05-09-2022, 06:27 PM
9
చూస్తుండగానే పదినిమిషాల్లో పదిమందిని తుక్కు రేగ్గొట్టాడు ఆదిత్య, మానస ఇంకా ఆశ్చర్యంగా చూస్తూనే ఉంది. ఆదిత్య అందరిని ఫినిష్ చేసి వాళ్ళ తాళ్లతో వాళ్ళనే కట్టేసాడు, చందు మరియు భరత్ కూడా సాయం చేశారు. భరత్, చందు ఆదిత్యని చూసి కొంచెం ఆశ్చర్యపోయినా ఇది సమయం కాదని తెరుకుని పనిలోకి దిగారు.
ఆదిత్య హడావిడిగా మానస వైపు పరిగెత్తి "నీ ఫ్రెండ్ కి ఫోన్ చేసావా ఎక్కడ వాడు, అక్కడ అమ్మాయిలని కాపాడాలి, నేను బెంగుళూర్ నుంచి వచ్చాను ప్లాన్ మొత్తం నాశనం చేసాడు వాడు"
మానస : అంటే మీరు ఆ అమ్మాయిలని కాపాడ్డానికి వచ్చారా, అయితే విక్రమ్ ఆ పని మీదే వెళ్ళాడు..
ఆదిత్య : ఎక్కడో తనకి ఎలా తెలుసు.?
మానస : మాకు తెలుసు, మేము వచ్చింది అందుకే..
ఆదిత్య : ఒక్కడే ఉన్నాడు, అక్కడ ఎంత మంది ఉన్నారో ఏంటో.. పద వెళదాం అని భరత్ వాళ్ళ వైపు చూసాడు.
చందు పరిగెత్తుకుంటూ వెళ్లి డ్రైవర్ దెగ్గర బస్సు తలలు తెచ్చి బస్సు స్టార్ట్ చేసాడు, ఆదిత్యతో పాటు భరత్ మానస కూడా ఎక్కారు. చందు వేగంగా చీకట్లో పోనించాడు బ్రిడ్జి రాగానే బస్సు ఆపేసాడు, ఆదిత్య బస్సు దిగి బ్రిడ్జి మీద నుంచి కిందకి చూసాడు, కింద కాలవ పారుతుంది పక్కనే ఉన్న గడ్డిలో రెండు ట్రక్లు ఎదురెదురుగా ఆగి ఉన్నాయ్, వెంటనే నీళ్ళలోకి దూకి అటు వైపు వెళ్ళాడు. భరత్ చందు మానస పక్కనే ఉన్న దారిలో చిన్నగా దిగి నడుచుకుంటూ వెళ్లారు. ఆదిత్య వెళ్లి చూసేసరికి అక్కడ నలుగురిని తాళ్లతో కట్టేసి బెల్టుతో కొడుతున్నాడు.
రెండు ట్రుక్కులు ఎదురెదురుగా ఉండటం ఒక ట్రక్కు లైట్లు వెలిగి ఉండటం వల్ల ఆ మనుషులు కనిపిస్తున్నారు కానీ వాళ్ళని కొడుతున్న విక్రమ్ మొహం చీకటిలో ఉండిపోయింది.
ఆదిత్య : విక్రమ్ అని పిలవగానే కోపంగా తల తిప్పి చూసాడు బెల్టుతో కొడుతూనే, కానీ తనలానే ఉన్న ఇంకో మొహాన్ని చూసి ఆగిపోయి ఆశ్చర్యంగా చూస్తుంటే మానస వచ్చింది.
విక్రమ్ : ఎవరు నువ్వు?
ఆదిత్య : అదే నేను అడిగేది ఎవడ్రా నువ్వు నా లాగ ఉన్నావ్
విక్రమ్ : (ఆదిత్య పొగరు చూసి) ఎవడివి బె నువ్వు.
మానస : ఆగండి ఆగండి.. ఇద్దరు.. ముందు అమ్మాయిల గురించి ఆలోచించండి.
ఆదిత్య : ఇందులో సగం మంది బెంగళూరుకి సంబంధించిన వాళ్ళు నేను డీసీఎం తీసుకెళతాను, అక్కడ నుంచి ఎవరిని వాళ్ళకి అప్పగిస్తాను.
విక్రమ్ : నేను మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటాను, డీల్ అని చెయ్యి పైకి ఎత్తాడు. ఆదిత్య విక్రమ్ ఇద్దరు చేతులు కలుపుకుని మల్లి బస్సు ఎక్కి తిరిగి వచ్చారు.
చందు మంట వేస్తే అందరూ దాని చుట్టూ కూర్చుని చలి కాచుకుంటున్నారు.
ఆదిత్య : నా బండి?
విక్రమ్ : నేను ఒక రెండు రోజులు ఆగి పంపిస్తాను, ఇంతకీ నీకు దీని గురించి ఎలా తెలిసింది?
ఆదిత్య : నాకు దీని తరువాత ఎవడికి ఎదురెళ్లలో కూడా తెలుసు, ఎవ్వరిని వదలను నా కొడుకులందరినీ నేల నాకించేస్తాను. ఈ నా కొడుకులు సంధ్య ఫౌండషన్స్ వెనెక గుట్టుగా అమ్మాయిలని స్మగ్లింగ్ చేస్తున్నారు.. అందరిని బైటికి లాగి తలలు నరుకుతాను ఒక్కొక్కడిది.
విక్రమ్ : ఇదే పని ఇక్కడ గ్రీన్ హోటల్స్ వెనుక చేస్తున్నారు.. కానీ ఇంత పెద్ద సంస్థల లాంటి వాటిల్లో ఇలాంటి పనులు జరుగుతుంటే వాళ్ళకి తెలియదా లేక వాళ్లే చేపిస్తున్నారో అర్ధం కావట్లేదు.
ఆదిత్య : నీకు ఇదంతా ఎలా తెలుసు?
విక్రమ్ : చేపించింది వీళ్ళ నాన్నే
ఆదిత్య : విక్రమ్ ని మానసని చూస్తూ.."ఇంట్రెస్టింగ్" అని నవ్వాడు.. దీని వల్ల మీకు ఎన్ని ఇబ్బందులో తెలుసా, ఇంతకీ మీ లవ్ మ్యాటర్ మీ ఇళ్లలో తెలుసా?
మానస : మా అమ్మకి తెలుసు, మా నాన్నకి తెలిస్తే అస్సలు యుద్ధం మొదలవుద్ది.
ఆదిత్య : ఆ తొక్కలే.. ఏమైనా అవసరం పడితే కాల్ చెయ్యండి హెల్ప్ చేస్తాను, నా లవ్ ఎలాగో సక్సెస్ అవ్వలేదు మిమ్మల్నయినా కలుపుతా.
మానస : ఎవరు అమ్మాయి.. ఎం చేస్తుంటుంది?
ఆదిత్య ఫోన్ తీసి చూపించాడు" అనురాధ నా మరదలు, సర్జన్ " అన్నాడు, వరసగా మూడు బీర్లు తాగి నాలుగోది లేపుతూ.
విక్రమ్ : వచ్చినప్పటి నుంచి అదే పనిలో ఉన్నావ్, పోతావ్ త్వరగా
ఆదిత్య : నాకు మత్తు ఎక్కదు బాస్, అయినా ఇదే నా లాస్ట్ రేపటి నుంచి ఇక మందు ముట్టను అని నాలుగో బీర్ కింద పెట్టి ఐదో బీరు నోటికెత్తుకున్నాడు.
మానస విక్రమ్ చెవి దెగ్గరికి వెళ్లి : విక్రమ్ ఇందాక కూడా ఇదే చెప్పాడు, పచ్చి తాగుబోతులా ఉన్నాడు ఇతన్ని నమ్మి అమ్మాయిలని పంపించడం సేఫ్ అంటావా?
ఆదిత్య అది విని పక్కకి చూసి నీ పేరేంటి అని అడిగాడు, "భరత్" హ్మ్... నీ పక్కనే ఉన్న నాలుగు రాళ్లు అందుకుని నా మీదకి ఒకేసారి గట్టిగా విసిరేయి అన్నాడు.. భరత్ విక్రమ్ ని చూడబోతే విక్రమ్ లేచి చేతికి అందిన ఏడు గులక రాళ్లు ఆదిత్య వైపు విసిరాడు.. ఆదిత్య నవ్వుతూ పట్టించుకోకుండా బీర్ తాగి కింద పెట్టి కరెక్టుగా మొహం మీదకి వచ్చిన మిల్లి సెకండ్ లో అన్ని రాళ్లు పట్టుకున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తే...
ఆదిత్య : చెప్పను కదా నాకు మత్తు ఎక్కదు అని, ఇప్పటికైనా నమ్ముతారా ఇక వదిలితే నేను బైలుదేరతాను.. అని లేచాడు.. ఆదిత్యని పంపించి విక్రమ్ మానస మిగతా వాళ్ల దెగ్గరికి వెళ్లి భయపడుతున్న అమ్మాయిలకి ధైర్యం చెప్పి సలీమా, రమ్య , పూజల సాయంతో మిగిలిన వాళ్ళని ఇంటికి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
తెల్లారి లంబసింగి కొండా ట్రేక్కింగ్ కాన్సల్ చేసుకుని టూర్ ప్రయాణం మొదలుపెట్టారు, బస్సు బైలదేరింది.. విక్రమ్ మానస బస్సు వెనకాలే ఆదిత్య బండి మీద ఇద్దరు టూర్ ఎంజాయ్ చెయ్యడానికి నిర్ణయించుకున్నారు.. బస్సు తరువాత ఆగబోయేది అరకులో..