Thread Rating:
  • 7 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నిధి రహస్యం... అంతు చిక్కని కథ...( ముగింపు)
2010... September 7th....

విశ్వాస్ ఇంకా తన బృందం ఆ జలపాతం దాటడానికి ప్రయత్నం చేసి చేసి ఇంకా తమ వల్ల కాదని తిరిగి వెళ్ళిపోవడానికి సిద్దం అయ్యారు ..అందరూ వాళ్ళ సామాన్లు సర్దుకొని పోయిన సారి బస చేసిన గుడి దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న దేవతకు మొక్కుకొని బయలు దేరారు కానీ ఇంతలో ఎవరో కింద పడినట్టు పెద్ద సౌండ్ వచ్చింది....

అందరూ ఆ సౌండ్ ఎంటి అని చూస్తే అక్కడ ఒక మనీషి చెట్టు మీద నుంచి కింద పడి ఉన్నాడు.విశ్వాస్ వెంటనే తన దగ్గర ఉన్న గన్ తీసి ఆ మనీషి దగ్గరకు వెళ్ళి హేయ్ ఎవరు నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడుగుతాడు...

ఆ మనీషి నా పేరు సత్యమూర్తి నేను మిమ్మల్ని 2 నెలలు గా ఫాలో అవుతున్న ఆ మిజుంబా గ్రామం కి మీరు వచ్చి వెళ్ళినప్పుడు నుంచి అలాగే ఇన్ని రోజులు మీరు ఆ జలపాతం దాటడానికి ప్రయత్నం చేయడం అన్ని చూస్తూనే ఉన్నా, కానీ మీరు డాటలేక పోయారు కదు అంటు నవ్వుతున్నాడు...

విశ్వాస్ కి కోపం వచ్చి ఆ మనీషి నీ కొట్ట బోయాడు..అతను హహహ నన్ను చంపితే మీకు ఏమి రాదు అదే నన్ను ఫాలో అయితే ఆ జలపాతం దాటడానికి సహాయం చేస్తాను అని నవ్వుతున్నాడు...

రూబెన్స్...ఎంటి నువ్వు మాకు సహాయం చేస్తావా లంజ కొడకా ఎవద్రా నువ్వు అంటూ అతని షర్ట్ పట్టుకొని పైకి లేపాడు ..

సత్యమూర్తి రూబెన్స్ అల పైకి లేపగానే పెద్దగా నవ్వుతూ రూబెన్స్ నీ కాలి తో కొట్టి తను వెళ్ళి ఒక చెట్టు కి బల్లి లాగా అతుక్కున్నడు.. రూబెన్స్ అతన్ని ఆశ్చర్యం గా చూస్తూ ఉన్నాడు .
విశ్వాస్...సరే నువ్వు మాకు ఎలా హెల్ప్ చేస్తావు అక్కడ జలపాతం దాటడానికి ఎటువంటి దారి లేదు కదా మరి ఎలా దారేది వెళ్లడానికి..???

సత్యమూర్తి....అన్ని దారులూ చూసారా అయితే గర్బ గుడి లో నుంచి కూడా వెళ్ళారా అంటూ నవ్వుతూ ఎగురుకుంటూ గుడి దగ్గరకు వచ్చి కూర్చొని దేవి కి దండం పెట్టుకొని విగ్రహం పక్కకి జరిపాడు..

ఉన్నట్టు ఉంది అక్కడ ఒక సొరంగం దాంట్లో నుంచి నీటి ధార కనిపించింది ..

అందరూ ఆశ్చర్యం గా చూస్తూ ఉన్నారు ..ఇదే దారి అంటూ సత్యమూర్తి అందులో దూకేశాడు .. విశ్వాస్ తన బృందం వైపు చూస్తూ అతను కూడా దూకేశాడు ..

విశ్వాస్ అందులో నుంచి ఆ జలపాతం లో కనిపించిన సొరంగం నుంచి బయటకు వచ్చాడు ...తన కళ్ళను తానే nammalekapoyadu అతని ఎదురుగా ఒక రాతి నడక ఉంది..

రూబెన్స్ , అతని వెనకాల జార్జ్ కూడా వచ్చేశారు... Wow సీనియర్ మనం చేరుకున్నాం అంటూ నవ్వుతున్నారు ..

విశ్వాస్.. హా కానీ ఆ మనిషి కనిపించటం లేదు బాయ్స్ అంటు చుట్టూ చూస్తున్నాడు..

ఆశ్న కూడా గుడి లో ఉన్న సొరంగం లో దూకింది ఆ నీటి ధార లో అటు ఇటు దొర్లుకుంటూ బయట పడింది కానీ తన తల ఒక బందరాయి కి గుద్దుకుంది...
ఆశ్న పైకి లేచి ఓహ్ నా తల అంటూ చెయ్యి పెట్టీ చూసుకుంది కాస్త రక్తం వస్తుంది . చేతికి తగిలిన రక్తం అక్కడ నీటిలో కడుక్కొని సీనియర్ పదండి ముందుకు అంటూ చెప్పింది..

విశ్వాస్ hmm నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ అందరూ ముందుకు వెళ్తున్నారు..
విశ్వాస్ కి వాళ్ళని ఎవరో ఫాలో అవుతున్న అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూశాడు ..అక్కడ వాళ్ళని తీసుకొని వచ్చిన డ్రైవర్ మైకేల్ ఉన్నాడు..

మైకేల్...హలో విశ్వాస్ సార్ ఎలా ఉన్నారు అంటూ తన భుజానికి ఉన్న బ్యాగ్ సరి చేసుకుంటున్నాడు.

విశ్వాస్...మైకేల్ నీ చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతున్నాడు. దానికి మైకేల్ మి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం తో మేడం కి అనుమానం వచ్చి చూసి రమ్మని నన్ను పంపించారు అని అబద్ధం చెప్పి ముందుకు నడుస్తున్నారు...

అలా అందరూ రెండు రాత్రుళ్ళు మూడు పగల్లు ప్రయాణం చేసి ఒక పురాతన మండపం కి చేరుకున్నారు . అది ఇప్పటి వెయ్యి స్తంభాల గుడి కంటే పెద్దగా ఉంది దాదాపు ఒక 50000 స్తంబాలు కొన్ని పడిపోయి ఉన్నాయి . అందరూ చుట్టూ చూస్తూ నడుస్తున్నారు..

జార్జ్ కి అక్కడ ఒక శిలా ఫలకం కనిపించింది . దాని మీద రాసిన అక్షరాలు చూసి అర్థం చేసుకొని చదువుతూ వెంటనే వద్దు ఎవరు ఆ మండపం లోకి వెళ్ళకండి అని గట్టిగ అరిచాడు..

కానీ ఆశ్న, రూబెన్స్ ఇంకా మైకేల్ మండపం మధ్యలో వెళ్లి నిలబడి ఉన్నారు...

విశ్వాస్...హేయ్ జార్జ్ ఏమైంది ఎందుకు వెళ్లొద్దు అంటున్నావ్ అని అతని దగ్గరకు వచ్చాడు..

ఇంతలో రూబెన్స్ వాళ్ళు కూడా ఎంటి అని రాబోయే లోపు ఒక పెద్ద గాలి మండపం మొత్తం చుట్టేసింది..

అక్కడ కిందపడి ఉన్న ఆకులు ఆ గాలి లో తిరుగుతూ 
మైకేల్ ఇంకా ఆశ్న నీ కత్తుల లాగా గుచ్చుతూ వాళ్ళ శరీరాల్ని జల్లెడ చేసి పడేశాయి . వాళ్ళు అక్కడే కుప్పకూలి పోయారు .
రూబెన్స్ భయం తో పరిగెత్తుకుంటూ బయటకు రాబోతుంటే ఉన్నట్టు ఉంది అతని తల ఎగిరి మండపం బయట పడింది.. అది దొర్లుకుంటూ విశ్వాస్ కాళ్ల దగ్గర వచ్చి ఆగింది...

కాసేపటికి గాలి ఆగిపోయింది ...తమ కళ్ల ముందే తమ స్నేహితులు చనిపోవడం తో జార్జ్ ఇంకా విశ్వాస్ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు..విశ్వాస్ రూబెన్స్ తల నీ చేతుల్లో తీసుకున్నాడు కానీ అది గాలి లో కలిసిపోయింది...

జార్జ్ ఏడుస్తూ సీనియర్ నేను ఇక్కడ రాసి ఉన్నది చదివాను ఇక్కడ ఉన్న ఆటంకం పంచభూతాలలో ఒకటి అయిన గాలి అది మన కంటికి కనిపించదు . గ్రహించలేరు ఎవరు అంచనా వేసే లోపు అంత అయిపోతుంది దీనిని దాటాలంటే తూర్పు పడమర రెండు దిక్కులో సూర్య చంద్రులు కనిపించాలి ఆ సమయం లో ఈ మండపం భూమి లోకి వెళ్ళిపోతుంది అప్పుడు మాత్రమే దాటాలి అని ఏడుస్తున్నాడు..

విశ్వాస్ సరే అని ఏడుస్తూ మన స్నేహితుల్ని బలి తీసుకున్న ఈ నిధి కనిపెట్టి తిరుతాను ఎలాగైనా అంటూ గట్టిగ అరుస్తూ ఏడుస్తున్నాడు...


కొద్ది సేపటికి చీకటి పడింది. ఇద్దరు అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నారు  ... అలా రాత్రి గడుస్తూ ఉండగా మెల్లగా ఆకాశం లో వెలుతురు వస్తు చీకటి తొలగిపోతుంది .. ఇద్దరి కళ్ళకి సూర్యచంద్రులు రెండు దిక్కుల్లో కనిపించారు.. ఆ సమయం లో మండపం భూమి లోకి వెళ్ళిపోయి మొత్తం ఒక ఏడరి గా అయిపోయింది .. ఇద్దరు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ అవతలి పక్కకు చేరుకున్నారు.. వెన్నక్కి తిరిగి చూసుకుంటే మండపం మెల్లగా బయటకు వస్తూ ఉంది.. ఆకాశం లో సూర్యుడు ఉదయిస్తు ఉన్నాడు...

విశ్వాస్ ఇంకా జార్జ్ వాళ్ళ స్నేహితులకి వీడ్కోలు చెప్పి ముందుకు కదిలారు...

జార్జ్ సీనియర్ ఇదంతా ఏదో సినిమా లో చూపించినట్టు చిక్కులతో కూడుకొని ఉంది మొదట సరదా గా ఉన్న మన వాళ్ళు చనిపోయిన తర్వాత భయం వేస్తుంది సీనియర్ మనం ఇద్దరం మాత్రమే ఉన్నాం అంటూ ఏడుస్తున్నాడు..

నాకు అర్ధం అయ్యింది జార్జ్ కానీ మన వాళ్ళు చనిపోయిన దానికి కారణం ఆ నిధి దానిని సాధించి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుందాం అంటూ విశ్వాస్ జార్జ్ నీ ఓదార్చి చెప్పాడు..

జార్జ్ ..నేను ఆ ఫలకం మీద చదివిన దాని ప్రకరం ఇప్పుడు మనం ఎదుర్కంటున్న ఇంకో గండం భూమి ఇంకా అగ్ని సీనియర్ అది కూడా దగ్గర్లో ఉంది అంటూ ముందుకు నడుస్తూ వెళ్తున్నారు..

అలా నడుస్తున్న వాళ్ళకి ఒక స్మశానం కనిపించింది . ఇద్దరు ఒక్కళ్ళ మొఖాలు ఒకరు చూసుకుంటూ స్మశనవాటికలో అడుగు పెట్టారు ..వాళ్ళ కాళ్ల కింద భూమి లోపలికి ఇంకిపోతు ఉండటం చూసి ఇద్దరు అక్కడ ఉన్న సమాదుల మీదకు ఎక్కి నిలబడ్డారు వాటిలో నుండి మంటలు రావడం మొదలు అయ్యాయి ఇద్దరు అల వాటి నుండి తప్పించుకుంటూ ముందుకు కదిలారు అల వెళ్తున్న వాళ్ళు సమాది మీద నుండి జారీ కింద పడ్డారు అప్పుడు విశ్వాస్ చెయ్యి భూమి లో ఇరుక్కుపోయింది..

జార్జ్ విశ్వాస్ నీ బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నాడు ..ఇద్దరు ఎంతో బలం గా చేతిని బయటకు లాగడానికి ఎంత సేపు ప్రత్నించిన రాలేదు . విశ్వాస్ చివరికి తన బ్యాగ్ లో నుండి ఒక కత్తి తీసి చేతిని నరికేసుకున్నడు...అది చూసి జార్జ్ సీనియర్ మీకు ఏమైనా మతి పోయింది ఎంటి చేతిని అల అంటూ అనేలోపు విశ్వాస్ తన నోరు ముయించి హ్మ్మ్ పద అంటూ అక్కడ నుండి లాక్కొని వెళ్లిపోయాడు...

జార్జ్ మాత్రం ఏడుస్తూ ముందుకు కదిలాడు.. అల ఇద్దరు ఒక కొండ పై ఎక్కి నిలబడ్డారు వాళ్ళ ఎదురుగా అవతల కొండ మీద కాళిక దేవి విగ్రహం ఉంది దాని చుట్టూ ఎత్తైన కొండలు కానీ వెళ్లడానికి దారి లేదు. ఇద్దరు అక్కడ కాసేపు విశ్రాంతి కోసం ఆగి ఉన్నారు.. జార్జ్ మెడికల్ కిట్ నుండి bandage తీసి విశ్వాస్ చేతికి కట్టు కట్టాడు...

ఇద్దరు అల పడుకొని ఉన్నపుడు ఆకాశం నుండి ఏదో మెరుపు లాంటిది వచ్చి వాళ్ళ దగ్గర పడింది...

జార్జ్...సీనియర్ అంటూ అరుస్తూ కింద పడిపోయాడు...

విశ్వాస్.. జార్జ్ ... జార్జ్ అంటూ అరుస్తూ వేరే పక్కకి పడిపోయాడు......

అలా ఇద్దరు మాయం అయిపోయారు.....

నిధి నీ చేరుకోడానికి ఆ నలుగురు మొదలుపెట్టిన యాత్ర అల ఆగిపోయింది ..
పంచభూతాల ఆధీనం లో ఉన్న ఈ నిధి నీ ఎవరు సాధిస్తారో చూడాలి....


తన భర్త కోసం సంధ్య ఏమి చేయబోతుంది...ఆ మిస్టరీ లేడీ బాస్ ఎవరు...???

అమ్మాయిల కిడ్నాప్ కి ఈ నిధి అన్వేషణ కి సంబంధం ఏమిటి...విక్రమ్ ఎక్కడ ఉన్నాడు...???

ఇంక ఈ కథలో వచ్చే కొత్త పాత్రలు ఎవరు ...???

వేచి ఉండండి...
For


Season...2.....

మీ అభిమాని....Jani fucker...$$$✓✓✓
Like Reply


Messages In This Thread
RE: నిధి రహస్యం... అంతు చిక్కని కథ... - by Jani fucker - 11-08-2022, 05:48 PM



Users browsing this thread: 23 Guest(s)