Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
రాజాజ్ఞ అంటూ ఒకడు రాక్షసనవ్వులతో నాదగ్గరికివచ్చి తల నరకడానికి పొడవాటి ఖడ్గాన్ని రెండుచేతులతో పైకెత్తాడు .
జై ఆదిపరాశక్తి అంటూ లేచి వాడి ప్రాణం పోకుండా ఇంకెప్పుడూ ఇలాంటి పోటీలలో ఎవ్వరినీ చంపడానికి వీలుకానట్లు కడుపులో పోటువేసి చేతులు కాళ్ళ లోని నరాలు తెగిపోయేలా గాట్లుపెట్టి కదలకుండా నిలబడ్డాను .
ఆయుధాన్ని ఎత్తిన రాక్షసుడు ఎత్తినట్లుగానే చలనం లేనట్లు వెనక్కు భూమి అదిరేలా పడిపోయాడు .
మళ్లీ ఒక్కసారిగా నిశ్శబ్దం ....... , రాజు తింటున్న మాంసం గొంతులో ఇరుక్కున్నట్లు ఇబ్బందిపడిపోతూ సింహాసనం పైకి చేరాడు .
నాకు మద్దతిస్తున్న ప్రజలంతా లేచి కేకలువెయ్యడం మొదలెట్టారు .

తోటి రాక్షసుడు ఊపిరి తప్ప కదలలేని స్థితిలో పడి ఉండటం చూసి గొడ్డలి - వలతో వచ్చినవాడి దాడిని తప్పించుకునేసరికి మిగతా ఇద్దరూ వెనకనుండి దాడి చేశారు , ముగ్గురు దాడి దెబ్బలు మరియు పోట్లకు రక్తం చిందిస్తూనే ఎదురుదాడి మొదలెట్టాను .
రేయ్ అంటూ సుత్తితో నావైపుకు ఒకడు రావడం చూసి మరొక రాక్షసుణ్ణి పట్టుకుని అడ్డుగా పెట్టాను .
నా దెబ్బ వాడి తలపై బలంగా తగలడంతో భయంకరమైన కేకతో అక్కడికక్కడే నేలకొరిగాడు .
ఆ దెబ్బ రాజుకు తగిలినట్లు తలపై చేతినివేసుకుని భయపడటం చూసి నవ్వుకున్నాను .
మొండి కత్తితోనే ఇక మిగిలిన ఇద్దరినీ రమ్మని సైగచేస్తూనే వాడిముందుకు దొర్లుకుంటూ వెళ్లి కాళ్ళు పనిచేయకుండా నరాలు తెగ్గోసాను .
జూ ...... ఊ ...... అంటూ నాకు మద్దతు తెలుపుతున్నవారంతా సంతోషంతో కేకలువేస్తున్నారు .
చివరగా మిగిలినవాడు భయపడుతుండటం చూసి నవ్వుకున్నాను .
రేయ్ ...... చంపేయ్ వాడిని అంటూ రాజు కోపంతో ఊగిపోతున్నాడు .
వణుకుతూనే గొడ్డలితో నా ఛాతీమీదకు దాడిచేసినవాడి పీకపై ప్రాణాలు పోకుండా కోసి యా ...... అంటూ రాజ్యం మొత్తం వినిపించేలా గర్జించాను .
నా గర్జనకు మిత్రుడు కృష్ణ సంతోషపు ఘీంకారాలు వినిపించడంతో ఆనందం వేసింది .

సుత్తిదెబ్బ తలపై తగిలినవాడు ప్రాకుకుంటూ వెళ్లిపోతుండటం చూసి , ప్రజలంతా చంపేయ్ చంపేయ్ అంటూ కేకలువేస్తున్నారు .
రేయ్ నువ్వేకదా నన్ను కాలితో తాన్నినది అంటూ వాడి దగ్గరకువెళ్లి రాజువైపు కోపంతో చూస్తూ కాలితో ఒక్క తన్ను తన్నాను - అంతదూరం ఎగిరిపడ్డాడు .

రాజును తాన్నినట్లు ఏకంగా సింహాసనంతోపాటు వెనక్కు పడటం చూసి నవ్వుకున్నాను - విజయనినాదంతో మొండి కత్తిని పైకెత్తాను .
ప్రజలంతా లేచి వీరుడు - వీరాధి వీరుడు - యోధుడు అంటూ రాజ్యం మొత్తం దద్దరిల్లిపోయేలా నినాదాలు చేస్తున్నారు .
రాజు : పైకిలేచి కోపంతో ఊగిపోతున్నాడు - సైన్యాధ్యక్షా ...... మొత్తం సైన్యంతో చుట్టుముట్టి వాడిని వాడిని ......
పరివారం : ప్రభూ ...... ప్రజలంతా చూస్తున్నారు - ఇప్పుడు ఆ వీరుడిని ఏమైనా చేస్తే మీ గౌరవానికి దెబ్బ - ఓటమి ఎరుగని మన యోధులను మట్టికరిపించాడు - మనవాళ్లను చంపేయ్యవచ్చు అని ఆజ్ఞ ఇచ్చు ఆ వీరాధివీరుడిని ప్రస్తుతానికి వదిలెయ్యండి - ఎలాగో తదుపరి పోటీ ఉండనే ఉందికదా ...... , ఇప్పుడు ఆ వీరుడిని ఏమైనా చేస్తే ప్రజలు తిరగబడినా తిరగబడేలా ఉన్నాడు - రాక్షసుల్లాంటి మన యోధులను ఓడించిన వీరుడికి బ్రహ్మరథం పడుతున్నారు మీరూ చూస్తున్నారుకదా అంటూ ఒప్పించారు .
చంపెయ్యాలి చంపెయ్యాలి అంటూ కేకలువేస్తున్న ప్రజలవైపు ఆగమని సైగచేసి , తన ఓటమిని ఒప్పుకుంటున్నట్లు వేలితో చూయించి చంపేయ్యమని ఆజ్ఞలువేశాడు రాజు .
నీలాంటి క్రూరమైన రాజు ఆజ్ఞను ...... హ హ హ అంటూ మొండి కత్తిని కిందకుపడేసి నొప్పిని భరిస్తూ నెమ్మదిగా ద్వారం వైపుకు నడిచాను .
వీరుడు - వీరాధివీరుడు దయగలవాడు దయగలవాడు అంటూ హోరెత్తించడంతో ....... రాజుకు భంగం కలిగినట్లు కోపంతో వెళ్ళిపోయాడు .
వీరుడు - వీరాధివీరుడా ...... నీ పేరేమిటి ? ఎక్కడ నుండి వచ్చావు ? వీరుడు - వీరాధివీరుడు - యోధుడు ....... అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు .

వీరా వీరాధివీరుడా ...... అంటూ నాతోటి బానిసలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ లోపలనుండే తాకడానికి ప్రయత్నిస్తున్నారు .
ఇనుప ద్వారం తాళం వేసి నన్ను లాక్కొచ్చి పడేసిన భటులవైపు చూసాను .
అప్పటికే భయపడుతున్న వారు గజగజవణుకుతూ వచ్చి తాళం తీసి ప్రక్కకుతప్పుకుని తలలుదించుకున్నారు .
వీరుడు - వీరాధివీరుడు అంటూ ప్రజలతోపాటు నినాధాలుచేస్తూ నాచేతులను భుజాలపై వేసుకుని కారాగారంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు .

వీరాధివీరా ...... మేము ప్రాణాలతో ఉన్నాము అంటే నీవల్లనే అంటూ త్రాగడానికి నీళ్లు అందించారు .
వొళ్ళంతా రక్తం - ఎంత రక్తం పోయిందో .......
తోటి బానిస : ఈరక్తం మన వీరుడుది కాదు ఆ రాక్షసులది అంటూ తడి గుడ్డలతో వొళ్ళంతా తుడిచారు - వీపుపై పడిన రెండు కత్తిగాట్లపై మరియు తలవెనుక పడిన కర్ర దెబ్బకు పసరు రాసి గుడ్డను కట్టారు - వీరుడా ..... నిన్నటి నుండీ ఏమీ తినలేదు అంటూ వాళ్ళు దాచుకున్న పళ్ళను అందించారు .
పర్లేదు సోదరులారా మీరు తినండి .
ఈరోజు మా ప్రాణాలు పోకుండా కాపాడిన దేవుడు మీరు ...... మీరు తింటే మేము తిన్నట్లే మేమంతా నిన్న రాత్రి తిన్నాము దేవుడా అంటూ చేతికి అందించారు .
తోటి బానిస : మన దేవిడిని కాసేపు విశ్రాంతి పోనిద్దాము - ఈ పొడవాటి కత్తి గాయాలు మానాలంటే రోజులుపడతాయి - రేపు మాత్రం మన దేవుడికంటే ముందు మనమే పోటీలలో పాల్గొనాలి .
అవును ఈ దేవుడి ధైర్యం చూసి మాకూ ధైర్యం వచ్చింది - భటులు ఎలా భయపడ్డారో చూసాము .
తోటి బానిస : భటులు ఏమిటి ఏకంగా రాజే భయపడి వెళ్లిపోతేనూ అంటూ నవ్వుకున్నారు .
ఈరోజే ఇంత భయంకరమైన రాక్షసులతో పోటీ అంటే ఇక రేపు ఎలా ఉంటుందో ........
అది ఎవ్వరికీ తెలియదు - ఇంతవరకూ తొలిపోటీని దిగ్విజయంగా పూర్తిచేసినది ఈ దేవుడు ఒక్కరే కదా .......
పదండి పదండి మన దేవుడికి విశ్రాంతి అవసరం .......

సోదరా ...... పెద్దాయన ......
తోటి బానిస : పెద్దాయనను తాకనివ్వలేదు సైనికులు - మరొక ద్వారం ద్వారా తీసుకెళ్లిపోయారు అంటూ బాధతో చెప్పాడు - ప్రాణమున్న మనల్నే ఘోరంగా చూస్తున్నారు ఇక .......
క్షమించండి పెద్దాయనా ...... నాకు వైద్యం చేసిన మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను.
తోటి బానిస : బాధపడకండి వీరాధివీరా ...... , పెద్దాయనను చంపిన వాళ్ళను చంపకుండా జీవితాంతం జీవచ్చవాలుగా మార్చేశారు , పైనుండి చూసి ఆనందిస్తారు , వీరాధివీరా ...... మీరు నిజంగానే మహారాజే మీ వీరత్వం చూస్తే అర్థమైపోతుంది ఈపాటికి రాజుకు కూడా తెలిసిపోయి ఉంటుంది - ఈరోజైతే నిద్రపోడు అంటూ నవ్వుకున్నాడు - క్షమించు దేవుడా ఇక మీరు విశ్రఅంతి తీసుకోండి అనిచెప్పి ద్వారం దగ్గరికివెళ్లాడు .
గురువుగారి ఆశీస్సులతో - అమ్మలగన్న అమ్మ ఆ పరాశక్తి తోడుగా తొలి గండం గట్టెక్కాను మహీ ...... , నిన్ను కలవాలన్న ఆశే నన్ను బ్రతికిస్తుంది , నువ్వు ఎక్కడ ఉన్నా జాగ్రత్తగా - సంతోషంగా ఉండాలి , ఆదిపరాశక్తి మరియు నదీఅమ్మ నీకు తోడుగా ఉండాలి అంటూ ప్రార్థించి , మహీ మహీ మహీ అంటూ కలవరిస్తూనే కళ్ళుమూసుకున్నాను .

అదేసమయానికి రాజమందిరంలో రాజు కోపంతో ఊగిపోతూ దొరికినవాటినల్లా పగలగొడుతున్నాడు . సైన్యాధ్యక్షా ...... ఇంతకీ వాడెవడు ? - ఎక్కడ నుండి తీసుకొచ్చారు ? .
సైన్యాధ్యక్షుడు : నిన్న మన రాజ్యం చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతుంటే భటులు బంధించి తీసుకొచ్చారు ప్రభూ ....... , ఎవరని అడిగితే మధ్య భారతదేశంలో ఉండే చంద్ర రాజ్య మహారాజునని - మీరు ..... మహారాణీ గారికి బహుమతిగా ఇచ్చిన చిలుక కోసం వచ్చానని ఎలాగైనా తీసుకెళతాను అని చెప్పాడు ప్రభూ అందుకే కారాగారంలో కాక చీకటి కారాగారంలో బంధించి చావుని పరిచయం చేసేలా కొరడా దెబ్బలు కొట్టించాను అయినా సూర్యోదయానికి ఎలా కొలుకున్నాడో అర్థం కావడం లేదు ప్రభూ - ఈరోజు జరిగిన పోటీ చూస్తే రాజే అని అనిపిస్తుంది ప్రభూ ......
రాజు : రాజైతే ఏమిటి ఇప్పుడు మన కాళ్ళ కింద బానిస , బానిసలానే చూడండి ఆ ఉత్తర - మధ్య భారతదేశ రాజ్యాలు ఎప్పటికీ మనకు శత్రువులే కదా , నా ఎదురుగా నిలబడి నన్నే ఎదురించడమే కాకుండా నా ఆజ్ఞనే తిరస్కరించాడు , వాడి చావుని నేను చూడాలి , రేపటి పోటీలు సిద్ధం చెయ్యండి , అతి భయంకరమైన వారిని రంగంలోకి దించండి .
సైన్యాధ్యక్షుడు : ప్రభూ ...... మీకు తెలియనిది కాదు .
రాజు : అవునుకదా ....... ఇన్ని ఏళ్ళల్లో రెండవరోజుకు పోటీలు కొనసాగనేలేదు - తొలిరోజునే బానిసలంతా ఖతం అయిపోయేవారు - అలా అయితే సమయం తీసుకునైనా వాడిని మించిన వారిని సిద్ధం చెయ్యండి - పోటీలు మరింత రసవత్తరంగా క్రూరాతిక్రూరంగా ఉండాలి - మరొక ముఖ్యమైన విషయం వాడు రాజు అని ప్రజాలకుకానీ వాడి రాజ్యానికి కానీ తెలియనేకూడదు అని ఆజ్ఞాపించాడు .
సైన్యాధ్యక్షుడు : ఆజ్ఞ ప్రభూ .........
రాజు : చెలికత్తెలూ ...... మహారాణీ మందిరానికి వస్తామని తెలియజేయ్యండి .
అలాగే మహారాజా అంటూ చెలికత్తెలు పరుగులుతీశారు .
వెనుకే వెళ్లి మహారాణీ మహారాణీ ...... ఒకడి వలన ఒకటే తలపోటు తైలం తీసుకురా ...... , మహారాణీ ఏమిటి ఆ చిలుక పంజరంలో అలా ఎగురుతోంది .
మహారాణి : ప్రభూ ప్రభూ ...... కొద్దిసేపటి ముందు ఒక గర్జన వినిపించింది అప్పటినుండీ నిన్న మొన్నటికంటే మరింతగా పంజరం నుండీ బయటకు రావడానికి తెగ ప్రయత్నం చేస్తోంది , ఎంతకూ శాంతించడం లేదు .
రాజు : వాడి గర్జనే ...... అంటే వాడు చెప్పినది నిజమే , మహారాణీ ...... ఎట్టిపరిస్థితుల్లోనూ పంజరాన్ని తెరవకండి , తరువాతి పోటీలలో వాడు చచ్చాక మనమాట తప్పక వింటుంది .
మంజరి : మా మహారాజు దేవుడు - దేవుడికి చావు అన్నది ఉండదు - మీరే స్వయంగా మీ చేతులతో మా దేవుడి చెంతకు చేరుస్తారు .
రాజు : అలా ఎప్పటికీ జరగనే జరగదు - మీ ఇద్దరినీ ఎప్పటికీ కలవనివ్వను - తదుపరి పోటీలో నీ దేవుడు చావడం ఖాయం ....... 
మంజరి : అలాంటి ఎన్నిపోటీలు పెట్టినా విజయుడై ఈరోజులానే గర్జిస్తాడు చూస్తూ ఉండండి .
రాజు : చిలుక మాటలకు తలనొప్పి మరింత పెరిగేలా ఉంది - చెలికత్తెలూ తీసుకెళ్లి చీకటిలో ఉంచండి .
అలాగే ప్రభూ అంటూ పంజరాన్ని తీసుకుని వెళ్లిపోయారు .
తోటి బానిస చెప్పినట్లు ఆరోజంతా కలలో నేనే కనిపించనట్లు నిద్రపోలేదు రాజు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 23-11-2022, 10:25 AM



Users browsing this thread: 32 Guest(s)