Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Maguva - Maya
#14
ఈ ఆలోచన ఎప్పుడైతే నాలో మొలకెత్తిందో, ప్రేమించే గుణం చచ్చిపోయింది, అదొక్కటే కాదు, ఇంకా చాలా లక్షణాలు కోల్పోయాను.  ఇంతకుముందు లాగ సానుభూతి చూపించలేకపోతున్నాను, జీవితం కష్టాలని కూడా ఇస్తుంది, అనుభవించాల్సిందే, అనుభవించండి అనే ముగింపుకు వచ్చేసాను, అప్పటివరకు దగ్గరకి తీసుకున్న వాళ్ళ మీద మమకారం చంపుకోవడానికి ప్రయత్నిస్తూ, ఎక్కువ ఎవరికీ దగ్గర అవకుండా, అందరి మధ్యలో ఉంటూ ఎవరికీ అందకుండా ఉంటూ, అచంచలంగా మారిపోయాను, ఒక బండ రాయి లాగా.

 
నా వంద శాతం ప్రేమించే శక్తిని తనకే ఇచ్చేసాను, ఇంకొకళ్ళ మీద చూపించడానికి నా దగ్గర ప్రేమ లేదు. ఇష్టం మాత్రమే ఉంది. తను వెళ్ళిపోతూ ప్రేమించే తత్వాన్ని తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు నిన్ను ప్రేమించట్లేదు నేను, ఇష్టం, ఇష్టపడుతున్నాను అంతే, ఈ గందరగోళంలో నిన్ను ఇరికించి బాధితురాలిని చెయ్యడం నాకిష్టం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం కావ్య, భూమి మీద ఉన్న ప్రతి మనిషి మారిపోతాడు, ఆ మార్పు మనకు బాధని మాత్రమే మిగుల్చుతుంది, అది కలుగకూడదు అంటే మనుషులకు దూరంగా ఉండాలి అనే బలమైన అభిప్రాయంతో ఉన్న నన్ను, నీ ఓదార్పు, నీ మాటలు, నీ ఒడి, నీ తోడు మాత్రమే మార్చాయి. ఆ చీకటి నుంచి బయటకు తీసుకురాగలిగాయి కానీ ప్రేమించే గుణాన్ని తిరిగి ఇవ్వలేకపోయాయి. ఇప్పటికి, నీతో ఇంత దూరం నడిచాక కూడా నాలో కలత తీరలేదు, వెలితి పోలేదు. బహుశా, తన దగ్గరే ఉండిపోయాయి అనుకుంట.
 
మనసులో ఇదంతా పెట్టుకుని, నీతో గడుపుతుంటే నిన్ను మోసం చేస్తున్నాను అనే భావన ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు నన్ను, నా జీవితానికి ఒక వెలుగు రేఖను ప్రసాదించిన దేవతవి నువ్వు, నీతో ఇలా సగం సగం ఉండలేను. చాలా ప్రయత్నించాను, నీ మాయలో పడి తనను మర్చిపోవడానికి, నీతో ఇంకో వందేళ్లు ఉంటే మారతానో మారనో కూడా వివరం, నమ్మకం రెండు లేవు నా దగ్గర. తనను మర్చిపోవడానికి నిన్ను వాడుకుంటున్నాను అనే ఆలోచన నన్ను లోలోపల కోసేస్తుంది. నా శాయశక్తులా ప్రయత్నించాను, నీతో మనస్ఫూర్తిగా గడపడానికి, దానికి నేను చెయ్యగలిగిన ప్రతి పని చేసాను, అది శారీరికంగా కానివ్వు మానసికంగా కానివ్వు, ప్రతి క్షణం, నీకు ఏది ఇంపార్టెంట్, ఏది కోరుకుంటున్నావు, ఏది ఉంటె నువ్వు సంతోషంగా ఉంటావు, ఇలా అన్ని ఆలోచిస్తూ అనిపించినా ప్రతి పని చేసాను, చేస్తున్నాను. చివరికి, ఇదంతా నిన్ను మోసం చేస్తున్న కాబట్టి పరిహారంగా చేస్తున్నానా, నిజంగా నీ మీద ఇష్టం తో చేస్తున్నానా? అనేది తెలియని అయోమయం లో పడిపోయాను. నీ మీద ఇష్టమే ఉందా? తనను ప్రేమించినట్టు నిన్ను ప్రేమించలేనా?
 
నువ్వు చెప్పు నన్ను ఏమి చేయమంటావు. నీతో ఏడడుగులు నడవడానికి నాకేం ఇబ్బంది లేదు, కానీ నీలాంటి అమ్మాయికి నేను సరికాదు, నీది స్వచ్ఛమైన ప్రేమ కాబట్టే ఆగాధంలో ఉన్న నేను బయటకు రాగలిగాను, మళ్ళి ఈ ప్రపంచాన్ని అందంగా చూడగలుగుతాను అనుకోలేదు. కానీ నా చుట్టూ ఉన్న ఒక వలయం లోపల ఉండి చూస్తున్నాను అని, ఆ వలయం తను అని, ఇది నేను దాటగలిగేదు కాదు అని తెలుసుకోవడానికి ఇంత సమయం పట్టింది నాకు. నీకోసం, నీ ప్రేమ కోసం, అది అందుకునే అర్హత ఉన్నవాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అనేది నా అభిప్రాయం.
 
 
తన పేరు ఏంటి?
 
 
వద్దు కావ్య, అడగామాకు, చెప్పే ధైర్యం నాకు లేదు, అది మళ్ళి మళ్ళి వినాలి అనిపించే పేరు కాదు, ఆ పేరు వింటే వెన్ను లో వణుకు పుడుతుంది నాకు.
 
సరే అడగను, ఇది చెప్పు, ఇన్నాళ్లు నువ్వు నాతో ఉన్నదీ నాతో చేసింది నాలో తనను ఊహించుకున్నావా? అని అడిగింది కావ్య
 
లేదు, నీలో తనను ఊహించుకోలేదు, తనను మర్చిపోవడానికి నీ మాయలో పడడానికి ప్రయ్నతించాను, కుదరలేదు.
 
జీవితాన్ని తనతో చూసావు, నాతో చూసావు, ఏది నచ్చింది నీకు? అని అడిగింది.
 
తనతో చూసింది ఒక ఎత్తు, నీతో చూసింది ఒక ఎత్తు. నీతో వెళ్లిన దూరంలో పావు వంతు కూడా తనతో వెళ్ళలేదు, ఇన్ ఫాక్ట్, తనకు నాకు సెక్స్ జగరలేదు, తనను ఒక్కసారి కౌగిలించుకున్నాను, ముద్దు పెట్టుకున్నాను అంతే. నీతో సహజీవనం చేసాను కావ్య. తనతో శారీరికంగా కలిసి ఉంటె ఆ ఫీలింగ్ ఎలా ఉండేదో తెలిసేది నాకు, తెలుసుకోవాలని ఉంది. జీవితం అంటావా, అది కూడా ఒక అంచనా మాత్రమే, తనతో కలిసి గడిపిన క్షణాలు చాలా తక్కువ. ఎక్కువ శాతం ఫోన్ లోనే ఉండేది మా సంభాషణ, ప్రేమ, కోపాలు, ఆప్యాయతలు.
 
మన ఇన్నాళ్ల పరిచయంలో మనం పొందిన అనుభూతిలో, చేసిన పనుల్లో ఏవి కూడా తనను మర్చిపోయేలా చెయ్యలేదు అంటున్నావు అంతేనా?
 
అంతే కావ్య.
 
సరే, సాధ్యమైనంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నువ్వు కోరుకున్నట్టే ఇంకో మనిషిని చూసి పెళ్లి చేసుకుంటాను, నువ్వు వీలైనంత త్వరగా తన నుంచి బయటకు వస్తే నీకు నీ ఆరోగ్యానికి చాలా మంచిది, అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది.
 
నాలుగు రోజుల తర్వాత వచ్చింది ఒక సాయంత్రం, బట్టలు, తన సామాన్లు అన్ని సర్దుకుని ఇల్లు ఖాళి చేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్లిపోయింది. ఇల్లంతా బోసిపోయింది, ఇన్నాళ్లు ఇంట్లో తిరిగిన మనిషి ఇప్పుడు లేదు, హాల్ లో సోఫా, వంట గదిలో ప్లాట్ఫారం, బెడ్ రూంలో మంచం, బాల్కనీలో కుర్చీలు అన్ని నిశబ్దంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒంటరితనం నాకేమి కొత్త కాదు, ఇక్షిక ఎప్పుడో పరిచయం చేసింది, చుట్టూ జనాలు ఉన్నా కూడా ఒంటరితనం లో బ్రతికిన నాకు కావ్య ఇచ్చిన ఈ బహుమతి పెద్ద బాధగా లేదు. అలవాటు అయిన మనిషి ఇంట్లో లేకపోతే ఒక వెలితి ఉంటుంది, ఆ వెలితి ఇబ్బందిగా అనిపిస్తుంది.
 
వర్క్ ఫ్రొం హోమ్ ఉండడం, ఆఫీస్ కి వెళ్లి కావ్య ని పలకరించడం లాంటివి లేకపోవడం, కావ్యతో మాట్లాడే అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను అప్పటికి, ఎలా ఉన్నావు, ఎం చేస్తున్నావు, ఇంట్లోకి ఏమైనా కావాలా అంటూ, అప్పుడప్పుడు కొనుక్కుని వెళ్తున్నాను పచారీ సామాన్లు లాంటివి. ఒక స్నేహితురాలుగా చూస్తున్నాను, ఇప్పుడు మనసు కొంచెం స్థిమితపడింది, ప్రేమ లేని చోట కలయిక ఉన్నా ఆ కలయిక కి అర్ధం ఉండదు, కామం మాత్రమే ఉంటుంది అనేది నా అభిప్రాయం. కావ్య ని కామానికి పరిమితం చెయ్యడం కంటే స్నేహితురాలుగా చూస్తుంటే ప్రశాంతంగా ఉంది. అలా అని తన మీద ఆ ఆలోచనలు రావట్లేదా అంటే వస్తున్నాయి కానీ అర్ధం లేని ఆలోచనలు అనుకుంటూ నాకు నేనే సర్దిచెప్పుకుంటున్నాను.
 
మూడు నెలల వ్యవధిలో తనకు పెళ్లి కుదిరింది. ఈ మాట వినగానే సంతోషంగా అనిపించింది, మొత్తానికి తన జీవితంలో ఒక పెద్ద మెట్టు ఎక్కబోతుంది అని.
 
కానీ ఏదో మూల ఒక చిన్న బాధ, ఇప్పటివరకు కావ్య కి నాకు మధ్యలో ఎవరు లేరు ఎలాంటి గీతాలు లేవు, ఇప్పుడు తనకు భర్త ఉంటాడు, పరిధి ఉంటుంది, పరిధి లేని స్నేహం కావాలి నాకు. అది దొరుకుందా దొరకదా అని సందేహం. తను నానుంచి వెళ్ళిపోయినప్పుడు కంటే, ఇప్పుడు కలుక్కుమనింది మనసులో.
 
మూడు నెలలు లో పెళ్లి, చెప్పి వెళ్ళింది.
 
పెళ్ళికి ఏదైనా బహుమతి ఇద్దాం అని షాపింగ్ కి వెళ్లాను. ఏదైనా గొలుసు కొందామని చూస్తున్నాను. నాలుగు షాప్ లు తిరిగి ఒక గొలుసు సెలెక్ట్ చేసాను, ప్యాక్ చెయ్యమని చెప్పి బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్తుంటే ఎదురుగా ఇక్షిక. ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం ఆగిపోయింది, లో బీపీ వచ్చినట్టు వొళ్ళంతా చెమటలు పట్టడం, ఒక్కసారిగా చుట్టూ చీకటి అయినట్టు అనిపించడం, కళ్ళు తిరుగుతున్నట్టు నీరసం రావడం, పక్కనే ఉన్న కుర్చీ లో కూలబడిపోయాను.
ఇక్కడ ఈ ఊరిలో ఎం చేస్తుంది, అసలు ఇక్కడ ఎందుకు ఉంది, పెళ్లి అయిపోయిందా, పెళ్లి అయిపోయి ఇటు వచ్చిందా, పెళ్లి అవలేదా? ఉద్యోగ రీత్యా వచ్చిందా ఇక్కడికి? నాకు తెలిసి చుట్టాలు ఎవరు లేరు కదా, మరెందుకు వచ్చింది? ఏదైనా పని మీద వచ్చిందా? ఎన్ని రోజులు ఇక్కడ ఉంటుంది? మళ్ళి కనిపిస్తుందా? కనిపిస్తే నా పరిస్థితి ఏంటి? వందల ఆలోచనలు ఒకేసారి పరిగెడుతున్నాయి మనసులో..
 
తను నన్ను చూస్తే? వచ్చి పలకరిస్తే? నా వల్ల కాదు, తట్టుకోలేను, వెంటనే వెనక్కు తిరిగిపోయాను. చిన్నగా అక్కడనుంచి లేచి పక్కకు వెళ్ళిపోయాను. ఇప్పుడు తను కూడా ఇటే వస్తే? ఇంకా భయం ఎక్కువైంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, బాత్రూం లోకి వెళ్ళిపోయాను. ఒక పావుగంటసేపు అలానే ఉన్నాను.  స్తమితపడ్డాక, మొహం కడుక్కుని బయటకు వచ్చాను, తను వెళ్లిపోయింది. హమ్మయ్య అనుకుంటూ, బిల్ పే చేసి గొలుసు తీసుకుని వచ్చేసాను.
 
పెళ్ళికి వెళ్లాను. పెళ్లి కూతురుగా ముస్తాబయ్యాక చాలా అందంగా ఉంది కావ్య. పెళ్ళి అప్పుడు అందంగా కనిపించాలని కొంచెం వొళ్ళు వచ్చేవి పెడతారు ఆ వారం పది రోజులు, దాని ఫలితం అనుకుంట, బొద్దుగా ముద్దుగా ఉంది. పలకరించాను, కాసేపు కూర్చున్నాను. భోజనం చేసి బయలుదేరాను. కార్ స్టార్ట్చ్ చేసి వెళ్లిపోతుంటే కావ్య నుంచి ఫోన్ వచ్చింది. పంక్తి భోజనాల దగ్గర ఉన్నాను, ఒకసారి రమ్మని సారాంశం. వెళ్లాను, నవజంట భోంచేస్తున్నారు, నన్ను చూసి తిన్నావా అని అడిగింది, తిన్నాను అని బదులిచ్చాను. తిన పేరు ఇక్షిక అని చూపించింది, ఇక్షిక అనే పేరు వినగానే వెన్నులో వణుకు పుట్టింది, కానీ తను వేరు తిను వేరు, ఒక్క క్షణం ఊపిరి పీల్చుకున్నాను. నమస్కారం అండి అని పలకరించాను. తను మన ఆఫీసులో కొత్తగా జాయిన్ అయింది, నేను ఉండే పిజి లోనే ఉంటుంది, రేపే తన జాయినింగ్, నేను మ్యారేజ్ లీవ్ లో ఉన్నాను కదా, నువ్వుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది అని పరిచయం చేస్తున్నాను అనింది. సరే, హెచ్అర్ కి ఒక మాట చెప్తాను, ఏదైనా ఇబ్బంది ఉంటె ఒక మెసేజ్ కానీ కాల్ కానీ చెయ్యండి అని చెప్పి నా నెంబర్ ఇచ్చి వచ్చేసాను ఇంటికి.
 
ఆఫీసుకు వచ్చి పని చేసుకుంటున్నాను, మధ్యాహ్నం అయింది, ఈ అమ్మాయి సంగతి ఏంటో చూద్దాం అని హెచ్ అర్ సెల్ వైపు వెళ్లాను, తను గల గల మాట్లాడుతూ నవ్వుతు జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తుంది, ఇదేంటి, కావ్య అలా చెప్పింది ఈ అమ్మాయి అల్లుకుపోతుంది అని ముక్కున వేలేసుకున్నాను. లంచ్ కి వెళ్ళేటప్పుడు పిలిచాను, ఒకళ్ళే ఉన్నారా ఎవరైనా కంపెనీ ఉన్నారా అని, ఇందాక కొంతమంది పరిచయం అయ్యారు, పర్లేదు మీతో వస్తాను అనింది. ఈ లోపు ఆ కొంతమంది పరిచయస్తులు ఇక్షిక దగ్గరకి వచ్చి వెళ్దామా అన్నారు, నాకు వాళ్ళు పరిచయం ఉన్నారు కానీ పెద్ద స్నేహితులు కాదు, ఈ పిల్ల ఒక పూటలోనే బ్యాచ్ ని
మెయింటైన్ చేస్తుంది, మనము ఉన్నాం పప్పు సుద్దల్లాగా అనుకున్నాను. సరే, వాళ్ళతో వెళ్ళండి, నేను మా వాళ్ళతో వెళ్తాను అని చెప్పి, మిగతా వాళ్లకి హాయ్ చెప్పి జారుకున్నాను. తర్వాత తెలిసింది, తను వేరే ప్రాజెక్ట్ అని. పోన్లే అనుకున్నాను. కొన్నాళ్ళు తనను చూసాక, తను మా ప్రాజెక్టులోకి వస్తే బాగుంటుంది అనుకున్నాను. తన చలాకీతనం, పని చేసే గుణం ఇవన్నీ కట్టిపడేశాయి నన్ను, నా ఇక్షిక కూడా ఇలానే ఉంటుంది. అచ్చు గుద్దినట్టు, మొహ కవళికలు, వ్యవహార శైలి, బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా అలానే ఉన్నాయి. అది కూడా ఒక కారణం అనుకుంట, తను నా ప్రాజెక్ట్ లోకి రావాలి అని కోరుకోవడానికి.
 
ఎప్పటిలాగే సాయంత్రం కావ్య ని కలిసినప్పుడు మాటల్లో ఇదే చెప్పాను, ఇక్షిక అచ్చం నా ఎక్స్ లాగా ఉంది, పైగా పని బాగా చేస్తుంది, మా ప్రాజెక్టులో ఉంటె బాగుంటుంది అని, తన ప్రస్తుత ప్రాజెక్టు పూర్తి కావొస్తుంది, ఒకసారి మేనేజర్ ని అడుగు, అవకాశాలు ఉన్నాయి అని చెప్పింది.
 
మేనేజర్ తో మాట్లాడి అంత సెట్ చేసాను, ఆ ప్రాజెక్ట్ ముగియగానే, బెంచ్ ఏమి లేకుండా మా ప్రాజెక్ట్ లోకి తీసుకున్నాము. అప్పుడు మొదలయింది ఈ గోల అంత.
 
 
 
 
 
 
******
 
 
 
 
నేను: ఏం మాట్లాడుతున్నావు కావ్య, నాకేం అర్ధం కావట్లేదు, నీకైనా పిచ్చి పట్టి ఉండాలి, నాకైనా పిచ్చి పట్టి ఉండాలి.
కావ్య: ఇదిగో, నీ ఫోన్, ఇందులో ఇక్షిక ఫోటో ఒక్కటైనా ఉందా? చూపించు, పోనీ కనీసం తన ఫోన్ నెంబర్ అయినా ఉందా?
నేను: నా దగ్గర ఇక్షిక ఫోటో లేదు, దిగలేదు, తనకు ఇష్టముడవు ఫోటో లు దిగడం.
కావ్య: సరే, తనకు కాల్ చెయ్యి.
నేను: నెంబర్ ఇందులోనే ఉండాలి, డిలీట్ అయిపోయిందా ఏంటి? కనిపించడం లేదు..
కావ్య: నెంబర్ డిలీట్ అయినా కూడా కాల్ హిస్టరీ లో రికార్డ్స్ ఉంటాయి గా, ఫీడ్ చెయ్యని నంబర్స్ ని ట్రూ కాలర్ లో చెక్ చెయ్యి, నెంబర్ చూపించు నాకు ఇక్షిక ది చాలు, నేనేం మాట్లాడను.
 
ఎంత వెతికిన నాకు తన నెంబర్ కనిపించట్లేదు, ఫోన్ చేసిన దాఖలాలు లేవు, అంత అస్థవ్యస్థనంగా ఉంది, అసహనంగా ఉంది, కోపం వస్తుంది. నా అవస్థను గమనించిన పార్థసారథి గారు,
 
కావ్య, ఇన్ని రోజులు డాక్టర్ పేషెంట్ కాంఫిడెన్షియాలిటీ అనే నియమాన్ని గౌరవిస్తూ నేను ఇది నీకు చెప్పలేదు. ఈ రోజు విభా ప్రాణాల మీదకు వచ్చింది కాబట్టి చెప్పక తప్పట్లేదు, విభా కు పారనోయిడ్ స్కీజోప్రినియా ఉంది, ఈ జబ్బు ఉన్నవాళ్లు లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఊహించుకుంటూ ఉంటారు, లేని శబ్దాలని వింటారు, కనిపించని పాత్రలతో స్నేహం చేస్తారు, ఊహల్లో ఉంటూ అదే నిజం అని భ్రమ పడుతూ ఉంటారు, ఏది నిజమో ఏది అబద్ధమో అవగాహన ఉండదు, ఆలోచనలు స్థిమితంగా ఉండవు, విపరీతమైన యాంగ్జైటీ ఉంటుంది. దానికి తోడు విభా సిగరెట్ లు మందు విరివిగా తాగుతుండడం వల్ల ఈ లక్షణాలు మరింత బలంగా మారాయి.
 
మతి ఉండే మాట్లాడుతున్నారా, నేనేంటి ఊహించుకోవడం ఏంటి అని డాక్టర్ మీద అరిచాను, అయినా నువ్వెంటి కావ్య రోజు నన్ను ఆఫీస్ లో చూస్తూనే ఉన్నావు కదా, అలా ఉన్నానా నేను? నీకు నేను ఎన్నేళ్లుగా తెలుసు, నాలో ఈ మార్పు ఎప్పుడైనా కనిపించిందా నీకు అని అడిగాను.
 
అసలు నువ్వు ఆఫీస్ కు ఎక్కడ వస్తున్నావు విభా?? దాదాపు సంవత్సరం నుంచి ఇంటి నుంచే పని చేస్తున్నావు, అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇంటి నుంచి ఆఫీస్ కి ఆఫీస్ నుంచి ఇంటికి డ్రాప్ చేస్తావు, ఇంటికి రమ్మంటే రావు, మళ్ళి వస్తా అని తప్పించుకుంటూ వెళ్ళిపోతావు, నువ్వు ఆఫీసుకు వెళ్లట్లేదు, ఆఫీస్ లో ఇక్షిక అనే అమ్మాయి లేదు. ఇది నిజం, ఇదే నిజం అని చెప్పింది.
 
మౌనంగా ఉండిపోయాను.
 
పార్ధసారధి గారు చెప్పడం మొదలుపెట్టారు, ఇది నువ్వు ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే ట్రీట్మెంట్ అంత తేలికగా ఉంటుంది విభా. ఆ రాత్రి నుంచి ఈరోజు మధ్యాహ్నం వరుకు అపస్మారక స్థితిలో ఉన్నావు, ఆ టైములో నీ ఊహలు ఎంత వేగంగా పరిగెత్తి ఉంటాయో నేను ఊహించుకోగలను, ఆ సాయంత్రం అంటే కావ్య పుట్టిన రోజు, కావ్య ని ఇంటి దగ్గర దింపడం నిజం, ఉదయం నువ్వు లేచిన దగ్గరనుంచి ఎం జరిగిందో నాకు చెప్పగలవా? ప్రతి సూక్ష్మ విషయం తో సహా, మొత్తం చెప్పు అన్నారు. కావ్య ని దింపి వైన్ షాప్ లో కొత్త రకం బీర్ కొన్న దగ్గర్నుంచి ఫ్లైట్ క్రాష్ అయ్యేవరకు మొత్తం చెప్పను. ఉక్రెయిన్ లో నాకు ఇక్షిక కి జరిగిన మొదటి రాత్రి విషయం తో సహా పూస గుచ్చినట్టు అడిగి మరి చెప్పించుకున్నారు.
 
మిగతా అన్ని రోజులు వదిలేద్దాము, బీర్ తీసుకుని ఇంటికి వచ్చావు, తాగడం మొదలు పెట్టావు, కరెంటు పోయింది, ఇన్వెర్టర్ ఉంది కాబట్టి టీవీ ఆగలేదు, కానీ ఇంటర్నెట్ పోయింది కాబట్టి వీడియో బఫర్ అవుతుంది, మోకాళ్ళు వరుకు నీళ్లు నిలిచేంత వర్షం లో జొమాటో ఆర్డర్ ఎలా వస్తుంది విభా? సరే వచ్చింది అనుకుందాం, కరెంటు లేదు అనేది ఇంట్లోనుంచి బయటకు వచ్చేటప్పుడు నీకు గుర్తుంది కాబట్టి మెట్లు దిగి వెళ్ళావు అనుకుందాం, జొమాటో వాడికి పాత వంద నోటు ఎలా ఇచ్చావు? నీ దగ్గరకు పాత నోటు ఎలా వచ్చింది? నువ్వు వైన్ షాప్ లో పే చేసింది ఫోన్ పే నుంచి కదా అంటూ ఫోన్ ట్రాన్సాక్షన్ చూపించాడు. పైకి వచ్చేటప్పుడు లిఫ్ట్ లో వచ్చావు, అంటే కరెంటు వచ్చి ఉండాలి, మరి వీడియో ఎందుకు ఇంకా బఫర్ అవుతూనే ఉంది? సరిగ్గా అదే టైం కి ఉక్రెయిన్ లో గొడవలు అంటూ కధనాలు విని ఉన్నావు కాబట్టి నీ మనసు దానికి అనుగుణంగా ఊహించుకోవడం మొదలు పెట్టింది. పొద్దున్న ఆఫీసుకు తీసుకెళ్లామని ఇక్షిక ఫోన్ చెయ్యడం, నువ్వు బైక్ వేసుకుని వెళ్లడం, నీ దగ్గర బైక్ ఎక్కడుంది విభా? ఇంతకుముందు తేజ నువ్వు కలిసి ఉన్నప్పుడు ఉండేది, ఇప్పుడు తేజ పెళ్లి చేస్కుని విడి కాపురం పెట్టాడు, తనకు ఇచ్చేసావు కదా, నీకు ఎక్కడ నుంచి వచ్చింది బండి?
 
ఆఫీసులో ఇక్షిక ని ఇక్షిక బట్టలని చూసి, నీ వొళ్ళు చల్లబడడం, చెమటలు పట్టడం, ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కి అవడం ఇవన్నీ నువ్వు అపస్మారక స్థితి నుంచి కోమా లోకి వెళ్ళేటప్పుడు ఫిసికల్ గా జరిగే లక్షణాలు, ఇవి నువ్వు ఆపలేవు కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక సిట్యుయేషన్ సృష్టించుకున్నావు. ఉదయం నన్ను కలవాల్సిన నువ్వు కలిసావా లేదా అని కనుక్కోవడానికి కావ్య కాల్ చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చెయ్యలేదు, పలుమార్లు చేసి నువ్వు పలకకపోయేసరికి కంగారుగా ఇంటికి వచ్చిన కావ్య కి పడుకున్నావో స్పృహ లేకుండా పడి ఉన్నవో తెలుసుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. వెంటనే అంబులెన్సు లో నిన్ను తీసుకొస్తుంటే ఆ అంబులెన్సు శబ్దాలని నువ్వు ఇక్షిక లంచ్ కి వెళ్ళేటప్పుడు పక్కన వెళ్తున్న ఒక ప్రభుత్వ అధికారి కాన్వాయ్ అని ఊహించుకున్నావు. ఇలా నీ భౌతిక కాయానికి జరిగే ప్రతి దానికి అనుగుణంగా ఒక సిట్యుయేషన్ ని ఒక ప్రాంతాన్ని సృష్టించుకుంటూ వెళ్ళిపోయావు. నువ్వు ఉక్రెయిన్ వెళ్లడం అక్కడ మీటింగ్ క్యాన్సల్ అవడం, తర్వాత గొడవలు జరగడం, సురక్షితంగా ఇంటికి రావడం, ఇదంతా నీ భౌతిక దేహానికి పక్కనున్న టీవీ లో వార్తలు చదివే వాళ్ళు వర్ణిస్తూ చెప్పడం, అది నీకు లీలగా విన్పించింది కాబట్టి, ఈ నాలుగు రోజులు నువ్వు ఈ వార్తలకు తగ్గట్టు ఊహించుకున్నావు.
 
నువ్వు కేవలం దిగులు చెందుతున్నావు, కొంచెం మీకు చేతనైన సాయం చెయ్యండి అని కావ్య నీ గురించి నాకు చెప్పినప్పుడు, ఇదంతా ఎందుకు ఊహించుకున్నావు? ఇలాంటి పరిస్థితిలో ఎలా చిక్కుకున్నావు? ఇది తెలియాలి అంటే నీ గతం తెలియాలి, నీ మాటల్లో నీ కథ విన్నాను, దాని విశ్లేషణ ఇదంతా.  ఇది డిప్రెషన్ తాలూకు సమస్య అనుకున్నాను. నీ మాటల్లో నీ గతం విన్నాక, నువ్వు ఇక్షిక ని కేవలం ప్రేమించి ఊరుకోలేదు, తనతో ఒక ప్రపంచాన్ని ఊహించుకున్నావు, అది నీకు బాగా నచ్చేసింది, తను లేదు అనే వాస్తవం జీర్ణించుకోలేకపోయావు, ఈ బాధ నిన్ను మింగేస్తుంటే, తప్పించుకోవడానికి కావ్య చుట్టూ తిరిగావు, నీ మనస్సాక్షి సందిగ్ధంలో పడిపోయింది, నీలో నీకే ఘర్షణ, ధర్మాధర్మాలు ఒక పక్క, భావోద్వేగాలు ఒక పక్క, తప్పు చేసిన పర్లేదు సుఖం దొరుకుతుంది, ఆ బాధని తప్పించుకునే అవకాశం దొరుకుతుంది అనే నార్సిసిజం వాదన ఒక వైపు, నీ సమస్యల్లోకి ఇంకో మనిషిని లాగుతున్నావు, పరాన్నజీవి లాగా బలిపశువుని చేస్తున్నావు  అని వర్చువస్ వాదన ఒక వైపు. ఈ రెండిటి మధ్య నలిగిపోతున్న నీకు, ఒక రోజు కావ్య ముఖాముఖీ అడిగేసరికి ఒప్పుకుని తప్పుకునున్నావు.
 
అది తేరుకునేలోపు, ఇన్నాళ్లు అలవాటు అయిన కావ్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది అనే వార్త తెలిసిన రోజున మళ్ళి ఇదే అగాధంలో పడిపోతాను అనే భయం ఆందోళన నీలో మొదలయ్యాయి, ఆరోజు పెళ్ళికి వెళ్ళేటప్పుడు కావ్య కి గొలుసు కొనడానికి వెళ్ళావు కదా, ఆ రోజు షాపులో ఇక్షిక ని ఊహించుకున్నావు, అదే మొదటిసారి, నువ్వు నిజానికి ఊహ కి తేడా తెలుసుకోలేని స్థితిలో పడిపోవడం. ఆరోజు కూడా నీకు లో బీపీ వచ్చినట్టు గుండె కొట్టుకోవడం ఒక్క క్షణం ఆగిపోయినట్టు అనిపించడం ఇదంతా దాని ప్రభావం. పదే పదే ఇక్షిక ని ఊహించుకుంటూ నువ్వు బ్రతకలేవు, తను నీతో ఉండాలి అంటే, ఇంట్లో వాళ్ళని కాదనాలి, అది జరిగే పని కాదు, కాబట్టి, కావ్య పెళ్లి లో ఇంకో అమ్మాయి, కొంచెం ఇక్షిక పోలికలతో ఉండడం వల్ల తనను ఊహించుకోవడం మొదలు పెట్టావు, ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర కావ్య నిన్ను పిలిచినట్టు ఇక్షిక అని నీకు పరిచయం చేసినట్టు ఇదంతా కూడా నీ ఊహ మాత్రమే. ఈ జబ్బు ఇంత వేగంగా పెరగడానికి ముఖ్య కారణం ఏంటో చెప్పనా? ఇంట్లో ఒక్కడివే ఉండడం, సిగరెట్ లు కాల్చడం, రాత్రి అవగానే మందు తాగడం, ఇవి ఇచ్చే మత్తు, నీ ఊహలకు ఆద్యం పోశాయి.
 
ఇంకో విషయం ఏంటంటే, నీ ఆలోచనల లోతుల్లో, ఒక కోరిక మిగిలిపోయింది, నువ్వు ఇక్షికని ఎంతలా ప్రేమిస్తున్నావో చెప్పాలి అనుకుని చెప్పలేకపోవడం. వస్తువులు కొనివ్వడం, కోరుకున్నవి తీర్చడం, ఉన్నత స్థితిలో వాళ్ళని ఉంచడం, కావాల్సినంత స్వతంత్రం ఇవ్వడం, ఇవన్నీ నాగరికత నేర్పినవి. డీప్ లేయర్స్ లోకి వెళ్తే, ఒక మనిషిని ఎంత ప్రేమిస్తున్నాం అనేది, కలయిక ద్వారానే తెలుపగలం. అఫ్ కోర్స్, ప్రేమ అంటే పైన చెప్పినవన్నీ ఉండాలి, కానీ ఒక మగ మనిషి ఒక ఆడ మనిషి కలిసినప్పుడు, శరీరాలు కలిసిపోయినప్పుడు, కొద్ది క్షణాలు మేము ఇద్దరము రెండు శరీరాలు కావు, ఇద్దరిది ఒకటే శరీరం ఒకటే ఆత్మ అనే భావన కలుగుతుంది, ఇద్దరం కాదు ఇద్దరం కలిపి ఒకటే అని చెప్పగలిగే ఈ చర్య కి భాష అవసరం లేదు, శబ్దాలు అవసరం లేదు, అసలు మాట్లాడాల్సిన పని లేదు, ఇది పరస్పర భావన, నీకు ఎలా అనిపిస్తుందో తనకు అలానే అనిపిస్తుంది, ఇది వాళ్ళ కళ్ళలో చూసినప్పుడు ఇదే కదా ప్రేమంటే అనే భావన కలుగుతుంది, దాన్నే యూనిఫికేషన్ అఫ్ బాడీస్ అండ్ స్పిరిట్ అంటారు. అది నీకు ఇక్షిక తో కలగలేదు, కలిగే అవకాశం రాలేదు. దానికోసం నీ మనసు పరితపించిపోయింది. లోలోతుల్లో దాగున్న ఆలోచన అవడం వల్ల నీ గురించి నీకు అంత తెలుసు అని నువ్వు అనుకున్నా కూడా ఇది పసిగట్టలేకపోయావు. హిప్నోసిస్ ట్రీట్మెంట్ లో నేను తెలుసుకున్న విషయం ఇది.
[+] 6 users Like moodyfyed's post
Like Reply


Messages In This Thread
Maguva - Maya - by moodyfyed - 26-07-2022, 02:29 AM
RE: Maguva - Maya - by moodyfyed - 26-07-2022, 02:31 AM
RE: Maguva - Maya - by moodyfyed - 26-07-2022, 02:34 AM
RE: Maguva - Maya - by moodyfyed - 26-07-2022, 02:36 AM
RE: Maguva - Maya - by ramd420 - 26-07-2022, 05:21 AM
RE: Maguva - Maya - by krantikumar - 26-07-2022, 06:12 AM
RE: Maguva - Maya - by appalapradeep - 26-07-2022, 08:08 AM
RE: Maguva - Maya - by DasuLucky - 26-07-2022, 05:20 PM
RE: Maguva - Maya - by DasuLucky - 26-07-2022, 06:22 PM
RE: Maguva - Maya - by BerlinLaCasa - 08-08-2022, 12:18 AM
RE: Maguva - Maya - by moodyfyed - 08-08-2022, 12:25 AM
RE: Maguva - Maya - by moodyfyed - 08-08-2022, 12:28 AM
RE: Maguva - Maya - by moodyfyed - 08-08-2022, 12:28 AM
RE: Maguva - Maya - by moodyfyed - 08-08-2022, 12:29 AM
RE: Maguva - Maya - by moodyfyed - 08-08-2022, 12:29 AM
RE: Maguva - Maya - by TheCaptain1983 - 08-08-2022, 02:10 AM
RE: Maguva - Maya - by neerathemall - 10-08-2022, 12:06 PM
RE: Maguva - Maya - by MrKavvam - 08-08-2022, 09:44 AM
RE: Maguva - Maya - by K.R.kishore - 08-08-2022, 01:52 PM
RE: Maguva - Maya - by appalapradeep - 08-08-2022, 06:12 PM
RE: Maguva - Maya - by Saikarthik - 08-08-2022, 06:58 PM
RE: Maguva - Maya - by Uday - 08-08-2022, 07:09 PM
RE: Maguva - Maya - by Rajanilatha - 09-08-2022, 09:47 PM
RE: Maguva - Maya - by ramd420 - 08-08-2022, 10:32 PM
RE: Maguva - Maya - by BR0304 - 09-08-2022, 12:13 AM
RE: Maguva - Maya - by Chakri bayblade - 09-08-2022, 12:50 AM
RE: Maguva - Maya - by Vallika sai - 09-08-2022, 03:24 PM
RE: Maguva - Maya - by Vivekananda - 09-08-2022, 11:22 PM
RE: Maguva - Maya - by neerathemall - 10-08-2022, 12:02 PM
RE: Maguva - Maya - by utkrusta - 10-08-2022, 01:05 PM
RE: Maguva - Maya - by narendhra89 - 11-08-2022, 05:12 AM
RE: Maguva - Maya - by moodyfyed - 12-08-2022, 07:29 PM



Users browsing this thread: 11 Guest(s)