30-08-2022, 07:16 PM
(This post was last modified: 19-10-2022, 10:32 PM by Takulsajal. Edited 1 time in total. Edited 1 time in total.)
26
గగన్ : మొదటి నుంచి చెప్పు శివా (అని మధ్యలో కదిలించేసరికి శివ మళ్లీ మొదలుపెట్టాడు)
శివ : కంపెనీ మీ మావయ్య గారి ఆరోగ్యం బాగోలేనప్పుడో మరి ఎలానో నాకు తెలీదు కానీ ఈ కంపెనీ సుశాంత్ చేతుల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇండైరెక్ట్ గా ఎవ్వరికీ తెలీకుండా ఇక్కడున్న మేనేజర్స్ ని తీసేసి తన ఫ్రెండ్స్ అయినా గోపాల్ ని శ్యామ్ ని పెట్టుకున్నాడు.
ఇక ముగ్గురు కలిసి డబ్బులు దున్నుకోడం మొదలుపెట్టారు, నేను సుశాంత్ ని ఒక రోజు ఫోలో అయ్యాను తనకి డబ్బులు తాగుళ్ళకి, అమ్మాయిలకి, పేకాటకి, క్రికెట్ బెట్టింగులకి అవసరం అందుకు తనకీ ఎంత కావాలో అంతే తీసుకునేవాడు కానీ ఈ గోపాల్, శ్యామ్ లు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు, అందులోనూ ఈ ఇద్దరు బావ బామ్మర్దుల వరస. వాళ్ల చుట్టాలని తెలిసిన వాళ్ళని కంపెనీ తమ కంట్రోల్లో ఉంచుకోడానికి అందరినీ వాళ్ళకి సంబంధించిన వాళ్లనే ఎంప్లాయిస్ గా పెట్టుకున్నారు, అందరూ కలిసి కంపెనీ లాభాలు దున్నుకుంటూ బాగానే సంపాదించారు. అందుకే పొద్దున వాళ్ళని అరెస్ట్ చెయ్యగానే అందరూ కలిసి అంత ఎత్తుకు ఎగిరారు. ఇక ఆ సుశాంత్ కి అవసరమైనప్పుడల్లా డబ్బు ముడుతుండడంతొ వీటన్నిటిని పట్టించుకోకుండా తన జల్సాల్లో తను ఉన్నాడు.
(మీనాక్షి, గగన్ ఇద్దరూ విని నోరేళ్ళబెట్టారు)
మీనాక్షి : అందుకే నాన్నా మనకి ఈ కంపెనీ అమ్మమ్మ ఇస్తుంటే వద్దని మొండికేసాడు నేను మనకింకా సపోర్ట్ గా ఉన్నాడేమో మనకి లాభాల్లో ఉన్న కంపెనీ ఇప్పిస్తాడేమో అనుకున్నాను, తన ఇన్కం మీద దెబ్బ పడుతుందని జాగ్రత్త పడబోయాడు కానీ అమ్మమ్మ వినలేదు.
గగన్ ఆలోచిస్తూ అవునన్నట్టు తల ఊపి శివ వైపు చూసాడు.
శివ : కంపెనీ తన చేతిలోకి వచ్చాక, చిన్నగా లాభాలు తగ్గించాడు ఆ తరువాత మన ప్రోడక్ట్ మీద మొగ్గు చూపడంలేదని అందరిని నమ్మించాడని గోపాల్ మాటల ద్వారా తెలిసింది. లోకల్ ఇండియా బ్రాండ్స్ వరకు అమ్మేసి ఆ లాభాలను అకౌంట్స్ లో జీతాలకి ఖర్చులకి టాల్లి చేసి బాలన్స్ చేశారు. గ్లోబల్ గా ఎక్స్పోర్ట్ చేసే అస్సలైన కాస్టలీ ఫాబ్రిక్ ని మాత్రం బైట దుబాయ్ వాళ్ళకి అమ్మేస్తున్నాడు.
నాలుగు రోజుల క్రితం గోపాల్ కి తెలీకుండా తన పెన్డ్రైవ్ తీసి అందులోని ఫైల్స్ కాపీ చేసి చూసాను, దుబాయ్ లో ఉన్న ఒక బ్లాక్ గ్యాంగ్ కి అమ్మేస్తున్నాడు, ఇవ్వాళ జరిగిన మీటింగ్ దాని గురించే. దుబాయ్ లోని మీ మావయ్య గారు బిజినెస్ చేసే పాత కంపెనీకి మెయిల్ పెట్టి వాళ్ళకి జరిగింది వివరించాను మన కంపెనీలో ఉన్న లోపాలని గుర్తించామని, కొత్త స్టాఫ్ ని పెట్టుకున్నామని ఇక నుంచి పర్ఫెక్ట్ గా బిజినెస్ చేద్దామని చెప్పాను, వాళ్ళు మళ్లి మనతో బిజినెస్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు.
సో ఇక మనకి ఒక ప్రాబ్లెమ్ తీరింది, ఇక ఢిల్లీలో మన దెగ్గర కొన్ని సంవత్సరాలుగా రా మెటీరియల్ సప్లై చేస్తున్న వాళ్ళు, నాలుగు నెలలుగా సప్లై చెయ్యడంలేదు, మెయిల్ చేసినా రిప్లై ఇవ్వలేదు. ఢిల్లీ వెళ్లి వాళ్ళని లైన్ లో పెట్టాలి. మన దెగ్గర కొనే రెగ్యులర్ వాళ్ళందరిని మళ్లి కలుపుకోవాలి. ఇంకా చాలా పనులున్నాయి, మనకి లోకల్ సపోర్ట్ లేదు వాళ్ళని మచ్చిక చేసుకోవాలి. వాళ్ళతో స్నేహంగా మెలిగితేనే అస్సలైన బిజినెస్.
ఈ కంపెనీకి చాల మంచి పేరు ఉంది దాన్ని మొత్తం సర్వ నాశనం చేశారు, మల్లి దీనికి పూర్వ వైభవం తీసుకు రావాలి, తీసుకొస్తాను. కచ్చితంగా లాభాలు వస్తాయి అని మాట్లాడుతూనే లేచి నిల్చున్నాను.
శివ మాటలకి గగన్, మీనాక్షి ముందు ఆనందపడ్డా, తరువాత గగన్ మాత్రం వెంటనే తన సందేహం బయట పెట్టడము.
గగన్ : అన్నీ ఓకే శివా, కానీ ఇప్పుడు ,మన దెగ్గర అస్సలు ఎంప్లాయిస్ లేరు కదా, మనం ఎం చెయ్యాలన్నా వర్కర్స్ లేకుండా ముందడుగు ఎలా వెయ్యడం?
శివ : ఎంప్లాయిస్ వస్తారు, రేపు పొద్దున్న పది గంటలకి వచ్చేయండి, మన కొత్త స్టాఫ్ ని పరిచయం చేస్తాను.
(ఆ మాటకి మీనాక్షి గగన్ ఆశ్చర్యంగా చూసారు, మీనాక్షికి గత పది రోజులుగా కనీసం శివ ఎందుకు ఫోన్ చెయ్యట్లేదో అప్పుడప్పుడు ఫోన్ చేసినా ఎందుకు ఎత్తడం లేదో అర్ధమైంది)
మీనాక్షి : ఒక్కడివే ఎలా చేస్తున్నావ్ ఇవన్నీ, మాకు మాత్రం ఏమి కనిపించటంలేదు ఏం జరుగుతుందో తెలీట్లేదు, పనులు మాత్రం జరుగుతున్నాయి.
శివ : నేను ఇక్కడ పనికి చేరిన క్షణం నుంచే అన్నీ గమనించడం మొదలుపెట్టాను, రెండోరోజు నుంచే ఎం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అన్ని ప్లాన్ చేసి పెడుతున్నాలే.
మీనాక్షి : ఆ బుర్రలో ఇంకా ఏమేమి ఉన్నాయో సస్పెన్సులు ఇవ్వకుండా అన్నీ చెప్పొచ్చు కదా.
దానికి నేను గగన్ సర్ ఇద్దరం నవ్వాము.
మీనాక్షి : నాన్నా ఇంటికి వెళ్తే మరి అమ్మమ్మకి ఎలా, ఏమని చెప్పాలి?
గగన్ సర్, మీనాక్షి ఇద్దరు నా వైపు చూసారు.
శివ : నన్ను చూడకండి, అది నాకు సంబంధం లేని విషయం.
గగన్ : అది నేను చూసుకుంటాలే, ఇప్పటికే లేట్ అయ్యింది శివ రేపు కలుద్దాం. మీనాక్షి పదా వెళదాం.
అక్కడనుంచి వాళ్ళని పంపించేసి ముస్కాన్ కి ఫోన్ చేసాను, ఆ తరువాత పెద్దమ్మకి ఫోన్ చేసాను.
కావేరి : పడుకోడానికి వస్తున్నావా?
శివ : లేదు హాస్టల్ కి వెళ్ళిపోతా, సరే పడుకో నేను రేపు మాట్లాడతా.
కావేరి : గుడ్ నైట్.
శివ : హ్మ్.
చాచా బండి మీద హాస్టల్ కి వెళ్లి టీ షర్ట్ మార్చుకుని పక్కన మంచం మీకహ పడుకున్న సందీప్ ని చూసాను,అలిసిపోయి పడుకున్నాడు. నేను కూడా, మంచం మీద అలా ఆనుకోగానె నిద్ర పట్టేసింది.
ఇటు మీనాక్షి, గగన్ లు కార్ ఇంటి గ్యారేజ్లో పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లారు, ఆ ఇంటికి తగ్గట్టే పెద్ద హాలు, ఎంత పెద్దదంటే ఒక పెద్ద సినిమా హాల్ అంత. ఇంట్లో ఉన్న అందరూ గగన్ రాక కోసమే చూస్తున్నారు. గగన్ కూడా అన్ని ఆలోచిస్తూనే మెట్లు ఎక్కుతూ ఇంటి లోపలికి వెళ్ళాడు.
మీనాక్షి ముందుగా లోపలికి వెళ్లి హాల్లో సోఫాలో కూర్చున్న తన అమమ్మ రాజేశ్వరిని చూసి ఆగిపోయింది. తన పక్కనే మీనాక్షి వాళ్ళ అమ్మ రజిత, ఆ పక్కనే మీనాక్షి మావయ్యలు అత్తలు అందరూకూర్చుని ఉన్నారు. మిగతా పిల్లలు, మీనాక్షి ఇద్దరు బావలు వదినలు తన తమ్ముడు పైకి వెళ్లే మెట్ల మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు, సుశాంత్ కోపంగా ఉన్నాడు.
గగన్ లోపలికి నడిచి మీనాక్షి పక్కన నించొని ఎదురుగా ఉన్న రాజేశ్వరిని చూసాడు, ఇద్దరినీ కోపంగా చూస్తుంది, మీనాక్షి సుశాంత్ ని చూసింది, కోపంగా వాళ్ళ వైపే చూస్తూ పళ్ళు కోరుకుంటున్నాడు, మీనాక్షి మొహం మీదకి నవ్వు వచ్చింది అది చుసిన ఆ ఇంట్లో అందరిలోకల్లా పెద్దది ఎదురు లేనిదీ, అరవై ఏళ్ళ వయసులో డబ్బుతొ వచ్చిన పొగరులో ఉన్న రాజేశ్వరి కోపం నషాళానికి అంటింది.
రాజేశ్వరి : ఎవడా శివ?