Thread Rating:
  • 2 Vote(s) - 4.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మ రాజీనామా
#3
మనశ్శాంతి ....అది   దొరకక వచ్చా. మీరు నన్ను పిలిచే పిలుపు ఏమిటో తెలుసా ఓయ్ , దేయం మొహం,   ఇవి మీరు నాకు ఇచ్చే బిరుదులు. ప్రాణానికి ప్రాణం బాగా   చూసుకునే కన్న వాళ్ళని వదిలి పెళ్లి తర్వాత ,చిరకాలం కష్టసుఖాలలో తోడునీడగా ఉంటారు అనే గుడ్డి నమ్మకంతో   వస్తాం. కానీ ఏనాడు నా మనసు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు.
...ఏంటి బంగారం కొనిచ్చాను అన్నారు కదా ...నేను అడిగాను? అది కేవలం సమాజంలో మి స్టేటస్ సింబల్. ప్రతి రోజు మీకు   ఇష్టమైనవి వండి పెట్టు నీ భార్య ఒక్కరోజు చేయకపోతే   చెయ్యి చేసుకుంటాం ప్రేమ ఉందంటారా....
అనురాగ బంధం లేని మీతో ఇంకా ఉంటే అది నా మూర్ఖత్వమే అవుతుంది.
చిన్నప్పటి నుంచే నా మనసులో ఎన్నో కోరికలు ఉండేది. ఎంతో చదువుకోవాలని, ఏవేవో చదవాలని ,పుస్తకాలు   రాయాలని, కానీ ఒక్కటి నెరవేరలేదు.
కారణం ఆయనకు ఇష్టం లేదు కాబట్టి. ఇప్పుడు చదివి ఏమి ఉద్దరిస్తాo అంటూ ప్రతి దానికి   ఆంక్షలు. అందుకే ఇప్పటికైనా నేను ఇక్కడ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదువుకుంటాను. గుడిలో అందరూ నేను పాడే పాటలు, కీర్తనలు చాలా ఇష్టపడతారు .కొందరైతే     రసిమని   కూడా అడుగుతున్నారు. పాటలు కీర్తనలన్నీ గ్రంథస్తం చేస్తాను . మన సంస్కృతి ,సాంప్రదాయాలు తర్వాతి తరం వాళ్ళకి తెలియజేస్తాను.
ఆయన మారుతారని ఇంత కాలం చాలా   భరించాను. కానీ నేను ఆయనకు అవసరం మాత్రమే అని తెలుసుకున్న. అందుకే నాకు   ఇష్టం వచ్చినట్లు ఇక్కడ బ్రతకాలి   అనుకుంటున్నాను .
అమ్మ ...అమ్మ   భూమిపై దేవుని అపురూప సృష్టి అంటారు. తల్లికి బిడ్డలపై ఎంతో ప్రేమ ఉంటుంది కదా.. అందులో....   ఆడపిల్లని నా కోసమైనా ఒక్కసారి ఆలోచించలేవ అమ్మ...
బిడ్డలకు రేక్కలు లేనప్పుడు వాటికి తల్లి సంరక్షణ అవసరమైనంత కాలం తల్లిగా నా బాధ్యతలు నెరవేర్చాను. ఇప్పుడు నీకు అన్ని ఆలోచించి విచక్షణా జ్ఞానం ఉంది.
ఎప్పుడు ..... అమ్మ ....పిల్లలతో నాకు చాలా కష్టం అవుతుంది అని అంటావు... పుట్టింట్లో నీకు పూర్తి విశ్రాంతి   ఇస్తాను. మీ ఇంటికొచ్చి ఏదో రెండు మూడు నెలల్లో నాలుగైదు రోజులు చేయవలెను. కానీ మళ్లీ నాలుగు రోజులకి అమ్మ వచ్చి హెల్ప్ చేయొచ్చుగా .... అంటావు.... నాకు వయసు అయిపోయింది అని తెలియటం లేదా.... ఇదివరకులా వేగంగా చేసే శక్తి నాకు లేదు. పైగా మీకు చంటి పిల్ల ఉన్నప్పుడు నాన్న   కేరళ లో ఉన్నా వాళ్ళ ఫ్రెండ్ కూతురు పెళ్ళికి తీసుకొని వెళితే. వయసులో హనీమూన్ కి తిరుగుతున్నారని ,అల్లుడు తప్పు పట్టారని   చెప్పావు కానీ.... మరి వాళ్ళు ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు వారి డబ్బులతో వారు వెళ్లారు కాళ్లు చేతులు    మాత్రం   ఆడినప్పుడే వెళ్లాలి కదా... అని   సర్ది చెప్పలేక పోయావే...
ఎప్పుడు అయ్యో బిడ్డ కష్టపడుతుంది అని అదో ఇదో చేసి పంపించే నా ఆరాటమే తప్పితే. నువ్వు ఎప్పుడైనా అమ్మ నువ్వు ఎలా ఉన్నావ్ నీ ఆరోగ్యం ఎలా ఉంది అని పట్టించుకున్నావ.
ఎందుకంటే అమ్మ అది ఆశించదు... నిజమే ...కానీ మళ్ళీ నీ కడుపున పుట్టిన వాళ్లు కూడా నీలాగే తయారవుతారు. అప్పుడు నా బిడ్డ మనసు ఎంత వేదన పడుతుందో నాకు తెలుసు. అది నేను భరించలేను. కాబట్టి ఇలాంటి సందేశం యువత మనసులో సున్నితంగా చెరుకుపోయేలా చేయాల్సిన అవసరం   ఇప్పుడు ఉంది.
నాలా నా బిడ్డగానీ, మరో అమ్మ గానీ బాధ     పడకూడదని నా ఆశ.
రాధా కళ్ళనిండా నీళ్ళు నిండాయి.
అమ్మ..మరి నేనేం తప్పు చేశాను. నువ్వు నా దగ్గరకి కూడా రాలేదు కదా.. కొడుకు ప్రశ్నించారు.
 
మానవ శరీరం గరిష్ఠంగా 45 డే (యూనిట్స్ ) బాధని భరించగలదు అంట. కానీ నీ తల్లి బిడ్డకు జన్మనిచ్చే టప్పుడు 57 డే (యూనిట్స్) నొప్పిని భరిస్తూదంట. అది   20 ఎముకలు ఒకేసారి విరిగితే పడే బాధ తో సమానం. కానీ అంత బాధ భరించి తన కడుపును చీల్చి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. బిడ్డను చూసి బాధ అంతా   మర్చిపోతుంది. కోడలు ఎప్పుడు కూతురు కాలేదు. తను చదువుకుంటూ, చిన్న పిల్లలను చూసుకుంటూ ఇబ్బంది పడుతున్నా ... కూతురు అయితే సహాయప డుతుంది, నాకెందుకు సహాయపడదు         అంటూ ఎన్నో     అనింది అని   చెప్పావు. అంటే వచ్చి మీ దగ్గర కొన్ని రోజులు ఉన్నాను. నేను ఉన్నన్ని రోజులు వంట   గదిలో గాని , పని చేసిన   చిదరించుకుంటు ఉండేది. భయం భయంగా   గడిపాను. ఆమె నన్ను అన్ని మాటలు   అంటున్నప్పుడు ,నీ మనసుకు తెలియదు నా మనసు బాధ   పడుతుందని .ఆమెకు నేను రెండు సంవత్సరాలుగా మాత్రమే తెలుసు. మరి నీకు నువ్వు
పుట్టినప్పటి నుంచి తెలుసు. ఒక్కసారైనా   నేను ఎలాంటి దాన్ని చెపి నాకు భరోసా ఇవ్వలేకపోయింది. అయినా ఇవన్నీ అని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు రేపు నీ కొడుకుతో మీరిలా బాధపడకూడదని. నేను అనుకున్న కొన్ని పనులు జన్మ ముగిసేలోగా చేయాలని వచ్చేసాను. నన్ను క్షమించండి....
సుధా జీవితంలో తొలిసారి మార్దవంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. కృష్ణమూర్తి ప్రేమ గా   దగ్గరికి తీసుకున్నారు.
నిను ఎన్నో కష్టాలు పెట్టిన మాట నిజమే .కానీ నీ మనసు   ఇంత గాయపడుతుంది   అని అనుకోలేదు. నువ్వు లేక క్షణం ఒక యుగం అయింది. నువ్వు లేక నేను బ్రతకలేను రా సుధా నా అవసరం కోసం   కాదు, నువ్వు అక్కడే ఉంది నీకు ఇష్టమైన పని చేసుకో. ఇక నుండి నీ ప్రతీ కష్టం   పంచుకుంటాను. తాగుడు   మానేస్తాను. ఇకముందు కూడా వాటి జోలికి పోను. నువ్వు ఎన్నోసార్లు మానేయడానికి డాక్టర్ దగ్గరికి కౌన్సిలింగ్ కి రమ్మన్నావు కదా ...ఇప్పుడు వస్తాను. నిన్న డాక్టర్ చెప్పారు. నీకు తరచు అనారోగ్యం ఎందుకు వస్తుందంటే ,అప్పుడు బాబుకి కిడ్నీ ఇచ్చావు కదా.... అందుకే నీకు అనారోగ్యంగా ఉంటుందంట.నిజంగా అమ్మ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నా మీద ఒట్టు నన్ను నమ్ము సుధా ప్లీజ్ ...అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు కృష్ణమూర్తి.
అమ్మ నా ప్రాణం నిలబెట్టిన నిన్ను బాధపెట్టాను నన్ను క్షమించు అన్నాడు రవి.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
అమ్మ రాజీనామా - by k3vv3 - 26-08-2022, 07:18 PM
RE: అమ్మ రాజీనామా - by k3vv3 - 26-08-2022, 07:21 PM



Users browsing this thread: 1 Guest(s)