్బు గారి మావయ్య వాళ్ళు వచ్చారు.

అరవింద్ : వస్తున్నాను.. నేను బైట ఉంటాను

సుబ్బు : వెళ్ళిపోకు నేను నీతో మాట్లాడాలి

అరవింద్ : అలాగే అని బైటికి వెళ్ళగానే సుబ్బు మావయ్య వాళ్ళు లోపలికి వచ్చారు.

జగన్ : రేయి సుబ్బు ఏంటిరా ఇదంతా, ఇంత గొడవ జరిగింది అన్నప్పుడు నువ్వు శరణ్యకి ఫోన్ చెయ్యలేదా

సుబ్బు : శరణ్య ఎక్కడుందో ఏంటో.. వద్దులే మావయ్య

జగన్ : ఉండు నేను ఫోన్ చేస్తాను అని బైటికి వెళ్ళొపోయాడు.. హలో శరణ్య ఎక్కడున్నావ్

అరవింద్ : అంకుల్ ఫోన్ పెట్టేయ్యండి..

జగన్ : ఏమైంది బాబు

అరవింద్ : ముందు ఫోన్ పెట్టేయండి.. అనగానే జగన్ ఫోన్ కట్టేసి అరవింద్ వైపు చూసాడు.. ఇదంతా చేసింది మీ అమ్మాయే..

జగన్ : శరణ్య..

అరవింద్ : తనే దెగ్గరుండి సుబ్బుని అరెస్ట్ చేపించి మరీ వాడికి అప్పగించింది.

జగన్ : నమ్మబుద్ధి కావట్లేదు.

అరవింద్ : మీ అమ్మాయి జాబ్ లో జాయిన్ అయ్యి నెల కూడా అవ్వలేదు ఇంకా నెల జీతమే పడదు అలాంటిది.. మీ ఆడోళ్ళ మెడలో బంగారం.. హారిక పేరు మీద ల్యాండ్ ఇవన్నీ మీరు గమనించలేదా లేదా తెలీనట్టు నటిస్తున్నారా.

జగన్ : నీ కోపం అర్ధమవుతుంది బాబు.. కానీ వాడు నాకు అల్లుడు.. నాకు ఇవేమి తెలీదు. ఏదో వడ్డీలకి తిప్పుతాను కానీ పాపాత్ములం కాదు, అన్నం పండించుకుని తినేవాళ్ళం.. ఇలాంటివి మాకు రావు.. నాకు ముందే తెలుసుంటే దాన్ని చంపేసేవాడిని.. అని కళ్లెమ్మటి నీళ్లతో సుబ్బుని చూడడానికి వెళ్ళాడు.

సాయంత్రం వరకు అక్కడే ఉండి మాట్లాడాక అరవింద్ అందరినీ పంపించేసి వెళ్లి సుబ్బు పక్కన కూర్చున్నాడు.

అరవింద్ : ఇంటికి వెళదామా ఇక్కడే ఉంటావా

సుబ్బు : నువ్వు కూడా వెళ్ళిపో.. పనులు అన్ని వదిలేసి ఇక్కడ ఏం చేస్తావ్.

అరవింద్ : అక్కడ ఏసీ లో కూర్చున్నాం ఇక్కడ మాములు అంతే.. వెళ్దాం అంటే ఇంటికి షిఫ్ట్ చేపిస్తా

సుబ్బు : ఎందుకురా నేనంటే అంత ప్రేమ

అరవింద్ : అంత లేదు మొన్న కారు, డబ్బులు తీసుకున్నావ్ నువ్విలా కూర్చుంటే ఆ డబ్బులు ఎవడు కడతాడు.. ఇక పదా ఇంటికి పోదాం.

ఇంతలో ప్రసాద్ లోపలికి వచ్చి సర్ మీకోసం ఎవరో వచ్చారు పొద్దున వచ్చిన అతను అతనితో పాటు శివరాం కూతురు కూడా వచ్చింది.

అరవింద్ : రానివ్వు.

అను విక్రమ్ మానస అందరూ లోపలికి వచ్చారు.

సుబ్బు : హాయి, పెళ్లి అయిపోయిందా హ్యాపీ మారీడ్ లైఫ్.

మానస : సారీ రా సుబ్బు.

సుబ్బు : పర్లేదులే.. మీ నాన్నని మాత్రం వదలను.. అందులో నువ్వు నన్ను క్షమించాలి

మానస : ఇప్పుడు కూడా జోకులే.. ఎలా ఉంది నొప్పిగా ఉందా

అను : ఇలా అయితే ఎలా సుబ్బు.. అని స్టేతస్కోప్ తీసుకుని చెక్ చేసింది.. బానే ఉన్నాడు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ కావాలి అంతే.. నేనెళ్ళి డాక్టర్ తో మాట్లాడి వస్తాను అని వెళ్ళింది.

అరవింద్ : నేనూ వస్తాను అని అనురాధ వెనుకే వెళ్ళాడు.

మానస : అరేయి సుబ్బు తనని ఎక్కడో చూసానురా

సుబ్బు : మీ నాన్న చుసిన సంబంధం.. వాడే

మానస : ఆ అవును అవును.. ఇతనేనా నీ బెస్ట్ ఫ్రెండ్

సుబ్బు : అవును.

మానస : ఇప్పుడు ఎక్కడికి వెళతావ్, మీ మావయ్య వాళ్ల ఇంటికా.. లేదా మాతో పాటు వస్తావా

సుబ్బు : లేదు అరవింద్ ఇంటికి వెళతాను. చాలా పనులున్నాయి

మానస : ఏం పనులో...

సుబ్బు : ముందు అర్జెంటుగా మీ నాన్నని లేపేయ్యాలి ఇప్పుడు అదొక్కటే పని

మానస : చాల్లే.. దెబ్బలు సరిపోలేదా

ఇంతలో అను మరియు అరవింద్ వచ్చారు.

అను : సుబ్బు.. డిశ్చార్జ్ కంఫర్మ్.. నర్స్ వస్తుంది వెయిట్ చెయ్యి.

సుబ్బు : ఇంకిక్కడ నా వల్ల కాదు వెళ్ళిపోదాం, రేయి అరవింద్ ఆ నర్స్ ని పిలు

అరవింద్ : ఏ నర్సొ నాకేం తెలుసు.. వస్తుంది ఆగు..

సుబ్బు : మొత్తం పదముడు మంది అందులో ఎనిమిది మందికి పెళ్ళైంది.. మిగతా ఐదుగురిలో ఇద్దరు బాగోరు మిగిలిన ముగ్గురిలో అందరికంటే హైట్ ఉండి తెల్లగా బక్కగా ఒక అమ్మాయి ఉంటుంది పేరు సుకన్య అనుకుంటా ఆ అమ్మాయిని పిలువు.

మానస, అను పగలబడి నవ్వుతుంటే విక్రమ్ ఆదిత్య ముసి ముసిగా నవ్వారు..

అరవింద్ : ఓరి నీ యబ్బ.. ఇంతలోనే ఎంత మందిని స్కాన్ చేసావురా నిన్ను మళ్ళీ ఆ శివరాం గాడి దెగ్గరే వదిలి పెడితే సరిపోద్ది..

అందరూ మానస వైపు చూసారు.. మానస కూడా చిన్నగా నవ్వుతుంది.
Like Reply


Messages In This Thread
RE: సుబ్బిగాడు ≠ World Famous Lover - by Pallaki - 12-10-2022, 07:04 PM



Users browsing this thread: 53 Guest(s)