14-09-2022, 12:04 AM
సుబ్బు : ముందు ఎక్కడైనా తిందాం, నాకు ఆకలేస్తుంది.
మానస : సరే ఎక్కడైనా ఆపు.
కారు రోడ్ మీద ధాబా దెగ్గర ఆపి ఇద్దరం వెళ్లి లోపల కూర్చున్నాం, మానస బిర్యానీ ఆర్డర్ చేసింది ఇద్దరం తింటుంటే అడిగాను ఏంటి మేటర్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా
మానస : మీ ఇంట్లో వాళ్ళైతే ఒప్పుకుంటారా ?
సుబ్బు : మనల్ని పట్టించుకునేవాడెవ్వడు లేడు లే, నీ గురించి చెప్పు.
మానస : ఏముంది బాగా డబ్బులున్నాయి, నాన్న MLA, ఒక్కగానోక్క కూతురిని చాలా గారాబంగా పెంచారు దాని ఫలితం ఒళ్ళంతా పొగరు ఎవ్వరిని లెక్క చేసేదాన్ని కాదు అలాంటి టైంలో విక్రమ్ కనిపించాడు అంతే అన్ని మూసుకుని ప్రేమించేసాను.. మా నాన్న అమ్మాయిలని స్మగ్లింగ్ చేస్తూ విక్రమ్ కి దొరికిపోయాడు, విక్రమ్ అడ్డు పడేసరికి మా నాన్నకి మా మ్యాటర్ తెలిసి ఇదిగో ఇప్పుడు ఇలా నీతో జర్నీ చేస్తున్నా.
సుబ్బు : ఇద్దరు గొప్ప మనుషులే.. ఇంత రిస్క్ పెట్టుకుని నన్ను ఇందులోకి లాగావు.
మానస : భయం అయితే వెళ్ళిపో, మరేం పరవాలేదు నేను వెళ్లిపోగలను.
సుబ్బు : నా చేతిలో కారు ఉన్నంత వరకు, నేను కారులో ఉన్నంత వరకు ఏ భయము లేదు.
మానస : నాది అయిపోయింది, ఫోన్ మాట్లాడుతుంటా తినేసి వచ్చేయి
సుబ్బు : బిల్లు కట్టి పో, నా దెగ్గర ఒక్క రూపాయి కూడా లేదు.
మానస : మరీ ఒక్క రూపాయి కూడా లేకుండా నన్ను నమ్మి వచ్చావా
సుభాష్ : నేను నిన్ను నమ్ముకొని రాలేదు, నీకు సహాయం చేద్దామని రాలేదు జాబ్ చేస్తున్నా అంతే.. నీ కార్ కీస్ నా చేతిలో ఉన్నంత వరకు నాకు ఏ భయము లేదు.
మానస : సరే సరే నేను కట్టనన్నానా, మరి అంత ప్రాక్టికల్గా ఉండకు పైకి రాలేవు.
సుభాష్ : అయితే ఇంకో ఫ్రూట్ జ్యూస్ కూడా ఇప్పించు.
మానస : ఇదిగో నా పర్సు, నీకు నచ్చింది తిని తాగి బిల్లు కూడా నువ్వే కట్టు అని వెళ్ళిపోయింది.
నిజంగా మంచిదే అనవసరంగా అనుమానించాను ఇలాంటి వాళ్లు ఫ్రెండ్స్ గా ఉంటె కచ్చితంగా మనకి కష్టం వచ్చినప్పుడు మనకోసం నిలబడతారు.. సాయమేగా చేద్దాం పోయేదేముంది కారు నడపడమేగా.. అని ఆలోచిస్తూ తిని బైటికి వచ్చేసాను. తను ఫోన్ మాట్లాడుతుంది.
సుబ్బు : మానస వెళదాం పదా, మనం లేట్ చేస్తే ఇంకా కష్టం అయిపోద్ది ఇక్కడనుంచి అన్నీ చెక్ పోస్ట్లు... ఊర్లల్లో నుంచి వెళదాం.
మానస : నేను తరవాత చేస్తా మా.. అని ఫోన్ పెట్టేసి.. పద వెళదాం.
పది నిమిషాల తరవాత హైవే నుంచి దిగి ఊళ్ళో నుంచి వెళ్తున్నాను.
మానస : నువ్వు చెప్పు అదే నీ మరదలు గురించి.
సుబ్బు : అదా ఆ తరువాత అక్కడనుంచి వచ్చేసి ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాను, నా ఫ్రెండ్ అరవింద్ సాయంతో రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఊరి నుంచి ఫోన్ వచ్చింది.. తాతయ్యకి సీరియస్ గా ఉందంటే.. వెళ్ళాను, ఆ తరువాత రెండు రోజులకే ఆయన చనిపోవడం అమ్మమ్మ మాట పడిపోవడం ఇక నన్ను పట్టించుకునే వాళ్లు కూడా లేరు.. తిరిగి సిటీకి వచ్చేద్దామని నిర్ణయించుకుని మావయ్యకి చెపుదామని వెళ్లాను.
సుబ్బు : మావయ్యా నేను బైలుదేరతాను, అని బ్యాగ్ తీసుకుని బైటికి నడిచాను.
జగన్ : రేయి సుబ్బు ఆగరా
ఇదే ఆయన నన్ను మొదటిసారి పేరు పెట్టి పిలవడం.. ఏడుపు మొహంతోనే నా ముందుకు వచ్చాడు.. జేబులోనుంచి డబ్బులు తీసి నా చేతిలో పెట్టాడు, వద్దన్నాను.
జగన్ : ఏరా, ఇన్ని రోజులు నీతో అలా మాట్లాడింది నీ మీద కోపమో లేక నువ్వంటే పగో కాదురా, తాతయ్య నీ అవసరాలు చూస్తుంటే నువ్వు సుఖాలకి అలవాటు పడి దారి తప్పుతావేమో, ఇంట్లో ఎవరిదో ఒకరిది భయం ఉండాలని నీతో అలా ప్రవర్తించేవాడిని అంతకు మించి ఇంకేం లేదురా.. నీ మీద నాకు ఎప్పుడు కోపం లేదు.. ఇంటికి మగపిల్లాడివి.. మమ్మల్ని దూరం పెట్టకు.. అలాగే నువ్వు సిటీకి వెళ్లి జాబ్ చేస్తావో లేదా ఇక్కడే ఉండి మన రైస్ మిల్లు అవి చూసుకుంటా అన్నా ఓకే.. నీ ఇష్టం.. కానీ గుర్తుంచుకో నీకు ఈ మావయ్య ఉన్నాడని.
ఏమనిపించిందో ఏమో ఆయనని వాటేసుకున్నాను, ఏడవలేదు కానీ ఈ బాధలో కొంత సంతోషం వేసింది.. అవును ఈ కుటుంబం నాది మావయ్యకి ఇద్దరు ఆడపిల్లలే రేపు వాళ్ళ పెళ్ళైనా ఇంకేమైనా వాళ్ళని చూసుకోవాల్సింది నేనే, ఇక నేను కూడా కష్టపడి పైకి రావాలని ధ్రుడంగా నిర్ణయించుకున్నాను.. మావయ్య దెగ్గర సెలవు తీసుకుని హారికని పలకరించి శరణ్య వైపు చెయ్యి ఊపి సిటీకి వచ్చేసాను.
సిటీకి వచ్చిన వెంటనే అరవింద్ గాడి దెగ్గరికి వెళ్లి నా సమస్య, నా ఆలోచన చెప్పాను.
అరవింద్ : చెప్పు రా ఎంత డబ్బు కావాలి నీకు
ఆ మాటకే కళ్ళు తిరిగినియి నాకు
సుబ్బు : ఒరేయ్ అరవిందు, ఇదంతా నిజమేనా లేక నా కలా.. నువ్వు డబ్బులు ఇస్తా అన్నావా
అరవింద్ : అన్నాను, ఇప్పుడు నీ కళ్ళలో చూస్తున్న ఈ నిజాయితీ ఇన్ని రోజులు నాకు కనిపించలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది, చెప్పు ఏదైనా వ్యాపారం చేస్తావా, లేదా షాప్ కానీ హోటల్ కానీ నడుపుతావా
సుబ్బు : నాకు అంత బ్రెయిన్ లేదు, ఒక కారు చూడు ప్రస్తుతానికి టాక్సీ నడుపుతాను, కొన్ని రోజులు గడవని నాలో ప్రత్యేకతలు ఏమున్నాయో ఈలోగా నేను తెలుసుకుంటాను.
అరవింద్ : చెప్పాను కదా, నువ్వు ఇంతక ముందు సుబ్బువి కాదు అని.
సుబ్బు : సరే నేను అలా మెడికల్ షాప్ కి వెళ్ళొస్తా
అరవింద్ : దేనికిరా ??
సుబ్బు : మొన్న వెళ్ళినప్పుడు చూసాను షాప్ లో సౌమిత్రి అనే అమ్మాయి చేరింది, ఇందాకే పరిచయాలు అయ్యాయి వెళ్లి కొత్తగా రాసిన కవిత ఒకటి తనకి ఇచ్చి వస్తా, నువ్వు ఈ లోపు కారు పని చూడు.. అని సుబ్బిగాడు తన స్నేహితుడిని ఇంకో మాట మాట్లాడకుండా చేసేసి లేచి వెళ్ళిపోయాడు.
సోఫాలో కూర్చున్న అరవింద్ మాత్రం నోరేళ్ళబెట్టి అలానే వెనక్కి వాలి సుబ్బిగాడిని చూస్తూ కూర్చున్నాడు.