Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కధా స్రవంతి ❤️
Arjun
అర్జున్

1




చీకట్లో నేషనల్ హైవే మీద స్పీడ్ గా వెళ్తుంది కారు, ఆ స్పీడ్ చూస్తే ఏదో ఎమర్జెన్సీ గా వెళ్తుందని అనుకుంటారు ఎవరైనా, అంత వేగంగా వెళ్తున్న ఆ నల్ల కారుని ఒక పెద్ద వ్యాన్ పక్క నుంచి ఢీ కొట్టింది, దానితో కారు గాల్లో ఎగిరి పక్కనే ఉన్న అడవిలోకి జారుకుంటూ వెళ్లి ఆగింది, అందులోనుంచి దిగింది ఎవరో కాదు నేనే.. పేరు అర్జున్.

కళ్ళు తిరుగుతున్నాయి చేతితొ తల తడుముకుని చూసాను రక్తం కారుతుంది, అది కార్ పల్టీ కొట్టడం వల్ల తగిలిన దెబ్బ కాదు ఎవరో ఐరన్ రాడ్ తొ కొడితే తగిలిన దెబ్బ, ఇప్పుడు ఇవన్నీ ఆలోచించే టైం లేదు అవ్వును టైం, టైం, టైం అస్సలు లేదు ఇంకో పదిహేను నిమిషాల్లో నేను చచ్చిపోతాను కార్ లో ఉన్న నా ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలో కూడా నాకు తెలీదు, అస్సలు ఏం జరుగుతుందో నా ఫ్యామిలీకి తెలీదు.


చిన్నగా కార్ డోర్ తెరిచి నా భార్యని బైటికి లాగాను, తన మెడ మీద కిటికీ గ్లాస్ గుచ్చుకుని రక్తం కారుతుంది కానీ చేతిలో ఉన్న పది నెలల పిల్లోడికి మాత్రం ఏం కానివ్వలేదు, ఎంతైనా తల్లి కదా ప్రాణం ఇచ్చయినా కాపాడుకుంటుంది.

పెద్దగా ఒక ఉరుము, చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి, పక్కనే ఉన్న అమ్మని కూడా బైటికి రమ్మని చెయ్యి ఇచ్చాను అమ్మని బైటికి లాగి ముందు కూర్చున్న నాన్నని చూసాను స్పృహలో లేడు కష్టపడి బైటికి తీసుకొచ్చి పక్కనే ఉన్న చెట్టుకి ఆనించాను.

జోరుగా వర్షం పడుతుంది చుట్టు పది మంది అందులో 30 ఏళ్ల లోపు వాళ్ళు ముగ్గురు 50 ఏళ్ల లోపు వాళ్ళు నలుగురు ఇక 50 ఏళ్ల పై వారు ముగ్గురు, మొత్తం పది మంది.

అందరి చేతికి ఒకే రకం వాచీలు కానీ ఎవ్వరివి పని చెయ్యడంలేదు, నాది కూడా.. పక్కనే ఉన్న అమ్మకి, నా భార్యకి ఏం అర్ధం కావట్లేదు ఎందుకంటే వాళ్ళకి నేను రక రకాలుగా కనిపిస్తున్నాను కాబట్టి.

మా అమ్మకి తను కనీ పెంచుకున్న  15 ఏళ్ల పిల్లోడు, 20 ఏళ్ల కాలేజీ పిల్లోడు, 25 ఏళ్ల కుర్రోడు మధ్యలో 30 ఏళ్ల అస్సలు కొడుకు కనిపిస్తున్నారు. నా భార్యకి కాలేజీ లో ప్రేమించిన ఒక పిల్లోడు ఒక కుర్రోడు ఒక మొగుడు కనిపిస్తున్నారు. అందుకే వాళ్లకస్సలు ఏమి అర్ధం కావట్లేదు, మీకు కన్ఫ్యూసింగ్ గా ఉందా ?

ఈ జోరు వర్షంలో ఈ చీకట్లో ఈ అడవిలో నేను.. అర్జున్.   చుట్టు నన్ను చంపడానికి వచ్చిన పది మంది అర్జున్లు. 15yrs, 19yrs, 25yrs, 34yrs, 40yrs, 46yrs, 50yrs, 55yrs, 60yrs, 65yrs.

తలకి తగిలిన దెబ్బలకి వర్షం ఒక్కొక్క బొట్టు తల మీద పడుతుంటే నాకు మైకం ఇంకా ఎక్కువవుతుంది.

ముసలి అర్జున్ వెళ్లి స్పృహ తప్పి పడిన మా నాన్న తల నరికేసాడు. తూలుతూ నాన్న దెగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నాను తల లేని బాడీ చూస్తూ, ఇంతలో మా అమ్మ అరుపుకి తల తిప్పి చూసాను 40 ఏళ్ల అర్జున్ మా అమ్మని రాక్షసంగా వెనక నుంచి కత్తితో పొడిస్తే వచ్చిన అరుపు అది.

ఏడిచే ఓపిక లేదు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి అమ్మ దెగ్గరికి వెళ్లి ఒళ్ళో పెట్టుకుని చూస్తున్నాను ఇంతలో నా బిడ్డ ఏడుపు వినిపించింది, తల తిప్పి చూసాను నా బిడ్డని వాళ్ళ అమ్మ దెగ్గర నుంచి లాగేసుకుంటున్నారు, నా భార్య గట్టిగా బిడ్డను పట్టుకునేసరికి ఒకడు నా భార్య పీక కోసేసాడు అది గిల గిలా కొట్టుకుంటూ నా కళ్ళలోకే కళ్ళు పెట్టి చూస్తూ పడిపోయింది.

అప్పటికే ప్రాణం లేని నా అమ్మని పక్కన పడుకోబెట్టి మోకాళ్ళ మీద నిల్చున్నాను నా పది నెలల బిడ్డ గొంతు పట్టుకున్నాడెవడో కానీ బ్లూ కాలర్ ఉండాల్సిన వాచ్ వాడి చేతికి పచ్చ రంగు వాచ్ ఉంది అచ్చు నా లాంటిదే, చెయ్యి ఎత్తాను వద్దు అన్నట్టు కానీ వాడు పసిబిడ్డ అని కూడా చూడకుండా ఒంటి చేత్తో మెడ పట్టుకుని గాల్లోకి లేపి నన్ను చూసి నవ్వుతూ మెడని పిసికేసాడు నా బిడ్డ గుజ్జు లా మారి పిండం కింద పడిపోడం చూసాను.

కళ్ళు మూసుకున్నాను నాకు తెలుసు నేను వాళ్ళని కాపాడుకోలేనని ఎందుకంటే నేనేం చేస్తానో ఏం ఆలోచిస్తానో అన్ని వాళ్ళకి తెలుసు ఎందుకంటే అవతల ఉన్నది కూడా నేనే కాబట్టి.

వెల్కమ్ టు ది టైమ్ లాప్స్.
వెల్కమ్ టు మై వరల్డ్.
Like Reply


Messages In This Thread
RE: కధా స్రవంతి ❤️ - by Takulsajal - 23-07-2022, 06:33 PM



Users browsing this thread: 27 Guest(s)