25-08-2022, 01:43 PM
(This post was last modified: 19-10-2022, 10:29 PM by Takulsajal. Edited 1 time in total. Edited 1 time in total.)
22
పొద్దున్నే లేచేసరికి పెద్దమ్మ లేచి పనులు చేసుకుంటుంటే వెళ్లి బ్రష్ చేసుకుని తన పక్కన నిల్చున్నాను. నా చేతికి కాఫీ అందించి తను కూడా తాగుతూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంది, తన ఎదురుగా కూర్చున్నాను.
శివ : పెద్దమ్మా అలా ఉండకు, నాకేం బాలేదు.
కావేరి : (కళ్ళు తుడుచుకుంది తప్ప ఇంకేం మాట్లాడలేదు)
ఇంతలో మీనాక్షి నుంచి వచ్చిన ఫోన్ చూసి శివ లేచాడు, కావేరి కప్పులు అందుకుని లోపలికి వెళ్ళిపోయింది.
శివ : గుడ్ మార్నింగ్ మేడం.
మీనాక్షి : మార్నింగ్ మార్నింగ్ (అని నవ్వుతూ). నేను, నాన్న నీకోసం వెయిటింగ్, ఆఫీస్ లో ఉన్నాం.
శివ : వస్తున్నా.
కాల్ కట్ చేసి లోపలికి పరిగెత్తి స్నానం చేసి కావేరి పెద్దమ్మ నాకోసం ఇంట్లో ఉంచిన ఇంకో జత బట్టలు వేసుకుని ఆఫీస్ కి బైలుదేరాను. లోపల అంతా సాఫీగానే సాగుతుంది వెళ్లి గగన్ సర్ ని పలకరించి మీనాక్షి కోసం గోడౌన్ దెగ్గరికి వెళ్లాను, అక్కడున్న పనివాళ్ళతో మాట్లాడుతుంది.
శివ : (వెనకగా వెళ్లి) మేడం గారు బిజీగా ఉన్నట్టున్నారు.
మీనాక్షి : (నా గొంతు వింటూనే నావైపు తిరిగింది) హమ్మయ్య వచ్చావా, ఇందాకటి నుంచి నీకోసమే చూస్తున్నాను.
శివ : దేనికి?
మీనాక్షి : నీతో మాట్లాడాలి. (ఏంటా అన్నట్టు చూసాను) ఇప్పుడు కాదు సాయంత్రం కార్ డ్రైవింగ్ నేర్చుకోడానికి రా, అప్పుడు మాట్లాడదాం.
సరే అంటూ వెళ్లి పని చేసుకుంటున్నాను, గంటా గంటన్నరకి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చారు, అందరూ గుంపు గూడి దీని గురించే మాట్లాడుకుంటున్నారు, నేను నవ్వుతూ పని చేసుకుంటున్నా. మీనాక్షి భయపడుతూ నా దెగ్గరికి వచ్చింది తనతో పాటే ఆఫీస్ దెగ్గరికి వెళ్ళాను, గగన్ సర్ వాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడుతున్నారు. లోపలికి వెళుతూనే నోరు తెరిచాను.
శివ : హాయ్ సర్ నేనే మీకు ఫోన్ చేసింది, అని ఆయనని చూస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చాను.
గగన్ సర్, మీనాక్షి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నన్నే చూస్తున్నారు. వాళ్ళని చూసి సర్ ని పరిచయం చేసాను ఈయన పేరు శంకర్. మన సిటీకి CI, శంకర్ గారు చాలా నిజాయితీ గల హ్యాండ్సమ్ ఆఫీసర్ మాత్రమే కాదు రఫ్ అండ్ టఫ్ కూడా రీసెంట్ గా రేప్ కేసులో నిందితులని ఎన్కౌంటర్ చేసింది సారే, అన్నాను శంకర్ గారిని చూస్తూ.
శంకర్ : థాంక్స్, సారీ నీ పేరు?
శివ : శివ సర్.
శంకర్ : థాంక్స్ శివా, ఇక వచ్చిన పని చూద్దాం. నాకు ఎందుకు ఫోన్ చేసారు?
శివ : సర్ మా కంపెనీలో గత కొన్ని రోజులుగా రా మెటీరియల్ మిస్ అవుతుంది, అలాగే వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసే కాస్టలీ ఫాబ్రిక్ కూడా మిస్ అవుతుంది, దాని గురించి మీకు కంప్లైంట్ చేద్దామనే పిలిపించాము అని పక్కనే నిల్చొని చూస్తున్న గోపాల్ మరియు శ్యామ్ ని చూస్తూ అన్నాను.
శంకర్ : అలాగా, నాకు రెండు రోజులు టైం ఇవ్వండి, ఎవడైనా సరే బొక్కలో వేస్తాను.
శివ : తప్పుగా అనుకోకండి సర్, మీరు సమర్ధులే అని నాకు తెలుసు కానీ మీకు నేను శ్రమ తగ్గించాను, ఒక్క సారి ఈ ఎవిడెన్స్ చూడండి అని పెన్డ్రైవ్ చూపిస్తూ మీనాక్షిని చూసాను, వెంటనే లాప్టాప్ తీసి ముందు పెట్టింది దాన్ని కనెక్ట్ చేసి రాత్రి తీసిన ఫోటోలు, వీడియోలు, స్టాఫ్ వర్కర్స్ నాతో చెప్పినవి రికార్డింగ్స్. మేనేజర్ గోపాల్, అసిస్టెంట్ మేనేజర్ శ్యామ్ చాటు వ్యవహారాలు మాటలు అన్ని శంకర్ గారి ముందు పెట్టాను.
పదిహేను నిమిషాల పాటు ఆఫీస్ లో ఉన్న అందరూ అన్ని విని చూసి పక్కకి చూసేసరికి వాళ్లిద్దరూ జారుకోవడం గమనించి సైగ చెయ్యగానే గోపాల్ ని శ్యామ్ ని అదుపులోకి తీసుకున్నారు, వాళ్లిద్దరూ నన్ను కోపంగా చూడటం గమనించాను.
శంకర్ : ఇంటెలిజెంట్ బాయ్, ముందుగా అన్ని సిద్ధం చేసే నన్ను పిలిచావన్నమాట. పక్కా సాక్ష్యాలతో వాళ్లు తప్పించుకోలేని నాన్ బెయిలెబుల్ అరెస్ట్ ఇది నా సర్వీస్ లో ఇదే మొదటిది, శభాష్.
శివ : థాంక్యూ సర్. అంటునే మీనాక్షిని చూసాను నన్నే ఓరగా కోపంగా చూస్తుంది. చిన్నగా నవ్వాను.
శంకర్ గారు గోపాల్ శ్యామ్ ని తీసుకువెళుతుంటే స్టాఫ్ అడ్డుపడ్డారు, శంకర్ గారు వాళ్ళకి చెప్పి జీప్ ఎక్కించాడు. కానీ గోపాల్ ఈ గ్యాప్ లో వాళ్ళకి ఏం చెప్పాడో ఏమో కానీ నినాదాలు మొదలెట్టారు. అది అరగంట లోపే స్ట్రైక్ గా మారిపోయింది.
గగన్ సర్ మీనాక్షి భయపడుతూ నా వైపు చూసారు.