08-08-2022, 12:25 AM
Maguva – Maya Part 2.
Twitter.com/moodyfyed.
ముందు మాట
ఈ భాగంలో పాత్ర స్వభావాలకి భావోద్వేగాలకు పెద్ద పీట వెయ్యడం జరిగింది, ఆశించినంత కారం, శృంగారం ఉండదు, గమనించగలరు.
కథ
నువ్వు ఎన్నైనా చెప్పు, ఇక్కడ ఉద్యోగాలు లేవా, చేసుకునే వాళ్ళు చేస్కొట్లేదా, హైదరాబాద్ వరుకు అంటే సరేలే దగ్గరే కదా అని ఒప్పుకున్నాం, బెంగళూరు అంటున్నావు, హైదరాబాద్ లో ఉన్నప్పుడే నెలకోసారి రావడానికి వంద కారణాలు చెప్తావ్, ఇంక బెంగళూరు వెళ్తే కనీసం ఫోన్ అయినా చేస్తావా అంటూ పొద్దున్నే సుప్రభాతం అందుకుంది అమ్మ.
అమ్మా, ఫోన్ చేస్తాను, రోజు చేస్తాను, వారం వారం రావడానికి కుదరదు కానీ, నెలకోసారి ఖచ్చితంగా వస్తాను.
"వారం వారం ఇక్కడున్నప్పుడే రాలేదు తమరు, ఇంక బెంగళూరు వెళ్ళాక ఏమొస్తారు లేండి బిజీ బిజీ అయిపోతారు" నిష్టూరాలు ఆడుతుంది అమ్మ.
నిజమే, హైదరాబాద్ లో ఉంటున్నా అనే కానీ, వారం వారం రావడానికి నాకేం పెద్ద ఇబ్బంది లేదు కానీ రాకపోవడానికి కారణం ఇంట్లో వాళ్లకి చెప్పి, వాళ్ళని బాధ పెట్టి నేను సాధించేది ఏమి లేదు అని ఊరుకుండిపోయాను.
"ఏరా, ఇంకా ఎంతసేపు?" చిరాకు పడుతున్నాడు తేజ!
ఒక్క ఐదు నిమిషాలు ఆగు అంటూ ఇంకో సిగరెట్ వెలిగించాను.
"ఇంకెన్ని తాగుతావ్ రా, ఇంకా లేట్ చేస్తే డ్రైవింగ్ కష్టం అవుద్ది రారా సావదెంగుతున్నావ్" అసహనంగా చూస్తున్నాడు.
"ఇదిగో, నువ్వు కూడా ఒకటి తాగు, అరవమాకు ఊరికే, కాసేపు కామ్ గా కూర్చో" అన్నాను.
"ఇంకెంత సేపు పిచ్చోడిలాగా ఆ ఇంటినే చూస్తూ ఉంటావు రారా" అంటూ తేజ అరుస్తుంటే మిర్రర్ పైకి లేపి కార్ డోర్ వేసేసా.
ఒక దమ్ము బలంగా పీల్చి డాబాని తదేకంగా చూస్తూ కళ్ళు మూసుకున్నాను.
ఇక్షిక: నా గుండె చప్పుడు నీకు తెలుస్తుందా?
నేను: తెలుస్తుంది.
ఇక్షిక: అదేం చెప్తుందో అర్ధమవుతుందా?
నేను: అర్ధమవుతుంది, నీకు చెప్పద్దు, మన ఇద్దరి మధ్యలోనే ఉండనివ్వు అంటుంది
ఇక్షిక: విభా!!
నేను: సరే చెప్పు
ఇక్షిక: నువ్వు దూరమైతే నాతో ఉండను అంటుంది.
చేతుల్లోకి మొహాన్ని తీసుకున్నాను, కళ్ళలోకి సూటిగా చూసాను, ఏం మాట్లాడలేదు, అలా చూసాను అంతే ఒక్క నిమిషం, చెమ్మార్చిన కళ్ళతో మళ్ళి హత్తుకుంది.
దాదాపు పావుగంట పాటు ఒకళ్ళని ఒకళ్ళు హత్తుకుని ఉండిపోయాము. నువ్వు దూరమైతే నాతో ఉండను అన్న తన మాటకు నేనేం మాట్లాడలేదు, మోహంలో భావం కూడా పలికించలేదు, కేవలం తనని ఒక చూపు చూసాను, ఆ చూపు లోనే నాకు తను ఏంటి, తనకు నేనేంటి అని తన తెలివికి వచ్చింది, తన కాళ్లలో కారిన ఆనంద భాష్పాలే దానికి నిదర్శనం. ఒక మనిషిని అంతకన్నా వశం చేసుకోగలమా? అంతకన్నా సొంతం చేసుకోగలమా? నా మనసులో కదలాడే ప్రతి భావం నా కళ్ళల్లో చూసి చదవగల తనదా పైచెయ్యి? ప్రతి విషయంలో తన తర్వాతే నేను అనుకునే నాదా పైచెయ్యి మా బంధంలో? అనేది అర్ధం కాక నవ్వుకుంటూ ఇంకా గట్టిగా హత్తుకున్నాను ఇక్షిక ని.
నాకు తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి, తన ఇంటి డాబా పైన ఆ రోజు జరిగిన సంఘటన ఇది. చెయ్యి వణుకుతుంది, గుండెల్లో ఏదో ఆతృత, ఆందోళన. మనిషి శారీరికంగా కానీ మానసికంగా కానీ ఎంత బలమైన వాడైనా, ఎప్పుడైతే ఒక ఆశకి బానిస అవుతాడో ఆ క్షణం బలహీనుడు అయిపోతాడు. ఆ బలహీనత మిగతా కోరికలని చంపేస్తుంది, ఆశ నిరాశగా మారినప్పుడు బ్రతుకు మీద ఆశ కూడా చచ్చిపోతుంది. నా ఆశ నా బలహీనత రెండు ఇక్షికనే, తను లేదనే నిజం, ఆ నిరాశ నన్ను కమ్మేస్తుంది అనే విషయం నాకు తెలుస్తుంది, అందుకే ఈ భయం.
సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు, చూసింది చాలు, ఇంక బయలుదేరు అని ఆ ఇంటి నీడ నన్ను చీకట్లోకి నెడుతుంది, గోడలకి అలంకరించిన పూలు వాడిపోయి దిగులుగా నా వైపు చూస్తున్నాయి.
ప్రయాణం టైం అవుతున్నా కూడా ఇక్షిక ఇంటి దగ్గరకి వచ్చి, ఆ ఇంటిని తదేకంగా చూడడానికి కారణం, ఈసారి తన తాలూకు జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తే, ముందు ఈ గుబులు గుర్తు రావాలని, చేసిన బాసలు ఇసుక రాతలు అయిపోయాయి అని తెలియాలని.
"ఇంకా లేట్ చేస్తే రేపే వెళ్ళేది", గద్దించాడు తేజ.
వాడికి కనిపించకుండా కళ్ళు తుడుచుకున్నాను, క్యాజువల్ గా కార్ దగ్గరకు వచ్చి వాటర్ ఇవ్వరా అన్నాను
కార్ లో నుంచి వాటర్ బాటిల్ ఇచ్చాడు తేజ, తాగి, ఒకసారి బలంగా ఊపిరి తీసుకుని, వెళదాం పదా అని కార్ ఎక్కాను!!
ఇదిగో, ఈ గదిలో గాలి వెలుతురు ఎక్కువగా ఉంటాయి, ఈ గదిలో సర్దుకో నీ బట్టలు అన్ని, అన్నాడు తేజ.
సరే, సర్దుకుంటాను, స్నానం చేసొస్తాను, మందు తెచ్చుకుందాం అన్నాను.
ఏదో ఒకటి అఘోరించు అన్నాడు.
తేజ నేను ఇంటర్ నుంచి స్నేహితులం, వాడికి నా గురించి బానే తెలుసు, వాడే హైదరాబాద్ లో వద్దు, కొన్నాళ్లు మార్పు కోసం బెంగళూరు రమ్మన్నాడు, వాస్తవానికి లాక్కొచ్చాడు. నేను పని చేస్తున్న కంపెనీ మంచిదే అయినా, రాజీనామా పెట్టించి బెంగళూరులో ఇంకో కంపెనీలో ఉద్యోగం చూసాడు. రోజు ఫోన్ చేసి విసిగించి వేధించి తీసుకొచ్చాడు ఇక్కడికి.
నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసాడు తేజ, ఇద్దరి ఆఫీసులు ఒకే పార్కు లో ఉన్నాయి. సాయంకాలం అయ్యాక పికప్ చేసుకుంటాను అని చెప్పి వెళ్ళాడు.
జాయినింగ్ ఫార్మాలిటీ లు ముగించుకునే సరికి మధ్యాహ్నం అయింది. ఏదైనా తిందామని కాంటీన్ కి వెళ్లాను. ఎవరికీ వాళ్ళు వాళ్ళ స్నేహితులతో నవ్వుకుంటూ తిట్టుకుంటూ తింటున్నారు, కోలాహలంగా ఉంది వాతావరణం అంతా.
ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పి ఖాళీగా ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాను, ఫోన్ తీసి కాసేపు అందులో మునిగిపోదాం అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఏంటో చిరాకుగా ఉంది, ఈ పాటికి ఇక్షికతో మాట్లాడుతూ ఉండేవాడిని మెసేజ్ చేస్తూ ఉండేవాడిని అంటూ జ్ఞాపకాలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి, ఫోన్ లోపల పెట్టేసి చుట్టూ కలియచూస్తున్నాను, ఒక జంట మీద నా దృష్టి పడింది, తను నవ్వుతుంది, ఆ నవ్వు చాలా స్వచ్చంగా నిష్కల్మషంగా అనిపించింది, చూడడానికి చాలా బాగుంది అమ్మాయి, మేని ఛాయా, మోహంలో కళ ఉట్టిపడుతుంది, కొంచెం పొడవు ఉన్న బొట్టుబిళ్ళ పెట్టింది, బొట్టుబిళ్ల కింద చిన్నగా కుంకుమ పెట్టింది, జుట్టు ఫ్రీ గా వదిలేసింది, కాషాయం రంగు కాటన్ పంజాబీ డ్రెస్ వేసింది, దానికి మాచింగ్ గా గంజి పెట్టిన చున్నీ చక్కగా ఇస్త్రీ చేసింది వేసుకుంది, టైట్ లెగ్గిన్ వేసుకుంది. ఆ నవ్వు చాలా నచ్చింది నాకు.
తన ఎదురుగా ఉన్న అబ్బాయి ఏంటో చెప్తున్నాడు, నవ్వుతు సమాధానం చెప్తుంది. చేతులు ఆడిస్తుంది, ముందుకు పక్కకు ఊగుతూ చలాకీగా ఉత్సాహంగా మాట్లాడుతుంది. ఒక్క క్షణం లో తను నిశ్చేష్టురాలు అయిపోయింది, మోహంలో రంగులు చకచకా మారుతున్నాయి, నవ్వు మాయమైపోయింది, ఆ అబ్బాయి ఏదో చెప్తున్నాడు, అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ అమ్మాయి మొహం ఇప్పుడు దీనంగా, ఇబ్బంది కరంగా మారిపోయింది, బదులుగా ఏదో చెప్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయి డీలా పడిపోయాడు, కాసేపు ఇద్దరు అలా మౌనంగా ఉన్నారు.
నా ఫ్రైడ్ రైస్ వచ్చింది, తింటూ వాళ్లనే గమనిస్తున్నాను, మళ్ళి ఆ అబ్బాయి ఏదో చెప్తున్నాడు, తను కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ బదులిస్తుంది, అలా కాసేపు సంభాషణ జరిగింది వాళ్ళిద్దరి మధ్య. ఆ అబ్బాయి విసురుగా లేచి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి జాలిగా కూర్చుంది. వెళ్లి మాట్లాడదామా అనుకున్నాను, మనకు ఎందుకులే, మనకు ఉన్న సమస్యలు మనకి సరిపోవా అనుకుంటూ తినేసి వాష్ బేసిన్ దగ్గర చెయ్యి కడుక్కుంటున్నాను, పక్కన చూస్తే అదే అమ్మాయి, మొహం కడుక్కుంటుంది. తన ఒంటి నుంచి వస్తున్న పెర్ఫ్యూమ్ తనకు సరిగ్గా సరిపోయింది, తనలో ఏదో ఆకర్షణ ఉంది. చాలామంది అమ్మాయిలు ఏదేదో ఊహించుకుంటూ వాళ్లకు సూట్ అవని పనులు చేస్తూ ఉంటారు, బట్టల విషయంలో కానీ, మేకప్ విషయంలో కానీ, హంగులు ఆర్భాటాలు కానీ, ఇలా ప్రతి విషయంలో, కానీ ఈ అమ్మాయికి అన్ని తెలిసినట్టు కట్టు బొట్టు తీరు సెంటు తో సహా ఎలా ఉంటే బాగుంటుందో అలా ఉంది. చెయ్యి కడుక్కుని కర్చీఫ్ తీసి చెయ్యి తుడుచుకోబోతు పక్కకు చూసా ఎందుకో, వెంటనే నవ్వొచ్చి తుడుచుకోకుండా ఆగిపోయా. పక్కకొచ్చి నిలబడ్డాను. తను మొహం కడుక్కోవడం అయిపోయింది, అప్పుడు అద్దంలో చూసుకుంది, మొహం కడుక్కునేటప్పుడు డ్రెస్ మీద వాటర్ పడ్డాయి టాప్ లో నుంచి చింది, అవి పొట్ట దగ్గర కొంచెం పైనా పడ్డాయి, పక్కన టిష్యూస్ కోసం చూసింది, అవి లేవు, అయిపోయాయి. నీట్ గా ముస్తాబయ్యి వచ్చింది కదా, గంజి పెట్టిన ఆ చున్నీ వాడుతుందా లేదా అని చాలా ఇంటరెస్టింగ్ గా చూస్తున్నాను, అసలే చిరాకులో ఉంటే ఇదొకటి నా కర్మకి అన్నట్టు మొహం పెట్టింది, నవ్వొచ్చేసింది, ముద్దొచ్చేసింది ఒకేసారి. ఇప్పుడు కర్చీఫ్ బయటకు తీసా, అడుగుతుందా లేదా అని. ఎందుకంటే అది కాషాయం రంగు డ్రెస్, వాటర్ పడితే చాలా తేలికగా కనిపిస్తుంది, ముదురు రంగు అయితే కనిపించేది కాదు, ఇప్పుడు బట్టల మీద తడితో బయటకు వెళ్తే బాగోదు అని తన అవస్థ గమనించినట్టు ఏమి తెలియకుండా వెళ్లి కర్చీఫ్ కావాలా అండి అన్నాను, పర్లేదు వద్దు అండి అని చున్నీ తోనే తుడుచుకుంటుంది.
అనుకోకుండా నా దృష్టి తన ఎదల మీద పడింది, అయస్కాంతానికి ఇనుము ఎలాగో అబ్బాయి చూపుకు అమ్మాయి శరీరం అలాగా. తను అలా తుడుచుకుంటుంటే తన చేతులు తగిలి ఎదలు ఎగురుతున్నాయి అదురుతున్నాయి. పైన ట్యూబ్ లైట్ వెలుగు సరిగ్గా ఎదల మధ్య పడుతూ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కామం ఉద్రేకం లాంటివి కలగలేదు నాలో, ఇందాక అమ్మాయి నవ్వు ఎలా ఆకర్షించిందో ఇది కూడా అలా ఆకర్షించింది. తను నచ్చింది కానీ కలవాలి అనిపించలేదు, మాట్లాడాలి పరిచయం పెంచుకోవాలి అనిపించింది, చాలా ప్లాటోనిక్ గా ఉంది మనసు.
పలకరింపుగా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతుంది, అక్కడే నుంచుని తను వెళ్తుంటే వెనుక నుంచి చూసాను, లయబద్దంగా కదులుతున్నాయి, కొంచెం కొంచెం అదరడం కనిపిస్తుంది. నన్ను కట్టిపడేసిన ఆలోచన ఏంటంటే ఇంత అందంగా ఉండి, ఎక్కడ ఉండాల్సినవి అక్కడ సరైన మోతాదులో ఉండి కూడా, తనను అందరూ చూస్తారని తెలిసికూడా పక్కనోళ్లు ఏమనుకుంటే నాకేంటి అన్నట్టు నిస్సంకోచంగా తడిచిన బట్టలతో అలా ధైర్యంగా వెళ్లిపోవడం.
ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ అమ్మాయి, ఈ ధైర్యం ఈ ఒక్క విషయంలోనేనా అన్నిటిలోను ఉందా, అప్పటివరకు నవ్వుతు మాట్లాడుకుని, ఒకేసారి మొహం మాడిపోవడం, ఇద్దరి మధ్య ఏదో జరిగింది, ఎం జరిగింది, అసలు ఎవరు వీళ్లిద్దరు, అని తెలుసుకోవాలని ఉత్సుకత మొదలయ్యింది నాలో. మళ్ళీ కనిపిస్తుందో లేదో అనుకుంటూ ఆఫీసులోకి వెళ్లాను.
సాయంకాలానికి అన్ని పనులు పూర్తి అయ్యాయి, టీం ని పరిచయం చేస్తాను అని ప్రాజెక్ట్ మేనేజర్ పిలవడంతో అనాసక్తిగా కదిలాను, ఇదిగో ఇది నీ డెస్క్, ఇది మన బే ఏరియా, వీళ్లంతా మన టీం, వాళ్ళు డెవలపర్స్, వీళ్లు టెస్టర్స్, వీళ్ళు ఎస్ ఆర్ ఈ టీం అంటూ చూపిస్తున్నాడు, ఒక్కక్షణం చుట్టూ చూస్తున్న నా కళ్ళు ఒకచోట ఆగిపోయాయి. ఒక్కొక్కళ్ళని పరిచయం చేసుకో అన్నాడు మేనేజర్. అందర్నీ పలకరించాను. అప్పటికే టైం ఆరు దాటింది, ఇంకెంతసేపు రా అన్నట్టు ఉన్నాయి ఒక్కొక్కళ్ళ మొహాలు, చిన్నగా నవ్వుకుని, సరే నేను బయల్దేరతాను అని చెప్పి బయటకు వచ్చాను. తేజ కి ఫోన్ చేసాను, పావుగంటలో వస్తా అన్నాడు, టీ షాప్ దగ్గరికి వెళ్లాను, మనకి ఇంక ఎలాగూ ఖాతా ఉండాల్సిందే కదా అని మాట కలిపాను, వాడి పేరు సూరిబాబు అంట, తెలుగు వాడే, ఒక టీ చెప్పి సిగరెట్ వెలిగించాను, కాసేపటికి తను బయటకు రావడం గమనించాను, ఇంకో సిగరెట్ వెలిగించాను, సూరిబాబు కాఫీ పెడుతుంటే నేను అడగలేదు కదా అన్నాను, ఆ టైంకి నేను ఒకడినే ఉన్నాను వాడి దగ్గర, వాడు పెడుతున్న కాఫీ నాకే అనుకుని, మీకు కాదు, ఆ మేడం గారికి అని తన వైపు చూపించాడు, ఇదేం యాదృచ్చికం రా నాయనా అనుకున్నాను, తను వచ్చి కాఫీ తీసుకుని తాగడం మొదలుపెట్టింది, మళ్ళి పలకరింపుగా ఒక నవ్వు నవ్వింది, మీరు ఎప్పటినుంచి ఈ ప్రాజెక్టులో పని చేస్తున్నారు అన్నాను, సంవత్సరం అవుతుంది అనింది, ఇంతలో నా ఫోన్ మోగింది, చూస్తే తేజ గాడు, ఎక్కడ అన్నాడు, టీ షాప్ దగ్గర అని పక్కన ఉన్న ఒక బోర్డు పేరు చెప్పా, వస్తున్నా అని ఫోన్ పెట్టేసాడు. ఏ ఊరు మీది అని అడిగాను, గుంటూరు అనింది, మా పక్క ఊరే అన్నాను, మళ్ళి ఒక నవ్వు నవ్వింది, ఆ నవ్వు నాకు బాగా తెలుసు, అంత తేలికగా మర్చిపోయేది కాదు, మధ్యాహ్నం జరిగిన దాని నుంచి ఇంకా బయటకు రాలేదు అనుకుని మిన్నకుండిపోయాను. ఇంతలో తేజ వచ్చాడు, వెళ్ళొస్తా అండి అని చెప్పి బయలుదేరాను.
తేజ: ఎరా ఎలా ఉంది మొదటిరోజు?
నేను: నేనేమైన శోభనం పెళ్లికూతురునా? మొదటిరోజు అంటూ మొదలుపెడుతున్నావ్
తేజ: ఎందుకంత చిరాకు, ఇంకేం అడగమంటావ్
నేను: అమ్మాయితో మాట్లాడుతుంటే ఏంటి అంత అర్జెంటు నీకు కాసేపు ఆగలేవా
తేజ: మొహానికి సిగ్గు లజ్జ లాంటివి ఏమైనా ఉన్నాయా, మొన్నటివరకు మన గతి ఏంటి ఈరోజు నువ్వు మాట్లాడేది ఏంటి
నేను: ఎహె అది కాదు, ఇంక అమ్మాయితో మాట్లాడితే అదే ఉద్దేశం ఉన్నట్టా? తనలో ఏదో స్పెషాలిటీ ఉంది
తేజ: ఎవరిలో
నేను: నువ్వు వచ్చినప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా కదా తనలో
తేజ: ఎవరు ఆ అమ్మాయి ఏంటి ఆ స్పెషాలిటీ
నేను: మా టీంలోనే ఉంది, ఏదో ప్రత్యేకత ఉంది, తన నవ్వులో ఒక బాధ ఉంది, బాధని కూడా నవ్వుతో అందంగా కప్పేస్తుంది.
తేజ: ఏంటి తన పేరు?
నేను: కావ్య!!!
రెండు వారాలు ఆఫీసుకు వెళ్లడం, నాకు ఇంకా మెయిల్స్ కి ఆక్సిస్ రాకపోవడం తో పెద్దగా పని లేకపోవడం, ప్రాజెక్ట్ కు సంబంధించి ఏవో వీడియో లు చూస్తూ సాయంత్రం ఎప్పుడవుతుందా అంటూ ఎదురు చూడడం, టైం దొరికితే ఏమి చేస్తుందా అని కావ్య ని చూడడం, ఇదే నా పని అయిపోయింది. రోజు రోజుకి తను ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మీటింగ్స్ లో తను మాట్లాడుతుంటే, తనకున్న క్లారిటీ, తెలివి, పక్కనోళ్ళకి సాయం చేసే తత్వం ఇవన్నీ నన్ను తనవైపుకు లాగుతున్నాయి. మంచి అమ్మాయి, గుణవంతురాలు అని ఒక ముద్ర పడిపోయింది, కొంచెం పరిచయం ఏర్పడింది ఇద్దరి మధ్య. తన మీద నాకున్న అంచానా నిజమో కాదో తెలుసుకుందామని శుక్రవారం వరుకు ఆగాను, ఆరోజే కదా మా సాఫ్ట్వేర్ వాళ్లకు రెక్కలు వచ్చేది, మంచి మూడ్ లో ఉండేది.
ఎప్పటిలాగే తను బాగ్ సర్దుకుంటుంటే వెంటనే నేను లేచి సూరిబాబు దగ్గరకి పరిగెత్తాను, సిగరెట్ ఇస్తుంటే వద్దు అన్నాను, ఏమైంది సర్ ఎందుకు వద్దు అన్నాడు, కాసేపాగి తాగుతాలే అన్నాను. కాసేపటికి తను రావడం గమనించాను.
కావ్య: ఏంటి విభా! ఇంకా వెలిగించలేదా? వెలిగించడం అయిపోయిందా
నేను: ఇంకా లేదు, వెలిగించాలి
కావ్య: ఏంటి లేటు
నేను: ఎం లేదు, ఊరికే ఆగా, అలా నడుస్తూ మాట్లాడుకుందామా
కావ్య: (అర్ధం కానట్టు చూసి) సరే పదా
నేను: నిన్ను ఒకటి అడగాలి అనుకుంటున్నా, ఏమనుకోవు కదా
కావ్య: అది నువ్వు అడిగేదాన్ని బట్టి ఉంటుంది, అనుకునేది అయితే ఖచ్చితంగా అనుకుంటాను
నేను: నువ్వు బాధపడేలా ఏమి అడగను కానీ కొంచెం వ్యక్తిగతంగా ఉండచ్చు అందుకే ముందే చెప్తున్నాను
కావ్య: ఏంటోయ్ అప్పుడే నా వ్యక్తిగత వివారాలు ఆరాలు కావాల్సొచ్చాయా నీకు
నేను: అది కాదు, నిన్ను మొదటిరోజు చూసింది గుర్తుందా నీకు
కావ్య: గుర్తుంది, కాంటీన్ లో, అంత తేలికగా మర్చిపోయేది కాదులే అది
నేను: అదేంటి, అంత గుర్తుండిపోయేలా ఎం జరిగింది అక్కడ?
కావ్య: అది తర్వాత కానీ, నువ్వు ఎం అడగాలి అనుకుంటున్నావో అది చెప్పు ముందు, సస్పెన్సు లో పెట్టకుండా
నేను: ఆరోజు నువ్వు ఒకతనితో మాట్లాడుతున్నప్పుడు నిన్ను చూసాను, నవ్వుతు మాట్లాడుతున్న నువ్వు ఒకేసారి ఇబ్బంది పడుతూ ఆ అబ్బాయితో మాట్లాడడం, తను వెళ్లిపోవడం, నువ్వు దిగులుగా ఉండడం, ఆ దిగులు ఒక వారం వరుకు పోకపోవడం, ఇదంతా చూసాక ఆరోజు నుంచి అది అలా ఉండిపోయింది, అడిగితే ఒక భారం తీరిపోతుంది కదా అని ఉండబట్టలేక అడుగుతున్నాను.
కావ్య: నీకు ఎందుకు అంత ఇంట్రెస్టు నేను ఆ అబ్బాయితో మాట్లాడితే
నేను: నిజానికి నా ఇంట్రెస్టు నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడినందుకు కాదు
కావ్య: నీతో మాట్లాడనందుకా'?
నేను: ఇది చెప్పడం వల్ల నీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ, నీ నవ్వులో ఒక బాధ చూసాను, అది నాకు తెలుసు, మనుషుల మధ్యలో ఉంటూ ఏకాంతంగా గడపడం, ఇది కూడా నాకు తెలుసు. నీలో ఇది చూసాను, ఆఫీస్ పనుల్లో తెలివిగా అన్నిటికి ముందుండి పని చేసే నువ్వు, గుర్తుందా, ఆ రోజు కాంటీన్ లో నీ డ్రెస్ మీద వాటర్ పడ్డా కూడా చూస్తే చుడనివ్వు అని నువ్వు వెళ్లిన తీరు, ఇలాంటి అమ్మాయికి ఏం ఇబ్బంది కలిగిందా, దానికి ఆ అబ్బాయే కారణమా అని తెలుసుకోవాలని ఉంది
కావ్య: నాకేం మాట్లాడాలో అర్ధం కావట్లేదు విభా, నువ్వు చెప్పింది నిజమే, కానీ అది నా వ్యక్తిగతం, ఇప్పుడు నాకు చెప్పేంత మూడ్ లేదు, ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను.
నేను: సరే, అడిగినందుకు సారీ,
కావ్య: సారీ ఏమి అవసరం లేదు, ఏమి అనుకోకు ఇలా అన్నందుకు.
నేను: ఎం పర్లేదు, నీకు చెప్పాలి అనిపించినప్పుడే చెప్పు, అసలు చెప్పకపోయినా నేనేమి అనుకోను.
ఆఫీస్ పని లో నిమగ్నమయ్యి ప్రపంచాన్ని మర్చిపోయాను, ఈరోజు డెడ్ లైన్, ఎలాగైనా పూర్తి చెయ్యాలి అని దీక్ష పూని కూర్చున్నాను. ఫోన్ మోగడంతో ఈ లోకం లోకి వచ్చాను.
నేను: హలో
కావ్య: ఎక్కడున్నావ్
నేను: ఆహ్ బార్లో కూర్చుని మందు కొడుతున్నా
కావ్య: నీకు అంత లేదులే కానీ చెప్పు ఎక్కడున్నావ్
నేను: ఎక్కడుంటానే ఆఫీసులోనే ఉన్నాను
కావ్య: నీకో విషయం చెప్పాలి
నేను: ఏంటది త్వరగా చెప్పు నాకు చాలా పనుంది
కావ్య: ఫోన్లో కాదు డైరెక్టుగా చెప్పాలి
నేను: నాకో రెండు గంటలు వరుకు పట్టచ్చు
కావ్య: అదేం కుదరదు, ఇప్పుడే చెప్పాలి
నేను: సరే చెప్పు
కావ్య: ఆహా, ఇంట్లోనే చెప్పాలి
నేను: సరే, వెయిట్ చెయ్యి అయితే
కావ్య: ఇప్పుడు వస్తున్నావా లేదా
నేను: కుదరదు, ఫోన్ పెట్టెయ్
కావ్య: గొడవలు అయిపోతాయి చెప్తున్నా
నేను: ఇప్పుడు పనిలో ఉన్నానే, ఇవాళే డెడ్ లైన్, పూర్తి చెయ్యాలి
కావ్య: పక్కన ఎవడో ఒక గొట్టం గాడికి అప్పచెప్పి రారా నువ్వు
నేను: ప్చ్ అబ్బా ఏంటి నీ గోల ఎం కావాలి నీకు
కావ్య: నువ్వు ఇప్పుడొచ్చి నన్ను పికప్ చేసుకోవాలి
నేను: ఎక్కడ తిరుగుతున్నావ్
కావ్య: షాపింగ్ కి వచ్చాను
నేను: బస్సు లో వెళ్ళడానికి బద్ధకం వేసి నాటకాలు ఆడుతున్నావా
కావ్య: తన్నులు తింటావ్ విభా చెప్తున్నా
నేను: నువ్వు చేసే హడావిడికి తగ్గ విషయం లేకపోతే నా చేతుల్లో నువ్వు తింటావ్
కావ్య: సరే, నువ్వైతే రా ఇక్కడికి
నేను: ఎక్కడ తగలడ్డావో చెప్పి చావు
కావ్య: లొకేషన్ పంపుతున్నా వచ్చేయి
కావ్య: ఎంతసేపు రా రావటానికి
నేను: నేనేమైన సూపర్ మాన్ ఆహ్ గాల్లో ఎగురుకుంటూ రావడానికి, బెంగళూరు ట్రాఫిక్ తెలుసుగా
కావ్య: సర్లే ఇంటికి పద
నేను: నువ్వు హాస్టల్ కి వెళ్ళవా
కావ్య: ఇందాక ఫోన్లోనే చెప్పా కదా ఇంట్లో నీకో విషయం చెప్పాలని
నేను: నువ్వు ఆ సీరియల్స్ చూడడం తగ్గించు కావ్య, మరీ డ్రమాటిక్ గా తయారవుతున్నావ్
కావ్య: ఏడిశావులే ఇంటికి పోనివ్వు, వెళ్లే దారిలో వైన్స్ దగ్గర ఆపు
నేను: నాకిప్పుడు తాగే మూడ్ లేదు
కావ్య: నాకుంది నేను తాగుతాను
నేను: ఏదోటి అఘోరించు
కావ్య: ఎందుకంత బాధ నీకు, ఎం అవసరం లేదు, కార్ ఆపు నేను దిగి వెళ్ళిపోతా
నేను: అమ్మ తల్లి, నాకేం బాధ బెంగ లేవు, దయచేసి అలగమాకు
కావ్య: సరే నీ కార్డు ఇవ్వు
నేను: నా కార్డు ఎందుకు
కావ్య: మందు కొనుక్కోడానికి రా
నేను: నీ దగ్గర లేవా
కావ్య: ఉన్నాయి కానీ వాడను, నీదే కావలి
నేను: ఏమొచ్చిందే నీకు ఇవాళ, అంతా బానే ఉందా
కావ్య: నేను బానే ఉన్నానులే కానీ ఇవ్వురా
గీసర్ ఆన్ చెయ్యి, మేడం గారు స్నానం చేస్తారు అని చెప్పి బెడ్ మీద వాలిపోయింది కావ్య, స్నానం చేస్తా అని పడుకున్నావేంటే అన్నాను. నీళ్లు కాగలి కదరా ఆవేశం అనింది, సర్లే దీనితో నాకెందుకులే అని గీసర్ ఆన్ చేసొచ్చి, టీవీ ఆన్ చేస్కుని కూర్చున్నా.
స్నానం చేసొచ్చి అన్ని సర్దింది, రమ్మని పిలిచింది. నేను కూడా స్నానం చేసి వచ్చి కూర్చున్నాను, ఒక బనియన్ షార్ట్ వేసుకుని.
బాల్కనీలో ఒక సోఫా, ఒక కుర్చీ వేసింది, సోఫా లో నేను కూర్చున్నాను, చిన్న టీపాయ్ ఒకటి పెట్టింది, రోప్ లైట్ లు ఆన్ చేసింది, ఒక కాండిల్ లైట్ డిన్నర్ లాగా సమకూర్చింది. ఏ మాటకి ఆ మాట, చల్లగా గాలి తెరలు తెరలుగా తాకుతుంటే, తన మొహం మీద రెండు ఫంక్ లు గాలికి కదులుతున్నాయి, ఎప్పటిలాగే పొడవాటి బొట్టు బిళ్ళ, కింద చిన్న కుంకుమ బొట్టు, వదులుగా ఉన్న ఒక టీ షర్టు, నైట్ ప్యాంటు వేసుకుని రెండు కాళ్ళు ముడుచుకుని కుర్చీలో పెట్టుకుని కూర్చుంది చిన్న పిల్ల లాగా, మందు గ్లాస్సులోకి పోస్తూ పెదాలు కొంచెం తెరిచి మధ్యలో నాలుక ఒక వైపుకు బయటకు పెట్టి పెదాలతో నాలుకని కొరుకుతూ ఎంతో ఆసక్తిగా ఎంత మందు కలుస్తుందో అని సైంటిస్టు లాగా కొలుస్తూ నిమగ్నమయిపోయింది. తదేకంగా తననే చూస్తున్నాను, తనమీద నాకున్న భావాలేంటో నాకేమాత్రం అర్ధం కావట్లేదు. మొదటి నుంచి ఇప్పటి వరుకు జరిగినవి ఆత్మ పరిశీలన చేసుకుంటున్నా, ఇంతలో మందు కలపడం అయిపోవడంతో తలెత్తి నన్ను చూసి నేను తనను చూస్తున్న విషయం గ్రహించి ఏంటి ఆలా చూస్తున్నావు అని అడిగింది.
ఏమి లేదు అన్నాను, సరే ఇదిగో తీసుకో అని గ్లాస్ అందించింది.
నేను: ఇంతకీ కారణం ఏంటో చెప్పలేదు
కావ్య: అప్పుడే కాదు, రెండు లోపలకి వెళ్లాక చెప్తాను
నేను: ఇదేం సిట్టింగ్ అమ్మాయ్, కారణం తెలియకుండా తాగడం ఏంటి
కావ్య: ఇప్పుడు కారణం చెప్పకపోతే మందు వెళ్లదా లోపలికి
నేను: వెళ్తుంది లే, సరే కానివ్వు అయితే, మీరు అనేవాళ్ళు మేము వినేవాళ్ళం
కావ్య: అంతొద్దు, ఛీర్స్
నేను: ఛీర్స్
రెండు పెగ్ లు అయ్యాక చెప్తాను అనింది, నాలుగు పెగ్ లు అయ్యాయి.
నేను: నాలుగు పెగ్ లు అయ్యాయి కావ్య, ఇప్పుడైనా చెప్తావా
కావ్య: ఇంతవరుకు ఎందుకు ఆగానో తెలుసా
నేను: తెలియదు, తమరు సెలవిస్తే తెలుసుకుంటాం
కావ్య: నీకు కొన్ని విషయాలు చెప్పాలి, కొన్ని అడగాలి, కొన్ని తెలుసుకోవాలి. ఒకసారి టాపిక్ స్టార్ట్ చేసాక, నాకు మొహమాటం అడ్డొచ్చి పూర్తిగా తెలుసుకోకుండా మధ్యలోనే ఆపేస్తానేమో అని అనుమానం భయం. అందుకే ఇంతసేపు ఆగమన్నాను.
నేను: ఇవాళ ఏదో పెద్ద పంచాయితీ పెట్టేలా ఉన్నావుగా
కావ్య: ఆహ్ అవును, తేల్చుకోవాల్సినవి ఉన్నాయి
నేను: అయ్యబాబోయ్, తేల్చుకోవడాలే
కావ్య: ఎప్పటినుంచో పెండింగ్ లో ఉండిపోయాయి విభా
నేను: ఒక్కొకటి విప్పు
కావ్య: ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ పార్టీ కి కారణం, నాకు ప్రమోషన్ వచ్చింది వీసా అప్ప్రోవ్ అయింది, త్వరలోనే ఆస్ట్రేలియా వెళ్తున్నాను.
నేను: ఇదేంటి ఇంత మంచి వార్త ఇప్పటివరకు నా దగ్గర దాచావా, సిగ్గులేదా నా ఫ్రెండ్ అని చెప్పుకుంటూ తిరగడానికి
కావ్య: నీలాగా నటించలేదు కదా విభా సిగ్గెందుకు!!
నేను: నటించడమేంటి, నేనేం నటించాను?
కావ్య: అదే చెప్పు, నువ్వేం నటించావు, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా
నేను: నేనేం చేసాను, నేనేం నటించలేదు
కావ్య: ప్రాజెక్టులో నాతో పాటు ముగ్గురు లైన్ లో ఉన్నారు, కానీ నాకు ప్రమోషన్ రావడానికి నీ హస్తం లేదా?
నేను: ఎవరు చెప్పారు
కావ్య: ఎవరో చెప్పారు, నువ్వు చెప్పు, నువ్వు చేసావా లేదా, నాకు వీసా వచ్చిన విషయం కూడా నీకు తెలుసు, కానీ ఏమి తెలియనట్టు ఎందుకు నటిస్తున్నావు
నేను: ఓస్, ఇంతేనా, ఇదా నీ అనుమానం, సరే చెప్తా, ఒకటి, ప్రాజెక్ట్ లో నీతో పాటు ముగ్గురు ఉన్నారు నిజమే, ముగ్గురికి నీకన్నా అనుభవం ఎక్కువ, కానీ ప్రమోషన్ తీసుకుని ఆస్ట్రేలియా వెళ్ళడానికి అనుభవం ఒకటే సరిపోదు, తెలివి ఉండాలి, ప్రాజెక్ట్ గురించి తెలిసి ఉండాలి, పని చేసే ఇంట్రెస్టు ఉండాలి, సమయస్పూర్తి ఉండాలి, అవి నీలో ఉన్నట్టు వాళ్లలో లేవు, అందుకే ఆ తీసుకునేది నువ్వు అయితే బాగుంటుంది అని నా అభిప్రాయం చెప్పాను అంతే, అంతకుమించి నేనేం చెయ్యలేదు.
మేనేజర్ కూడా ఏమంత చిన్నపిల్లాడు అమాయకుడు కాదు నేను ఆడించినట్టు ఆడడానికి, నువ్వు డెసెర్వింగ్ కాబట్టి నిన్ను తీసుకున్నారు. ఇందులో నా పాత్ర చాలా చిన్నది, నీకొచ్చి చెప్పి, నా కృషి ఉంది, అందుకే నీకు ప్రమోషన్ వచ్చింది అని చెప్పడం సరికాదు, నాకిష్టం లేదు. రెండు, ఇది నాకు తెలిసినా కూడా నీ ముందు తెలియనట్టు నటించడం ఎందుకు అంటే, నువ్వు అంతా పూర్తయ్యాక చెప్పాలి అనుకున్నావు, లేదంటే మొదటిరోజే చెప్పేదానివి, అప్పటివరకు నా నుంచి దాచిపెడుతు, ఒకేసారి చెప్పాకా నేనెలా రియాక్ట్ అవుతానో అని నవ్వుకుంటూ, దాచిపెడుతున్నప్పుడు నువ్వు పడే ఇబ్బందులు, కొన్నాళ్ళయ్యాకా ఇవే మనకు ఉండే జ్ఞాపకాలు, చిన్న చిన్న ఆనందాలు. ఇవి దూరం చెయ్యడం ఇష్టం లేక తెలియనట్టు ఉన్నాను.
కావ్య: (రెండు నిమిషాలు మౌనం తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి) ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేనంటే ఇంటరెస్ట్ ఆహ్ ఒట్టి స్నేహమేనా
నేను: ఇంటరెస్ట్ ఆహ్ అంటే, ఒక రకంగా ఇంటరెస్ట్ అనే చెప్పాలి, నీలో ఏదో స్పెషలిటీ ఉంది, నువ్వు నడుచుకునే తీరా, నీ నడవడికా, నీ మనస్తత్వమా, నీ మాటలా, లేదా నువ్వు కనిపించే విధానమా తెలీదు నాకు, ఏదో నచ్చింది.
కావ్య: అంటే ఇప్పుడు నా నుంచి ఎం ఆశిస్తున్నావ్ నువ్వు
నేను: అలా నేనెప్పుడూ ఆలోచించలేదు, నీ నుంచి నాకేం కావాలి అని, ఆ టైంకి ఏది అనిపిస్తే అది చేసుకుంటు పోయాను, నువ్వూ నన్నెప్పుడు అడగలేదు. ఎందుకు చేసాను ఇవన్నీ అని ఇపుడు ఆలోచిస్తే, ఇది చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు, ఇది నువ్వు కోరుకుంటున్నావు, దక్కితే ఆనందిస్తావు, అలా అనిపించిందల్లా చేసాను అంతే. కానీ ప్రమోషన్ వీసా కి మాత్రం ఒక ఉద్యోగి ఇంకో ఉద్యోగికి చేసినట్టు చేసాను, దాన్లో వ్యక్తిగతం ఏమి లేదు.
కావ్య: నాకేం మాట్లాడాలో అర్ధం కావట్లేదు విభా
నేను: ఇది అయితే ముగిసినట్టే కదా, తర్వాత దాన్లోకి వెళ్ళు, ఇంకా చాలా ఉన్నాయి అన్నావు.
కావ్య: మన పరిచయం జరిగి సంవత్సరం దాటింది, నువ్వు నన్ను మొదటిసారి కాంటీన్ లో చూసినప్పుడు ఒక అబ్బాయితో మాట్లాడుతున్నాను, తర్వాత ఇద్దరికి చిన్న వివాదం జరిగింది తను వెళ్ళిపోయాడు, ఇది నువ్వు అప్పుడే అడిగావు, నేను చెప్పను అన్నాను, మళ్ళి ఇంతవరుకు అడగలేదు, ఇన్నాళ్ళల్లో మనకి ఉన్న చనువుకి నన్ను గట్టిగా తిట్టి మరి అడగచ్చు నువ్వు, ఎందుకు అడగలేదు?
నేను: హాహా, నాకు గట్టిగా తిట్టి మరి అడిగేంత చనువు ఉన్నప్పుడు, నా భుజం మీద తల పెట్టుకుని నేనున్నా అని ధైర్యంతో నిద్రపోగల నమ్మకం నీక్కూడా ఉండాలిగా, నమ్మకం కలగడానికి ధైర్యం రావడానికి మాటలు సరిపోవు, మన విధానం, ఎదుటివాళ్ళ మీద చూపించే శ్రద్ధ ఉండాలి, నేను నీ మీద చూపించే ఇది నీకు సరిపోయినప్పుడు, ఇది గ్రహించిన రోజు నువ్వే చెప్తావు అని వదిలేసాను.
కావ్య: వెల్, ఐ అం స్పీచ్ లెస్ అగైన్. చెప్తాను విభా!!
తన పేరు కిరణ్, తను నాకు పాత ఆఫీస్ లో పరిచయం, చాలా ఫ్రెండ్లీ గా ఉండేవాడు, నన్ను ఇంప్రెస్స్ చెయ్యడానికి చాలా ఇబ్బంది పడేవాడు, ఒకళ్ళు మనల్ని మెప్పించాడానికి పాట్లు పడుతుంటే చాల ముచ్చటగా ఉంటుంది, ఇది ఎటు వెళ్తుందో అర్ధం కానంత పిచ్చి దాన్ని కాదు, ఆరోజు అదే అడిగాను, నన్ను ప్రేమిస్తున్నావా అని. అవును ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు, నాకు ప్రేమించి పెళ్లి చేస్కునే ఉద్దేశం లేదు అని చెప్పాను, కోప్పడ్డాడు, బాధపడ్డాడు, వెళ్ళిపోయాడు.
నేను: ఇందులో నువ్వు నాకు చెప్పకపోవడానికి అంత బలమైన కారణం ఏమి లేదు, ఒక్క ప్రేమ పెళ్లి ఎందుకు వద్దు అన్నావో అన్న ప్రశ్న తప్ప
కావ్య: నాకు ఇద్దరు అక్కలు, ఇద్దరికి పెళ్లి అయిపోయింది, ఇది నీక్కూడా తెలుసు, మా నాన్నగారు చనిపోయారు ఇది కూడా నీకు తెలుసు, కానీ ఎందుకు చనిపోయారో నీకు తెలియదు కదా. పెద్దక్క ప్రేమించి పెళ్లి చేసుకుంది, రేపు ఉదయం పెళ్లి అనగా ఇవాళ రాత్రి ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది, మా పరువును కూడా తీసుకుని వెళ్లిపోయింది. పెళ్ళికొడుకు వైపు వాళ్ళు, మా చుట్టాలు దగ్గర నుంచి ఛీత్కారాలు అవమానాలు దాదాపు ఆరు నెలలు మోసాము. ఇంటికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు నన్ను, చిన్నక్క ని వేళాకోళం చెయ్యడం, మీరైనా మీ నాన్న కు అవకాశం ఇస్తారా మీరే వెతుక్కుంటారా? అంటూ తేలికగా మాట్లాడడం, తట్టుకోలేక నరకం చూసాము. పెద్దక్క ప్రేమిస్తున్న విషయం చెప్పలేదు ఇంట్లో, కనీసం ప్రేమించిన విషయం చెప్పి మాట్లాడితే కదా తెలిసేది ఒప్పుకుంటారా ఒప్పుకోరో అని. ఆ అవకాశం కూడా ఇవ్వలేదు మాకు.