11-09-2022, 02:20 PM
(This post was last modified: 05-02-2024, 12:05 AM by Pallaki. Edited 4 times in total. Edited 4 times in total.)
సంధ్య అనాధ ఆశ్రమం
రోజు ఏడు ఎనిమిది అయితే కానీ లేవని అక్షిత పొద్దున్నే లేచి కూర్చుంది, చక చకా రెడీ అయ్యి బట్టలు అన్ని సర్ది బ్యాగ్ తొ రెడీగా ఉన్నా ఈ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళడానికి కొంచెం బాధగానే ఉంది.
డిగ్రీ అయిపోయి మాస్ కమ్యూనికేషన్స్ కోర్స్ చేస్తున్న అక్షితకి హోటల్లో వెయిటరుగా జాబ్ దొరికింది, పార్ట్ టైం చేస్తూనే చదువుతుంది. ఇప్పటికే చాలా ఎక్కువ రోజులు ఆశ్రమంలో ఉన్నది, ఇక భారం కాకూడదని వెళ్ళిపోడానికి నిశ్చయించుకుంది. ఆశ్రమంలో అందరి దెగ్గర సెలవు తీసుకొని బైట పడి అక్కడ నుంచి నేరుగా తను చూసుకున్న లేడీస్ హాస్టల్ కి వెళ్లి అంతా సెట్ అయ్యింది. తెల్లారి లేచి రెడీ అయ్యి ముందు కాలేజీకి వెళ్లి అక్కడ పనులు చూసుకుని ఆ తరువాత పని చెయ్యడానికి హోటలుకి బైలుదేరింది.
రోజు కాలేజీకి వెళ్లడం హోటల్లో పని చెయ్యడం తినేసి హాస్టల్లో సొయ లేకుండా పడుకోడం ఇదే అక్షిత డైలీ రొటీన్. అందంగా ఉండటం వల్లో, విపరీతమైన మంచితనం వల్లో, తన గడుసుతనం మరియు నోటి దూలవల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ని సంపాదించలేకపోయింది కానీ ఏ బాధ లేదు ఒంటరిగానే ఉన్నా నవ్వుతూ అందరినీ నవ్వుస్తూనే ఉంటుంది.
హోటల్లో ఆర్డర్ సెర్వ్ చేసి వచ్చి కూర్చుని ఆలోచిస్తున్న అక్షితని భుజం మీద తట్టింది తన తోటి పని చేసే సౌమ్య.
సౌమ్య : ఏంటి ఇవ్వాళ చాలా ఆనందంగా ఉన్నావ్, ఏంటి మ్యాటర్?
అక్షిత : నేనెప్పుడూ ఇలానే ఉంటాను, నువ్వే ఇవ్వాళ నన్ను చూస్తున్నావ్ అంతే..
సౌమ్య : సరే సరే అక్కడ కస్టమర్ వెయిటింగ్ వెళ్లి ఆర్డర్ తీసుకో
అక్షిత : ఇంకో పది నిముషాలు అయితే నా డ్యూటీ అయిపోద్ది వేరే ఎవరికైనా చెప్పొచ్చుగా
సౌమ్య : ఇంకా పది నిముషాలు ఉంది, ఇదొక్కటి సెర్వ్ చేసి వెళ్ళిపో
అక్షిత : (దొంగముండ) అలాగే సౌమ్య గొర్రె.
సౌమ్య : ఎమన్నావ్?
అక్షిత : సౌమ్య గారు అన్నాను, ఎలా వినపడిందేంటి ?
సౌమ్య : ఏదో గొర్రె అన్నట్టు.
అక్షిత : నిన్ను నువ్వు అలా తక్కువ చేసుకోకు సౌమ్య, నువ్వు చెయ్యాల్సిన పనులు పక్కవాళ్ళకి చెప్తుంటావ్ కదా అందుకే గొర్రె లాగ ఫీల్ అవుతున్నావేమో అందుకే నీకు అలా వినిపిస్తుంది, ఎందుకైనా మంచిది ఎవరికైనా చూపించుకో.. అని సౌమ్య మాడిపోయిన మొహం చూసి నవ్వి ఆర్డర్ తీసుకుందామని బైటికి వచ్చేసాను.
దీపు : ఎందుకే దానితోటి, అస్సలే ఓనర్ తన చుట్టమని తెగ పొగరు చూపిస్తుంది అందరిమీద
అక్షిత : ఏడిసింది, దానికంత సీన్ లేదు. ఓనర్ కి అంత క్లోజ్ అయితే మేనేజర్ కానీ ఇంకోటి కానీ అయ్యుండేది వెయిటర్ కావడం ఎందుకు. దానివన్నీ కోతలు, నువ్వు నమ్మకు అని కస్టమర్ దెగ్గరికి వెళ్లి వెల్కమ్ సర్, అని మెనూ అందించింది.
"మెనూ చూసేంత ఓపిక లేదు, ఏదో ఒకటి ఆర్డర్ చెయ్యండి"
అక్షిత : ఎండు గడ్డి ఉంది తెమ్మంటారా (అని నవ్వుకోలుగా అడిగింది)
"ఏంటి జోకులా"
అక్షిత : మరి ఏంటి సర్, నేను ఏదో ఒకటి తెచ్చాక అది మీకు నచ్చకపోతే దాని బిల్లు నేనే చెల్లించుకోవాలి. కొంచెం ఓపిక తెచ్చుకుని ఆర్డర్ చెయ్యండి సర్.
"బిర్యానీ ఉంటే పట్టుకురా"
అక్షిత : అలాగే సర్. అని కిచెన్లో బిర్యానీ ఆర్డర్ చెప్పి యూనిఫామ్ విప్పేసి తిరిగి హాస్టల్ కి వెళ్ళడానికి రెడీ అయ్యి బైటికి వచ్చి చూసేసరికి ఆర్డర్ ఇచ్చిన వారికీ ఇంకా బిర్యానీ రాలేదు. కిచెన్ లోకి వెళ్లి చూస్తే ఎవ్వరు లేరు. ఇక నేనే సెర్వ్ చేద్దామని వెళ్లేసరికి తను ఏదో ఫోటో చూసి నవ్వుకోడం చూసి బిర్యానీ ప్లేట్లో పెడుతూ అడిగాను.
అక్షిత : గర్ల్ ఫ్రెండా
"కాదు నా భార్య"
అక్షిత : చాలా అందంగా ఉంది.. ఎం పేరు?
"అవును, పద్మ"
అక్షిత : చూస్తే పల్లెటూరి మొహంలా ఉంది, మీరు కూడా అలానే ఉన్నారు, ఇక్కడ సిటీలో తెలారు ఏంటి కథ ?
"ఇక్కడ నా పెద్ద భార్య ఉంటుంది, తనని కలవడానికే వచ్చాను" అని నవ్వాడు అక్షిత కూడా సరదాగా మాట్లాడుతుంటే.
అక్షిత : అంటే మీకు ఇద్దరా, వామ్మో..
"ఏ ఉండకూడదా ?"
అక్షిత : మీ ఇష్టమండీ, ఎంతమందినైనా చేసుకోవచ్చు.. అని నవ్వి.. మరి పెద్ద భార్య ఇక్కడ చిన్న భార్య అక్కడ ఒకరికి తెలీకుండా ఇంకొకరికి మేనేజ్ చేస్తున్నారా ఏంటి ?
"లేదు, నా పెద్ద భార్య ఇక్కడ జాబ్ చేస్తుందిలే.."
అక్షిత : ఎం చేస్తుంటుందేంటి?
"ఎవ్వరికీ చెప్పకూడదు మరి"
అక్షిత : చెప్పను చెప్పను.. ఎవరు?
"ఈ జిల్లా కలెక్టర్"
అక్షిత : అబద్ధాలకి అడ్డు అదుపు ఉండాలి, మరి ఏది చెపితే అది నమ్మరు
"నిజంగా"
అక్షిత : నన్ను వెయిటర్ అనుకుంటున్నావేమో, నేను కాబోయే జర్నలిస్ట్ ని. తనకింకా పెళ్లే కాలేదు, ఇలాంటివి ఏమైనా జరిగితే నాకు తెలీకుండా ఉంటాయా ?
"సరేలే ఏదో జోక్ చేసాను, నీకు దొరికిపోయాను నువ్వే గెలిచావ్ హ్యాపీయేనా?"
అక్షిత : ఆమ్మో లేట్ అయిపోయింది, నేను వెళ్ళాలి అని కిచెన్లోకి పరిగెత్తి హోటల్లో మిగిలిన ఫుడ్ సగం బస్తా వరకు నింపుకుని బైటికి పరిగెత్తాను.
"ఓయి అమ్మాయి ఆగు, ఏంటి దొంగతనం చేసావా నువ్వు ఇప్పుడు ?"
అక్షిత : ష్.. మెలకుండా వెళ్ళిపో
"నేను చాలా మంది దొంగలని చూసాను కానీ ఇలాంటి తిండి దొంగని ఇప్పుడే చూస్తున్నా"
అక్షిత : ఒక్కదాన్నే మోస్తున్నాను ఇంత బలంగా ఉన్నావ్ ఇది అందుకో అని తనకి ఇచ్చి అయినా నేనేం దొంగతనం చెయ్యలేదు, నేను రోజు తీసుకెళ్తానని ఓనర్ కి తెలుసు.
"మరేందుకు పరిగెత్తావ్ ?"
అక్షిత : అక్కడ లోపల ఒకటి ఉందిలే, పేరుకే వెయిటర్ కానీ ఓనర్ కి దూరపు చుట్టమట, ఆ వంకతో మమ్మల్ని పీకుతూ ఉంటుంది. అది చూసిందంటే దానితో మళ్ళీ గొడవ ఎందుకని ఈ పరుగు.
"అలాగా, సారీ తప్పుగా అనుకున్నాను అయినా ఎం చేస్తావ్ ఇదంతా, సోషల్ సర్వీసా ?"
అక్షిత : ఆ.. వచ్చింది ఇక్కడే అని విజిల్ వెయ్యగానే కొంత మంది ముసలివాళ్ళు బైటికి వచ్చారు, నీ దెగ్గర డబ్బులు ఉన్నాయా ?
"ఉన్నాయి"
అక్షిత : కొన్ని పేపర్ ప్లేట్లు తీసుకురా.. అలా చూడకు బ్రదరు, నాతో పాటు కొంచెం పుణ్యం పంచుకో
పేపర్ ప్లేట్స్ తెచ్చి ఇవ్వగానే అక్షిత ఒక్కోటి తీసుకుని అందరికీ ప్లేట్స్ లో పెట్టి అక్కడున్న అందరికీ పంచి చేతులు కడుక్కుని బైట పడింది. తనతో పాటు నడుస్తూ ఎవరు వీళ్లంతా అని అడిగాడు.
అక్షిత : వీళ్లంతా బెంగుళూరు నుంచి పారిపోయి తప్పించుకుని ఇక్కడ తెలారు..
"ఏమైయ్యుంటుంది?"
అక్షిత : తెలీదు కానీ వీళ్ళు ఏదో తెగకి సంబంధించిన వాళ్ళని నా అనుమానం. ఏదో జరిగింది. నేను జర్నలిస్ట్ అయ్యాక వీళ్ళకి హెల్ప్ చేస్తాను అప్పటి వరకు ఇలా వీళ్ళకి రోజు ఒక పూట తిండికి సాయం చేస్తుంటాను.
"నువ్వు చాలా గ్రేట్"
అక్షిత : నీ కళ్ళు చూస్తుంటే నాకు భయంగా ఉంది నన్ను మూడో పెళ్లి చేసుకుంటావేమో అని
"హహ.. అలా కాదులే, నువ్వు నాకు చెల్లెలు లాగ సరేనా"
అక్షిత : ఇదేదో బాగుంది.. అయినా ఇంతవరకు నీ పేరు కూడా చెప్పలేదు నాకు.
"అవును కదా.. నా పేరు వాసు"
అక్షిత : వాసు, పద్మ అవును నీ పెద్ద భార్య పేరేంటి అని నవ్వింది.
వాసు : శృతి
అక్షిత : అదిగో మా హాస్టల్ వచ్చేసింది బాయ్, మీకు కుదిరితే వాళ్ళకి అప్పుడప్పుడు హెల్ప్ చెయ్యండి.
వాసు : కత్చితంగా, నా నెంబర్ తీసుకో నీకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నేను అండగా ఉంటాను.. ఓకే నా ?
అక్షిత : అలాగే దేవుడిచ్చిన అన్నగారు, సిటీకి వచ్చినప్పుడు కనిపించండి. అని వాసు ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేసి అది నా నెంబర్.. బాయ్.. అని లోపలికి వెళ్ళిపోయింది.
xx xx xx
Dubai
ఎండలో ఎడారిలో ఇసక కుప్పలో ఒక మనిషి స్నైపర్ పట్టుకుని ఎవరికీ కనిపించకుండా అదే మాచింగ్ డ్రెస్లో కలిసిపోయి మెయిన్ రోడ్ వైపు బైనాక్యులర్స్ తొ చూస్తున్నాడు, పాకిస్తాన్ కి సంబందించిన మెయిన్ టెర్రరిస్ట్ ని లేపేయ్యడమే మిషన్. ఇంతలో ఫోన్ మోగింది.
హలో.. అమ్మా..
పార్వతి : ఒరేయ్ ఎక్కడికి చచ్చావ్, నాలుగు రోజులు అవుతుంది నువ్వు ఫోన్ చేసి, అన్నకి ఎంగేజ్మెంట్ ఉందన్న సంగతి కూడా మర్చిపోయావ్ నువ్వు, నాకు తెలీదు రేపు పొద్దున్నకల్లా నువ్వు ఇంట్లో ఉండాల్సిందే. ఆయన మర్యాదగా పిలిచినప్పుడు రా, ఎక్కువ చేస్తే ఇక నేను కూడా నీ గురించి పట్టించుకోను.
సరే సరే ఏడవకు, వస్తాను.
పార్వతి : ఎక్కడ ఊరేగుతున్నావ్?
ఫ్రెండ్స్ పార్టీ అంటే, బైటికి వచ్చాను.
పార్వతి : తాగడం మాత్రం అలవాటు చేసుకోకు, చంపేస్తా
ఇంతలో వరసపెట్టి నాలుగు కార్లు వస్తుండడంతొ బైనాక్యులర్లో చూసి అమ్మా ఫ్రెండ్స్ వచ్చారు నేను మళ్ళీ ఫోన్ చేస్తా అన్నాడు.
పార్వతి : ఆ.. బై..
ఫోన్ పక్కకి విసిరేసి పోజిషన్లో సెట్ అయ్యి గురి పెట్టి గట్టిగా ఊపిరి పీల్చుకుని రెడీగా ఉన్నాడు. ఎండలో మెడ కింద ఒక్కో చెమట చుక్క రాలుతుంటే 3...2... అని ట్రిగ్గర్ నొక్కాడు, అంతే హెడ్ షాట్. కార్లు ఆగిపోయాయి, పది మంది గన్స్ తొ వచ్చి కాపలాగా నిలుచొని చుట్టు చూసారు కానీ లాభంలేదు ఆ టెర్రరిస్ట్ చనిపోయాడని అందరూ కార్లు ఎక్కి వేగంగా వెనక్కి వెళ్లిపోయారు. ఆ తరువాత స్నైపర్ ని వెతకడానికి హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి, కానీ అతని జాడ దొరకలేదు. చీకటి పడే వరకు హైడ్ అవుట్ అయ్యి రాత్రికి హెలికాప్టర్ రాగానే ఎక్కేసి ఇండియా చెక్కెసాడు మన చిన్నా అలియాస్ చిరంజీవి.