Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కధా స్రవంతి ❤️
2


పొద్దున్నే ఎవరో కిటికీ కర్టెన్ ని పక్కకి జరిపారు నా నిద్ర చెడగొట్టడానికి, ఎవరో కాదు నా మీద ఎప్పుడెప్పుడు పగ తీర్చుకుందామా అని ఎదురు చూసే నా గయ్యాళి చెల్లెలు. దుప్పటి తల నిండా కప్పుకుని పడుకున్నాను..

సుభద్ర : నవ్యా అన్నయ్యని లేపు. కిచెన్ లోనుంచి మా అమ్మ అరుపు 

నవ్య : నేను లేపను.. మళ్ళీ నన్ను కొడతాడు. నువ్వే లేపుకో

సుభద్ర : అబ్బబ్బ అంటూ చపాతీలు చేస్తూనే స్టవ్ ని సింలో పెట్టి అట్లకాడతొ బెడ్రూంలోకి వచ్చింది. రేయి లేస్తావా పిర్ర మీద అట్లకాడ పెట్టనా

ముసుగు తీసాను, అమ్మా ఎలాగో స్కూల్ కెళ్ళేటప్పుడు చంపుతావు కనీసం ఈ హాలిడేస్ అయినా ఎంజాయి చెయ్యనివ్వవే, ఇంకో పది రోజులు అయితే ఎలాగో కాలేజీకి వెళ్ళాలి అప్పుడు నువ్వు చెప్పినట్టే వింటాలే అని గడగడా వాగేసి మళ్ళీ ముసుగు తన్ని పడుకున్నాను.

సుభద్ర : వీడికి ఇవ్వాళ మనం నాయనమ్మ వాళ్ళ ఊరికి వెళుతున్నాం అని గుర్తుందా లేదా అని నవ్యని చూసి అడిగింది.

నవ్య : మతిమరపోడు.. ఎప్పుడు గుర్తుండి చచ్చింది.. ఏది గుర్తుండి చచ్చింది, మనల్ని గుర్తు పెట్టుకున్నాడు అదే పదివేలు.

లేచి నవ్య ముడ్డి మీద తన్నాను.

నవ్య : అమ్మా చూడే...

సుభద్ర : రేయ్.. ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఇద్దరు తన్నుకోడానికి.. అర్జున్ లేచి బ్యాగులు సర్దు ఇక నవ్య నువ్వు నాతొ పాటు వచ్చి నేను చపాతీలు కాలుస్తుంటే నువ్వు వాటిని పార్సెల్ చేద్దువురా అని కిచెన్ లోపలికి వెళ్ళిపోయింది.

మొహం మీద కొట్టుకుంటూ బద్దకంగా లేచి ముందు బ్రష్ చేసి చిన్నగా ఒక్కో బ్యాగ్లో బట్టలు సర్ధకుండా కుక్కుతుంటే ఇంతలో మా నాన్న అక్కడికి వచ్చి నన్ను, నేను చేస్తున్న పని చూస్తూ కూర్చున్నాడు.

అర్జున్ : ఏంటి నాన్నా 

రవి : సుభద్రా.. చెప్పక చెప్పక ఈ వెధవకే నువ్వు పని చెప్పావా.. నీకు డబల్ పని పెడతాడు.. రేయి అది వదిలేసి పొయ్యి ఫోన్లో గేమ్స్ ఆడుకోపో

అర్జున్ : థాంక్స్.. నాన్న

రవి : సిగ్గులేకపోతే సరి.. పొయ్యి స్టేషన్ కి వెళ్ళడానికి క్యాబ్ ని పిలుచుకు రాపో.. వెధవన్నర వెధవ

అర్జున్ అబ్బా అనుకుంటూ చెప్పులు వేసుకుని బైటికి వెళ్లి క్యాబ్ మాట్లాడి పిలుచుకుని వచ్చేలోపు అందరూ రెడీ అయ్యి గేట్ తాళం వేసి బైట నిల్చొని ఉన్నారు.

సుభద్ర : చూడండి.. వాడి అవతారం పనోడిలాగ.. స్నానం కూడా చెయ్యలేదు.. కనీసం బ్రష్ అయినా చేసాడో లేదో

రవి : వాడు అలా ఉంటేనే బాగుంటాడు

నవ్య : అయినా వాడేదో రోజు స్నానం చేసేవాడిలాగ మాట్లాడతావే.. ఒక్కో సారి నాలుగు రోజులు కూడా చెయ్యడు గబ్బు కొడుతుంది నాకు వాడి పక్కన పడుకుంటే

అర్జున్ : ఆపుతావా నా మీద చాడీలు చెప్పడం.. అమ్మా పదండి అని బ్యాగ్స్ డిక్కీలో పెట్టి వెనకాల కూర్చుంటే నాన్న డ్రైవర్ తొ మాట్లాడుతూ ముందు కూర్చున్నాడు. గంటలో రైల్వే స్టేషన్ ముందు ఉన్నాం, టిక్కెట్లు తీసుకుని ట్రైన్ కోసం ఒక అరగంట ఎదురు చూడగా వచ్చింది.

నవ్య : అమ్మా.. వాడిని వెనక్కి రమ్మను పెద్ద హీరోలా వెళ్లి పట్టాల దెగ్గర నిలబడ్డాడు.. ట్రైన్ స్పీడ్ గా వచ్చిందంటే ఆ గాలికే ఎగిరిపోతాడు

అర్జున్ : చిన్న పిల్లవి చిన్న పిల్లలా ఉండు..

నవ్య : అంత లేదు నీకు నాకు పది నిముషాలు మాత్రమే తేడా, అంత దానికి నువ్వు పెద్దొడిలా ఫీల్ అవ్వకు.

ఇంతలో ట్రైన్ హారన్ వినిపించి నాన్న అరిచాడు.. ఇద్దరం తగ్గి తలా ఒక బ్యాగ్ అందుకుని ట్రైన్ ఎక్కాం.. ట్రైన్ ఎక్కామో లేదో నవ్య తినడం మొదలు పెట్టింది ఉడకేత్తిన పల్లీల నుంచి వయా సమోసాలు మీదగా చనా మసాలా వరకు ఏది వస్తే అది తింటూనే ఉంది నాన్న కొనిస్తూనే ఉన్నాడు..

నవ్య : అలా చూడకపోతే.. నువ్వు కొనుక్కోవచ్చుగా

రవి : అవి ఓన్లీ ఫస్ట్ ర్యాంకర్స్ కి మాత్రమేరా తల్లీ, నువ్వు తిను

అర్జున్ : చెప్పాడుగా.. నువ్వు మెక్కు అని కోపంగా లేచి డోర్ వైపు వచ్చి నిల్చున్నాను, చల్లటి గాలి పొలాలు దాటి అడవిలోకి వెళ్తున్న కొద్ది ట్రైన్ వేగం ఇంకా పెరగసాగింది. ఇంతలో ఏమైందో ఏమో సడన్ గా ట్రైన్ ఆగింది. నేను పడిపోకుండా ఉండటానికి ఎమ్మటే ఎదురుగా ఉన్న డోర్ ని కాలితో తొక్కి పట్టాను.

అన్నీ గ్యాస్ లీక్ అయిన శబ్దాలు, పైకి ఎక్కి పడుకున్న వాళ్లు కింద పడ్డారు. కొంత మందికి దెబ్బలు తగిలాయి, నవ్యని అమ్మని పడిపోకుండా నాన్న పట్టుకున్నాడు. ముసలోళ్ళు అవసరం లేకపోయినా ఒకటే ఏడుపులు అరుపులు.

కొందరు కిందకి దిగారు, వాళ్ళతో పాటు నాన్న కూడా దిగితే తన వెనకాలే నేనూ దిగాను. అందరూ ముందు ఇంజిన్ వైపు వెళుతుంటే మేము వెళ్ళాము, చూస్తే ఇంజిన్ కి ఏదో గుద్దుకుని ఆగిపోయింది రౌండ్ గా పెద్దగా రాజుల కాలంలో యుద్ధానికి వాడే ఐనప గుండు అంత ఉంది, ఒక మనిషి మాత్రమే పట్టగలడు ముందే గుద్దుకోవడం వల్ల ముక్కలు ముక్కలుగా అయిపోయింది. అందరూ ఏదో ఎలియన్ స్పేస్ షిప్ అని దాని దెగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు.

కొంత మంది ట్రైన్ డ్రైవర్ల దెగ్గరికి వెళ్లారు వాళ్ళకి ఎలా ఉందొ చూడ్డానికి, అస్సలు అదేంటో చూద్దామని చాలా దూరంగా ఉండే మనుషుల్ని దాటుకుంటూ దాని చుట్టూ చూస్తూ నడుస్తున్నాను సడన్గా నా కాలికి షాక్ కొట్టింది.

కాలు పక్కకి జరిపి కింద చూస్తే పసుపు రంగులో చిన్న రింగ్ రెండు ఇంచుల diameter/వ్యాసం అంత సన్నని ప్లేట్, పసుపు రంగులో కొద్దిగా మెరుస్తుందనే చెప్పాలి. ఇంతలో నాన్న కోపంగా అరుస్తుంటే దాన్ని జోబులో పెట్టుకుని ఆయన దెగ్గరికి వెళ్లిపోయాను.
Like Reply


Messages In This Thread
RE: కధా స్రవంతి ❤️ - by Takulsajal - 04-08-2022, 06:46 AM



Users browsing this thread: 28 Guest(s)