Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రియ శత్రువు
GLIMPSE


అర్ధ రాత్రి పదకొండు అవుతుంది, జోరుగా వర్షం కురుస్తుంది..

రాధా శివలిద్దారు టీవి చూస్తూ కూర్చున్నారు.. కడుపుతో ఉన్న రాజీ ఇద్దరికి చెరొక కప్పు కాఫీ ఇచ్చి రాధ కాళ్ళ దెగ్గర కూర్చుని టీవీ చూస్తుంది.. రాధ రాజీ తల మీద ప్రేమగా చెయ్యి వేసి నిమిరింది...
లిఖిత పిల్లలని నిద్రబుచ్చుతుంది.. కంధర రుద్రతొ తన అక్క అయిన రాక్షస కంధర గురించి చెపుతుంటే వింటున్నాడు..

ఇంతలో తలుపు కొట్టిన శబ్దం.. ఆపకుండా కొడుతూనే ఉన్నారు.. పిల్లలకి మెలుకువ వచ్చింది.. రాజీ రాధ శివలు కూడా తలుపు వైపు చూసారు.. రుద్ర లేవబోగా లిఖిత కోపంగా తలుపు దెగ్గరికి వెళ్లి తలుపు తెరిచింది..

ఎదురుగా ఒక కుర్రవాడు ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో వర్షంలో తడుస్తూ ఉన్నాడు.. వాడి కళ్ళ కింద చారలు ఏడ్చిన గుర్తులు అవి.. వాడి చేతిలో ఒక పెద్ద తోపుడు బండి దాంట్లో నలుగురు చలనం లేకుండా రక్తపు ముద్దల్లా పడిపోయి ఉన్నారు.. ఇదంతా చూసిన లిఖిత వాడిని చూసి లోపలికి రమ్మని చెపుతూ డోర్ తెరిచి రుద్రని కేక వేసింది..

రుద్ర వచ్చి ఆ ముగ్గురిని లోపలకి తీసుకొచ్చి పడుకోబెట్టాడు.. ఆ కుర్రాడిని చూసి "ఏం జరిగింది?" అని అడిగాడు.. వాడు ఏడుస్తూనే ఉన్నాడు..

రుద్ర : మొదటి వాడిని చూసాడు.. కాళ్ళు విరిగిపోయి పొట్టలో కత్తులు దిగి ఉన్నాయి.. రెండో వాడు అచ్చం మొదటి వాడిలానే ఉన్నాడు కానీ చేతులు మెడ విరిగిపోయి ఉన్నాయి కానీ ఏ ఆయుధం ఒంట్లో దిగలేదు.. ఇక మూడో వాడు మిగిలిన ఇద్దరి కంటే చాలా బలంగా ఉన్నాడు.. వాడి చేతి నరాలు తెగిపడి ఉన్నాయి.. పొట్టలోనుంచి పేగులు బైటకి వచ్చాయి.. ఇక నాలుగోవాడు ప్రాణాలతో ఉన్నాడా లేడా అన్నట్టుగా ఉన్నాడు... ఇంత ఘోరంగా వీళ్ళని ఈ స్థితికి ఎవరు తెచ్చి ఉంటారు.. అని ఆలోచిస్తూనే..

రుద్ర : కంధర.. వీళ్ళని నయం చెయ్యి.. అన్నాడు..

కంధర ముగ్గురిని ఐదు నిమిషాలలో నయం చేసి వాళ్ళకి స్పృహ వచ్చేలా చేసింది.. ముగ్గురు లేచి కూర్చున్నారు.. ఆ కుర్రాడు లేచిన వాళ్ళని చూసి "అన్నయ్యలు.. లేచారు.." అని సంబరపడుతూ రుద్రని వాటేసుకున్నాడు..

లేచిన నలుగురు ఆ కుర్రాడి నుంచి జరిగింది తెలుసుకుని రుద్రకి నమస్కారం పెట్టారు.. నలుగురి కళ్ళలో కోపం.. అది రుద్ర లిఖిత ఇద్దరూ గమనించారు..

కుర్రాడు : నిజంగా ఆ స్వామి చెప్పినట్టు ఇట్టే నయం చేసారే..

రుద్ర : ఏ స్వామి..?

కుర్రాడు : ఆ గుళ్లో ఉన్న స్వామి.. మీ దెగ్గరికి వెళ్ళమని పంపించింది ఆయనే..

రుద్ర : అలాగా..  ఇంతకీ ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్తావా?

"ఓహ్.. నా పేరు సుబ్బిగాడు.. ఇదిగొ ఈ అన్న పేరు విక్రమ్.. ఈ అన్న పేరు ఆదిత్య.. ఈ అన్న పేరు వాసు.. ఈ అన్న పేరు చిరంజీవి నలుగురిని ఒక ముసలిది కుక్కని కొట్టినట్టు కొట్టింది.."

లిఖిత  పుసుక్కున నవ్వింది.. రుద్రకి కూడా నవ్వొచ్చింది కానీ ఆపుకున్నాడు ఎందుకంటే ఈ సుబ్బిగాడికి అంత ఎటకారం ఎక్కువ మరి..

ఆ నలుగురు తల దించుకోవడం చూసి రుద్ర రాజికి వేడి వేడిగా సూప్ పెట్టమని చెప్పాడు.. రాజీ లోపలికి వెళ్ళింది.. కంధర కూడా పిల్లల దెగ్గరికి వెళ్ళింది.

రుద్ర : మీరు చెప్పండి..

సుబ్బిగాడు : చెప్పడానికి ఏం లేదు అన్నియ్యా.. ముగ్గురిని కుక్కని కొట్టినట్టు కొట్టింది.. శివమని డ్రమ్స్ వాయించినట్టు, జాకీర్ హుస్సేన్ తబలా వాయించినట్టు.. పిచ్చి పిచ్చిగా రొచ్చు రొచ్చుగా కొట్టింది..

లిఖితకి నవ్వాగలేదు గట్టిగా నవ్వేసింది.. వాసు సుబ్బిగాడిని కోపంగా చూసాడు.. రుద్ర లిఖితని చూసాడు.. లిఖిత నవ్వు ఆపింది..

సుబ్బిగాడు : ఏంటన్నాయి.. అలా చూస్తావ్.. డాక్టర్ల దెగ్గర ఏం దాచాకూడదు.. మిమ్మల్ని బంతి ఆట ఆడింది ఆ ముసలిది.. కానీ అన్నాయి అని రుద్రని చూస్తూ "అది మాములు ముసలిది కాదు.. మంత్రగత్తే.."

ఈలోగా రాజీ అందరికీ సూప్ అందించింది..

రుద్ర : మంత్రగత్తే... అంటూనే లిఖిత వైపు చూసాడు.. మళ్ళీ అందరినీ చూసి అస్సలు ఏం జరిగిందో మొత్తం మొదటి నుంచి చెప్పండి..

సుబ్బిగాడు : అయితే మీకు విక్రమాదిత్య గురించి చెప్పాలి...

❤️
Like Reply


Messages In This Thread
RE: ప్రియ శత్రువు - by Pallaki - 22-08-2022, 11:11 PM



Users browsing this thread: 57 Guest(s)