05-10-2022, 08:03 PM
(This post was last modified: 05-10-2022, 08:05 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
12
విక్రమ్ ఒక సాదా సీదా కుర్రోడు, ప్రాణంగా చూసుకునే అమ్మ బెస్ట్ ఫ్రెండ్ లాంటి నాన్న పెంపకంలో చాలా ఆనందంగా ఉండే జీవితం తనది, వాళ్ళ నాన్న జనరల్ ట్రాన్స్ఫర్స్ మీద ఊర్లు తిరుగుతూ తిరుగుతూ పల్లెటూరు చేరాడు, అక్కడే తనకి పరిచయం అయిన తన స్నేహితులు అక్కడి వాతావరణం, అక్కడి బంధాలకి అలవాటు పడి ఊర్లోనే స్థిర పడిపోయారు.
భరత్, చందు, పూజ, సంధ్య, రమ్య ఐదుగురు స్నేహితులతో పాటు సలీమా అనే చెల్లిని కూడా సంపాదించుకున్నాడు. విక్రమ్ మహిమో ఏమో పొగరుగా ఎవ్వరిని లెక్క చెయ్యకుండా ఉండే మానస ఒక్క చూపులోనే తన చిన్నప్పటి స్థితికి వెళ్ళిపోయింది అలానే తన అమ్మకి మళ్ళీ దెగ్గరయ్యింది.
ఈ జంటకి పెద్దగా ప్రేమించుకోడానికి సమయం దొరక్కపోయినా ఉన్న సమయాన్ని చాలా బాగా వాడుకున్నారు, ఈ ప్రయాణంలోనే మానస తన తండ్రి ఎటువంటివాడో తెలుసుకుని ఆయనకి విరుద్ధంగా విక్రమ్ తో పాటు కిడ్నాప్ అయిన ఆడపిల్లలని కాపాడింది, అప్పుడే అచ్చు విక్రమ్ లానే ఉండే ఆదిత్యని కలిసి తన మరదలు గురించి తెలుసుకుంది.
ఆదిత్య అడిగిన సాయానికి విక్రమ్ బెంగుళూరు వెళ్లగా, మానస నాన్న జరిగింది మొత్తం తెలుసుకుని మనుషుల్ని పంపించడంతో మానస అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి బెంగళూరులో ఉన్న విక్రమ్ దెగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించుకుంది.. ఈ ఒక్క రోజులోనే సుభాష్ అనే ఒక ఎక్సట్రార్డినరీ డ్రైవర్ ని కలిసి తన కధ విని దెగ్గరికి చేర్చుకుంది.
ఆదిత్య కధ విన్నాక విక్రమ్ తనకి సహాయం చెయ్యడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు, మానస విక్రమ్ చెంతకీ చేరింది కానీ ఆ తరువాత తన మూలంగా సుబ్బు వాళ్ళ నాన్నకి చిక్కడంతో ఆదిత్య విడిపించడానికి బైలుదేరగా, ఆదిత్య మరదలు అయిన అనురాధ పెళ్లి పనులు మొదలు పెట్టింది.. అదే రోజు సాయంత్రానికి విక్రమ్ అమ్మా నాన్నా.. మానస వాళ్ళ అమ్మ, ఇంట్లో పని చేసే అక్క తన కొడుకుతో వచ్చి అందరూ కలిసి పెళ్లి ఏర్పాట్లు చేశారు.
తెల్లారే లోగా విక్రమ్ ఫ్రెండ్స్ రావడం, ఆ వెంటనే పెళ్లి టైంకి ఆదిత్య సుబ్బుని హాస్పిటల్లో జాయిన్ చేసి మానస నాన్నతో పెళ్లి మండపంలో అడుగుపెట్టాడు. మానస బెదిరినా తన నాన్న నవ్వుతూ నాకు ఇష్టమే అని చెపుతూనే భయపడుతూ పక్కనే నిల్చున్న ఆదిత్యని చూసి ఒక అడుగు వెనక్కి వేసాడు.. విక్రమ్ తాళి కట్టడం అందరూ అక్షింతలు వెయ్యడం అయిపోయింది..
పెళ్లి అవ్వగానే మానస లేచి విక్రమ్ తో పాటు హాస్పిటల్ కి వెళ్ళింది, సుబ్బు లేచే ఉన్నాడు. మానస సుబ్బుని చూడగానే ఏడ్చేసింది..
మానస : సుబ్బు క్షమించరా, నా వల్లే...
సుబ్బు : ఏం అవ్వలేదులే.. ఏడవకు.. పెళ్లి బాగా జరిగిందా.. హ్యాపీ మారీడ్ లైఫ్..
మానస : థాంక్స్..
విక్రమ్ : థాంక్స్ సుబ్బు..
సుబ్బు : మీ నాన్నని మర్చిపో, వాడిని వదలను
మానస : ఇప్పుడు కూడా జోకులే.. పోరా..
అనురాధ : వాడికి తోడుగా నేనుంటాలే మీరు వెళ్ళండి.. బావా తీసుకెళ్లి మిగతా ఏర్పాట్లు చూడు.. నేను సుబ్బు గురించి కనుక్కుని వీలైతే డిశ్చార్జ్ చేపించుకుని వచ్చేస్తా.. అని ఆదిత్య వాళ్ళని పంపించడానికి బైటికి వెళ్ళింది.
బెడ్ మీద పడుకుని ఉన్న సుబ్బు జోక్ చేసేటప్పుడు తన ఎడమ కంట్లో నుంచి కారిన నీరు చూసి ఉంటే అది జోక్ లా తీసుకునే వారు కాదేమో. సుబ్బు ఎంతగా నవ్విస్తాడో నవ్వుతాడో తెలిసిన మానసకి సుబ్బు బాధ పడితే వాడు కోప్పడితే ఎంత భయంకరంగా ఉంటుందో చూడబోతుందని తెలీదు. సుబ్బుని ఆపడానికి విక్రమ్ ఆదిత్య ఇద్దరు ఎన్ని చెరువుల నీళ్లు తాగాలో ముందు ముందు తెలుసుకుందాం.
ఇంతటితో ఈ కధ సమాప్తం, విక్రమ్ మానస, విక్రమ్ అమ్మ కావ్య మిగిలిన వాళ్ళు సందర్బానుసారం మిగతా కధల్లో విక్రమ్ రిచి రిచ్ కధలో వచ్చిపోతుంటారు. ఈ కధని ఆదరించినందుకు పాఠకులందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
సమాప్తం
❤️❤️❤️
❤️